Pinned Tweet
Rahul Gandhi: India Should Not Fear Jokers and Clowns Who Know Nothing of Our History or Philosophy
రాహుల్ గాంధీ: మన చరిత్ర, తత్వశాస్త్రం తెలియని జోకర్లు, క్లౌన్లను చూసి భారత్ భయపడాల్సిన అవసరం లేదు
రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడుతున్నప్పుడు భయపడటం అర్థం చేసుకోవచ్చని, కానీ నేడు మన చరిత్ర, తత్వశాస్త్రం గురించి ఏమీ తెలియని శక్తులను చూసి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
దేశం పిరికితనంతో వ్యవహరించకుండా ధైర్యంగా నిలబడాలని స్పష్టం చేశారు.
LoP Shri Rahul Gandhi said that while fear may be understandable when fighting the British Empire, there is no reason to be afraid of forces that know nothing about India’s history or philosophy.
He stressed that India must stand with courage.
#RahulGandhi #India
Sadar Festival Committee Invites CM Revanth Reddy to November 4 Celebrations at NTR Stadium
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు.
వచ్చే నెల 4న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సదర్ ఉత్సవాలకు ఆహ్వానం.
సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపిన కమిటీ ప్రతినిధులు.
కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, యాదాద్రి బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, ఇతర నాయకులు.
#RevanthReddy #Telangana
Telangana Youth Congress Leader Indujaa Files Complaint Against KTR, Seeks SC/ST Atrocities Case Over Alleged Social Media Harassment and Misinformation
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బల్మూర్ ఇందుజా.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వేధింపుల ఆరోపణలకు సంబంధించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వినతి.
• @VenkatBalmoor
• @GaddamInduja
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలి – డిగ్రీ సర్టిఫికెట్లపై గెజిటెడ్ అధికారి ధృవీకరణ నిబంధనను తొలగించాలి
Extend Graduate Voter Enrolment Deadline by Four Weeks and Remove Mandatory Gazetted Officer Attestation for Degree Certificates
రానున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ (MBNR–RR–HYD), వరంగల్–ఖమ్మం–నల్గొండ (WGL–KMM–NLG) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్ర ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ సి. సుధర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ కు టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్, ఎస్ఐఆర్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గంప వేణుగోపాల్ వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ నవంబర్ 6వ తేదీ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు చివరి తేదీగా ఉన్న నేపథ్యంలో, అనేక మంది అర్హులైన పట్టభద్రులు అవగాహన లోపం, అవసరమైన పత్రాల సేకరణలో ఇబ్బందులు, ధృవీకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల కారణంగా గడువులోగా నమోదు చేసుకోలేకపోయే అవకాశం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు గడువును కనీసం మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరడం జరిగినది. అదే సమయంలో, విద్యాసంస్థలు, ప్రైవేట్ టెక్ పార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగినది.
అలాగే, తెలంగాణ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీ సర్టిఫికెట్ల ప్రతులపై గెజిటెడ్ అధికారి ధృవీకరణ తప్పనిసరి చేయడం వల్ల దరఖాస్తుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గెజిటెడ్ అధికారులను సంప్రదించడం, ధృవీకరణ పొందడం కోసం సమయం వెచ్చించాల్సి రావడంతో నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోందని పేర్కొన్నారు.
ఫారం-18తో పాటు సమర్పించే డిగ్రీ సర్టిఫికెట్లను ఎన్నికల అధికారులు ఆన్లైన్ ద్వారా ధృవీకరించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. నిబంధనలకు అనుగుణంగా, స్వీయ ధృవీకరణ (Self-Attestation) చేసిన సర్టిఫికెట్లను లేదా ఇతర ప్రత్యామ్నాయ ధృవీకరణ పద్ధతులను అనుమతించడం ద్వారా పట్టభద్రుల నమోదు ప్రక్రియను సులభతరం చేయవచ్చని సూచించారు.
