బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు.. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లకు కోర్టు ఆంక్షలు
- కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాలో మధ్యంతర ఉత్తర్వులు
- వివాదాస్పద వీడియోలు, వార్తా కథనాలు తొలగించాలని మీడియా సంస్థలకు ఆదేశాలు
- కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది పి. విశ్వజనని వాదనలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పై తప్పుడు ఆరోపణలు చేయవద్దంటూ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన రూ.10 కోట్ల పరువు నష్టం దావాలో విచారణ సందర్భంగా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దావాలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి కేటీఆర్‌పై మరిన్ని తప్పుడు ఆరోపణలు చేయరాదని స్పష్టం చేసింది.
కేటీఆర్‌పై డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు చేయడం, డ్రగ్స్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగించడం, మహిళలు, సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖులతో వ్యక్తిగత సంబంధాలపై ఆరోపణలు చేయడం వంటి అంశాలను కేటీఆర్ తన దావాలో సవాలు చేశారు. సరైన ధ్రువీకరణ లేకుండా వీడియోలు, ఇంటర్వ్యూలు, వార్తా కథనాల ద్వారా ఇటువంటి ఆరోపణలను ప్రచారం చేయడం వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని పేర్కొన్నారు.
ఈ కేసులో కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీమతి పి. విశ్వజనని బుధవారం కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వివాదాస్పద ఆరోపణలకు సంబంధించిన ఇప్పటికే ప్రచురించిన వీడియోలు, వార్తా కథనాలను తొలగించాలని మన తొలివెలుగు టీవీ, ఏబీఎన్ తెలుగు, వాహిని టీవీ తదితర సంబంధిత మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. భవిష్యత్తులోనూ దావాలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించిన ఇటువంటి కంటెంట్‌ను ప్రచురించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
తనపై తప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రచారాన్ని నిలువరించడంతో పాటు, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ కేటీఆర్ రూ.10 కోట్ల నష్టపరిహారంతో పాటు తప్పనిసరి, శాశ్వత నిషేధాజ్ఞల కోసం సివిల్ దావా దాఖలు చేశారు.
రేవంత్-మహేష్‌ది విన్నింగ్ కాంబినేషన్ కాదు..
ఎర్నింగ్ కాంబినేషన్!
కోఆర్డినేషన్ ఉన్నది కరప్షన్‌లోనే..
ఆస్తులు కూడబెట్టుకోవడంలో!
- మాజీ కార్పొరేషన్ చైర్మన్ @DrErrolla
రాష్ట్ర ప్రజలు ఎల్ నినో కరువు పరిస్థితుల్లో ఉంటే..
రేవంత్ రెడ్డి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణను ముందుకు తెచ్చాడు.
సాగు, తాగునీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..
7 వేల కోట్లు పెట్టి, డీపీఆర్ లేకుండా, కమీషన్ల కోసం టెండర్లు ఇచ్చి, దొంగదారిన ఈరోజు పబ్లిక్ హియరింగ్ పెట్టారు.
పబ్లిక్ హియరింగ్‌కు బీఆర్ఎస్ నాయకులు పోతుంటే, రేవంత్ రెడ్డి నిరంకుశంగా అరెస్ట్ చేయిస్తున్నాడు.
- ఎమ్మెల్సీ @sravandasoju
ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. రేవంత్ లూటిఫికేషన్!
ఒక పక్క ఎల్ నినో కరువు పరిస్థితులు ఉంటే.. ఇంకో పక్క కమీషన్ల కోసం మూసీ సుందరీకరణకు పబ్లిక్ హియరింగ్ పెట్టిన తుగ్లక్ రేవంత్ సర్కార్!
పబ్లిక్ హియరింగ్ కూడా సక్రమంగా నిర్వహించకపోవడంతో, మూసీ బాధితులకు అండగా నిలబడడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని, అక్రమంగా అరెస్ట్ చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం.
కాంగ్రెస్ ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ విధానాన్ని పాటిస్తోంది.
