పాఠకులకు మేధోపరీక్ష పెట్టే రచయిత వివేక్ శానభాగ
నూరు పేజీల నవల తనని ఇండియన్ చెహోవ్‌ని చేసింది. కన్నడ నుండి ఇంగ్లీష్‌లోకి అనువాదమై ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంది. ఆ నవలే ఘాచర్ ఘోచర్. పట్టణ, మధ్యతరగతి జీవితాలను ఆవిష్కరించే వివేక్ రచనలు భిన్నమైనవి. కన్నడలో రాసే అంతర్జాతీయ రచయిత తాను. "సకీనా ముద్దు" నవల సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఎందుకిలా మీ నవలలకు ఓ ముంగిపునివ్వరు? అని అడిగితే, "పాఠకులకు అన్నీ విస్తట్లో వడ్డించే రచయితను కాను నేను." అన్నాడు. వివేక్ నవలలు చదవడం ఓ జీవితానుభవం.
ఘాచర్ ఘోచర్, సకీనా ముద్దు లానే మరో వర్డ్ ప్లే ‘ఉరు భంగ’ అనే శీర్షికతో నవల రాశాడు. అదే పేరుతో బాసుడు రాసిన గొప్ప సంస్కృత నాటకం ఉంది. ఇంతకీ, ఈ ఉరు భంగ దేని గురించి? తెలుసుకోవాలంటే ఛాయ సాహిత్యోత్సవానికి రండీ. ఆ నవల ఆవిష్కరణలో వివేక్ పాల్గొంటున్నాడు. దాంతో పాటూ మరో రెండు సెషన్లలో. నవంబర్ 14, 15వ తేదీలలో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదికగా...
వివేక్ శానభాగ రచనలు
chaayabooks.com/book-author/…
#vivekshanbhag #ghacharghochar #telugubooks #ChaayaBooks #chaayaliteraturefestival
34
తమిళ సాహిత్యపు బలమైన గొంతుక జయమోహన్ — ది హిందూ
తమిళంలోనే గాక అనువాదమైన ప్రతి భాషలోనూ తనకంటూ ప్రత్యేకమైన పాఠకులను తయారు చేసుకుంటాయి జయమోహన్ రచనలు. ఇటీవల అమెరికాలో విడుదలైన The Abyss (తెలుగులో అధోలోకం) పబ్లిషర్ వీక్లీ బెస్ట్ బుక్స్ జాబితాలో చోటు చేసుకుంది. ఇదే నవలలో కొంతభాగాన్ని బాలా "నేను దేవుణ్ణి" పేరుతో సినిమాగా తీశాడు. కథలు, నవలలతో పాటూ పొన్నియన్ సెల్వన్, రోబో 2 లాంటి సినిమాలకు కథా సహకారం అందించాడు జయమోహన్. తన కథలూ విడుదలై, వేందు తానిందతు కాడు, ఓళిమురి సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి. మణిరత్నం, వసంతబాలన్, ఏఆర్ మురుగదాస్, వెట్రిమారన్, గౌతమ్ మీనన్ లాంటి దర్శకులతో కలసి పనిచేశాడు. ఇటీవల వచ్చిన జయమోహన్ "తెల్ల ఏనుగు" నవలా, రణబాలి నేపథ్యం ఒకటే.
నవంబర్ 14,15వ తేదీలలో జరిగే ఛాయ సాహిత్యోత్సవంలో రెండు రోజులపాటూ జయమోహన్ పాల్గొననున్నాడు. మధుర మీనాక్షి కళ్యాణం నేపథ్యంలో రాసిన చారిత్రిక నవల "ముక్కడలి ముత్యం" ఛాయ లిట్ ఫెస్ట్ లో ఆవిష్కరణ.
Jeyamohan books
chaayabooks.com/book-author/…
#jeyamohan #tamilliterature #teluguliterature #chaayaliteraturefestival #chaayabooks
20
ఎందుకు అనువాదాలు? అవే ఎక్కువ ఎందుకు వేస్తారు? అని ఎందరో మిత్రులు మమ్మల్ని అడుగుతుంటారు. ఎక్కడో పాలస్తీనా కథ, న్యూయార్క్‌లో ఉండే పాలస్తీనా ప్రవాసిని రాస్తే తెలంగాణ గుండెను తాకింది. ఆరు దశాబ్దాలను తలపోసింది. యాదుల్నీ మనాదుల్నీ పలవరించింది. ఇక్కడ పూరించాల్సిన ఖాళీని గుర్తుచేసింది. "లక్షలాది మందిని నిలబెట్టి కవాతు చేయించిన ఆ అస్తిత్వం రికార్డ్ కావాలి" అనే బలీయమైన కోరికను, అవసరతను గుర్తుచేసింది. అంతకు మించి ఇంకేం కావాలి.
