Official Account of the Collector & District Magistrate Khammam- Divakara, IAS

Khammam, India
Joined January 2017
ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆదివారం పాలేరు నియోజకవర్గం లోని #ఖమ్మంరూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనితతో కలిసి పర్యటించిన మంత్రి, రూ.38 కోట్లతో మద్దులపల్లి నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులతో పాటు రూ.కోటి వ్యయంతో చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. మద్దులపల్లి నుంచి గొల్లగూడెం రూ.38 కోట్లతో చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారితో పాటు సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నామని, పనులను త్వరితగతిన పూర్తి చేయాడం ద్వారా ఏదులాపురం ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుగా అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే ప్రభుత్వం రూ.75.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేటాయింపులు జరిగాయని వివరించారు. రహదారులు, డ్రైనేజీలు, జంక్షన్ల అభివృద్ధి తదితర మౌళిక సదుపాయాలను మెరుగుపరిచి పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమాంతరంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. గత పాలకులు సృష్టించిన ఆర్థిక అవరోధాలను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతి దశలో అండగా నిలుస్తుందని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదని, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో నీటి లభ్యతపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వానాకాలంలో రైతులు సాగు చేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడదని స్పష్టం చేశారు. పంటలకు అవసరమైన నీరు, విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. అయితే, రానున్న కాలంలో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు రెండో పంట వేయవద్దని విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. సంక్షోభ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరమని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా తెలంగాణకు ఎలాంటి వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు అవసరమైన సహాయం అందేలా బీజేపీ ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి తగిన మద్దతు లభించేలా కృషి చేయాలని కోరారు. కరువు పరిస్థితులను గతంలో ఎదుర్కొన్న అనుభవం రైతులకు ఉందని, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ... ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించినట్లు తెలిపారు. గిరిజన భవన్, వసతి గృహం, వివిధ రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. రూ.38 కోట్లతో చేపట్టనున్న రహదారి నిర్మాణం ఎంతో ప్రాధాన్యత కలిగిన పనిగా పేర్కొంటూ, మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగించి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రజలకు దీర్ఘ కాలికంగా ఉపయోగపడేలా పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
1
6
891
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌళిక సదుపాయాల కల్పనే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు తెలిపారు. #ఖమ్మంజిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పర్యటించారు. #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్., ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిలతో కలిసి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పూర్తయిన పనులను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. చింతకాని మండలం లోని రామకృష్ణాపురం గ్రామంలో రామకృష్ణాపురం నుంచి పెద్దగోపతి రోడ్డు వరకు రూ.50 కోట్లతో చేపట్టనున్న రహదారి విస్తరణ, బలోపేతం పనులకు, అలాగే రామకృష్ణాపురం నుంచి కొత్తగూడెం వరకు దేవరపల్లి హైవేను కలుపుతూ రూ.3 కోట్లతో నూతనంగా చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, తర్వాత తిమ్మినేని పాలెం గ్రామంలో రూ.8.25 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, ఆనంతరం కొదుమూరు గ్రామంలో వెంకటపాలెం నుంచి చింతకాని రోడ్డు వరకు రూ.60 కోట్లతో నాలుగు వరుసల రహదారిగా చేపట్టనున్న విస్తరణ, బలోపేతం పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. తిమ్మినేని పాలెం ఎస్సీ కాలనీలో రూ.62 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను, గాంధీనగర్ ఎస్సీ కాలనీలో రూ.46 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డులను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. మెరుగైన రహదారుల వల్ల గ్రామాల మధ్య రాకపోకలు సులభతరమౌతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజలకు అభివృద్ధి పనుల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
1
12
926
సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, రానున్న రోజుల్లో తలెత్తే కరువు పరిస్థితు లను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు తెలిపారు. శనివారం #ఖమ్మంజిల్లా చింతకాని మండలంలో #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్ రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించిన అనంతరం కొదుమూరు గ్రామంలో డిప్యూటీ సిఎం మీడియా సమావేశం నిర్వహించారు. సూపర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోందని, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీరు ఆవిరైపోవడంతో పాటు భూగర్భ జలాలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని, రాబోయే 10 నెలల పాటు మనుషులు, పశువుల త్రాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని 44 వేల చెరువుల్లో సుమారు 40 శాతం చెరువుల్లో కనీసం పావు వంతు కంటే తక్కువ నీరు ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరువు పరిస్థితు లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను ప్రజలు, రైతులు పాటిస్తూ ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరించాలని కోరారు. రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. 2014లో రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 6,648 మెగావాట్లు ఉండగా, 2023లో 15,497 మెగావాట్లకు చేరిందని, ప్రస్తుతం 20 వేల మెగావాట్లకు పైగా డిమాండ్‌ నమోదవుతోందని వివరించారు. గృహ అవసరాలు, వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాల వినియోగం పెరగడంతో విద్యుత్‌ డిమాండ్‌ అధికమవుతోందని తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో రోజుకు 245 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం వస్తే, ప్రస్తుతం రోజుకు 335 మిలియన్ యూనిట్ల, దాదాపు 37 శాతం అధికంగా డిమాండ్ పెరిగిందని అన్నారు.   డిమాండ్‌ పెరుగుదలను ముందుగానే అంచనా వేసి, నిపుణులతో చర్చించి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం వల్ల విద్యుత్‌ కోతలు లేకుండా సరఫరా చేయగలుగుతున్నామని తెలిపారు. అక్టోబర్‌ నెలలో విద్యుత్‌ అవసరాలు అధికంగా పెరిగినప్పటికీ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని అన్నారు. ఒకవైపు విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతూ, మరోవైపు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో జలవిద్యుత్‌ ఉత్పత్తి అవకాశాలు తగ్గుతున్నాయని వివరించారు. విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఎన్పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో కొత్తగా 680 సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయగా, 177 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ట్రాన్స్‌కో పరిధిలో 24 సబ్‌ స్టేషన్లకు అనుమతులు మంజూరు చేయగా, 11 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా, వాటిలో దాదాపు 15 లక్షల పంపుసెట్లు భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ప్రభావితమయ్యాయని డిప్యూటీ సీఎం తెలిపారు. నీరు లేకున్నా మోటార్లు నడపడం, ఒకేసారి అధిక విద్యుత్‌ లోడ్‌ పడటం వల్ల కొన్ని ప్రాంతాల్లో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా యని చెప్పారు. భూగర్భ జలాలు అందుబాటులో లేనప్పుడు మోటార్లు ఆన్‌ చేయవద్దని, పంపుసెట్లకు అమర్చిన ఆటో స్టార్టర్లను తొలగించాలని రైతులకు సూచించారు. విద్యుత్‌ వినియోగంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. 53 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకం క్రింద ఇప్పటి వరకు ప్రభుత్వం పేద కుటుంబాల తరఫున డిస్కంలకు రూ.5,000 కోట్లు చెల్లించిందన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు డిస్కంలకు చెల్లిస్తోందని వివరించారు. గ్రామాల వారీగా వ్యవసాయ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై రైతులకు తగిన సూచనలు అందించాలని తెలిపారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం క్రింద పెద్ద ఎత్తున పనులు చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి గ్రామంలో అవసరమైన పనులను గుర్తించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన మేరకు నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
1
14
1,011
#ఖమ్మంజిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో రూ.3.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్., ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. గ్రామాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ మౌళిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని, నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
1
12
1,030
#ఖమ్మంజిల్లా పర్యటన లో భాగంగా శనివారం కలెక్టరేట్ కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి జిల్లాకలెక్టర్ దివాకర టి.ఎస్ గారు పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
42
2,273
