ఆదిలాబాద్ రైతు గర్జన సభకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బోథ్ నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు.
ఆదిలాబాద్ రైతు గర్జన సభకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మేడ్చల్‌లో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు.
ఆదిలాబాద్ రైతు గర్జన సభకు తన నివాసం నుండి కొద్దిసేపటి క్రితం బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఆదిలాబాద్ రైతు గర్జన సభకు ముస్తాబైన సభా ప్రాంగణం.
ఈరోజు సాయంత్రం జరిగే సభలో రైతు సమస్యలపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీయనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
రైతు గర్జన సభకు సర్వం సిద్ధం.
రైతు సమస్యలపై, కాంగ్రెస్ తెచ్చిన కరువుపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈరోజు సాయంత్రం ఆదిలాబాద్‌లో రైతు గర్జన నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ.
ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
🔶 అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే వస్తుంది
🔶 అబద్ధానికి అంగీ లాగు తొడిగితే అచ్చం రేవంత్ రెడ్డి లెక్కే ఉంటది
🔶 వంటంతా మేము వండితే, చివర్లో గంట తిప్పి నేనే వండినా అంటున్నడు
🔶 ఇది ఓట్ చోరీ కాదు, పక్కా క్రెడిట్ చోరీ
🔶 జడ్జిమెంట్ కాపీ చేతికి రాకముందే మియాపూర్ భూములు అమ్మమని కలెక్టర్‌ను పరుగులు పెట్టిస్తున్నడు
🔶 ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నవ్ రేవంత్ రెడ్డి?
🔶 మంచిరేవుల గ్రేహౌండ్స్ భూమి కేసు 2010లో కాంగ్రెస్ హయాంలో ఓడిపోయింది
🔶 నాడు ఏజీని కోర్టుకు పంపకుండా చిన్న జీపీని పంపి ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు తెచ్చారు
🔶 2017 మే 19న కేసీఆర్ ఆదేశాలతో దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను నియమించాం
🔶 2021 డిసెంబర్ 31న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో బీఆర్ఎస్ విజయం
🔶 2023 ఆగస్టు 1న సుప్రీంకోర్టులో 142 ఎకరాలు ప్రభుత్వానివేనని తుది తీర్పు అప్పుడు ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమే
🔶 కాంగ్రెస్ ఓడిపోయిన భూమిని గెలిపించింది మేము, నిందలు మాత్రం మాపైనే
🔶 30 ఏళ్ల గ్రేహౌండ్స్ ప్రహరీ గోడను రాత్రికి రాత్రే కూల్చేశారు
🔶 రెండు రోజుల్లో లోపలికి కొత్త గోడ కట్టారు టెండర్ ఎవరిచ్చారు?
🔶 10 ఎకరాల 10 గుంటల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు వదిలేశారు
🔶 గండిపేట ఎస్ఆర్ఓలో డాక్యుమెంట్ నం. 8886/2026 జీరో వాల్యూ రిజిస్ట్రేషన్
🔶 మార్కెట్ విలువ రూ. 45.39 కోట్లు, కన్సిడరేషన్ వాల్యూ సున్నా
🔶 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజులో ఒక్క రూపాయి కూడా కట్టలేదు
🔶 డ్రీమ్ వ్యాలీ సంతోష్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్, వెంటనే మరో 20 రిజిస్ట్రేషన్లు
🔶 ఎకరం రూ. 100 కోట్లు పలికే చోట రూ. 1,000 కోట్ల ప్రభుత్వ ఆస్తి కొల్లగొట్టారు
🔶 భూభారతిలో ఈ రోజుకూ ఆ భూమి గ్రేహౌండ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పేరు మీదే ఉంది
🔶 ముఖ్యమంత్రి కనుసన్నల్లో కాకపోతే గ్రేహౌండ్స్ గోడ కూల్చే దమ్ము ఎవరికుంటుంది?
