FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) header
FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) profile picture

Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh. Report any misleading post/tweet at [email protected]

Joined December 2020
అమరావతిలో కురిసిన వర్షాలకు నీటిని బయటకు తోడేందుకు మోటార్లు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన ఎక్స్ (@KethireddyMLA) ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేస్తూ ప్రచారం చేశారు. ఈ ప్రచారం పూర్తిగా అసత్యం మరియు తప్పుదోవ పట్టించేలా ఉంది. పోస్టులో ఉపయోగించిన వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతికి సంబంధించింది కాదు. రెండవ స్క్రీన్‌షాట్‌లో బెంగాలీ భాషా శీర్షిక ("একযোগে চালানো হচ্ছে অনেকগুলা মেশিন" - Arif Hossain 5.0 ఖాతా) స్పష్టంగా కనిపిస్తోంది. ఇది బంగ్లాదేశ్ ప్రాంతంలో ఆక్వాకల్చర్, వ్యవసాయం లేదా నీటి నిర్వహణకు సంబంధించిన పాత దృశ్యం. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డ్రైనేజీలు, డక్టింగ్ కోసం తవ్విన గోతులు, రైతుల ప్లాట్ల కోసం నిర్మిస్తున్న రోడ్లు మరియు డ్రెయిన్ పనుల కారణంగా భారీ వర్షాలు పడినప్పుడు కొన్ని చోట్ల నీరు నిలిచిపోవడం సహజం. ఇటీవల సంభవించిన అర్నబ్ మరియు మురసు తుఫాన్ల వల్ల కోస్తా జిల్లాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు మరియు రాజకీయ నాయకులు నిజా నిజాలు పరిశీలించకుండా వేరే ప్రాంతాల వీడియోలతో రాష్ట్ర రాజధానిపై తప్పుడు ప్రచారం చేయడం తగదు. సంక్షోభ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, వేరే ప్రాంతపు దృశ్యాలను రాజధానికి ఆపాదిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడం బాధ్యతారాహిత్యం. వేరే ప్రాంతానికి చెందిన బెంగాలీ వీడియో ఆధారంగా అమరావతి రాజధాని నిర్మాణాలు మరియు నీటి ఉపసంహరణపై చేసిన ఈ ప్రచారం పూర్తిగా అసత్యం. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. #Factcheck #AndhraPradesh
13
103
13
281
15,333
భారీ వర్షాల కారణంగా అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పరిసరాలు, రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, రాజధాని ప్రాంతమంతా వరదతో మునిగిపోయిందని కొన్ని వార్తా చానల్స్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అర్నబ్, మురుసు తుఫాన్ ల కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలలో తీసిన గోతులలో, చేసిన తవ్వకాలలో నీరు చేరిన మాట వాస్తవమే. అమరావతి పరిధిలోని రోడ్లకు ఇరువైపులా ప్రస్తుతం డ్రైనేజీ (Drainage), డక్టింగ్ (Ducting) మరియు అండర్ గ్రౌండ్ పనుల కోసం పెద్ద ఎత్తున గోతులు తవ్వడం జరిగింది. నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న వేళ, వర్షం నీరు నిర్మాణ పనుల గోతుల్లో నిలవడం సహజం. అయితే, దీనిని ఆధారంగా చేసుకుని "రాజధాని అంతా మునిగిపోయింది", "వరద బీభత్సం" అని ప్రచారం చేయడం అతిశయోక్తి మరియు తప్పుడు కోణంలో చూపించడమే అవుతుంది. ఒక టీవీ ఛానెల్లో మరీ బాధ్యత లేకుండా శాఖమూరు రిజర్వాయర్ విజువల్స్ వేసి ‘‘అమరావతి మునిగిపోయింది’’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరొక ఛానెల్లో డ్రైనేజి, డక్టింగ్ పనుల గుంతలను, వాటిలో చేరిన నీటిని చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఛానెళ్లు చూపిన తప్పుడు వీడియోలను మరి కొందరు సోషల్ మీడియా హ్యాండల్స్ లో షేర్ చేసుకుంటున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు. ఈ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh
24
53
2
145
9,017