జిల్లా అభివృద్ధి కోసం అన్ని శాఖలు స్పష్టమైన లక్ష్యాలతో పనిచేయాలని #జిల్లాకలెక్టర్ దివాకర టి ఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం #ఖమ్మంకలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికే రూపొందించిన జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ ప్రణాళికలను వివరించగా, వాటిని పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రతి శాఖ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ తెలిపారు. స్వల్పకాలిక లక్ష్యాలను ఆరు నెలల్లోగా వంద శాతం సాధించేలా, మధ్యకాలిక లక్ష్యాలను ఆరు నుంచి పన్నెండు నెలల్లో, దీర్ఘకాలిక లక్ష్యాలను పన్నెండు నుంచి ఇరవై నాలుగు నెలల్లో సాధించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి నెలా లక్ష్యాల సాధనలో పురోగతిని సమీక్షించాలని, నిర్దేశిత నమూనాలో పూర్తి వివరాలతో ప్రణాళికలను సవరించి తిరిగి సమర్పించాలని ఆదేశించారు. అత్యంత ముఖ్యమైన పనులను వెంటనే చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల ప్రణాళికలకు ప్రాథమిక కార్యాచరణ నమూనా సిద్ధమైన తర్వాత ప్రతి రంగానికి అవసరమైన కన్సల్టెన్సీ సేవలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. జిల్లాలో శిశు మరణాల రేటు (IMR), మాతృ మరణాల రేటు (MMR) తగ్గించేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. గర్భిణుల నమోదు వంద శాతం పూర్తి చేయడంతో పాటు ప్రసవాల వివరాలు, గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, టీకాల కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వైద్య సేవల మెరుగుదలకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇప్పటికే అమలులో ఉన్న విధానాలను క్షేత్రస్థాయిలో ఎలా పర్యవేక్షిస్తున్నారో నిర్దేశిత నమూనాలో వివరాలు సమర్పించాలని తెలిపారు. సిజేరియన్ ప్రసవాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, పీసీపీఎన్‌డీటీ (PCPNDT) చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. పిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపం, మధ్యస్థ పోషకాహార లోపం తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో పిల్లల్లో పోషకాహార లోపానికి గల కారణాలను గుర్తించి, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రతి అంశంపై లక్ష్యాలు, అమలు విధానం, పర్యవేక్షణ వివరాలను నిర్దేశిత నమూనాలో సమర్పించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాల ప్రస్తుత రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకొని విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతను మెరుగుపరచాలని తెలిపారు. పాఠశాలల వారీగా సాధించాల్సిన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించి, వాటి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సూచించారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీ, వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పరిశ్రమలు, మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న నైపుణ్యాల డిమాండ్‌కు అనుగుణంగా శిక్షణ కోర్సులు రూపొందించాలని సూచించారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో ఎక్కువ మంది యువత పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, శిక్షణ పొందుతున్న యువత వివరాలు, శిక్షణ పురోగతి, సాధించిన ఫలితాలపై ప్రత్యేక రికార్డు నిర్వహించాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని వసతి విద్యాసంస్థల్లో త్రాగునీటి సదుపాయాల పరిస్థితిని వచ్చే వారం రోజుల్లోగా సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులు, ఉత్పత్తులు, పారిశ్రామిక అవకాశాలను పరిగణనలోకి తీసుకొని పరిశ్రమల అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. పెద్ద, మెగా పరిశ్రమల స్థాపనకు అవకాశాలను గుర్తించడంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిధిలో వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో మిర్చి ఉత్పత్తి అధికంగా ఉన్నప్పటికీ, దానికి అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు తక్కువగా ఉన్న అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మిర్చి ప్రాసెసింగ్‌తో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలనిఅధికారులను‌ కలెక్టర్ ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
1
19
1,475
పేద ప్రజల పక్షాన నిలిచి, అణగారిన వర్గాల కోసం పోరాడిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న అని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. గురువారం పండుగ సాయన్న జయంతి సందర్భంగా #ఖమ్మంకలెక్టరేట్‌ లో వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజలను దోపిడీ చేస్తున్న భూస్వాములకు, దొరలకు వ్యతిరేకంగా పండుగ సాయన్న పోరాటం చేశారని కలెక్టర్ తెలిపారు. పండుగ సాయన్న కేవలం సంపన్నుల నుంచి ఆస్తులను తీసుకొని పేదలకు పంచి పెట్టడానికే పరిమితం కాకుండా, ఆనాటి పాలనలోని అధికార వ్యవస్థను ప్రశ్నించి, అధికారులను ఎదిరించారని తెలిపారు. తనదైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా ప్రయత్నించారని వివరించారు. ప్రజల కోసం పోరాడిన పండుగ సాయన్న జీవితం, ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడిన మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
2
7
816