🔶 ఫైరింగ్ రేంజ్ కోసం సేకరించిన మరో 10 ఎకరాల నోటిఫికేషన్ రద్దు అప్పీల్‌కు వెళ్లలేదు
🔶 జడ్జి పేరా 134లో కొత్త నోటిఫికేషన్ ఇవ్వొచ్చని రాసినా మూడు నెలలుగా కదలిక లేదు
🔶 మంచిరేవులలో మొత్తంగా రూ. 2,000 కోట్ల కుంభకోణం
🔶 గోల్డ్‌స్టోన్ ప్రసాద్ సోదరుడిని జైలుకు పంపింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
🔶 రిజిస్ట్రేషన్ చేసిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను అదే రోజు కేసీఆర్ సస్పెండ్ చేశారు
🔶 2016 జూన్ 1న జీవో 45తో జాగీర్ అబాలిషన్ యాక్ట్‌కు చట్టబద్ధత కల్పించాం
🔶 మియాపూర్ కేసు సుప్రీంకోర్టులో 192 సార్లు విచారణకు వచ్చింది
🔶 అందులో 86 సార్లు వాదించింది బీఆర్ఎస్ నియమించిన వైద్యనాథన్ గారే
🔶 కాంగ్రెస్ వచ్చాక జరిగింది కేవలం 11 విచారణలు మాత్రమే
🔶 మియాపూర్ తీర్పుకు పునాది 2023లో మేము గెలిచిన ట్రినిటీ తీర్పులోని పేరా 93
🔶 భూపాలపల్లి అటవీ భూముల కేసును టీడీపీ, కాంగ్రెస్ 20 ఏళ్లు పట్టించుకోలేదు
🔶 2021లో అక్రమార్కులను అరెస్టు చేసి జైలుకు పంపింది కేసీఆర్ ప్రభుత్వమే
🔶 భూమి కట్టబెట్టే ఉద్దేశమే ఉంటే వాళ్లను ఎందుకు అరెస్టు చేస్తాం?
🔶 SLP 6937/2021 దాఖలు చేసి మూడేళ్లు పోరాడింది బీఆర్ఎస్
🔶 2024 ఏప్రిల్ 18న తీర్పు అధికారంలోకి వచ్చి మూడు నెలలకే రేవంత్ గెలిచాడా?
🔶 ఐఎంజీ బిల్లీరావుకు ఎకరం రూ. 50 వేలకు 850 ఎకరాలు కట్టబెట్టింది చంద్రబాబే
🔶 ఆనాడు ఆ టీడీపీ ముఠాలో రేవంత్ రెడ్డి భాగస్వామి కాదా?
🔶 ఐఎంజీ కేసులో 9 ఏళ్లు పోరాడింది బీఆర్ఎస్, తీర్పు వచ్చింది 2024 మార్చి 7న
🔶 అప్పటికి రాష్ట్రంలో న్యాయశాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు
🔶 కంచె గచ్చిబౌలిలో చెట్లు నరికి జింకలను ఆగం చేసినందుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు
🔶 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని కుదువపెట్టారు
🔶 రూ. 10 వేల కోట్ల అప్పు కోసం ముంబై బ్రోకర్‌కు రూ. 400 కోట్ల కమీషన్
🔶 దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు
- తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు
ఐఎంజీ భూముల వ్యవహారంలో అసలు నేరస్తుడు చంద్రబాబు నాయుడే కదా? ఆనాడు రేవంత్ రెడ్డి కూడా అదే పార్టీలో ఉన్నాడు కదా?
ఆ కేసులో కూడా మంచి న్యాయవాదులను పెట్టి, ఆ భూములను కాపాడింది మేము.
రేవంత్ ప్రభుత్వం వచ్చాక మూడు నెలలకే తీర్పు వచ్చింది, అంతమాత్రాన రేవంత్ కాపాడినట్టా?
బ్రోకర్లకు కమీషన్ ఇచ్చి, అవే కంచె గచ్చిబౌలి భూములను రూ. 10 వేల కోట్లకు కుదువపెట్టిండు రేవంత్ రెడ్డి.