గత పర్యాయం ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు శాతం తక్కువగా కనిపిస్తోందన్న ఆందోళనను కూడా వినతిపత్రంలో ప్రస్తావించడం జరిగినది. నమోదు ప్రక్రియలో ఉన్న అదనపు నిబంధనలు అర్హులైన పట్టభద్రులకు ఇబ్బందిగా మారకుండా, ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే
ఈ రోజు డెక్కన్ క్రోనికల్ దినపత్రికలో ప్రచురించింబడ్డ శీర్షిక ప్రకారం సుమారు 5లక్షల ఓటర్లను ఎస్ఐఆర్ కు ముందే ఫారం 7 ద్వారా తొలగించబడిందని, ఈ ఫారం 7 ఏఐ జనరేటెడ్ ఆ లేదా ఫీజికల్ వొచ్చాయా, ఈ ఫారం 7 వివరాలు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగినది, అలాగే ఈ 5లక్షల ఫారం 7 వివరాలు పునః పరిశీలించాలని కోరం జరిగినది.
ప్రధాన డిమాండ్లు:
- గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు గడువును కనీసం నాలుగు వారాలు పొడిగించాలి.
- విద్యాసంస్థలు, ఐటీ టెక్ పార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
- తెలంగాణలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల డిగ్రీ సర్టిఫికెట్లకు గెజిటెడ్ అధికారి ధృవీకరణ తప్పనిసరి నిబంధనను తొలగించే అంశాన్ని పరిశీలించాలి.
- ఆన్లైన్ ధృవీకరణ లేదా నిబంధనలకు అనుగుణమైన స్వీయ ధృవీకరణ పద్ధతుల ద్వారా నమోదు ప్రక్రియను సులభతరం చేయాలి.
- ఈ సంవత్సరం ఎస్ఐఆర్ కి ముందే ఓటర్ జాబితా నుండి 5 లక్షల ఓటర్ల తొలిగింపు పై పునః పరిశీలించాలి.
అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఎంతో అవసరమని పేర్కొంటూ, నవంబర్ 6వ తేదీ గడువుకు ముందే ఈ అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ముఖ్య ఎన్నికల అధికారిని కోరడం జరిగినది.
-పులిపాటి రాజేష్ కుమార్,
చైర్మన్,
టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ.
Extend Graduate Voter Enrolment Deadline by Four Weeks and Remove Mandatory Gazetted Officer Attestation for Degree Certificates
Pulipati Rajesh Kumar, Chairman of the TPCC Election Commission Coordination Committee, and Gampa Venugopal, State Coordinator for SIR, submitted a representation to Shri C. Sudharshan Reddy Garu, IAS, Chief Electoral Officer of Telangana, requesting measures to simplify the enrolment process for eligible graduate voters ahead of the forthcoming elections to the Mahabubnagar–Rangareddy–Hyderabad (MBNR–RR–HYD) and Warangal–Khammam–Nalgonda (WGL–KMM–NLG) Graduate MLC Constituencies.
The representation highlighted that November 6 is the last date for graduate voter enrolment and expressed concern that many eligible graduates may be unable to register within the stipulated deadline due to a lack of awareness, difficulties in obtaining the required documents, and procedural hurdles in the verification process.
In this regard, they requested that the graduate voter enrolment deadline be extended by at least four weeks. They also urged the Election Commission to conduct extensive voter awareness campaigns across educational institutions, private technology parks, and rural areas to ensure that every eligible graduate gets an opportunity to enrol as a voter.
They further pointed out that the mandatory requirement of Gazetted Officer attestation on copies of degree certificates issued by recognised universities within Telangana is causing considerable inconvenience to applicants. The need to approach Gazetted Officers and obtain the necessary attestation is resulting in delays and creating additional barriers to the enrolment process.
They requested the Chief Electoral Officer to consider permitting election officials to verify degree certificates submitted along with Form-18 through online systems. They also suggested allowing self-attested copies of degree certificates or other alternative verification methods, wherever permissible under the applicable rules, to simplify the registration process without compromising verification standards.
The representation also expressed concern that graduate voter enrolment appears to be lower compared with the previous term's elections. They urged the authorities to take appropriate steps to remove unnecessary procedural difficulties and increase voter participation.
### Request for Clarification and Review of Removal of Five Lakh Voters
The representatives also referred to a headline published in Deccan Chronicle on the same day, according to which approximately five lakh voters had reportedly been removed from the electoral rolls through Form 7 before the commencement of the Special Intensive Revision (SIR).
They sought clarification on whether these Form 7 applications were AI-generated or physically submitted. They also requested that the details of the Form 7 applications be provided and that the removal of the approximately five lakh voters be thoroughly reviewed to ensure transparency and accuracy in the electoral rolls.
### Key Demands
- Extend the graduate voter enrolment deadline by at least four weeks.
- Conduct extensive voter awareness campaigns across educational institutions, IT parks, and rural areas.
