ఆన్లైన్లో టబు పేరుతో ఏఐ మోసాలు.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..
indiadailylive.com/news/delh…
#Tabu #DelhiHighCourt #TabuAIDeepfake #AIDeepfake
106
ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘన.. రెండు ప్రముఖ సంస్థల లైసెన్సులు సస్పెండ్!
indiadailylive.com/news/fssa…
#fssai #foodsafety #uttarpradesh #maharashtra #publichealth
1
104
రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు.. కొత్త పీఆర్ఎస్ను తీసుకొస్తున్న భారతీయ రైల్వే!
indiadailylive.com/news/indi…
#indianrailways #passengerreservationsystem #prs #irctc #railwayticketbooking
25
మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్.. వారణాసి నుంచి రెండు పవర్ఫుల్ స్టిల్స్ విడుదల..
indiadailylive.com/news/mahe…
#MaheshBabu #Varanasi #SSRajamouli #Rudhra #PriyankaChopra #TeluguCinema
2
209
బడ్జెట్: రూ.2200 కోట్లు
సినిమా ప్రొడక్షన్ టైమ్: 93 రోజులు
దర్శకుడు: క్రిస్టొఫర్ నోలన్
సినిమా: ది ఆడిస్సీ
రివ్యూ: సూపర్..
13
హత్యలకు ముందు రాజ్‌కుమార్ సెల్ఫ్ వీడియో..
షాబాద్ ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ హత్యలకు ముందు రోజు రికార్డ్ చేసిన సెల్ఫ్ వీడియో వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబాన్ని నమ్మి రెండు ఎకరాల భూమి అమ్ముకున్నానని, తన వద్ద డబ్బులు తీసుకుని చివరకు తనపైనే కేసు పెట్టి జైలుకు పంపాలని చూశారని అందులో చెప్పాడు. పిల్లలకు ఆస్తి లేకుండా పోయిందని, తన కుటుంబానికి ఈ నిర్ణయంతో సంబంధం లేదని, వారిని చంపిన తర్వాత తానూ చనిపోతానని వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
29
బయటి ఫుడ్ ఎక్కడైనా సరే నాణ్యత లోపించినా, ఆహారం బాగా లేదని, పాడైందని అనుమానించినా, హోటల్స్ లేదా రెస్టారెంట్స్ శుభ్రత పాటించకపోయినా వినియోగదారులు నేరుగా FSSAI యాప్ లో ఫిర్యాదు చేయవచ్చు.
యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
apps.apple.com/in/app/food-s… -- యాప్ స్టోర్
play.google.com/store/apps/d… -- ప్లే స్టోర్
@fssaiindia #FoodSafetyConnectApp
26
IRCTC కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు, ఇక నిమిషానికి 1.5 లక్షలకుపైగా టికెట్లు..
భారత రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) త్వరలో కొత్త వెర్షన్ IRCTC వెబ్‌సైట్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సులభమైన టికెట్ బుకింగ్ అనుభవాన్ని అందించేలా ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను తగ్గించేలా వ్యవస్థను అప్‌గ్రేడ్ చేశారు.
కొత్త వెబ్‌సైట్‌లో నిమిషానికి టికెట్ బుకింగ్ సామర్థ్యాన్ని 32 వేల నుంచి 1.5 లక్షలకు పైగా పెంచారు. అలాగే PNR స్టేటస్, రైలు వివరాల విచారణ సామర్థ్యాన్ని 4 లక్షల నుంచి 40 లక్షలకు పైగా పెంచడంతో ఒకేసారి భారీ సంఖ్యలో వినియోగదారులు సేవలు పొందవచ్చు
వెబ్‌సైట్‌లో పేజీలు వేగంగా లోడ్ అయ్యేలా, నావిగేషన్ మరింత సులభంగా ఉండేలా మార్పులు చేశారు. వినియోగదారులకు ఇబ్బంది కలిగించే అనవసర CAPTCHAలు, పాప్‌అప్‌లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్‌ను తొలగించారు. దీంతో టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
ప్రయాణికులు తమకు నచ్చిన సీటు లేదా బెర్త్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పించారు. అలాగే Fare Calendar ద్వారా వేర్వేరు తేదీల్లో ప్రయాణ చార్జీలను పోల్చి చూసి అనుకూలమైన తేదీని ఎంచుకోవచ్చు.