విశాఖ 14వ వార్డు YSRCP అభ్యర్థి కిడ్నాప్ ప్రచారం పూర్తిగా అసత్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా @Telugufeedsite ఖాతా ద్వారా ప్రచారం చేస్తున్న "విశాఖపట్నం 14వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డి కిరణ్మయి కిడ్నాప్‌కు గురయ్యారని, కూటమి నేతలు ఆమెను బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారనే" వార్తల్లో ఎలాంటి నిజం లేదు. 14వ వార్డు అభ్యర్థి శ్రీమతి రెడ్డి జీవన్ కిరణ్మయి (27) తన భర్త దాసుతో కలిసి 21-10-2026న అరిలోవ పోలీసు స్టేషన్‌కు నేరుగా వచ్చారు. "17-10-2026న జీవీఎంసీ 14వ వార్డు అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరుపున నామినేషన్ వేశాను. అయితే, సొంత ఆస్తులు లేకపోవడం, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం మరియు పార్టీ నుంచి కూడా ఎలాంటి ఆర్థిక మద్దతు లభించకపోవడంతో ఆస్తులు అమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేయడం ఇబ్బందికరమని గ్రహించాను, అందుకే నా వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛందంగానే పోటీ నుంచి తప్పుకుంటున్నాను" స్పష్టం చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ‘‘14వ వార్డ్ అభ్యర్ధి కిడ్నాప్ అయ్యారు’’ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని, సదరు ప్రెస్ నోట్‌లోని "కిడ్నాప్" వార్తలు పూర్తిగా అబద్ధమని, తన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా, తను పోటీ విరమించుకోవడంతో తను పోటీ చేసిన రాజకీయ పార్టీ కేడర్ నుంచి తనకు, తన కుటుంబానికి ఇబ్బందులు రాకుండా పోలీసు రక్షణ కల్పించాలని పోలీసులను వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చి అభ్యర్థించారు. రెడ్డి కిరణ్మయి కిడ్నాప్ అయినట్లుగానీ, బలవంతంగా విత్‌డ్రా చేయించినట్లుగానీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదని అరిలోవ పోలీస్ ఇన్ స్పెక్టర్ అధికారికంగా ధ్రువీకరించారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు, సోషల్ మీడియా వినియోగదారులు నమ్మవద్దని, షేర్ చేయవద్దని, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. #FactCheck #AndhraPradesh
26
1
42
3,014
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నడికుడి-మాచర్ల టర్నింగ్ వద్ద ఒక మహిళ ప్రమాదానికి గురైతే గంట సేపైనా అంబులెన్స్ రాలేదని, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రచారం అవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అసత్యం మరియు తప్పుదోవ పట్టించేలా ఉంది. బాధితురాలి ప్రకటన :- ప్రమాదానికి గురైన దేవుళ్ళ లలిత అనే మహిళ స్వయంగా స్పందిస్తూ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు. దాచేపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలయ్యాయని, ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి తమను హాస్పిటల్‌కు తరలించారని ఆమె తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు వెంటనే ప్రథమ చికిత్స అందించారని చెప్పారు. పాల వ్యాన్ డ్రైవర్ కూడా వచ్చి వైద్య సహాయానికి, చికిత్సకు అయ్యే ఖర్చులకు సహకరించారని తెలిపారు. సంఘటన స్థలంలో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి, వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ప్రభుత్వంపై, అధికారులపై ఆరోపణలు చేస్తూ వీడియో తీశాడని బాధితురాలు స్పష్టం చేశారు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ వ్యక్తి ఎవరో కూడా తమకు తెలియదని బాధితురాలు స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ శాఖలు (పోలీస్ & వైద్య విభాగాలు) వేగంగా స్పందించి బాధితురాలికి సకాలంలో సహాయం అందించాయి. మద్యం మత్తులో ఒక వ్యక్తి తీసిన వీడియోను ఆసరాగా చేసుకుని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఇలాంటి తప్పుడు వార్తలను మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. #FactCheck #AndhraPradesh