ఇంతకమునుపు శ్రీలంక అంతర్యుద్ధం గురించిన నవల ఇలాంటి ప్రవాసిని రాసిందే, "మనుషులు మాయమయ్యే కాలం" వేసినప్పుడు నల్లమల కొండల అంచుల్లో వ్యవసాయం చేసుకునే ఓ రైతు ఫోన్ చేసి ఇది మా కథ అన్నాడు. మేమూ ఇట్లాంటి బతుకే బతికాం అన్నాడు. "Art should comfort the disturbed and disturb the comfortable" అని నమ్మే మేము వీటికన్నా గొప్ప కితాబు మా పుస్తకాలకు లేదనుకుంటాం. వీటిని నుండి ప్రేరణ పొంది ఇక్కడి గొప్ప చరిత్ర నమోదుకు ఎవరైనా పూనుకుంటే మరింత సంతోషిస్తాం.
అదృశ్యం కథనం పాఠకుల్ని అడిగే ప్రశ్న "మనుషులు మాయమైపోతారు సరే, వాళ్ళ సామూహిక జ్ఞాపకాలను ఏం చేస్తారు?" అని. అవును, ఏం చేస్తాం?
ఈ నవల చదివాక తీరిగ్గా చర్చించుకుందాం.
chaayabooks.com/book/adrushy…
#allamnarayana #palestine #telangana #teluguliterature #ibtisamazem
21
చోరశాస్త్రం
ఒక మాములు దొంగ, విచిత్ర ప్రవర్తన కలిగిన ఒక ప్రొఫెసర్ ఇంట్లోకి చొరబడటంతో ఈ కథ మొదలవుతుంది. అయితే అక్కడ అతనికి దొరికేది సంపద కాదు, శతాబ్దాల నాటి ఒక రహస్య తాళపత్ర గ్రంథం... అదే ‘చోరశాస్త్రం’
కేవలం చూపుతోనే ఎలాంటి తాళాన్నైనా తెరిచే అద్భుత శక్తులను, దొంగతనంలోని రహస్య సూత్రాలను ఈ గ్రంథం ఆ దొంగకు అందిస్తుంది. ఆ విద్యను సాధించిన తర్వాత అతనికి అపరిమితమైన శక్తులు వస్తాయి. కానీ, గొప్ప శక్తులతో పాటే తీవ్రమైన నైతిక సంక్షోభాలు, ఊహించని ప్రమాదాలు కూడా వస్తాయి. ఆ వింత శక్తులతో ఆ దొంగ ఏం చేశాడు? ప్రొఫెసర్‌తో అతని అనుబంధం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే ఈ నవల.
హాస్యం, వ్యంగ్యం, లోతైన తాత్విక చింతనల కలబోతగా సాగే ఈ కథ, ఆధునిక సమాజంలోని అత్యాశను మానవ బంధాలలోని సంక్లిష్టతలను బయటపెడుతుంది. కేవలం ఒక దొంగ కథగా కాకుండా, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ఒక అద్భుత సృజనాత్మక రచన ఈ 'చోరశాస్త్రం'
ఈ నవల రచయిత వి.జె. జేమ్స్ ఛాయ సాహిత్యోత్సవానికి వస్తున్నాడు. ముందే నవల చదివేస్తే వచ్చాక ఆయనతో నవల గురించి చర్చించొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం వెంటనే కొనుగోలు చేయండి.
chaayabooks.com/book/chorash…
1
32
ఒక ఉదయం, ఇజ్రాయెల్‌లోని పాలస్తీనియన్లందరూ అదృశ్యమయ్యారు. కారణం లేదు. మిగిలింది అలా రాసిన ఎర్రని డైరీ, అమ్మమ్మ చెప్పిన జాఫా, పక్కింటివాడు చదివే ఆ పేజీలు. ఇబ్తిసామ్ అజెం రాసిన The Book of Disappearance, International Booker Prize 2025 longlist, ఇప్పుడు తెలుగులో. ఛాయ ప్రచురణ.
