Dear Graduates,
👇🏻
ceotserms2.telangana.gov.in/…
please register yourself as a voter for the upcoming Hyderabad-RangaReddy-Mahbubnagar & Nalgonda- Warangal-Khammam Graduate MLC Elections by clicking on the link.
పంటలకు చుక్క నీరు ఇవ్వలేం..
వరి వేస్తే మాకేం సంబంధం లేదని చేతులెత్తేసిన రేవంత్ సర్కార్!
ఓవైపు వరి వేయొద్దని చెప్తూ.. మరోవైపు విత్తనాలు కావాలంటే,
'కరెంట్ పోయినా, నీళ్లు లేక పంట ఎండిపోయినా ప్రభుత్వానికి బాధ్యత లేదు' అంటూ రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్లు రాయించుకుంటున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం!
పదేళ్ల తర్వాత తెలంగాణకు మళ్లీ కరువును తెచ్చి,
సాగుపైనే ఆంక్షలు విధిస్తూ అన్నదాతల నోట్లో మట్టికొడుతున్న అరాచక రేవంత్ సర్కార్!
కాలమో, దేవుడో తెచ్చిన కరువు కాదు.. ఇది ముమ్మాటికీ రేవంత్ కావాలని తెచ్చిన కరువు!
కన్నెపల్లి పంపుల వద్ద లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతుంటే, మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపమన్నా రేవంత్‌కు సోయి రాలే.
కృష్ణాలో 250 టీఎంసీలు, గోదావరిలో 750 టీఎంసీల నీళ్లను వదిలేసి.. ఇప్పుడేమో కరువు అంటూ ప్రజల నెత్తిన రుద్దుతుండు!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఢిల్లీలో బీజేపీ ప్రజలను విభజించడంలో బిజీగా ఉంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలను దోచుకోవడంలో బిజీగా ఉంది.
నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడం నగేష్ గెలిచినా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు.
పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి అధికారం కోల్పోగానే పార్టీని వీడి పారిపోయాడు.
అవకాశవాదులు పార్టీని వీడినా, పోరాట యోధులు బీఆర్ఎస్‌లోనే ఉన్నారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🔸 ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు!
🔸 కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా రైతుల పంటలు ఎండబెడుతున్నాడు
🔸 రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం
🔸 కేసీఆర్ తిరిగి వస్తేనే తెలంగాణ మళ్లీ గట్టెక్కుతుంది
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రేవంత్ రెడ్డి అసమర్థ పాలన, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రేవంత్ రెడ్డి తన వైఫల్యాలతో ప్రజల నెత్తిన రుద్దిన కరువని మండిపడ్డారు. రాష్ట్రంలో సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలు, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నదుల్లో నీళ్లు పారుతున్నా వాటిని సాగుకు వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారని, అందుబాటులో ఉన్న నీటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని ఎప్పుడు చేసుకుందామా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని అన్నారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
🔸 కేసీఆర్ పాలనలో రైతులకు భరోసా
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సదుపాయాలు అందించామని కేటీఆర్ గుర్తుచేశారు. రైతుబంధు, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచామని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకున్నామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పిన నాయకులు, ఇప్పుడు వాటి అమలుపై ప్రశ్నిస్తే తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయలేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయవద్దని అన్నారు.
హామీల అమలుపై ప్రశ్నిస్తే మూడు నెలల్లో పిల్లలు పుడతారా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని కేటీఆర్ విమర్శించారు. మూడు నెలల్లోనే అన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
🔸 ఇది దేవుడు తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
తెలంగాణలో కరువు పరిస్థితులు ప్రకృతి వల్ల మాత్రమే ఏర్పడినవి కావని, నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని కేటీఆర్ ఆరోపించారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోకుండా వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారని విమర్శించారు.
జూన్ 19, 2026న కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించినప్పుడు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోందని, పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వాన్ని కోరామని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే ప్రాజెక్టుపై ఇంతకాలం చేసిన ఆరోపణలు తప్పని తేలిపోతాయనే భయంతోనే బటన్ నొక్కడం లేదని ఆరోపించారు.