మూసీ సుందరీకరణ కోసం బాధితులందరినీ ఒకేసారి పిలవకుండా.. ఒక్కో కాలనీ వాళ్లను ఒక్కోసారి పిలుస్తున్నారు.
అలా చేస్తే మా ఇళ్లను మేము ఇవ్వము.. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు.
- మూసీ సుందరీకరణ బాధితులు
మూసీ సుందరీకరణ పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకుడు @KarthikIndrAnna ని అడ్డుకొని, అక్రమంగా అరెస్ట్ చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం.
మూసీ బాధితుల తరపున మాట్లాడేందుకు వస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసు వాహనం ముందు ఆందోళన చేసిన మూసీ బాధితులు.
తుమ్మిడిహట్టి డ్రామాలతో తెలంగాణ ప్రజలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతావ్ రేవంత్? 😡
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీకి పద్దెనిమిదేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ.
2008 నుండి 2014 వరకు ఆరేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, 2023 నుంచి మూడేండ్లు తెలంగాణలో అధికారంలో ఉన్నా.. రోజూ మాటల గారడీ తప్ప తుమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి ఎత్తలేదు ఈ అసమర్థ కాంగ్రెస్ సర్కార్.
అక్కడ బ్యారేజీ కట్టడం అసాధ్యం అని తెలిసినా డ్రామాలు ఆడుతూ.. సిద్ధంగా ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర ఉన్న నీళ్లను ఎత్తడం చేతకాని దద్దమ్మ రేవంత్!
ఒక పక్క రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులు ఉంటే..
ఇప్పటికిప్పుడు మూసీ సుందరీకరణ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది?
ఎల్ నినో వల్ల రైతులు చనిపోతుంటే, దాని గురించి పట్టించుకోవడం లేదు. వారికి ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కానీ, మూసీ ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు.
మూసీ సుందరీకరణ కోసం నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు?
హిమాయత్ సాగర్‌కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? రంగనాయక సాగర్‌ను నింపడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ఇక మూసీని ఎక్కడి నుంచి సుందరీకరణ చేస్తారు?
రేవంత్ రెడ్డి రైతులను పంటలు పండించకండి.. కూలి పని చేసుకోండి అని చెప్తున్నాడు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BrsSabithaIndra
ఇందిరమ్మ రాజ్యం❌
ఎమర్జెన్సీ పాలన ✅
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితుల ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BrsSabithaIndra ని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.
కపట పాలకులు.. కరువు సృష్టికర్తలు!
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్షాలు పడకపోయినా, కాళేశ్వరం నీళ్లతో చెరువులు నింపి, పంటలకు నీళ్లిచ్చిన మొనగాడు కేసీఆర్.
నేడు నదుల్లో నీళ్లున్నా, వాటిని ఆపి, చెరువులు నింపడం చేతకాక, ‘ఎల్ నినో’ పేరిట తప్పించుకొని, పంటలను ఎండబెడుతున్న చేతగానివాళ్లు కాంగ్రెస్ పాలకులు!
పచ్చని తెలంగాణలో ‘కృత్రిమ’ కరువును తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.
నదుల్లో నీళ్లు పారుతున్నా, వాటిని ఆపి, చెరువులను నింపే సోయి లేదు.
వ్యాసకర్త: ఎమ్మెల్సీ @Ravinder_RaoMLC
శ్రీశైలానికి నీళ్లు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోయకుంటే..
చంద్రబాబు నాయుడు 800 కిలోమీటర్లు దూరం నీళ్లు తీసుకొని పోయాడు.
పక్కనే 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వలేదు.
కేసీఆర్ గారు ఉండగా రెండు కిలోమీటర్లకు ఒక చెక్ డ్యామ్ కట్టి నీళ్లు ఆపి, నీళ్లు ఎత్తిపోసి అక్కడి నుంచి చెరువులు నింపేవారు.
కాంగ్రెస్ నాయకులకు ఒక్కొక్కడికి నీళ్లు ఎత్తిపోయాలని సోయి లేదు.