- మాజీ మంత్రి హరీష్ రావు
మంచిరేవుల భూములను కూడా కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. రేవంత్ రెడ్డి అబద్ధాలను ఎండగట్టిన మాజీ మంత్రి హరీష్ రావు 👇
మంచిరేవులలో రూ. 10 వేల కోట్ల విలువైన 142 ఎకరాల భూమిని కాపాడామని రేవంత్ రెడ్డి అంటున్నాడు.
మంచిరేవుల భూమిపై 40 నుంచి 50 ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది.
ఈ కేసులో 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టులో ఓడిపోయింది.
కానీ కేసీఆర్ వచ్చాక వైద్యనాథన్ అనే సీనియర్ న్యాయవాదిని నియమించి కేసు గెలిచాము.
ప్రైవేట్ వ్యక్తులు సుప్రీం కోర్టుకు వెళ్తే, అక్కడ కూడా బలమైన వాదనలను వినిపించి, 2023లో ఆ అవి ప్రభుత్వ భూములు అని తీర్పు వచ్చేలా చేశాం.
ఆనాడు భూమిని పోగొట్టింది కాంగ్రెస్, తిరిగి సాధించింది బీఆర్ఎస్.
మియాపూర్ భూముల కేసు 23 ఏళ్ల నుండి ఉంది.
సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది వైద్యానాథన్‌ను పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది.
తెలంగాణ రాకముందు 86 సార్లు ఈ కేసు హియరింగ్‌కు వచ్చింది, బీఆర్ఎస్ హయాంలో 95 సార్లు హియరింగ్‌కు వచ్చింది.. కేసును చివరికి దశకు మేమే తీసుకొచ్చాం.. కాంగ్రెస్ హయాంలో కేవలం 11 హియరింగ్‌లు మాత్రమే జరిగాయి.
మేము జాగీర్ అబోలిషన్ యాక్ట్‌కు చట్టబద్ధత కల్పించడం కూడా ఈ కేసు విజయానికి దోహదపడింది.
- మాజీ మంత్రి హరీష్ రావు
మియాపూర్ భూముల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందని రేవంత్ రెడ్డి బట్ట కాల్చి మీద వేస్తున్నాడు.
ఆ భూముల విషయం బయటికి రాగానే, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను సస్పెండ్ చేశారు, నిందితులను జైలుకు పంపారు.
హైకోర్టులో, సుప్రీం కోర్టులో కొట్లాడి ఆ భూములు ప్రభుత్వానికి దక్కేలా చేశారు.

🔶 బిగ్ బ్రదర్ ఆఫీసులో రాధా రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం 4 వేల కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
🔶 ముఖ్యమంత్రి కుటుంబం నిర్మించే స్కూల్ కోసం, బిగ్ బ్రదర్ భాగస్వామి అయిన ఆర్ఆర్ రియాల్టీ హై-రైజ్ భవనాల కోసమే నార్సింగిలో 100 ఫీట్ల రోడ్డు అలైన్‌మెంట్‌ను వంకరటింకరగా మార్చారు
🔶 కోకాపేట, నార్సింగిలో గజం రూ. 2 లక్షలు పలుకుతుంటే.. రూ. 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గజం రూ. 47 వేల చొప్పున కేవలం రూ. 26 కోట్లకే కట్టబెట్టి, ఇప్పుడు ఆ భూమికి హై-రైజ్ పర్మిషన్ ఇవ్వడం కోసం సామాన్యుల అపార్ట్‌మెంట్లు కూల్చుతారా?