8
12
1,795
ఏపీలో మరో దారుణం… బధిరులను కూడా వదలరా? అంటూ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్న బధిరుల ఐటీఐ పై అసంబద్ధమైన కథనాలను కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నెల రోజుల కిందట ఒక కాంట్రాక్టు ఉద్యోగి తాను పని నుంచి తప్పించుకోవడానికి అక్కడ ఉన్న విద్యార్ధులతో వంట పని చేయించినట్లు తెలియగానే సంబంధిత అధికారులు అతడిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించడం జరిగింది. సదరు కాంట్రాక్టు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా తగిన ఆదేశాలు జారీ చేశారు. బాధ్యత లేని కాంట్రాక్టు ఉద్యోగిని విధుల్లోకి తీసుకున్నందుకు సంబంధిత అధికారుల పైనా, ప్రిన్సిపల్ పైనా కూడా క్రమ శిక్షణా చర్యలకు ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం కరెక్టు కాదు. సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారంటే అది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డుపైనా, అధికారులపైనా ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు మాత్రమే అని అనుకోవాల్సి వస్తున్నది. ఇలాంటి తప్పుడు కథనాలను ప్రజలు నమ్మవద్దు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అధికారులు అనుక్షణం అప్రమత్తతతోనే ఉన్నారు. #FactCheck #AndhraPradesh
15
24
1,293
అనకాపల్లిలోని క్రిటికల్ కేర్ విభాగంలో మానిటర్స్ పని చేయకపోవడం వల్ల ఒక చిన్నారి మృతి చెందినట్లు కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. రాష్ట్రంలో ఎంతో పటిష్టంగా అందుతున్న వైద్య సేవలపై ప్రజల్లో అపోహలు కలిగించే దురుద్దేశంతోనే కొందరు పనిగట్టుకుని ఈ చెడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటంటే: తెగడ గ్రామానికి చెందిన నానుబిల్లి పరమేష్, సుగుణ దంపతులు 13 నెలల వయసు ఉన్న తమ చిన్నారి కి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతున్నదని ఉదయం 6.45 నిమిషాలకు ఆసుపత్రికి తీసుకువచ్చారు. అంతకు కిందటి రోజు సాయంత్రం నుంచే ఆ చిన్నారి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నదని కూడా వారు చెప్పారు. వైద్యులు ఆ చిన్నారికి వచ్చిన సమస్యను గుర్తించి చికిత్స ప్రారంభించే లోపునే ఈ దుర్ఘటన సంభవించింది. ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకువచ్చిన 13 నిమిషాలలోనే ఇదంతా జరిగింది. ఈ విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగానీ, ఆసుపత్రిలో వైద్య పరికరాల లోపం గానీ లేదు. ఆ దంపతులు తమ చిన్నారిని తీసుకుని ఆసుపత్రికి వచ్చిన దృశ్యాలు, వైద్య సిబ్బంది చేసిన సహాయం అంతా కూడా సీసీ టీవీ కెమెరాలలో రికార్డు అయి ఉన్నది. మొత్తం 13 నిమిషాలలోనే ఆ చిన్నారి తుది శ్వాస విడిచింది. జరిగిన ఈ సంఘటన సహజంగానే బాధితులకు ఆగ్రహం తెప్పిస్తుంది. అయితే వారికి సీసీ టీవీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాలు, వైద్య సిబ్బంది, వైద్యులు తీసుకున్న తక్షణ చర్యల గురించి వివరించి 13 నిమిషాలలోపే అకస్మాత్తుగా చిన్నారి ఆరోగ్యం విషమించడంతో ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయతను వివరించగా వారు సమస్యను అర్ధం చేసుకున్నారు. జరిగిన ఈ దురదృష్టకర సంఘటనను ఉపయోగించుకుని ప్రజలలో అపోహలు రేకెత్తించేందుకు కొందరు పనిగట్టుకుని ప్రయత్నిస్తూ, ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేసే వారిని, ఇలాంటి పోస్టులను షేర్ చేసుకునే వారిని గుర్తించి ప్రభుత్వం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించడమైనది. #FactCheck #AndhraPradesh