- Review the mandatory Gazetted Officer attestation requirement for degree certificates issued by recognised universities within Telangana.
- Simplify graduate voter enrolment through online verification or self-attestation, wherever permissible under the applicable rules.
- Review the reported removal of five lakh voters from the electoral rolls before the commencement of this year's SIR and provide details of the associated Form 7 applications.
Emphasising that every eligible graduate must have a fair opportunity to register as a voter, the representatives urged the Chief Electoral Officer to consider these requests favourably and take appropriate action before the November 6 deadline. They stated that simplifying the enrolment process and ensuring transparency in electoral roll management are essential to strengthening democratic participation.
— Pulipati Rajesh Kumar Chairman TPCC Election Commission Coordination Committee
• @OMGampa
సదాశివపేట మండలం గంగకత్వలో
“డైవ్ కొట్టిన జగ్గారెడ్డి”
గంగకత్వ అభివృద్ధికి సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించిన జగ్గారెడ్డి
ఈ సందర్భంగా గంగకత్వలో డైవ్ కొట్టి... సరదాగా ఈత కొట్టిన జగ్గారెడ్డి
*ఏడవ నిజాం నిర్మించిన గంగకత్వ కాలువ ఆధునీకరణ పనులకు రూ.37 కోట్లు నిధులు తీసుకొచ్చిన జగ్గారెడ్డి, నిర్మల
*నవంబర్ నెలలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజ నరసింహ, వివేక్ చేతులమీదుగా పనులకు శంకుస్థాపన
*2028 జూన్ నెలలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభం
*నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, వివేక్ లకు కృతజ్ఞతలు
*పనులు పూర్తయితే 11 గ్రామాల్లోని 3,300 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం
*రైతుల అవసరాలే లక్ష్యంగా త్వరితగతిన పనులు చేపట్టాలి
*గంగకత్వ కాలువను పరిశీలించి అందులో డైవ్ చేసి ఈత కొట్టిన జగ్గారెడ్డి
#JaggaReddy #Telangana
YS Sharmila Invites Minister Seethakka to Her Daughter’s Wedding, Shares Emotional Memories of YSR
ప్రజా భవన్ లో మంత్రి సీతక్కను కలిసి తన కూతురు వివాహ మహోత్సవానికి ఆహ్వానించిన APCC చీఫ్ వైయస్ షర్మిల దంపతులు
ఆహ్వాన పత్రికను మంత్రి సీతక్కకు అందజేసి, కూతురు వివాహానికి ఆహ్వానించిన వైయస్ షర్మిల దంపతులు
తన నివాసానికి విచ్చేసిన షర్మిల దంపతులను శాలువా కప్పి ఆత్మీయంగా ఆహ్వానించిన మంత్రి సీతక్క
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి నివసించిన భవనం కావడంతో భవనంలో కలియతిరిగి తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్న YS షర్మిల
వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని చూసి భావోద్వేగానికి గురైన వైయస్ షర్మిల, ఓదార్చిన మంత్రి సీతక్క
వైయస్ రాజశేఖర్ రెడ్డి తో షర్మిల ఉన్న చిత్రపటాన్ని షర్మిలకు బహూకరించిన మంత్రి సీతక్క
మంత్రి సీతక్క వెంట తనయుడు సూర్య, ములుగు డిసిసి పైడాకుల అశోక్
#Seethakka #YSSharmila
• @seethakkaMLA
• @realyssharmila
CM Revanth Reddy Reviews STPs, Directs 100% Treated Water Usage and Strict Water Quality Monitoring
ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఎస్టీపీలు, ట్రీటెడ్ వాటర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమీక్ష.
హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ ఎండీ జితేష్ వి. పాటిల్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి.
సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..
ట్రీటెడ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో ఏఐ టెక్నాలజీని వినియోగించాలి.
నీటి నాణ్యతపై రాజీ పడొద్దు.
ప్రతి ప్లాంట్ దగ్గర స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలి.
ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలి.
ఈ ప్లాంట్లపై హైడ్రా మానిటరింగ్ ఉండాలి.
ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ల్యాండ్‌స్కేప్‌లు, రోడ్ క్లీనింగ్‌కు ట్రీటెడ్ వాటర్‌ను మాత్రమే వాడాలి.
సెక్రటేరియట్, సీఎం కార్యాలయం ల్యాండ్స్కేప్లతో పాటు పబ్లిక్ పార్కుల్లో కూడా ట్రీటెడ్ వాటర్ వినియోగించాలి.