కొత్త వెబ్‌సైట్‌ను బహుభాషా (Multilingual) సదుపాయంతో రూపొందించారు. దివ్యాంగులు, విద్యార్థులు, రోగులకు సంబంధించిన ప్రత్యేక సేవలను కూడా ఒకే వేదికపై సమీకరించారు.
భారీ ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త రిజర్వేషన్ వ్యవస్థను ప్రస్తుతం ఉన్నదానికంటే 10 రెట్లు ఎక్కువ ట్రాఫిక్‌ను నిర్వహించేలా అభివృద్ధి చేశారు. ఈ అన్ని కొత్త ఫీచర్లు RailOne యాప్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఎయిర్‌టెల్ వినియోగదారులకు అలర్ట్: ఉచిత Perplexity Pro సబ్‌స్క్రిప్షన్ ఆటో-రిన్యూ అయ్యే ముందు వెంటనే చెక్ చేసుకోండి..
ఎయిర్‌టెల్ అందించిన ఒక సంవత్సరం ఉచిత Perplexity Pro ఆఫర్‌ను గత ఏడాది పొందిన వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిసిన తర్వాత ఆటో-రిన్యూ అయ్యే అవకాశం ఉంది. మీరు Perplexity ఖాతాలో చెల్లింపు విధానం (Payment Method) జోడించి ఉంటే, తదుపరి బిల్లింగ్ సైకిల్‌కు మీ ఖాతా నుంచి డబ్బు కట్ అయ్యే అవకాశం ఉంది.
సబ్‌స్క్రిప్షన్ రద్దు చేసే విధానం:
* Perplexity యాప్‌లో సైన్ ఇన్ చేయండి.
* Profile పై ట్యాప్ చేయండి.
* మీ సబ్‌స్క్రిప్షన్ కింద ఉన్న View Details ఎంచుకోండి.
* Cancel Subscription పై ట్యాప్ చేయండి.
*Continue to Cancellation ఎంపిక చేసి రద్దును నిర్ధారించండి.
మీరు చెల్లింపు విధానాన్ని జోడించారా లేదా అన్న విషయం గుర్తు లేకపోయినా, ఒకసారి ఖాతాను పరిశీలించడం మంచిది. దీంతో అనుకోకుండా ఛార్జీలు పడకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
31
1600, 140 సిరీస్‌లకు చెందిన ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను థర్డ్ పార్టీ యాప్స్ బ్లాక్ చేయకూడదు.
140 సిరీస్ నంబర్లలో వచ్చే కాల్స్ ను ప్రమోషనల్ కాల్స్ గా భావించాలి. 1600 సిరీస్ ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్‌గా అర్థం చేసుకోవాలి.
చాలా బ్యాంకులు, ఇతర ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారులకు స్పామ్ కాల్స్ చేస్తున్నాయి.
ప్రభుత్వం ట్రూ కాలర్ వంటి యాప్ లపై నియంత్రణ చర్యలు చేపట్టాలి.
- TRAI.
11
₹2,000 నోట్లు ఇంకా ఉన్నాయా? చెల్లుబాటుపై ఆర్‌బీఐ కీలక స్పష్టీకరణ..
₹2,000 నోట్లు ఎక్కువ శాతం ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినప్పటికీ, ఇంకా మీ వద్ద ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది.
ఆర్‌బీఐ వెల్లడించిన ముఖ్యాంశాలు:
* ₹2,000 నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన కరెన్సీ (Legal Tender)గానే కొనసాగుతున్నాయి.
* దేశంలోని 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో వాటిని నేరుగా మార్చుకోవచ్చు.
* అలాగే ఇండియా పోస్ట్ ద్వారా ఏదైనా RBI ఇష్యూ కార్యాలయానికి పంపించి, మీ బ్యాంక్ ఖాతాలో మొత్తాన్ని జమ చేయించుకునే అవకాశం కూడా ఉంది.
ప్రజలు అధికారిక సమాచారం కోసం RBI ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని అధికారులు సూచిస్తున్నారు.