దేవుడు తెలంగాణ ప్రజల కోసం నీళ్లు పంపిస్తే, మధ్యలో పూజారి రేవంత్ రెడ్డి అడ్డుపడి బటన్ నొక్కకుండా అడ్డుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నీటిని వినియోగించుకుని ఉంటే కోటి ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని అన్నారు.
🔸 పంటలు ఎండుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
ఒకవైపు పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రైతుబంధు సకాలంలో అందడం లేదని, కరెంటు, యూరియా, సాగునీటి సమస్యలు మరింత తీవ్రంగా మారాయని పేర్కొన్నారు.
రైతుల కష్టాలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. నెలనెలా ఢిల్లీకి వెళ్లి ఈఎంఐ కట్టడానికే ముఖ్యమంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఈఎంఐ కడితేనే ముఖ్యమంత్రి పదవి మళ్లీ రెన్యువల్ అవుతుందంటూ విమర్శించారు. రైతులకు రైతుబంధు పడకపోయినా, రాహుల్ బంధు మాత్రం సమయానికి అందుతోందని వ్యంగ్యంగా అన్నారు.
🔸 తెలంగాణ దోపిడీకి వేదికగా మారింది
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దోపిడీ వేదికగా మారిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి ఢిల్లీ నాయకత్వాన్ని సంతృప్తిపరచడంపైనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ ప్రజలను విభజించడంలో బిజీగా ఉంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలను దోచుకోవడంలో బిజీగా ఉందని వ్యాఖ్యానించారు.
నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గొడం నగేష్ గెలిచినా నియోజకవర్గానికి ఏం సాధించారని ప్రశ్నించారు. నిర్మల్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, చెక్‌డ్యామ్‌లు, ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తుచేశారు.
పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి అధికారం కోల్పోగానే పార్టీని వీడారని విమర్శించారు. అవకాశవాదులు పార్టీని వీడినా, పోరాట వాదులు బీఆర్ఎస్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు.
🔸 కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
తెలంగాణను ప్రస్తుత సంక్షోభం నుంచి బయట పడేయాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ మళ్లీ గట్టెక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ సమయం లేదని, మరో ఏడాదిలో రాజకీయ పరిస్థితులు మారుతాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మళ్లీ అభివృద్ధి, సంక్షేమ బాటలోకి వస్తుందని అన్నారు.
🔸 నవంబర్ 11న నిర్మల్‌లో భారీ సభ
నిర్మల్‌లో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రామచరణ్ నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని, యువ నాయకులు అనిల్ జాదవ్, జాన్సన్ రాథోడ్ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
నవంబర్ 11న నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభలో మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు తగిన బాధ్యతలు అప్పగించే అంశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ నాయక్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బిల్లుల కోసం ఎవరూ చనిపోవద్దు.. గట్టిగా పోరాడుదాం.
డీలర్ల సమస్యలు పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, ప్రాణత్యాగానికైనా సిద్ధం అనడం నన్ను కదిలించింది.
నిన్ననే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా మాట్లాడుతూ.. చచ్చిపోతేనే మా నియోజకవర్గ బిల్లులు వస్తాయంటే ప్రాణత్యాగానికి సిద్ధం అని ఆవేదన వ్యక్తం చేశారు.
దయచేసి ఎవరూ తొందర పడవద్దు, అందరూ బాగుండాలి. అందరం కలిసి గట్టిగా కొట్లాడి బిల్లులు, డీలర్ల కమిషన్ సాధించుకుందాం.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
BRS Party retweeted
మహబూబ్ నగర్ జిల్లా..
దేవరకద్ర నియోజకవర్గం...
దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో ఎండిన వరి పంటలను పరిశీలించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి...
13 ఎకరాల్లో వరి ఎండిపోవడంతో మాజీ ఎమ్మెల్యేతో తన బాధ చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైన రైతు జానకమ్మ...
రైతులను పరామర్శించి ధైర్యం చెప్పిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి....
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కామెంట్స్..
నాలుగు వందల ఎకరాలు ఎండిపోయింది.
చివరి తడి నీళ్ళు లేక పంటలు ఎండిపోయాయి..
జానకమ్మ నాలుగు ఎకరాలు,కవులుకు తొమ్మిది ఎకరాలు తీసుకొని సాగు చేశారు..
మొత్తం పదమూడు ఎకరాలు ఎండిపోయింది.