రైల్వే డిపార్ట్మెంట్తో పాటు మెట్రో రైల్‌ను కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలి.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర అవసరాల కోసం వంద శాతం ట్రీటెడ్ వాటర్‌ను వాడాల్సిందే. దీన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వాలి.
ట్రీటెడ్ వాటర్ ట్యాంకర్లను ట్రాక్ చేయాలి.
దీనిపై విస్తృత ప్రచారం జరగాలి.
ట్రీటెడ్ వాటర్ కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి.
ట్రీటెడ్ వాటర్‌నే వినియోగించాలని భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే నిబంధన విధించాలి.
ట్రీటెడ్ వాటర్ ప్లాంట్లను సోలార్ పవర్‌తో నడిపే అవకాశాలను పరిశీలించాలి.
ప్రైవేట్ ఎస్టీపీలను ప్రోత్సహించాలి.
డేటా సెంటర్లకు కూడా ట్రీటెడ్ వాటర్ అందించాలి.
నవంబర్ 1 నుంచి డిసెంబర్ ఆదేశాలు అమలయ్యేలా చూడాలి.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చర్యలు ఉండాలి.
ఎట్టి పరిస్థితుల్లో మంచి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి.
మంచి నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ జరగాలి.
అధికారులు నిర్లక్ష్యంగా ఉండొద్దు.
#RevanthReddy #Telangana
Mahesh Kumar Goud Slams Denial of Special Trains, Vows Congress Participation in Delhi Mega Rally on November 1
నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ మెగా ర్యాలీ
రెండు, మూడు నెలలుగా ధర్నాలు, నిరసనలు చేపడుతున్న ఇండియా కూటమి
ర్యాలీ కోసం ప్రత్యేక రైళ్లు కేటాయించాలని ఎంపీల విజ్ఞప్తి
ఎంపీలు అనిల్ యాదవ్, మల్లు రవి ప్రత్యేక రైళ్ల కోసం జీఎంకు దరఖాస్తు
ఆరు రోజుల పాటు కాలయాపన చేసి చివరి నిమిషంలో రైళ్లు ఇవ్వలేమన్నారు
ఉద్దేశపూర్వకంగానే ప్రత్యేక రైళ్లను నిరాకరించారు
రైళ్ల కోసం వెళ్తే పోలీసుల దురుసు ప్రవర్తన
మోదీ, అమిత్ షా సూచనల మేరకే రైళ్లు కేటాయించడం లేదు
దక్షిణాది నేతలు ఢిల్లీ ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకునే కుట్ర
ఎన్ని అవాంతరాలు ఎదురైనా ర్యాలీలో పాల్గొంటాం
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జన సమీకరణకు కాంగ్రెస్ నేతల సన్నాహాలు
ఢిల్లీలో నిరసన గళం వినిపించి తీరుతాం
ప్రత్యేక రైళ్లు ఇవ్వకపోయినా ఢిల్లీ నిరసన ర్యాలీలో పాల్గొంటాం
మోడీ ఫాసిస్టు పాలనకు నూకలు చెల్లాయి
నిరసన ర్యాలీ లో పాల్గొని తీరుతాం
--- మహేష్ కుమార్ గౌడ్,
టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ
• @Bmaheshgoud6666
Congress Leaders Arrested During Protest at Secunderabad Railway Station Over Denial of Trains for November 1 Delhi Protest
సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సహా నేతల అరెస్ట్
నవంబర్ 1న ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి రైళ్లు కేటాయించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మెరుపు ధర్నా నిర్వహించారు.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రైల్వే నిలయంలోని జీఎం కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నగరం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు.
అనంతరం పోలీసులు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తన జన్మదినం సందర్భంగా ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిసిన రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Revenue Minister Ponguleti Srinivasa Reddy met Telangana Chief Minister Revanth Reddy at the Bodhi Pavilion in MCR HRD on the occasion of the Chief Minister’s birthday.