- మాజీ ఎమ్మెల్యే @AlaVenkateshwer
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం పైన ఆంక్షలు పెట్టడం మొదటిసారి చూస్తున్న
రైతు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తేనే విత్తన వడ్లు అమ్మాలని చెప్తున్నారు.
కరెంటు, నీళ్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదని డిక్లరేషన్ తీసుకోవడం దుర్మార్గం
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @TJEEVANREDDI
రేవంత్ రెడ్డి ప్రజలకు, రైతులకు నమ్మకం.. భరోసా కల్పించాల్సింది పోయి భయపెడుతున్నాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పంటలు వేసుకోనీయకుండా.. సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నారు.
కేసీఆర్ ఉండగా అందరికీ భరోసా కల్పించేవారు.. రేవంత్ రెడ్డి భయపెడుతున్నాడు.
- మాజీ ఎమ్మెల్యే @balkasumantrs
ఎక్కడికిపోయినా కేసీఆర్ గారు ఉండగా బాగుండే..
ఇప్పుడు కేసీఆర్ గారు లేని లోటు తెలుస్తుందని రైతులు మాట్లాడుకుంటున్నారు.
నీళ్ల గురించి మా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడితే కాంగ్రెస్ నాయకులతో ఇష్టమున్నట్లు తిట్టిస్తున్నారు.. మళ్లీ తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు.
కరోనా సమయంలో కేసీఆర్ గారు అన్ని విధాలా ప్రజలకు పథకాలు అందించారు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిట్లో విఫలమైంది.
- మాజీ ఎమ్మెల్యే @BeeramHarshaBRS
ఇది కాంగ్రెస్‌కు ఓటు వేసి రైతులు తెచ్చుకున్న కరువు
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీళ్లను కొనలేము, ఫ్యాక్టరీలో సృష్టించలేము అని మాట్లాడుతున్నాడు..
తొమ్మిది నెలల ముందు నుంచే అందరూ అదే చెప్తున్నారు కానీ రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్ తప్ప తెలంగాణ మొత్తం నీళ్లు పారుతాయి.
తెలంగాణకు వేరే రాష్ట్రాలకు ఉన్న తేడా.. మనకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంది. ఒక్క బటన్ ఒత్తితే నీళ్లు పారేవే.
పంతాలకు పోయి ఈరోజు తెలంగాణకు కరువు తెచ్చారు.
- జీ న్యూస్‌లో కరీంనగర్ నుంచి శ్రీనివాస్ రావు
📣 రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు.. తల్లడిల్లుతున్న రైతన్నలు 😢
⚠️ నీళ్లులేక, కళతప్పిన చెక్‌డ్యామ్‌లు, రిజర్వాయర్లు
🚨 అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా కండ్ల ముందే ఎండిపోతున్న పంట
⚡ విద్యుత్ కోతల కారణంగా నీళ్లందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన
🆘 కడుపు మండి.. ఎండిన పంటకు నిప్పు, పశువులకు మేత
⛔ పంటలను కాపాడుకోవడం కోసం జనరేటర్ సాయంతో పంటకు నీళ్లు
📢 కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల అరిగోస
చెంపలేసుకున్న ఈనాడు పత్రిక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు క్షమాపణ
తప్పుడు వార్తకు పత్రిక చరిత్రలో మొదటిసారి క్షమాపణ
కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు తలవంచిన ఈనాడు యాజమాన్యం
కేటీఆర్ పాస్‌పోర్టుపై తప్పుడు వార్త ప్రచురించామని పశ్చాత్తాపం
సంబంధిత కథనాలను అన్ని వేదికల నుంచి తొలగించినట్టు స్పష్టీకరణ
కేటీఆర్ న్యాయవాది పంపించిన నోటీసుకు సంస్థ సమాధానం
వ్యవహారాన్ని ముగించాలని విజ్ఞప్తి
LIVE: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశం xitter.cf/i/broadcasts/1DGleVzqQ…