Order here
chaayabooks.com/book/adrushy…
#thebookofdisappearance #ibtisamazem #palestine #telugu #chaayabooks
2
136
ఈ నవలలో తోలుబొమ్మలకు ప్రాణం పోసి, వాటిని ఆడిస్తూ గోపిని సృష్టికి ప్రతి సృష్టిని చేసాడు. ఆ వైభవాన్ని మళ్ళీ కళ్ళముందు కట్టాడు. కనికట్టు చేసాడు. మంత్రించినట్టు మాయ చేసాడు. వున్నదానిని లేనట్లు, లేనది ఉన్నట్లు భ్రమింపచేసాడు. పాఠకుడ్ని అద్భుత, ఆశ్చర్యాలకు లోను చేసాడు. పెన్ను చేసే అబ్రకదబ్ర మాయాజాలంలో మనల్ని పరవశుల్ని చేసాడు.
"పారిజాతాపహరణం" అనే సజీవ నాటకారంగంపై, మ్యాజిక్ రియలిజం అనే రచనా రీతిలో అధ్బుతంగా పండించడం, గోపిని రచనా నిపుణతకు నిలువెత్తు నిదర్శనం. ఈ నవల చదివినట్టు కాకుండా, కన్నెదుట సినిమా చూసినట్టు వున్నది.
— థింసా, కవి విమర్శకుడు
Order here
chaayabooks.com/book/paarija…
[ Magic realism, Telugu books, Gopini Karunakar, Chaaya Books, Chaaya Publications, Book recommendations, telugu literature, Navala, Vijayanagara Samrajyam, Srikrishna Devaraya, Puppet show, Tholubommalata ]
వాల్మీకి సంస్కృత రామాయణం నుంచి, వ్యాస సంస్కృత భారతం నుంచి, తెలుగులో కవిత్రయం చేసిన మహాభారతం నుంచి, వ్యాసుని సంస్కృత భాగవతం నుంచి, అలాగే పోతన రాసిన భాగవతం నుంచి యథాతథంగా శ్లోకాల నుంచి, పద్యాల నుంచి, వచనాల నుంచి కూర్చిన సకల విశేషాల సమాహారం ఈ పుస్తకం.
- తల్లావజ్ఝుల శివాజీ
Order here
chaayabooks.com/book/tripath…
#ramayanam #mahabharatam #bhagavatham #chaayabooks #teluguliterature
[ Ramayanam, Mahabharatam, Bhagavatham, Valmiki, Pothana, Vyasudu, telugu literature, chaaya books, thalavajhula sivaji ]
1
50
ఎవరీ హీలర్?
ఎందుకు సీరియల్ కిల్లర్ గా మారాడు?
రాజకీయ నాయకులు, కార్పొరేట్ అధినేతలు, వారి కుటుంబాలనే ఎందుకు టార్గెట్ చేశాడు?
చదవండి. ది హీలర్. ఉత్కంఠ భరితమైన ఫీనిష్ క్రైమ్ థ్రిల్లర్
chaayabooks.com/book/the-hea…
[ Crime thriller, nordic noir, telugu books, telugu navala, chaaya videshi, chaaya Publications, book recommendations, best seller ]
1
58
మర్డర్ మిస్టరీ, డిటెక్టివ్ కథలంటే ఇష్టమా? అయితే ఈ నవల మీ కోసమే.
అర్నాల్దూర్ ఇంద్రిదాసన్ రాసిన ఐస్‌లాండ్ క్రైమ్ నవల "జార్ సిటీ" (అసలు పేరు "మీరిన్"), డిటెక్టివ్ ఎర్లెందూర్ సిరీస్‌లో మొదటి పుస్తకం. రేక్యావిక్‌లో ఒక వృద్ధుడి హత్యతో మొదలయ్యే ఈ కథ, దశాబ్దాల కిందట జరిగిన ఒక అత్యాచారం, జన్యుపరమైన వ్యాధి, నిగూఢమైన రహస్యాల వైపు తీసుకెళ్తుంది.