జానకమ్మ లాంటి రైతు కంటతడి పెడితే రాష్ట్రానికి మంచిది కాదు..
ఐదు లక్షలు పెట్టుబడి పెడితే ఐదు రూపాయలు కూడా రాలేదు..
వానకాలం పంటలు కూడా కాపాడలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది.
కోయిల్ సాగర్ నుండి దేవరకద్ర పెద్ద చెరువుకు నీళ్ళు వదిలే వాళ్ళం..అక్కడి నుండి వరుసగా చెరువులు నిండేవి..
2018 నుండి 2023 వరకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చాం..
జూరాలకు నీళ్ళు వచ్చినా లిఫ్ట్ చేయలేదు..
నలభై రోజుల తరువాత కోయిల్ సాగర్ కు ఎత్తిపోతల ప్రారంభించారు..
ప్రజలకు ఉపయోగపడని పదవులు ఎందుకు?
పెద్ద వాగులో కూడా కృష్ణా జలాలు పారించలేదు.వానాకాలంలోనే పూర్తిగా ఎండిపోయింది.
మేము ఉన్నపుడు నీళ్ళు ఎట్లా వచ్చాయి..ఇప్పుడెందుకు రావట్లేదు..
కోయిల్ సాగర్ నుండి లగచర్లకు నీళ్ళు తీసుకెళ్లేందుకు సర్వే నడుస్తుంది.
కోయిల్ సాగర్ నుండి నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి..
కోయిల్ సాగర్ వెనక నుండి నీళ్ళు తీసుకెళ్లేందుకు చూస్తుంటే ఇక్కడి ప్రజా ప్రతినిధులకు సోయి లేదు..
ఉమ్మడి పాలమూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి..
ఎకరాకు యాభై వేలు పరిహారం ఇవ్వాలి..
పెద్ద మనసు చేసుకొని సీఎం గారు ఆలోచించాలి..
చివరి దశలో పంటలు కాపాడేందుకు చర్యలు తీసుకోండి..
రైతులు నష్టపోకుండా కాపాడండి..
BRS Party retweeted
దేవరకొండ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ నమోదు కార్యక్రమం.
30 నెలలుగా మొద్దునిద్ర పోయిన రేవంత్, నిన్న మహారాష్ట్ర వెళ్లి తుమ్మిడిహట్టి గురించి మాట్లాడాడు.
మహారాష్ట్ర వెళ్లి రేవంత్ రెడ్డి ఏం సాధించాడు? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది
నాడు కేసీఆర్ గారు మూడేళ్లలో ప్రాజెక్టు కడితే, రేవంత్ రెడ్డి కనీసం మూడేళ్లలో మరమ్మతులు కూడా చేయలేకపోయాడు.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @TJEEVANREDDI
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం xitter.cf/i/broadcasts/1dxYlaZBL…
కాంగ్రెస్ దరిద్రపు పాలనలో.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే @AlaVenkateshwer
13 ఎకరాల్లో వరి పంట ఎండిపోవడంతో తన బాధను మాజీ ఎమ్మెల్యేకు చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమైన మహిళా రైతు జానకమ్మ.
రైతులను పరామర్శించి, ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
🔹 నాలుగు వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.
🔹 చివరి తడి నీళ్లు అందక పంటలు ఎండిపోయాయి.
🔹 జానకమ్మ నాలుగు ఎకరాలు, కౌలుకు మరో తొమ్మిది ఎకరాలు తీసుకొని సాగు చేశారు.
🔹 మొత్తం 13 ఎకరాల్లో పంట ఎండిపోయింది.
🔹 జానకమ్మ లాంటి రైతు కంటతడి పెడితే రాష్ట్రానికి మంచిది కాదు.
🔹 ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే, ఐదు రూపాయలు కూడా తిరిగి రాలేదు.
🔹 వానాకాలం పంటలను కూడా కాపాడలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది.
🔹 కోయిల్‌సాగర్ నుంచి దేవరకద్ర పెద్ద చెరువుకు నీళ్లు వదిలేవాళ్లం. అక్కడి నుంచి వరుసగా చెరువులు నిండేవి.
🔹 2018 నుంచి 2023 వరకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చాం.
🔹 జూరాలకు నీళ్లు వచ్చినా ఎత్తిపోసుకోలేదు.