15
వాట్సాప్‌లో వచ్చిన రైలు టికెట్ చెల్లదు.. టికెట్ చెకింగ్‌లో తప్పనిసరిగా ఒరిజినల్ ఈ-టికెట్ చూపాల్సిందే..
భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక సూచన చేసింది. వాట్సాప్‌లో షేర్ చేసిన రైలు టికెట్ ఫోటో, స్క్రీన్‌షాట్ లేదా ఇమేజ్‌ను టికెట్ తనిఖీ సమయంలో చెల్లుబాటు అయ్యే ప్రయాణ టికెట్‌గా అంగీకరించబోమని స్పష్టం చేసింది.
టికెట్ చెకింగ్ సిబ్బంది (TTE) వద్ద వాట్సాప్‌లో వచ్చిన టికెట్ ఇమేజ్ లేదా స్క్రీన్‌షాట్ చూపిస్తే అది చెల్లదని, అలాంటి కాపీలను తిరస్కరిస్తారని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికులు తప్పనిసరిగా:
అధికారిక IRCTC ఈ-టికెట్ (PDF) లేదా
ఎస్‌ఎంఎస్ టికెట్ లేదా
IRCTC Rail Connect యాప్‌లోని ఒరిజినల్ ఈ-టికెట్ ను చూపించాలని సూచించారు.
టికెట్ చెకింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణానికి ముందు టికెట్‌ను అధికారిక రూపంలో సిద్ధంగా ఉంచుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచించారు.
15
ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ స్లాషర్ హారర్ సినిమాలు.. ఒక్కోటి ఒక్కో థ్రిల్!..
క్లాసిక్ స్లాషర్ కథకు ఆధునిక టచ్ ఇచ్చిన టెక్సాస్ చెయిన్‌సా మ్యాసకర్ (2022) ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇన్‌ఫ్లూయెన్సర్ యుగంలో లెదర్‌ఫేస్ మరోసారి మారణహోమం సృష్టిస్తాడు. కొత్త పట్టణమైన హార్లోకు వచ్చిన లిలా, మెలడీ జీవితాలు ఒక్కసారిగా రక్తపాతంగా మారిపోతాయి. అసలు చిత్రంలోని సర్వైవర్ సాలీ హార్డెస్టీ తిరిగి రావడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఫియర్ స్ట్రీట్: ప్రామ్ క్వీన్ (2025) ఆర్.ఎల్. స్టైన్ రూపొందించిన ఫియర్ స్ట్రీట్ సిరీస్‌లో తాజా భాగం. ఈ సినిమా 1988 కాలం నేపథ్యంలో సాగుతుంది. స్లాషర్ హారర్‌తోపాటు అతీంద్రియ అంశాలు కూడా ఇందులో కనిపిస్తాయి. అందువల్ల హారర్ అభిమానులకు భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.
దేర్ ఈజ్ సమ్‌వన్ ఇన్‌సైడ్ యువర్ హౌస్ (2021) దర్శకుడు పాట్రిక్ బ్రైస్ రూపొందించిన పూర్తి స్థాయి స్లాషర్ మూవీ. కొత్త నగరానికి వచ్చిన ఓ ఎక్స్‌చేంజ్ విద్యార్థిని తన సహ విద్యార్థులు వరుసగా ముసుగు ధరించిన హంతకుడి చేతిలో హత్యకు గురవుతున్నట్లు చూస్తుంది. దీంతో ఒక రహస్యమైన కథ ప్రారంభమవుతుంది. బాధితుల ముఖాలనే మాస్క్‌లుగా ధరించడం ఈ కిల్లర్ ప్రత్యేకత. టీనేజ్ భావోద్వేగాలు, హైస్కూల్ డ్రామా, అత్యంత క్రూరమైన హత్యల కలయికగా ఈ చిత్రం నిలుస్తుంది.
టైమ్ కట్ (2024) టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన స్లాషర్ సినిమా. లూసీ ఫీల్డ్స్ (బైలీ) టైమ్ మెషీన్ ద్వారా 2003 సంవత్సరానికి వెళ్తుంది. అక్కడ తన సోదరి సమ్మర్ హత్యను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. ముసుగు ధరించిన కిల్లర్‌ను ఆపే క్రమంలో తన భవిష్యత్తునే ప్రమాదంలో పడేస్తుంది. టైమ్ ట్రావెల్, థ్రిల్లింగ్ హత్యల మేళవింపుతో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.