చల్లని ఐస్‌లాండ్ వాతావరణం, మౌనంగా బాధపడే పాత్రలు, నెమ్మదిగా పొరలు పొరలుగా విప్పుకునే నేరపరిశోధన ఈ నవలకు బలం. నార్డిక్ నోయిర్ శైలిలో ఇది ఒక ముఖ్యమైన రచన.
నవల ఇదే పేరుతో సినిమాగా కూడా వచ్చింది.
chaayabooks.com/book/jar-cit…
[ Mystery, ditective fiction, telugu books chaaya videshi, Jar city, myrin, Arnaldur indridason, Y krishnajyothy, chaaya publications, thriller movies ]
Audio: Music: 1997
Musician: EnjoyMusic
Video: myrin 2006 film.
2
233
ఒళ్ళు గగుర్పొడిచే నవల ‘వేట’
– శ్రీనివాసమూర్తి
ప్రపంచ సాహిత్యంలో వేటది ప్రత్యేకస్థానం. ప్రఖ్యాతి పొందిన ‘ఓల్డ్ మాన్ అండ్ ది సీ ‘ నవలా రచయిత ఎర్నేస్ట్ హెమింగ్వే స్వయంగా సాహసి, పెద్ద జంతువుల వేటగాడు. ఆయన మరో రచన ‘గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా’ ది వేట సాహిత్యంలో మొదటి స్థానమని చెబుతారు. విల్సన్ రాల్స్ ‘వేర్ ది రెడ్ ఫెర్న్ గ్రోస్’ పిల్లల కోణంలో రాసిన వేట నవల. జాక్ లండన్ రాసిన ‘కాల్ ఆఫ్ ది వైల్డ్’ నవల, ‘ది సీ వుల్ఫ్’ కథలు మన తెలుగు పాఠకులకు బాగా పరిచయం అయినవి. ప్రమాదకరంగా మారిన హిమాలయ చిరుతల, పులుల వేట గురించి జిమ్ కార్బెట్ రాసిన ‘మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమాన్’ భారతీయ నేపధ్యం ఉన్న వేట నవల.
ఇంతకు ముందు ఇతర భాషల్లోనూ, తెలుగులోనూ వచ్చిన వేటసాహిత్యం కంటే చాలా భిన్నమైన రచన ఇటీవల తెలుగులోకి అనువాదం అయ్యింది. గేయ స్కోటర్స్ రాసిన ‘ట్రోఫీ’ నవలని ఎస్.కుమార్ తెలుగులోకి ‘వేట’ గా అనువాదం చేయగా ఛాయ ప్రచురించింది. భిన్నమైనదని ఎందుకంటే వాటి లాగా కేవలం వేట వివరాలకు, ఘటనలకు పరిమితం కాకుండా వేట నేపధ్యంలో ఆఫ్రికా లేదా మూడో ప్రపంచదేశాల గురించి పాశ్చాత్యులకు (శ్వేతజాతి దేశాల) ఉన్న అభిప్రాయాలను చర్చలోకి తెచ్చింది. ఆ దేశాలు పెట్టుబడిదారులకు నయా వలసలుగా మారి ఎట్లా దరిద్రంలోకి నెట్టబడుతున్నాయో చూపింది. చివరకు ఆ దేశ మూలవాసులను వేట జంతువులుగా మారుస్తున్న పేదరికాన్ని, అక్కడి వన్యప్రాణి చట్టాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న శ్వేతజాతి తెలివితేటలను, వాళ్లకు లొంగిపనిచేస్తున్న అక్కడి తొత్తు రాజ్యాంగ యంత్రాన్ని, గిరిజన తెగల నిస్సహాయతను మనముందు పెట్టింది.
bit.ly/Vetareview
chaayabooks.com
[ Telugu Literature, hunting, trofee hunting, Veta, gaeas choters, chaaya books, chaaya videshi ]
2
30
"ఏ భాషలోకైతే అనువాదాలు జరుగుతాయో ఆ భాషకు మరణం ఉండదు" అంటారు ప్రొఫెసర్ తారకేశ్వర్. అనువాదాలు ఆయా భాషల సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తాయి. కొత్తను పరిచయం చేస్తాయి. తెలుగులో ఉత్తమ అనువాదాలకు ఛాయ కేరాఫ్ అడ్రస్ అవడం మాకింత గర్వకారణమే అయినా వాటిని ఆదరించే పాఠకులుండటం వలనే అది సాధ్యమయింది అని అనుకుంటాం.