🔶 జనవరి 7న ఒక జీవో, రాత్రికి రాత్రే జనవరి 8న మరో గెజిట్.. ప్రజల వినతిపత్రం తీసుకోవాలంటేనే ‘ఇందులో చాలా పెద్దవాళ్లు ఉన్నారు, మేం మాట్లాడలేం’ అని అధికారులు భయపడుతున్నారంటేనే రక్షకుడే భక్షకుడిగా మారాడని అర్థమవుతోంది
🔶 నాడు 400 ఏళ్ల హనుమాన్ ఆలయాన్ని కాపాడేందుకు కేసీఆర్ గారు ఏ ఒక్కరి ఇల్లు పోకుండా 2018లో గెజిట్ ఇస్తే.. నేడు రేవంత్ రెడ్డి ఒక బిల్డర్ ధనదాహం కోసం 10 అపార్ట్‌మెంట్లు, 5 వేల మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు
🔶 కేసీఆర్ గారు పైసా తీసుకోకుండా కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేదల దారిని కూడా రాత్రికి రాత్రే రేకులు పెట్టి మూసేశారు.. అడిగితే పోలీసులతో బెదిరిస్తున్నారు
🔶 నాడు హైదర్‌షాకోట్‌లో బుల్డోజర్లకు అడ్డం పడతామని హెచ్చరించి పేదల ఇండ్లు కాపాడాం.. నేడు నార్సింగిలోనూ ఈ రెడ్ మార్కులు తుడిచేసే దాకా బీఆర్ఎస్ అండగా ఉంటుంది, ఎమ్మెల్యేలమంతా కలిసి బాధితులతో HMDA ఆఫీసుకు వెళ్తాం
🔶 అర్ధరాత్రి ఫోన్ చేసినా నా ఇల్లయినా, కేటీఆర్ గారి ఇల్లయినా, సబితక్క ఇల్లయినా ఇక్కడికి 10 నిమిషాల దూరమే.. ఏ ఒక్క బిల్డింగ్‌పై చెయ్యి పడినా ఊరుకోం, 2026 నాటి అక్రమ గెజిట్‌ను తక్షణమే రద్దు చేయాల్సిందే
🔶 రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వల్ల నష్టపోతున్న సెవెన్ హిల్స్ , వెస్ట్రన్ మిడోస్ తదితర కాలనీలను పరిశీలించి, బాధిత కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారి ఆవేదనను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు👇
🔸ఇక్కడ తమ ఆవేదనను వ్యక్తం చేసిన అజయ్ కుమార్ గారు, సోదరీమణులు శోభ, శ్వేత, పద్మజ, రిటైర్డ్ జిల్లా జడ్జి విజయ్ కుమార్ గారు, ప్రసన్నత గారు, డాక్టర్ నందగోపాల్ గారు, అలెగ్జాండర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు, వివిధ అపార్ట్‌మెంట్ల అసోసియేషన్ల కార్యవర్గ సభ్యులు, నష్టపోతున్న అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మాటలు వింటుంటే ప్రభుత్వం ఎంత అరాచకంగా వ్యవహరిస్తోందో స్పష్టమవుతోంది.
🔸నిజానికి ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకానీ ఒక బిల్డర్ కోసమో, ఒక కాంట్రాక్టర్ కోసమో, కొందరు వ్యక్తుల స్వార్థం కోసమో పనిచేయకూడదు.
🔸వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఈ 100 ఫీట్ల రోడ్డు కోసం మాస్టర్ ప్లాన్‌లో మార్కింగ్ ఇచ్చారు. అయితే ఆనాడు ఇచ్చిన గెజిట్‌లో ఇక్కడి గుట్టను తొలగిస్తూ, గుట్ట మీద ఉన్న 400 ఏళ్ల చారిత్రక హనుమాన్ టెంపుల్‌ను కూల్చేస్తూ ఆ 100 ఫీట్ల రోడ్డు అలైన్‌మెంట్ ఉండేది.
🔸తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆ హనుమాన్ ఆలయాన్ని కాపాడాలని స్థానికులు సబితక్క దృష్టికి తీసుకొచ్చారు.
🔸వెంటనే సబితా ఇంద్రారెడ్డి గారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి, ఆ 100 ఫీట్ల రోడ్డును యథావిధిగా కొనసాగిస్తూనే.. ఆలయం దగ్గర మాత్రం గుడిని కాపాడుతూ పక్కనే ఉన్న ఓపెన్ ల్యాండ్ నుంచి మెయిన్ రోడ్డుకు కలిపేలా 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గెజిట్ (జీవో నం. 181) ఇచ్చింది.