1
3
8
1,016
29.09.2026న విజయవాడ సివిల్ కోర్టు ఆవరణలో న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ ఒక దినపత్రికలో ప్రచురితమైన వార్తలు పూర్తిగా అవాస్తవం, అభూతకల్పన. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవాలు : కొంతమంది న్యాయవాదులు తమ డిమాండ్స్ పై నిరసన తెలిపే సమయంలో అదే రూట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి Z+ కేటగిరీ కాన్వాయ్ పర్యటన ఉంది. ఈ సమయంలో విఐపి భద్రత, సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా వారిని కేవలం 2 నిమిషాలు ఆగాలని కోరినప్పటికీ, లాయర్లు బందర్ రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారు. ఈ సమయంలో పోలీసులు వారికి నచ్చజెప్పి అంబేడ్కర్ స్మారక ద్వారం వద్దకు పంపగా వారు తమ వినతిపత్రం సమర్పించారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఏ పోలీస్ అధికారి వద్ద గానీ, సిబ్బంది వద్ద గానీ ఎలాంటి లాఠీలు లేవు. అలాంటప్పుడు లాఠీఛార్జ్ చేసే ఆస్కారమే లేదు. న్యాయవాదుల పట్ల పోలీసులు ఎలాంటి దురుసు ప్రవర్తన చేయలేదు, లాఠీఛార్జ్ కూడా జరగలేదు. కాని వాస్తవాలను గమనించకుండా పోలీస్ వారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా, ప్రజల్లో పోలీసులపై అభద్రతా భావం కలిగేలా ఆ దినపత్రిక కథనాన్ని ప్రచురించడం శోచనీయం. #FactCheck #AndhraPradesh
15
19
1,079
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఒక లిక్కర్ మార్ట్‌లో కొనుగోలు చేసిన మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా "QR Code Not Found / Error" అని వచ్చిందని, మంగళగిరిలో భారీగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మద్యం సీసాపై ఉండే ఇతర క్యూఆర్ కోడ్‌లు లేదా యాప్ ఇన్‌స్టాలేషన్ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం వల్ల యాప్‌లో 'Error' వచ్చింది. మద్యం సీసా అసలైందో కాదో ధృవీకరించుకోవడానికి సీసా మూతపై (బాటిల్ క్యాప్‌పై) ఉండే 'వెరిఫికేషన్ క్యూఆర్ కోడ్' (Verification QR Code) ను మాత్రమే 'AP Excise Suraksha' యాప్ ద్వారా స్కాన్ చేయాలి. సరైన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయకుండా 'Error' అని రాగానే నకిలీ మద్యం అనడం నిరాధారమని, ప్రజలు ఇటువంటి వదంతులను నమ్మవద్దని ఎక్సైజ్ శాఖ కోరింది. #FactCheck #AndhraPradesh
13
28
1,386
గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఒక మహిళ గౌరవాన్ని తగ్గిస్తూ తప్పుడు ఆరోపణలు చేసి వాటిని సోషల్ మీడియాలో కొందరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒక మహిళా టీచర్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. DSC 2025 లో స్పోర్ట్స్ కోటా నియామకాలలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పారదర్శకంగా నియమ నిబంధనల మేరకు మాత్రమే అభ్యర్ధుల ఎంపిక జరిగిందని పలుమార్లు అధికారులు స్పష్టంగా చెప్పినా కూడా దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆరోపణ: ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నం కు చెందిన యోగేశ్వరరావు, ఆయన చెల్లికి స్పోర్ట్స్ కోటాలో ఎస్ జీ టీ ఉద్యోగాలు ఇచ్చారు. వారి సర్టిఫికెట్లు నకిలీవి. వాస్తవం: జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. పేద వ్యవసాయదారుని కుటుంబానికి చెందిన యోగేశ్వరరావు, ఆయన చెల్లి మోహినీ దేవి ఎంతో కష్టపడి చదువుకోవడమే కాకుండా ఆటల్లో రాణించి ఖోఖో ఆటలో ఛాంపియన్లుగా నిలిచారు. వారిద్దరూ కూడా నిబంధనల మేరకు Teacher Eligibility Test – TET అర్హత