ఇంతకమునుపు భారతీయ సాహిత్యాన్ని తెలుగులోకి తెచ్చిన ఛాయ, గత ఏడాది నుండి విదేశీ భాషల సాహిత్యాన్ని కూడా విదేశీ సీరిస్ పేరుతో తీసుకుని వస్తోంది. ఇప్పటికే 11 పుస్తకాలు అందులో వచ్చాయి. ఇంకో 10 పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్ నాటికి వస్తాయి. నోబెల్ బహుమతి పొందిన రచయితలు మొదలు, బుకర్, ఇంటర్నేషనల్ బుకర్ అవార్డులు పొందిన పుస్తకాల దాకా వీటిలో ఉన్నాయి. అవేగాక ప్రపంచ వ్యాప్తంగా అనేక అవార్డులను గెలిచిన పుస్తకాలను కూడా తెలుగులోకి తెస్తోంది.
ఆయా రచయితలను ఛాయ సాహిత్యోత్సవంలో భాగం చేయడం ద్వారా తెలుగు సాహితీ లోకానికి భారతీయ, అంతర్జాతీయ సాహితిలోకానికి ఒక వంతెన కడుతోంది.
ఛాయ ఇప్పటి దాకా 60కి పైగా అనువాదాలను తీసుకువచ్చింది. వాటన్నిటినీ chaayabooks.com/books-catego… ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.
#translations #literature #worldtranslationday #ChaayaPublications #teluguliterature
2
43
ఒక కరువు. రెండు కథలు.
1876–78 మద్రాస్ కరువు.
ఒక పక్క లక్షలమంది నిరుపేద భారతీయులు ఆకలితో మాడి చేస్తూంటే ఇంకో పక్క వేల క్వింటాళ్ళ ధాన్యం తమ సైన్యంకోసం బ్రిటిష్ ప్రభుత్వం బయటి ప్రాంతాలకు ఎగుమతి చేసిన కాలం.
అప్పట్లో ఒక్క రాయలసీమలోనే 8 లక్షల మంది చనిపోయారని అంచనా.
నాటి మద్రాసు ప్రావిన్సులో 25% జనాభా ఈ కరువుకు బలైంది. ఈ కరువు దక్కన్‌నూ తాకింది.
ఆ కరువు కాలంలో జరిగిన ఘటనల స్ఫూర్తితో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రధారిగా "రణబాలి" సినిమా వస్తోంది. సింగనమల బొబ్బిలి రణబాలి, రాయలసీమ మట్టిలో పుట్టిన యోధుడు. బ్రిటిష్ పాలనను కరువు దోపిడీని ఎదుర్కొని పోరాడాడు.
అదే కాలంలో జరిగిన చారిత్రిక సంఘటనలను తీసుకొని తమిళ రచయిత జయమోహన్ "వెల్లై యానై" అనే నవల రాశాడు.
దాన్ని తెలుగులో "తెల్ల ఏనుగు"గా ఛాయ తీసుకొచ్చింది.
ఐస్ తయారీ చేసే మద్రాస్ ఐస్ హౌస్ ఫ్యాక్టరీ. న్యూ ఇంగ్లండ్ (అమెరికా) సరస్సుల నుంచి ఆ ఫ్యాక్టరీకి దిగుమతి అయ్యే భారీ మంచుదిమ్మెలు, వాటిని మోసే దళిత కార్మికులు, వాళ్ళమీద బ్రిటిష్ అండతో యాజమాన్యం చేసే అకృత్యాలు, ఇంకో పక్క కృత్రిమంగా సృష్టించిన కరువు - ఇదంతా ఒక ఐరిష్ అధికారి కళ్ళతో మనకు చూపిస్తాడు ఈ నవలలో జయమోహన్.
సినిమా యుద్ధాన్ని చూపించబోతుంటే, ఈ నవల మనిషిని, మనిషిలోని అంతర్యుద్ధాన్ని కళ్ళకు కడుతుంది.
రణబాలి థియేటర్లలోకి రాకముందే ఆ కరువు వెనకాలున్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే "తెల్ల ఏనుగు" చదవండి.