🔸ఆ రోజు మేము అలైన్‌మెంట్ ఎందుకు మార్చామంటే.. అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రజల కోరిక మేరకు ఒక చారిత్రక దేవాలయాన్ని కాపాడుతూ, ఏ ఒక్క అపార్ట్‌మెంట్‌కు గానీ, ఏ ఒక్కరి ఇంటికి గానీ ఇంచు కూడా నష్టం కలగకుండా 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది.
🔸మరి ఈరోజు 2026లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కొత్త గెజిట్ వెనుక ఏముంది? ఇందులో ఏమైనా ప్రజాప్రయోజనం ఉందా? ఇందులో అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేనే లేదు, కేవలం ‘ప్రైవేట్ ఇంట్రెస్ట్’ మాత్రమే ఉంది ఒక్క బిల్డర్ ప్రయోజనమే ఈ ప్రభుత్వ ప్రయోజనంగా మారింది.
🔸ఒక్క బిల్డర్‌ను సంతోషపెట్టడం కోసం ఇవాళ 2 వేల అపార్ట్‌మెంట్లలో ఉండే 4 వేల కుటుంబాలు, 5 వేల మంది ప్రజల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు. దసరా పండుగ ముందు వీళ్ల ఇండ్లకు రెడ్ మార్కులు వేసి, గత రెండు నెలలుగా ఏం జరుగుతుందో తెలియక నిద్రలేని రాత్రులు గడిపేలా చేశారు.
🔸ఈ ప్రాంతంలో ఆర్ఆర్ రియాల్టీ అనే బిల్డర్ తమను ఎలా వేధించాడో, ఆయన భూదాహానికి తాము ఎలా ఇబ్బంది పడ్డామో ఇక్కడ ఇల్లు కట్టుకున్న అలెగ్జాండర్ రెడ్డి గారు, కాలనీ వాసులు కన్నీళ్లతో చెప్తున్నారు.
🔸ఈ రాధా రియల్టర్ ఎక్కడ ఉంటాడో మా తమ్ముడు కార్తీక్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు.. అతను సాక్షాత్తూ ‘బిగ్ బ్రదర్’ ఆఫీసులోనే కూర్చుంటాడు, అక్కడ అతనికి ఒక ప్రత్యేక ఛాంబర్ పెట్టారు..ఆ అండ చూసుకునే వాడికి ఇంత ధైర్యం వచ్చింది.
🔸లేకపోతే రాత్రికి రాత్రే జీవోలు, గెజిట్‌లు మారుతాయా? జనవరి 7వ తేదీన ఒక జీవో వస్తుంది, తెల్లారేసరికి జనవరి 8వ తేదీన మళ్లీ మార్పులతో ఇంకో గెజిట్ వస్తుంది. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, పెద్ద స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టే రాత్రికి రాత్రే జీవోలు మారిపోయి, ఇండ్లపై రెడ్ మార్కింగ్‌లు పడుతున్నాయి.
🔸ఇక్కడి వెస్ట్రన్ మిడోస్ ప్రతినిధి డాక్టర్ నందగోపాల్ గారు చాలా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు.. ఇదంతా జరుగుతున్నది ఒకవైపు ముఖ్యమంత్రి గారి కూతురు స్కూల్ కోసం, అంటే ‘బిగ్ బ్రదర్స్’ కుటుంబానికి చెందిన కార్పొరేట్ స్కూల్ కోసం.. ఇంకోవైపు బిగ్ బ్రదర్స్ భాగస్వామి, అత్యంత సన్నిహితుడైన ఆర్ఆర్ రియాల్టీ హై-రైజ్ భవనాల కోసమే..
🔸హనుమాన్ టెంపుల్‌ను తప్పిస్తూ 2018లో వేసిన పాత నోటిఫైడ్ రోడ్డులో రాధా రియల్టర్స్ వెంచర్ ఎఫెక్ట్ అవుతుందని దాన్ని మార్పించాడు.
