ప్రజాస్వామ్యంలో ఓటు విలువను గుర్తించి, ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత యువతపై ఉందని వనపర్తి డీఆర్వో రాంరెడ్డి అన్నారు. ఐడీఓసీ హాల్లో శనివారం జరిగిన జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీల్లో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన వారు ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
1
7
648
విజేతలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని తెలిపి, ప్రశంసా పత్రాలు అందజేశారు.
@TelanganaCMO
@TelanganaCS
@CEO_Telangana
34
వనపర్తి జిల్లా పెద్దగూడెంలో ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి తో కలిసి ప్రారంభించారు. 18–59 ఏళ్ల కుటుంబ పెద్ద మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు అందుతాయని,
1
1
244
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా నమోదు మొదలైందని తెలిపారు. ప్రతి కుటుంబానికి బీమా వర్తిస్తుందంటూ, ఐదుగురికి నమోదు పత్రాలు అందజేశారు.
@TelanganaCMO
@TelanganaCS
46
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి, ఐదుగురు లబ్ధిదారులతో నమోదు చేయించారు.
@TelanganaCMO
@TelanganaCS
4
445
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం నర్సింగాయిపల్లెలోని ఎంసీహెచ్ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి, ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను
1
10
1,017
క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం మెడికల్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి, జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
1
1
93
ఇదే వేగంతో పనులను కొనసాగిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసి ఆసుపత్రి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత నిర్మాణ సంస్థ, అధికారులకు ఆదేశించారు.
@TelanganaCMO
@TelanganaCS
57
గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, సన్నద్ధతపై అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ తో కలిసి సంబంధిత జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వీడియో కాన్ఫరెన్స్
1
1
326
నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
1
50
శిబిరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ప్రతి గ్రామం, వార్డులో శిబిరాల నిర్వహణకు సంబంధించి ప్రజలకు ముందస్తుగా సమాచారం అందించాలని సూచించారు.
@TelanganaCMO
@TelanganaCS
25
వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల,జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
1
2
359
పనులు నత్తనడకన సాగుతుండటంపై ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
1
1
53
కాంట్రాక్టర్‌కు వెంటనే సమాచారం అందించి పనుల వేగం పెంచేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
@TelanganaCMO
@TelanganaCS
21
బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సమీక్షించారు.ఈ సందర్భంగా పలు కీలక సూచనలు,ఆదేశాలు జారీ చేశారు.
1
1
273
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్నిఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆభా (ABHA) కార్డుల జనరేషన్ ప్రక్రియను వేగవంతంచేయాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రతిరోజూ కనీసం 200 ఆభా కార్డులు జనరేట్ చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలని సూచించారు.అదేవిధంగా జిల్లాలో 108 అంబులెన్స్ సేవలవినియోగాన్ని
1
42
పెంచాలని,అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులు ఈ వాహనాలను సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించి,అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
@TelanganaCMO
@TelanganaCS
16
బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, దరఖాస్తుల సేకరణ, ప్రజలకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
1
4
331
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించే సమయంలోనే వనపర్తి జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ఒకేసారి ప్రారంభించాలని
1
65
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించడంతో పాటు, రాబోయే రెండు వారాల పాటు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు సేకరించాలని సూచించారు.
@TelanganaCMO
@TelanganaCS
20






