Congress Stages Protest at Secunderabad Railway Station Over Denial of Trains for November 1 Delhi Protest
సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నా
నవంబర్ 1 వ తేదీన ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ నిరసనలకు రైళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మోదీ కి వ్యతిరేకంగా నినాదాలు
ధర్నాలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, డిసిసి అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్, ఇతర ముఖ్య నేతలు అధికారులు
నిరసనలో నగరం నలుమూలల నుండి భారీగా పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు
సికింద్రాబాద్ రైల్వే నిలయం లోని జిఎం కార్యాలయం ముందు బయట బైఠాయించి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నా
నవంబర్ 1 వ తేదీన ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ నిరసనలకు రైళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మోదీ కి వ్యతిరేకంగా నినాదాలు
CM Revanth Reddy Reviews Preparations for Invest Telangana Global Summit 2026
డిసెంబర్ లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమీక్ష
గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ ప్రపంచ స్థాయిలో మరింతగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు
ఈ నెల 29న ఢిల్లీలో జరగనున్న కర్టెన్ రైజర్ కార్యక్రమం విజయవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించిన సీఎం
ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుండి నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్, ఔత్సాహిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్ పో, ఇండియా జాయ్ ఈవెంట్ల పై అధికారులకు దిశానిర్దేశం
నవంబర్ మొదటి వారంలోగా ప్రణాళికలను ఖరారు చేసుకుని పలు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే సీఈఓలు, ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు
టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన వివిధ ప్రముఖులను అతిథులకు చాటిచెప్పే విధంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రచార ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో పలు చోట్ల డ్రోన్ ఆధారిత ప్రచారం చేపట్టాలన్నారు
క్లైమేట్ చేంజ్, ఏఐ రంగాలకు సంబంధించిన ప్రపంచ స్థాయి ప్రముఖులను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించాలన్నారు
AVGC (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) రంగానికి సంబంధించి ప్రత్యేకంగా చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు.
తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్ ఆవరణలో డిజైన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం అధికారులకు సూచించారు
కాకతీయ కళా తోరణం, రామప్ప ఆలయం డిజైన్లకు ప్రాముఖ్యతను ఇవ్వాలన్నారు
బతుకమ్మ పండుగ గురించి అతిథులు తెలుసుకునేలా ప్రత్యకంగా డిజైన్లు, ఏర్పాట్లపై అధికారులు వివరించారు
సీఎస్ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ డి. అనుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు
#RevanthReddy #Telangana
బీజేపీ పని అయిపోయింది...
ఇప్పుడున్న 8 ఎంపీ సీట్లలో రెండు వస్తే ఎక్కువ
8 మంది ఎమ్మెల్యే లలో ఒక్కరు గెలువరు
---- పీసీసీ అధ్యక్షుడు,
మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్
కేటీఆర్ - హరీష్ రావు భ్రమలో ఉన్నారు... గ్రౌండ్ రియాలిటి తెలుసుకోవడం లేదు.
మా టార్గెట్ వచ్చే ఎన్నికల్లో వంద(100) సీట్లు.
అన్ని సమస్యలకు నవంబర్ లో పరిష్కారం దొరుకుతుంది.
నవంబర్ అయ్యాక డైరెక్ట్ ఎన్నికలే మా టార్గెట్.
మా ముఖ్యమంత్రి మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.. మాకు ఉన్నంత కోఆర్డినేషన్ దేశంలో ఎక్కడా లేదు
ఎమ్మెల్యేలు గ్రౌండ్ లో యాక్టీవ్ అయ్యారు - ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చూసాను.
కేసీఆర్ మేధావి అనుకుంటాం - ఆలోచన లేకుండా అప్పులు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు.
తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే
సన్నబియ్యం - ఇందురమ్మ ఇండ్లు పొందిన ప్రతీ ఒక్కరు మాకు ఓటు వేస్తారు
ఉచిత కరెంట్ - 90 వేల ఉద్యోగాలు ఇచ్చాం వాళ్లంతా మావెంటే ఉన్నారు.
ప్రభుత్వాలు వచ్చినా పోయినా పార్టీ ప్రమాణికం - పర్మినెంట్.
మాకు పార్టీనే బలం - గ్రౌండ్ లో కాంగ్రెస్ బలంగా ఉంది.
ఎల్‌నినో పై హరీష్ రావు పిచ్చిగా మాట్లాడుతున్నారు. దేశం అంతా ఎల్‌నినో ఉంది.
బీజేపీ పని అయిపోయింది... ఇప్పుడున్న 8 ఎంపీ సీట్లలో రెండు వస్తే ఎక్కువ.
8 మంది ఎమ్మెల్యే లలో ఒక్కరు గెలువరు
ఆదిలాబాద్ - నిజామాబాదు లో 40 శాతం సీట్లు మాకే వస్తాయి!