సమాజంలో అనాదిగా కొనసాగుతున్న వెట్టి చాకిరి, బానిసత్వం వంటి దురాచారాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ పిలుపునిచ్చారు. వెట్టి చాకిరి నిర్మూలనపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్‌ను గురువారం #ఖమ్మంకలెక్టరేట్‌ లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం అసంఘటిత రంగ కార్మికులకు వెట్టి చాకిరి నిర్మూలన, కార్మిక హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వెట్టి చాకిరి అనేది మానవ హక్కులకు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే అమానవీయ విధానమని, సమాజంలో ప్రతి ఒక్కరికీ గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్మికులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఎవరైనా బలవంతంగా పనులు చేయించడం, శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా పనిచేయించుకోవడం వంటి అన్యాయాలకు పాల్పడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వెట్టి చాకిరి నిర్మూలనకు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు వెట్టి చాకిరి నిర్మూలన, కార్మికుల హక్కులు, అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలు, ఫిర్యాదుల పరిష్కార విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, గనులు, క్వారీలతో పాటు వెట్టిచాకిరీ చోటుచేసుకునే అవకాశం ఉన్న ఇతర పని ప్రదేశాల్లోని అసంఘటిత, ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న కార్మికరంగాలపై ఈ ప్రచారం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని, సమాజంలో వెట్టి చాకిరికి తావులేకుండా, ప్రతి కార్మికుడు స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
1
12
1,302
పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భరోసా, రక్షణ కల్పించడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని #జిల్లాకలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు. బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా #ఖమ్మంజిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్మృతి పరేడ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్‌తో కలిసి పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా బుధవారం ఖమ్మం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్, జిల్లా పోలీస్ యంత్రాంగం, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. తొలుత పోలీసు సాయుధ బలగాలు అమరవీరుల స్మృత్యర్థం పరేడ్ నిర్వహించి గార్డ్ ఆఫ్ హానర్ సమర్పించాయి. తర్వాత రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లు శాలువాలతో సత్కరించి గౌరవించారు. దేశ రక్షణ కోసం లడక్ సరిహద్దు ప్రాంతంలో ప్రాణ త్యాగం చేసిన వీరుల స్ఫూర్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలీస్ జెండా కేవలం ఒక వస్త్రం కాదని, అది పోలీస్ శాఖ నిత్యం ప్రదర్శించే నిబద్ధత, త్యాగం, గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ప్రగతికి తోడుగా ప్రజలకు భరోసా, రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ గుర్తు చేశారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు వారి కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు అండగా నిలుస్తున్న కుటుంబ సభ్యుల త్యాగాలను కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం నేరాల స్వరూపం వేగంగా మారుతోందని, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు సహా కొత్త తరహా నేరాలు వెలుగు లోకి వస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా అరికట్టేందుకు పోలీసింగ్ విధానాలను ఆధునీకరిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో వినియోగించడంలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధనలో పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం రెండు ముఖ్యమైన విభాగాలని, పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. #పోలీసుకమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ* 1959 అక్టోబర్ 21న లడఖ్‌ ప్రాంతంలో చైనా సైనికులతో పోరాడుతూ దేశ సరిహద్దులను కాపాడే క్రమంలో 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. చివరి శ్వాస వరకు దేశ రక్షణ కోసం పోరాడిన వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది త్యాగాలను ఈ సందర్భంగా స్మరించు కుంటున్నామని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటం, ప్రజలకు రక్షణ కల్పించడం, నేరాలను నియంత్రించడం వంటి బాధ్యతలను పోలీసులు నిరంతరం నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో నక్సలిజం, తీవ్రవాద సమస్యలు తీవ్రంగా ఉండేవని, పోలీసుల నిరంతర కృషి, త్యాగాల ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
2
14
1,211
#ఖమ్మం నగరంలో విజయదశమి రోజున పారువేట గా జమ్మిబండపై ప్రత్యక్షమయ్యే శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ దంపతులు మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్ కుటుంబ సమేతంగా దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
1
18
991