🔹 40 రోజుల తర్వాత కోయిల్‌సాగర్‌కు నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు.
🔹 ప్రజలకు ఉపయోగపడని పదవులు ఎందుకు?
🔹 పెద్దవాగులో కూడా కృష్ణా జలాలను పారించలేదు. వానాకాలంలోనే అది పూర్తిగా ఎండిపోయింది.
🔹 మేము ఉన్నప్పుడు నీళ్లు ఎలా వచ్చాయి? ఇప్పుడు ఎందుకు రావడం లేదు?
🔹 కోయిల్‌సాగర్ నుంచి లగచర్లకు నీళ్లు తీసుకెళ్లేందుకు సర్వే జరుగుతోంది.
🔹 కోయిల్‌సాగర్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలి.
🔹 కోయిల్‌సాగర్ వెనుక భాగం నుంచి నీళ్లు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే, ఇక్కడి ప్రజాప్రతినిధులకు సోయి లేదా?
🔹 ఉమ్మడి పాలమూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
🔹 రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి.
🔹 పెద్ద మనసు చేసుకుని సీఎం గారు ఆలోచించాలి.
🔹 చివరి దశలోనైనా పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి.
🔹 రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కాపాడాలి.
BRS Party retweeted
*నెర్రలు పారిన పొలాల్లో ప్రెస్ మీట్*
*లక్షెట్టిపేట మండలంలోని బలరావుపేట గ్రామంలో నెర్రలు పారిన పొలాలను,రైతులతో కలిసి పరిశీలించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు.*
*అనంతరం నెర్రలు పారిన పొలాల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.*
ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ
➡️ జెండా వెంకటాపూర్, బలరావుపేట్,పెద్దంపేట మరియు హాజీపూర్ మండలాల్లో నీరు లేక 80% పొలాలు ఎండిపోయాయని తెలిపారు
➡️ ఎంత ఎండిపోయా అంటే పొలాలు మొత్తం నేర్రలుగా పగిలిపోయాయని అన్నారు.
➡️ దివాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ముందు చూపుతో నీటిని విడుదల చేసి ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చేశారని గుర్తు చేశారు.
➡️ మంచిర్యాల నియోజకవర్గంలో పొలాలు ఎండిపోవడానికి కారణం మంచిర్యాల ఎమ్మెల్యే అసమర్థ పాలనని అన్నారు.
➡️ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అసమర్థ పాలనతో దండేపల్లి, లక్షెట్టిపేట,హాజీపూర్ మండలాలలో వేల ఎకరాలు ఎండిపోయాయని తెలిపారు
➡️ రైతులకు నీళ్లు ఇద్దామని ఆలోచన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కి లేదు అని అన్నారు.
నీరు ఇద్దామని ఆలోచన ఉంటే కడెం ప్రాజెక్టు ద్వారా మరియు దివాకర్ రావు గారు నిర్మించిన గూడెం లిఫ్ట్ ద్వారా రైతాంగానికి నీటిని ఇవ్వచ్చు కానీ నీరు విడుదల చేయకుండా రైతులను గోసపెడుతున్నాడని తెలిపారు
➡️ అదేవిధంగా నీటికి కష్టం వచ్చినప్పుడు మన రాష్ట్రానికి కరువు రాకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాలేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించారాని, దానితో దివాకర్ రావు గారు కట్టించిన ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపి మరియు తెలంగాణ రాష్ట్రం రైతాంగం అందరికీ సాగునీటిని సరఫరా చేయొచ్చని తెలిపారు.
➡️ కానీ కెసిఆర్ గారి మీద ఉన్న కోపంతో రేవంత్ రెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయకుండా,ఆంధ్రప్రదేశ్ కు నీరు తరలిపోతుంటే చూస్తూ ఎందుకు ఉంటున్నారని అడిగారు
➡️ బిఆర్ఎస్ పార్టీ కాలేశ్వరం ఓటర్లు ఆన్ చేయండి అని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా నీటిని విడుదల చేయలేదని గుర్తు చేశారు
➡️ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలించడం చేతగాక ఈరోజు రైతాంగానికి సూచన పేరుతో పంటలు వేయొద్దని చెప్తున్నారు. రైతులను పంటలు వేయొద్దు అనడానికి మీరెవరు అని అడిగారు.