• @Bmaheshgoud6666
YS Sharmila Invites Mahesh Kumar Goud Couple to Her Daughter’s Wedding
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దంపతులను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు.
తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరుతూ వారికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ దంపతులను వివాహ వేడుకకు ఆహ్వానించారు.
Centre Denies Trains; Telangana Congress Arranges 100+ Buses for Delhi Protest
ఢిల్లీ నిరసనకు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 100కు పైగా బస్సుల ఏర్పాటు
నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి కేంద్రం రైళ్లను నిరాకరించినప్పటికీ, మా గొంతును వినిపించేందుకు వెనక్కి తగ్గేది లేదు.
ప్రజాస్వామ్యం, న్యాయం కోసం జరిగే ఈ పోరాటంలో ప్రజలు పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 100కు పైగా బస్సులను ఏర్పాటు చేశాం.
--- మహేష్ కుమార్ గౌడ్
అధ్యక్షులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
Despite the Centre denying us trains for our November 1 protest in Delhi, we are determined to make our voices heard. Telangana Congress has arranged over 100 buses to ensure our people can participate in this fight for democracy and justice.
--- Mahesh Kumar Goud President, Telangana Pradesh Congress Committee
• @Bmaheshgoud6666
MP Chamala Kiran Kumar Reddy Hits Back at Harish Rao Over Kaleshwaram Project, Says BRS Misrule Led to Medigadda Barrage Collapse
హరీష్ రావుకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మేడిగడ్డ గురించి మాట్లాడితే కోపం వస్తుంది
నేను మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ళలో వాటర్ లెవల్స్ గురించి మాట్లాడాను
మేడిగడ్డ నుంచి 20 వేల క్యూసెక్కుల నీళ్లు ఏపీకి వెళ్తున్నాయని బిఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది
మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందనే విషయం తెలంగాణ ప్రజలకు,మీకు తెలియదా...?
బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కూలింది
దేవాదుల,సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ లో పంపులు నడుస్తున్నాయి
మేడిగడ్డ వద్ద గతంలో నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు.ఇప్పుడు లేదు
హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కాలేశ్వరం కూలేశ్వరం చేశారు
కాళేశ్వరం పేరు వినగానే హరీష్ రావుకు ఎక్కడ లేని కోపం వస్తుంది
బిఆర్ఎస్ హయాంలో చేసిన దరిద్రం వలనే కాళేశ్వరం కూలేశ్వరం అయింది
గోదావరిలో నీళ్లన్నీ కిందకు జారిపోవడానికి బిఆర్ఎస్ పార్టీ కారణం
-- చామల కిరణ్ కుమార్ రెడ్డి,
భువనగిరి లోక్ సభ సభ్యులు
• @kiran_chamala
TPCC Appoints Committee for Mega National Rally “Vote Bachao, Desh Bachao” in New Delhi
ఓటు బచావో - దేశ్ బచావో మెగా జాతీయ ర్యాలీకి టీపీసీసీ కమిటీ నియామకం
నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న “ఓటు బచావో - దేశ్ బచావో” మెగా జాతీయ ర్యాలీకి తెలంగాణ నుంచి హాజరయ్యే నాయకుల ప్రయాణం, వసతి, ఇతర అవసరమైన ఏర్పాట్ల సమన్వయం కోసం టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ కమిటీని నియమించారు.
ఈ కమిటీలో ఎంపీ, తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ డా. మల్లు రవి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్, ఎంపీ పి. బలరాం నాయక్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు.
TPCC President Mahesh Kumar Goud Holds Meeting with Adilabad District Leaders
ఆదిలాబాద్ జిల్లా నాయకులతో సమావేశం అయిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తదితరులు.
జిల్లాలో త్వరలో నియమించబోయే సహకార సంఘాల ఛైర్మన్ ల నియామకాలు ఇతర రాజకీయ అంశాలపై చర్చించిన నాయకులు
Telangana CM Revanth Reddy Holds Key Talks with Maharashtra CM Devendra Fadnavis on Tummidihatti Project
ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం భేటీ.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కీలక చర్చలు.
ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు రెండు రాష్ట్రాల సీఎస్ లు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు.
Telangana CM Revanth Reddy Meets Maharashtra CM Devendra Fadnavis in Mumbai
ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం.
#RevanthReddy #Telangana
