🔸అంతేకాకుండా, కొత్తగా వేలంలో కొనుక్కున్న భూమికి, అతని ఇతర భూములకు హై-రైజ్ పర్మిషన్ రావాలంటే ముందు 100 ఫీట్ల రోడ్డు ఉండాలి కాబట్టి, ఆ రోడ్డును రౌండ్‌గా తిప్పి ఇక్కడున్న 10 అపార్ట్‌మెంట్లను కూల్చడానికి సిద్ధమయ్యారు.
🔸అంటే వాళ్ల ఒక్క అపార్ట్‌మెంట్ కట్టుకోవడానికి ప్రజల ఇన్ని అపార్ట్‌మెంట్లు కూల్చాలా? వాళ్ల స్కూల్ కోసం ప్రసన్నత గారు ఎంతో ప్యాషన్‌తో, కష్టపడి కట్టుకున్న స్కూల్‌ను కూల్చేస్తారా? ఇదెక్కడి న్యాయం?
🔸ఇందులో జరిగిన భూ వేలం కుంభకోణం చూస్తే వీళ్ల దోపిడీ ఎంత బరితెగింపుగా ఉందో అర్థమవుతుంది. సాధారణంగా ప్రభుత్వం ఎప్పుడైనా భూమిని వేలంవేస్తే.. ముందు అక్కడ 100 ఫీట్ల రోడ్డు వేసి, ఆ భూమి 100 ఫీట్ల రోడ్డు మీద ఉందని పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి వేలం వేస్తుంది. అప్పుడు ఆ భూమికి ఎక్కువ ధర పలికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
🔸కానీ వీళ్లు ఏం చేశారు? కోకాపేట, నార్సింగి ప్రాంతంలో ఇవాళ గజం ధర రూ. 2 లక్షలకు తక్కువ లేదు. కానీ ఈ ప్రభుత్వ భూమికి 60 ఫీట్ల రోడ్డే ఉంది, హై-రైజ్ పర్మిషన్ రాదు అన్నట్లుగా చూపించి, 100 ఫీట్ల రోడ్డు విషయం దాచిపెట్టి.. సైలెంట్‌గా గజం కేవలం రూ. 47 వేలకే వేలం వేసేశారు..
🔸దాదాపు రూ. 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 26 కోట్లకే తమ బిల్డర్‌కు కట్టబెట్టారు. తీరా వాడు అగ్గువకు భూమి కొన్నాక.. ఇప్పుడు ఆ భూమికి 100 ఫీట్ల రోడ్డు వేయడం కోసం మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలుస్తామంటున్నారు..
🔸ఒకవైపు హైడ్రా అని పెట్టి పేదవాళ్ల గుడిసెలన్నీ కూల్చి వాళ్లను రోడ్డు మీదకు తెచ్చారు. ఇంకోవైపు హైదరాబాద్ చుట్టూ భూములను ‘22-A’ నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పుడు 100 ఫీట్ల రోడ్ల పేరు మీద మధ్యతరగతి ప్రజల అపార్ట్‌మెంట్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు.
🔸హైడ్రా అయినా, 22-A అయినా, 100 ఫీట్ల రోడ్లయినా.. ఇవేవీ ప్రజలకు పనికొచ్చే పనులు కావు; కేవలం వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్ల భూదాహం, ధనదాహం తీర్చడానికి చేస్తున్న అరాచకాలే..
🔸చట్టప్రకారం కొత్త గెజిట్ ఇవ్వాలన్నా, మాస్టర్ ప్లాన్ మార్చాలన్నా.. ముందు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, స్టేక్ హోల్డర్స్‌తో మాట్లాడాలి, పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. కానీ ఇక్కడ ఏ ఒక్కటీ చేయలేదు..
🔸కనీసం బాధితులు వెళ్లి తమ గోడు చెప్పుకుందామంటే అధికారులు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు.