➡️కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాక, రైతాంగానికి నీరు అందించడం రాక ఈరోజు పంటలు వేయద్దని చెప్తున్నారని తెలిపారు
➡️ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని అన్నారు.
➡️ రైతుకు 24 గంటలు కరెంటు కేసీఆర్ గారి ఇస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రోజుకు ఆరు గంటలు మాత్రమే ఇస్తుందని హెద్దేవా చేశారు.
➡️ దివాకర్ రావు గారు నిర్మించిన గూడెం లిఫ్ట్ నుండి మోటర్లు ఆన్ చేసి ఉంటే అదేవిధంగా కేసిఆర్ గారి కట్టించిన కాలేశ్వరం ప్రాజెక్టు నుండి దివాకర్ రావు గారు కట్టించిన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని నింపినట్లైతే ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో వేల ఎకరాల పంటలు ఎండిపోయేవి కాదని అన్నారు.
➡️ తెలంగాణ నుండి నీటిని, ఆంధ్రప్రదేశ్ కు తరలించి తన గురువు అయిన చంద్రబాబు గారికి గురుదక్షిణ ఇవ్వడం వలన ఈరోజును తెలంగాణను రేవంత్ రెడ్డి ఎండబెట్టాడని తెలిపారు.
➡️ అదేవిధంగా గోదావరి మన ప్రాంతం నుండి పోతుంటే మన స్థానిక ఎమ్మెల్యే నీటిని ఆపుకునే చేతకాక మంచిర్యాల ప్రాంతం ఎండిపోయిందని తెలిపారు.
➡️ వీరికి చేతకాకపోతే అధికారులకు పూర్తి బాధ్యతలు ఇచ్చిన అధికారులు నీటిని ఇప్పటికే నింపేవారు కానీ అధికారులు వారి పని వారిని చేసుకోనీయకుండా వారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అడ్డం పడుతున్నారని అన్నారు
➡️ ఆరు నెలలు రైతులను పంట వేయొద్దు అని ప్రభుత్వం చెప్తున్నది మరి ఈ ఆరు నెలలు వ్యవసాయ శాఖకు మంత్రి ఎందుకు,వ్యవసాయ అధికారులు ఎందుకు అని ప్రశ్నించారు.
వారందరినీ కూడా పక్కన పెట్టి ఆరు నెలల తర్వాతే వారికి జీతాలు ఇవ్వాలని అన్నారు.
➡️ అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే తన వ్యక్తిగత గొడవలను పక్కనపెట్టి ప్రజల కోసం, రైతుల కోసం పనిచేయాలని సూచించారు.
➡️ మంచిర్యాల నియోజకవర్గ రైతాంగానికి ఇప్పటికైనా నీటిని అందించాలని,పంటలు పూర్తిగా ఎండిపోకుండా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.
BRS Party retweeted
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలి. నవంబర్ 6 చివరి తేదీ కావడంతో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించడం జరిగింది.
#BRS #KTR #GraduateVoters
@KTRBRS – at Hyderabad, India
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ @TJEEVANREDDI మీడియా సమావేశం xitter.cf/i/broadcasts/1qKVmydmE…
రైతులకు ధైర్యం చెప్పాల్సింది పోయి..
నీళ్లు, కరెంట్ ఇవ్వలేమని.. పంటలు వేసుకోవద్దని చెప్తూ..
సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ
రైతులను భయపెడుతున్న రేవంత్ రెడ్డి!
కరోనా సమయంలో కేసీఆర్ గారు
రైతులకు ఇచ్చిన ధైర్యాన్ని
ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న రైతులు.
- మాజీ ఎమ్మెల్యే @balkasumantrs
కరువుపై డైవర్షన్ డ్రామాలో భాగంగా..
నిన్న మహారాష్ట్రలో జరిగిన కాంగ్రెస్ - బీజేపీల చీకటి సమావేశం.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తుపై మహారాష్ట్ర సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా..
తమ అనుంగు మీడియాతో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది!
ఎన్డీఎస్ఏ నివేదిక అంటూ దొంగ నివేదికను ముందుకు తెచ్చి,
కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టింది కాంగ్రెస్, బీజేపీలే!
- మాజీ ఎమ్మెల్యే @balkasumantrs



