హార్ట్ ఐస్ (2025) వాలెంటైన్స్ డే రోజున ఒంటరిగా ఉండటం ఒక సమస్య అయితే, హార్ట్ ఐస్ కిల్లర్ టార్గెట్‌గా మారడం మరింత ప్రమాదకరం. ఈ ముసుగు ధరించిన హంతకుడు ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుంటాడు. అయితే అనుకోకుండా తప్పు జంటతో తలపడతాడు. రొమాన్స్, కామెడీ, క్లాసిక్ స్లాషర్ అంశాలను సమపాళ్లలో కలిపిన వినోదాత్మక హారర్ చిత్రంగా ఇది నిలుస్తుంది.
#telugunews #ott #movies #tollywood #hollywood #netflix #amazonprime #india #telugumovies
15
భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) దేశంలోని సాధారణ మొబైల్ నెట్‌వర్క్ పూర్తిగా అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా కమ్యూనికేషన్‌ను అందించే ప్రత్యేక శాటిలైట్ ఫోన్ సేవను ప్రారంభించింది.
కమ్యూనికేషన్ బియాండ్ బౌండరీస్ అనే థీమ్‌తో తీసుకొచ్చిన ఈ సేవ, మొబైల్ టవర్లు లేని లేదా పనిచేయని ప్రాంతాల్లో అత్యవసర కమ్యూనికేషన్‌కు కీలక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఈ సేవ కోసం ప్రత్యేకంగా రూపొందించిన శాటిలైట్ హ్యాండ్‌సెట్‌లను ఉపయోగిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ నెట్‌వర్క్ సేవలను అందించే ఇన్‌మార్సాట్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ పరికరాలను అభివృద్ధి చేశారు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా సమర్థంగా పనిచేసేలా ఈ హ్యాండ్‌సెట్‌లను రూపొందించారు.
దృఢమైన నిర్మాణం, నేరుగా శాటిలైట్లతోనే కమ్యూనికేషన్..
ఈ శాటిలైట్ ఫోన్‌లో బలమైన, మన్నికైన డిజైన్‌ను అందించారు. దుమ్ము, నీరు, గట్టి దెబ్బలు వంటి పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంటుంది. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉపయోగించుకునేలా దీర్ఘకాలిక బ్యాటరీని అమర్చారు. స్పష్టమైన వాయిస్ కమ్యూనికేషన్‌తోపాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం కోరేందుకు ప్రత్యేక ఎస్‌ఓఎస్ ఫీచర్‌ను కూడా ఇందులో అందుబాటులో ఉంచారు.
శాటిలైట్ ఫోన్లు భూమిపై ఉన్న మొబైల్ టవర్లపై ఆధారపడకుండా నేరుగా శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి. అందువల్ల అత్యంత మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సంస్థలు, అత్యవసర సేవలు, ప్రత్యేక విభాగాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. సరిహద్దు ప్రాంతాలు, దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించే రక్షణ దళాలు, భద్రతా బలగాలకు ఈ సేవ కీలకంగా మారనుంది.
భూకంపాలు, వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో సాధారణ టెలికాం నెట్‌వర్క్ దెబ్బతిన్నా కమ్యూనికేషన్ ను కొనసాగించేందుకు ఇది ప్రధాన ఆధారంగా ఉంటుంది.
ధర ఎంత, ఎక్కడ కొనాలి..
అలాగే సముద్ర రవాణా, ఆఫ్‌షోర్ కార్యకలాపాలు, గనుల పరిశ్రమ, అటవీ పరిశోధనలు వంటి రంగాల్లో పనిచేసేవారికి కూడా ఈ సేవ ఉపయోగపడుతుంది. ఎత్తైన పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులు, సాహస యాత్రలు చేసే ప్రయాణికులు కూడా అవసరమైతే ఈ శాటిలైట్ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.