సాధించిన వారే. అన్నా చెల్లెలు ఇద్దరూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొనలేదని ఇప్పుడు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాకేజీ కింద అన్నా చెల్లెళ్లకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు అనే దిగజారుడు కామెట్లు చేస్తున్నారు. అన్నా చెల్లెలు ఇద్దరూ కూడా ఖోఖో ఛాంపియన్ షిప్ లో ప్రతిభ చూపిన వారేనని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు SAP కు ఇచ్చిన అధికారిక సమాచారం ఈ విధంగా ఉంది. చిల్లా యోగేశ్వరరావు నల్గొండలో 2009 నవంబర్ 19 నుంచి 21 వరకు జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్ లో ప్రధమ స్థానం పొందారు. సంబంధిత సర్టిఫికెట్ వాస్తవమైనదేనని ధృవీకరిస్తున్నాము. (లేఖ నెం F.No.:8-3/KKFI/CV/2025/1003 Dated 22-07-2025) చిల్లా మోహినీదేవి నల్గొండలో 2009 నవంబర్ 19 నుంచి 21 వరకు జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్ లో ద్వితీయ స్థానంలో నిలిచారు. సంబంధిత సర్టిఫికెట్ వాస్తవమైనదేనని ధృవీకరిస్తున్నాము. (లేఖ నెం F.No.:8-3/KKFI/CV/2025/1003 Dated 22-07-2025) వాస్తవాలు ఈ విధంగా ఉండగా క్రీడాకారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, గౌరవ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం తగదు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. #FactCheck #AndhraPradesh
1
11
24
1,764
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు విశాఖ పర్యటన ను ఎగతాళి చేస్తూ ఒక మీడియాలో వచ్చిన వార్తను, దాని ఆధారంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. పర్యావరణ పరిరక్షణకు ప్రధమ ప్రాధాన్యతను ఇస్తూ, పేద ప్రజల సముద్ధరణకు సకల చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వంపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం క్షంతవ్యం కాదు. ఈ నెల 19వ తేదీన విశాఖ లో ‘‘పేదలకు పట్టాభిషేకం’’ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి అక్కడి 28,445 మంది పేదలకు ఇళ్ల హక్కులు కల్పిస్తూ పట్టాలను అందచేసిన అనంతరం, విశాఖ ఆర్ కే బీచ్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొని, బీచ్ లో మురి మిక్సర్ అమ్ముకునే మహిళతో కొద్ది సేపు మాట్లాడారు. ఆమె ఒంటరి మహిళ అని తెలుసుకున్న వెంటనే సంబంధిత ఉన్నతాధికారులను పిలిచి ఆమెకు పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు చేస్తున్న పర్యటనలు, అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించడం, చెత్తను ఎరువుగా ఇంధనంగా మార్చే కార్యక్రమాలను పర్యవేక్షించడం వల్ల ఇప్పటికే సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. ఇంతటి పాజిటీవ్ కార్యక్రమంపై కళ్లు కుట్టిన కొందరు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. విశాఖ బీచ్ లో మురి మిక్సర్ బండ్లు చాలా ఉన్నాయి. సీఎం కోసం సెట్టింగ్ వేసినట్లు ఆ తర్వాత వాటిని ఎత్తివేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లాంటి పవిత్ర కార్యక్రమాలను నిండు హృదయంతో ఆశీర్వదించాలని కోరడమైనది. #FactCheck #AndhraPradesh
5
22
5
48
4,614