🔸వినతిపత్రం ఇస్తామంటే.. ఇందులో చాలా పెద్దవాళ్లు ఉన్నారు లేండి, మేము మాట్లాడలేం, మీరు ఏమీ అనుకోకండి, మేము కాగితం కూడా తీసుకోలేం అని అధికారులు అంటున్నారంటే రాష్ట్రంలో అసలు చట్టం ఉందా?
🔸బాధితుల కాగితం తీసుకోవడానికి కూడా అధికారులు భయపడుతున్నారంటే.. దీని వెనుక ముఖ్యమంత్రి కుటుంబం, ‘బిగ్ బ్రదర్స్’ ఉన్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? రాష్ట్రాన్ని పాలించే రక్షకుడే ఇవాళ భక్షకుడిగా మారిపోయాడు..
🔸ఇక్కడి సెవెన్ హిల్స్ వారు ఎంతో ఆదర్శంగా నిలిచారు. ఇవాళ రేపు ఇంట్లో నలుగురు అన్నదమ్ములు కలిసి ఉండటమే కష్టమైన రోజుల్లో.. ఏ బిల్డర్ లేకుండా 1,553 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక తాటిపైకి వచ్చి, ఒకే కుటుంబంలా కలిసి నిర్మించుకుని 13-17 ఏళ్లుగా ఆనందంగా జీవిస్తున్నారు.
🔸అలాంటి సెవెన్ హిల్స్ అపార్ట్‌మెంట్‌కు ఒకవైపు 10 మీటర్లు, ఇంకోవైపు 7 మీటర్లు లోపలికి రెడ్ మార్కులు వేశారు..
🔸దీనివల్ల సెల్లార్‌లోకి వెళ్లే అండర్‌పాస్ పోతుంది, గుడి పోతుంది, వాకింగ్ ట్రాక్ పోతుంది, సెల్లార్ పార్కింగ్ పోతుంది, పిల్లర్లు దెబ్బతిని అసలు బిల్డింగ్ స్ట్రెంత్, అపార్ట్‌మెంట్ లైఫే పోయే ప్రమాదం ఏర్పడింది..
🔸సెవెన్ హిల్స్, వెస్ట్రన్ మిడోస్, అలెగ్జాండర్ రెడ్డి గారి లాంటి వ్యక్తిగత ఇండ్లు, పాఠశాలలు.. ఇలా దాదాపు 10 అపార్ట్‌మెంట్లు ఈ అక్రమ అలైన్‌మెంట్ వల్ల దెబ్బతింటున్నాయి.
🔸అంతేకాదు, పక్కనే కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉండే పేద అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు కూడా ఇక్కడికి వచ్చి తమ బాధ చెప్పుకున్నారు.
🔸గతంలో వాళ్లు కేవలం 100 మీటర్లలో మెయిన్ రోడ్డు మీదకు వచ్చేలా దారి ఉండేది. కానీ ఈ బిల్డర్ రాత్రికి రాత్రే రేకులు పెట్టి వాళ్ల దారిని మూసేశాడు, డ్రైనేజీ మార్చేశాడు, ఉన్న రోడ్డును తవ్వేశాడు.
🔸పాపం ఆ పేదవాళ్లు ఇప్పుడు కిలోమీటర్ చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. ఇదేంటని అడిగితే పోలీసులను పెట్టి భయపెడుతున్నారు.
🔸నాడు కేసీఆర్ గారు పేదల దగ్గర ఆరు పైసలు కూడా తీసుకోకుండా ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టించి గృహప్రవేశాలు చేయించారు.
🔸కానీ నేడు రేవంత్ రెడ్డి పేదలకు ఇల్లు ఇవ్వాలంటే రూ. 5 లక్షలు, 6 లక్షలు కట్టాలంటున్నాడు.. ఆటోలు, రిక్షాలు నడుపుకునేవాళ్లు, ఇండ్లలో పనిచేసుకునే పేదవాళ్లు రూ. 6 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు..