శాటిలైట్ కమ్యూనికేషన్‌కు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాల కారణంగా దీని ధర సాధారణ మొబైల్ సేవలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్ తన శాటిలైట్ ఫోన్ ధరను అన్ని పన్నులు కలిపి రూ.1,34,166గా నిర్ణయించింది. దీని కొనుగోలు లేదా ఇతర వివరాల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్న వారు 9768866652 నంబర్‌లో సంప్రదించవచ్చు.
అధిక ధర కారణంగా సాధారణ వినియోగదారుల కంటే ప్రభుత్వ సంస్థలు, పారిశ్రామిక రంగం, అత్యవసర సేవలు, ప్రత్యేక అవసరాలు ఉన్న విభాగాలకే ఈ శాటిలైట్ ఫోన్ ప్రధానంగా ఉపయోగపడే అవకాశం ఉంది.
#telugunews #bsnl #satellitephone #technology #communication
1
11
కళ్ళాపి పొడిలో ప్రమాదకరమైన రసాయనాలు..
మూత్రపిండాలు దెబ్బతినడం, క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరిక..
ఈ పొడి కలిపిన నీళ్లు తాగి 19 మంది ఆత్మహత్య..
ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీసౌభాగ్య కళ్ళాపి పొడి పేరుతో విక్రయింపులు..
ఏడాదిన్నర కాలంలో ఈ పొడి కలిపిన నీళ్లు తాగి 19 మంది ఆత్మహత్య చేసుకోవడంతో, ఈ పొడిలో ఏముందో తెలుసుకోవడానికి తనిఖీలు చేసిన అధికారులు..
ఈ పొడిలో ఆరమైన-ఓ అనే రసాయనాన్ని వాడుతున్నారని, ఈ పొడి పీల్చినా, చర్మంపై పడినా, కడుపులోకి చేరినా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారుల గుర్తింపు..
దీంతో ప్రొద్దుటూరులో సదరు కంపెనీకి చెందిన ఐదు యూనిట్లను సీజ్ చేసిన అధికారులు..
#telugunews #andhrapradesh #ap #news #kadapa #proddutur
16
కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఎప్పుడు లెటర్ రాస్తే.. అప్పుడే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెడదామని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎంత సమయం మాట్లాడాలనుకుంటే అంత సమయం ఇస్తామని స్పష్టం చేశారు.
ఒకవేళ కేసీఆర్ వాదనలో బలముందని రుజువైతే.. రాబోయే మూడేళ్ల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ల బాధ్యతను, మేజర్ కాంట్రాక్ట్‌ను కేసీఆర్‌కే అప్పగిస్తామని.. ఆయన ఇష్టం వచ్చిన వాళ్లకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చుకోవచ్చంటూ సంచలన సవాల్ చేశారు.
బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లను ‘ఆర్థిక ఉగ్రవాదులు'గా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ కట్టిన ఇతర ప్రాజెక్టులను, ప్రజాభవన్, సెక్రటేరియట్లను తాము వాడుతున్నామని.. కానీ, కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్లే అది నిరూపయోగంగా మారిందని మండిపడ్డారు.
ప్రస్తుతానికి బ్యారేజీల్లో నీళ్లు నింపి ఎత్తిపోయాలని ఏ ఎక్స్‌పర్ట్స్ కమిటీ కూడా చెప్పలేదని రేవంత్ గుర్తుచేశారు. ఒకవేళ బలవంతంగా నీళ్లు నింపితే బ్యారేజీలు పూర్తిగా కూలిపోతాయని, భద్రాచలం నగరం మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు తీసుకోకుండానే.. తాము అధికారంలోకి వచ్చాకవేల కోట్ల అప్పులు కట్టాల్సి వచ్చిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణుల కంటే ఎవరు మంచి సలహాలు ఇచ్చినా తీసుకుంటామని, కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదని ఆయన అన్నారు. ప్రజా సొమ్ము గోదారి పాలు కాకుండా కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. #telugunews #cmrevanthreddy #congressparty #brsparty #telangana @TelanganaCMO @revanth_anumula
17
భారత్‌లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 4బి..