ముఖ్యమంత్రి (CM), ఉప ముఖ్యమంత్రి (Dy CM), మరియు విద్యాశాఖ మంత్రి (HRD మంత్రి) పర్యటనలకు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల వాడకం కోసం ప్రభుత్వ ఖజానా నుండి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ & HRD మంత్రి శ్రీ నారా లోకేష్ తమ అధికారిక పర్యటన ల కోసం APACL ద్వారా ఎటువంటి ఖర్చు చేయటం లేదు, విమానయాన సేవలు తీసుకోవడం లేదు. APACL కు బడ్జెట్ కేటాయింపు కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనలకు మాత్రమే నిర్దేశించినవి కాదు. ఇందులో గవర్నర్ పర్యటనలు, కేంద్ర మంత్రుల పర్యటనలకు ఇచ్చే హెలికాప్టర్లు, గిరిజన ప్రాంతాల్లో ఎయిర్ అంబులెన్స్ సేవలు, నేపాల్‌ వంటి చోట్ల చిక్కుకున్న తెలుగు యాత్రికులను సురక్షితంగా తీసుకురావడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల ఖర్చులు కూడా కలిసే ఉన్నాయి. APACL కు కేటాయించిన నిధులు బడ్జెట్ పరిమితులకు లోబడే ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి APACL కి మొత్తం బడ్జెట్ కేటాయింపు రూ 54.63 కోట్లు. ఇందులో మొదటి రెండు త్రైమాసికాలకు (Q1 & Q2) కలిపి సుమారు రూ 30.95 కోట్లు (రూ. 19.12 కోట్లు + రూ.11.83 కోట్లు) మాత్రమే విడుదలయ్యాయి. 2021-22 నుండి 2023-24 వరకు జిల్లాల పర్యటనలకు ఏటా రూ. 51.45 కోట్ల నుండి రూ. 55 కోట్ల వరకు ఖర్చు చేశారు. కోవిడ్ లాక్‌డౌన్ పరిమితులు ఉన్న 2020-21 సంవత్సరంలో కూడా రూ. 30 కోట్ల బడ్జెట్ వినియోగించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి 'పేదల సేవలో', 'స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర', 'పట్టాదార్ పాస్‌బుక్స్ పంపిణీ', 'సంజీవని' వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం తరచూ జిల్లాల్లో పర్యటిస్తున్నప్పటికీ, ఈ విమానయాన ఖర్చులు కేటాయించిన బడ్జెట్ పరిమితి లోపే ఉన్నాయి. ప్రజల పట్ల బాధ్యత తో వ్యవహరించే కూటమి ప్రభుత్వం ఎలాంటి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఈ అంశంపై జరుపుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh
7
30
2
71
3,963
విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో ఏర్పాటైన సుమారు 500 కు పైగా వినాయకచవితి పందిళ్లలో ప్రశాంతంగా, భక్తిభావనలతో ప్రజలు గణపతి నవరాత్రులు నిర్వహించుకుంటుండగా కోటి గాజుల గణపతి విగ్రహం వద్ద నిర్వాహకులు ప్రజా భద్రతను గాలికి వదిలేసి జాతీయ రహదారికి సమీపంలో వినాయక మండప స్థలంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించారు. పోలీసులు, ఇతర ప్రభుత్వం అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకోగా దీనికి కులం రంగు పులుముతూ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవంగా జరిగినది ఏమిటంటే: గాజువాక నియోజకవర్గానికి చెందిన కోసిరెడ్డి గణేష్ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం భారీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా 108 అడుగుల మట్టి గాజులతో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. వినాయక పందిరి ఏర్పాటు చేసే స్థలానికి మాత్రమే పోలీసుల నుండి పర్మిషన్ తీసుకుని షాపులను లీజు కు ఇచ్చారు. షాపులను ఏర్పాటు చేయడం వల్ల జాతీయ రహదారి కావడం ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇదే విషయాన్ని జీవీఎంసి, పోలీసు, రెవెన్యూ, ఫైర్ డిపార్ట్ మెంట్ జాయింట్ టీమ్ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి నిర్ధారించింది. అక్కడ వారు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వాణిజ్య దుకాణాలను తొలగించేందుకు వెళ్లగా గణేష్, ఆయన తల్లి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి వారి విధి నిర్వహణను అడ్డుకున్నారు. సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ వినాయక చవితి పందిరికి ఎలాంటి నష్టం జరగలేదు. కేవలం అక్కడి అనుమతి లేని షాపులను మాత్రమే తొలగించడం జరిగింది. శాంతిభద్రతలను కాపాడుతూ, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చేయడమే కాకుండా వినాయక చవితి పందిరి పేరుతో వాణిజ్య కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది. #FactCheck #AndhraPradesh
12
112
5
580
94,260