Order here
chaayabooks.com/book/tella-e…
#TellaEnugu #Ranabaali #Jeyamohan #VijayDevarakonda #ChaayaBooks
1
30
పెదరాశి పెద్దమ్మ, రాజుగారి ఏడుగురు కొడుకుల కథలు కూడా నిషేధితార్హం అవుతాయా?
అట్లాంటి రోజోకటి వస్తే? లేదా అట్లాంటి రాజ్యం ఒకటుంటే?
సాహిత్యం చదివే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.
చదివేందుకు chaayabooks.com నుండి ఆర్డర్ చేయండి.
#folktales #telugukathalu #telugu #chaayavideshi #chaayapublications
1
28
అనేక మూకల నడుమ...
మన చుట్టూ ఎన్నో మూకలు. అడుగు తీసి అడుగు వేస్తే ఒక మూక ఎదురవుతుంది. అట్లే, అడుగడుక్కూ కులం. కులం అనే మూకస్వామ్యంలో బతికే మనుషుల కథే ఈ మూక. మార్జినాలైజ్డ్ మనుషుల సాహిత్యం ఇవాళ ప్రపంచంలో ప్రధాన స్రవంతి అయింది. తన "అక్రమ సంతానం"తో తెలుగు పాఠకుల్ని కుదిపేసిన మరాఠీ రచయిత శరణ్ కుమార్ లింబాలే "సనాతనం"కు గానూ సరస్వతీ సమ్మాన్ పురస్కారం అందుకున్నాడు. ఛాయ తీసుకువస్తున్న రెండవ శరణ్ కుమార్ నవల ఈ "మూక". @yendlurimanasa
అనువాదంలో...
పుస్తకావిష్కరణ సభలో కవయిత్రి @mercymargaretboda ఈ పుస్తకాన్ని పరిచయం చేసింది. తన ప్రసంగం ఛాయ యూట్యూబ్ ఛానల్లో
youtu.be/SLqx_SAB4jk?si=LtTK…
chaayabooks.com
#Mooka #Jhund #SharanKumarLimbale
#Chaayapublications #TeluguLiterature
3
103
ప్రతి పాఠకుడి, రచయిత లైబ్రరీలో ఉండాల్సిన పుస్తకం ఈ 'నిషేధిత పుస్తకాల లైబ్రరీ'.
పుస్తకాలను నిషేధించాల్సిన సెన్సార్ అధికారి ఆ పుస్తకాలకు పాఠకుడిగా మారితే ఎలా ఉంటుంది? అనే ఒక ఊహ నుండి పుట్టింది పుస్తకం. పుస్తక నిషేధాలు తెలుగు నేలకు కొత్తకాదు. ఈ దేశానికీ కొత్తకాదు. ఇప్పుడు నిషేధం పుస్తకం అచ్చుకాక మునుపే జరిగిపోతుంది. రాస్తున్నప్పుడే తమ రచనలను సెన్సార్ చేసుకోవడం, ప్రచురణకర్తలు సెన్సార్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ పుస్తకం దగ్గర మొదలు పెట్టి ఈ పుస్తకపు ముందూ వెనకలచరిత్రనూ తట్టాడు Srinivas Kandlakunta. ప్రతి పాఠకుడి దగ్గర ఎట్లా ఈ పుస్తకం ఉండాలో, ఈ ఉపన్యాసం కూడా వినాలి.
అరబిక్ లో వచ్చిన ఈ పుస్తకాన్ని ఇంగ్లిష్ అనువాదం చేసిన సవాద్ హుస్సేన్, రాన్యా అబ్దుల్ రహ్మాన్ లకు మొదట అభినందనలు. వారిద్దరూ పూనుకోకపోతే ఈ పుస్తకం మా తెలిసేది కాదు.
తెలుగు అనువాదం చేసిన Aripirala Satyaprasad, పుస్తక ఎడిటింగ్ భాద్యతలు పంచుకున్న Ramana Murthy , ముందుమాట రాసిన ఎన్. వేణుగోపాల్ లకు ప్రత్యేక ధన్యవాదాలు.