#ఖమ్మంజిల్లా, పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ (22వ వార్డు)లో రూ. 2.5 కోట్లతో నిర్మించే గిరిజన సంక్షేమ శాఖ బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవన నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి సోమవారం రాత్రి శంకుస్థాపన చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని, త్వరలోనే బాలికల హాస్టల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తామని మంత్రి తెలిపారు. వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర పరిణామాలతో రాష్ట్రంలో ఎల్నినో ముప్పు పొంచి ఉందని, సాగునీటికి కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ఇప్పటికే రైతులు వేసిన పంటకు నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వరి, మొక్కజొన్న వంటి నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలు సాగుచేయవద్దని, నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు సాగుచేయాలని అన్నారు. ప్రజలంతా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
1
5
1,069
వెలుగుమట్ల కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు కాలనీలో చేపడుతున్న అన్ని మౌళిక వసతుల పనులను నవంబర్ 15వ తేదీ నాటికి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు. సోమవారం #ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల మోడల్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి మంత్రి పరిశీలించి, మీడియా సమావేశం నిర్వహించారు. వెలుగుమట్ల కాలనీలో నిర్మాణం ప్రారంభించిన 300 ఇండ్లను నవంబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఇంటి నిర్మాణ స్థితిగతులు, ప్రస్తుతం జరుగుతున్న పనులు, పూర్తికావాల్సిన పనులు, పనుల పురోగతితో కూడిన నివేదికను ప్రత్యేకంగా సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని సూచించారు. ప్రతి రోజూ పనులను పర్యవేక్షిస్తూ, అన్ని ఇళ్లను ఒకే నమూనాలో, ఆకర్షణీయంగా నిర్మించాలని, అదనపు సిబ్బందిని నియమించి పగలు, రాత్రి పనులు కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరులోగా అన్ని ఇళ్ల స్లాబుల నిర్మాణం, విద్యుత్ పనులు కూడా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణంతోపాటు రహదారులు, డ్రైనేజీలు, ఎనిమిది దుకాణాలతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్, బస్తీ దవాఖానా, కమ్యూనిటీ హాల్, అంగన్‌వాడీ కేంద్రం తదితర మౌళిక వసతుల పనులను కూడా నవంబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అన్ని పనులను సమాంతరంగా చేపట్టాలని, ఏ పనిలోనూ జాప్యం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటికి త్రాగునీటి పైపులైన్ ఏర్పాటు చేసి, ఇంటి వద్దనే త్రాగునీటి కుళాయి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కాలనీకి అవసరమైన రహదారులను నిర్మించాలని సూచించారు. కాలనీలోని ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన అనుమతులను ఇంధన శాఖ కార్యదర్శి ద్వారా పొందేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నవంబర్ 8వ తేదీ దీపావళి నాటికి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వెలుగుమట్ల కాలనీని డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. అప్పటికి కాలనీలోని అన్ని ఇళ్లు, రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌళిక వసతులు అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. కాలనీకి సంబంధించిన పేరును ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటిస్తారని తెలిపారు. గతంలో ఇక్కడ జరిగిన పరిణామాలను వివరిస్తూ, పేదల పేరుతో కొంతమంది భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించారని, కోర్టు నిర్ణయం ప్రకారం జిల్లా యంత్రాంగం ఆక్రమణలను తొలగించిందని మంత్రి పేర్కొన్నారు. అదే ప్రాంతంలో మోసపోయిన పేదలకు శాశ్వత నివాసాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వివరించారు. పేదలకు న్యాయం చేస్తూ ఆదర్శ కాలనీగా, వెలుగుమట్ల కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కాలనీల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో, అలాంటి సదుపాయాలన్నింటినీ వెలుగుమట్లలోని పేదలకు ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి తెలిపారు. ఇళ్లతోపాటు రహదారులు, డ్రైనేజీలు, బస్తీ దవాఖానా, అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం వెలుగుమట్లలో ఆదర్శవంతమైన కాలనీని నిర్మిస్తోందని అన్నారు. గతంలో జరిగిన దోపిడీని ప్రజలకు తెలియజేయడంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలు, వారికి కల్పిస్తున్న సదుపాయాలను కూడా ప్రజలకు స్పష్టంగా వివరించాలని మంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల స్థాయిపై ఆసక్తి వ్యక్తమవుతోందని, ఇటీవల తమిళనాడు పర్యటన సందర్భంగా అక్కడి వారు తెలంగాణలో ఇన్ని సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయగలుగు తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. పేదల సంక్షేమాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి పేర్కొన్నారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
2
14
1,899