* 6.77 ఇంచుల ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్
* 50 మెగాపిక్సల్ (మెయిన్), 8 మెగాపిక్సల్ (అల్ట్రా వైడ్) బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్
* ఆండ్రాయిడ్ 16 (నథింగ్ ఓఎస్ 4.1)
ధర: 8జీబీ, 128జీబీ రూ.34,999 నుంచి..
#nothing #smartphones #nothingphone4b #android16 #5g
15
లెనిన్ కు ఎన్టీఆర్ సపోర్ట్.. అఖిల్ సినిమాకు స్పెషల్ వాయిస్ ఓవర్..
indiadailylive.com/news/akhi…
#telugunews #telugucinema #tollywood #movies #films #akhilakkineni #jrntr #leninmovie
29
ఐటీఆర్ దాఖలు చేయలేదంటూ విదేశీ ఇన్వెస్టర్లకు ఐటీ శాఖ రీ-అసెస్‌మెంట్ నోటీసులు.. పెట్టుబడిదారుల్లో ఆందోళన..
భారత ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) శాఖ పలువురు విదేశీ పెట్టుబడిదారులకు (Foreign Investors) ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయలేదన్న ఆరోపణలపై రీ-అసెస్‌మెంట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
పన్ను చెల్లించాల్సిన ఆదాయం లేదా లాభాలు లేవని పేర్కొన్న సందర్భాల్లో కూడా ఈ నోటీసులు జారీ కావడం పెట్టుబడిదారుల్లో ఆందోళనకు దారితీసింది.
ఈ నోటీసుల్లో లావాదేవీల పూర్తి వివరాలు, పెట్టుబడుల విలువ నిర్ధారణ (Valuation) నివేదికలు, సంబంధిత పత్రాలు, వివరణలు సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది.
పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం, రీ-అసెస్‌మెంట్ చేపట్టే అధికారాలు ఆదాయపు పన్ను శాఖకు ఉన్నప్పటికీ, పన్ను బకాయిలు లేవని భావించిన కేసుల్లో కూడా నోటీసులు జారీ కావడం విదేశీ పెట్టుబడిదారుల్లో నియంత్రణ వ్యవస్థ స్థిరత్వం (Regulatory Certainty), అనుసరణ (Compliance) అంశాలపై సందేహాలు పెంచుతోంది.
ఈ పరిణామం భారత్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలపై ప్రభావం చూపే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
#IncomeTax #ITR #ForeignInvestors #FPI #TaxCompliance #IndianMarkets #StockMarket #India #Investing #Finance #TaxNews #BusinessNews #Economy #MarketUpdate
1
15
జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) సేవలు:
- పాత మెట్రెస్ లేదా అవసరం లేని ఫర్నిచర్ ఇంట్లో ఉందా?
- వాటిని వీధుల్లో లేదా నాలాల్లో వదలవద్దు.
- GHMC ఇంటి వద్దే తీసుకుంటుంది.
- డోర్‌స్టెప్ పికప్ సర్వీస్ ఇప్పుడు లైవ్ అయింది.
ప్రయోజనాలు:
- సులభంగా ఇంటి వద్దే పికప్
- సురక్షితంగా, శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్
- వీధులు, నాలాలు శుభ్రంగా ఉంచడం
- హరిత హైదరాబాద్
ఎలా బుక్ చేయాలి?
- QR కోడ్‌ను స్కాన్ చేసి ఉచిత డోర్‌స్టెప్ పికప్ బుక్ చేయండి.
- GHMC ద్వారా పాత మెట్రెస్‌లు, ఫర్నిచర్‌ను బాధ్యతాపూర్వకంగా రీసైకిల్ చేయండి.
గమనిక:
మెట్రెస్‌లు, ఫర్నిచర్‌ను మాత్రమే తీసుకుంటారు.
వివరాలు:
- వెబ్‌సైట్: ghmc.gov.in
- సోషల్ మీడియా: GHMCOnline
#GHMC #SwachhHyderabad #CleanHyderabad #Recycling #CircularEconomy #DoorstepPickup
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
@jayesh_ranjan
@Commissionrghmc
@ZC_Khairatabad
@ZC_Secunderabad
@ZC_Charminar
@ZcGolconda
@ZC_Shamshabad
@ZC_RAJNGR
19