Video Link
youtu.be/ZYyIAifu9uo
Order your copy here
chaayabooks.com/book/nishedh…
[Telugu literature, Chaaya books, K Srinivas, Book censorship, Chaaya Videshi ]
3
101
మహారాష్ట్రలో మొదలు కువైట్ మీదుగా పాలస్తీనా దాకా ఈ మూడు పుస్తకాలు మిమ్మల్ని నడిపిస్తాయి. భూత, భవిష్యత్, వర్తమానాన్ని కళ్ళకు కడతాయి. మూడు వేరువేరుగా కనిపించినా వీటన్నిటిని కలిపే ఓ అంతఃసూత్రత ఉన్నది.
కాళ్ళ కింద నేల లేకుండా నేల కోసం పోరాడే మనుషులు,
మాట్లాడుకునే భాష అంతరాల్లోకి పోకుండా నిషేధించబడిన మనుషులు,
మనుషులుగా పుట్టిన మనుషులుగా గుర్తింపు లేని మనుషులు ఈ మూడు పుస్తకాల్లో మీకు తారసపడతారు.
Adrushya Kathanam
amazon.in/dp/9347704067
Nishedhita Pustakala Library
amazon.in/dp/934770492X
Mooka
amazon.in/dp/9347704431
chaayabooks.com
#Telugu #telugubooks #chaayapublications
1
54
పుస్తకాలే చదవటం లేదు అనే కాలంలో పుస్తకాలను ప్రజల్లోకి తీసుకుపోతున్న ఛాయకి అభినందనలు. ఈ పుస్తకం ఒక అద్భుతం. – అల్లం నారాయణ, మాజీ చైర్మెన్, మీడియా అకాడమీ తెలంగాణ
Order link
amazon.in/dp/9347704067
chaayabooks.com
#internationalbookerprize #teluguliterature #ChaayaVideshi #allamnarayana #chaayapublications
1
38
ఈ పుస్తకం చదివిన తరువాత, పుస్తక పఠనం మీద మనకున్నటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు చాలా ఉన్నతీకరింపబడతాయి. – కె. శ్రీనివాస్, సీనియర్ సంపాదకులు
Order your copy here
chaayabooks.com/book/nishedh…
#teluguliterature #telugu #bookrecommendations #chaayabooks #bookcensorship
1
46
ఇవి మనుషుల గురించి రాసిన పుస్తకాలు. ఇప్పుడున్న సందర్భంలో ఇలాంటి పుస్తకాలు అవసరం - ప్రకాశ్ రాజ్
Adrushya Kathanam
amazon.in/dp/9347704067
Nishedhita Pustakala Library
amazon.in/dp/934770492X
Mooka
amazon.in/dp/9347704431
chaayabooks.com
#prakashraj #teluguliterature #chaayabooks #telugubooks #bookrecommendations
3
119
ఛాయ అనువాద నవలల ఆవిష్కరణ
మూకలు రాజ్యమేలు కాలంలో మొదట వచ్చేది నిషేధం. ఆ తరువాత జెనోసైడ్. ఈ మూడు నవలల అంతఃసూత్రం ఇదే. శరణ్ కుమార్ లింబాలే "మూక" మూలస్వామ్యం గురించి మాట్లాడితే, Bothayna Alessa "నిషేధిత పుస్తకాల లైబ్రరీ" సెన్సార్షిప్ అనేది ఎన్నివిధాలుగా జరుగుతుందో చేర్చింది. Ibtisam Azem ابتسام عازم "అదృశ్య కథనం" మానవ హననం, విధ్వంసం, జ్ఞాపకాల గురించి చెబుతుంది.
నటుడు ప్రకాశ్ రాజ్ ఈ పుస్తకాలను ఆవిష్కరించి నడుస్తున్న కాలాన్ని ప్రస్తావిస్తూ, భవిష్యత్తును హెచ్చరించాడు. ఇట్లాంటి పుస్తకాలు మరిన్ని రావాలనే అభిలాషను వ్యక్తం చేశాడు.
ఈ మూడు పుస్తకాలను ఇక్కడ ఆర్డర్ చేయచ్చు;
Adrushya Kathanam
amazon.in/dp/9347704067
Nishedhita Pustakala Library
amazon.in/dp/934770492X
Mooka
amazon.in/dp/9347704431
chaayabooks.com
#chaayapublications #teluguliterature #dystopian #bookcensorship #mobocracy
2
87