🔸పైగా కేసీఆర్ గారు ఇచ్చిన ఇండ్లలోకి వెళ్లే దారిని కూడా మూసేస్తారా? డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు ఎవరూ అధైర్యపడొద్దు, సబితా మేడమ్, మేమంతా మళ్లీ మీ కాలనీకి వస్తాం, మీ దారిని తెరిపిస్తాం.
🔸నాడు కోకాపేట, నార్సింగి ప్రాంతంలో మంచినీళ్ల సమస్య ఉంటే.. కేసీఆర్ గారి ప్రభుత్వం పైప్‌లైన్లు వేసి, మీ వాటర్ ట్యాంకర్ల బిల్లులు తగ్గించి పుష్కలంగా తాగునీళ్లు ఇచ్చింది.
🔸పవర్ కట్స్ లేకుండా, ఇన్వర్టర్లు, జనరేటర్లతో పని లేకుండా 24 గంటల కరెంటు ఇచ్చింది. కాంగ్రెస్ రాగానే మళ్లీ వాటర్ ట్యాంకర్ల దందా మొదలైంది, ఇంకో నాలుగు రోజులు పోతే మళ్లీ కరెంటు కోతలు, ఇన్వర్టర్లు, జనరేటర్లు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది..
🔸కాలనీవాసులందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నాను.. మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. గత దీపావళి అప్పుడు పక్కనే ఉన్న హైదర్‌షాకోట్‌లో మూసీ సుందరీకరణ పేరుతో 40-50 ఏళ్ల నుంచి ఉంటున్న పేదల ఇండ్లకు ఇలాగే రెడ్ మార్కులు ఇచ్చి దీపావళి గిఫ్ట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి.
🔸వాళ్లంతా తెలంగాణ భవన్‌కు వస్తే, మేమందరం హైదర్‌షాకోట్‌కు వెళ్లి బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని హెచ్చరించాం.
🔸బీఆర్ఎస్ పోరాటంతో దిగొచ్చిన రేవంత్ రెడ్డి.. అక్కడ ఇండ్లు, అపార్ట్‌మెంట్లు కూల్చబోమని ప్లాన్ మార్చుకున్నాడు.
🔸హైదర్‌షాకోట్‌లో రెడ్ మార్కులు ఎలాగైతే పోయాయో.. నార్సింగిలో కూడా ఈ రెడ్ మార్కులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దాకా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మీ వెన్నంటి ఉంటారు..
🔸ఇక్కడి కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు, రిటైర్డ్ జడ్జి గారితో కూర్చుని చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలో కార్యాచరణ రూపొందిస్తాం.
🔸అవసరమైతే నేను, సబితక్క, దాసోజు శ్రావణ్ గారు, సుధీర్ రెడ్డి గారు, మా నగర ఎమ్మెల్యేలమంతా మీతో పాటు హెచ్ఎండీఏ ఆఫీసుకు వస్తాం, అధికారులను నిలదీస్తాం. న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలో, అసెంబ్లీలో.. ఏ వేదిక మీదనైనా సరే ఈ 2026 నాటి అక్రమ గెజిట్ రద్దయ్యేదాకా పోరాడుతాం.
🔸ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ పాలసీతో రకరకాల ప్రలోభాలకు, భయాలకు గురిచేసే ప్రయత్నం చేస్తుంది.
🔸కానీ మీరంతా ఐక్యంగా ఉండాలి. మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ ఒకే హక్కు ఉంటుంది.. ప్రభుత్వానికి గానీ, రాధా రియల్టర్‌కు గానీ కొమ్ములేమీ లేవు..
🔸ఇదేదో శాశ్వత ప్రభుత్వం కాదు, ఇంకో ఏడాది, ఏడాదిన్నర పోతే మళ్లీ వచ్చేది కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వమే.
🔸మీకు అర్ధరాత్రి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి.. నా ఇల్లయినా, కేటీఆర్ గారి ఇల్లయినా, సబితక్క ఇల్లయినా మీ అపార్ట్‌మెంట్ నుంచి కేవలం 10 నిమిషాల దూరమే..
🔸పది నిమిషాల్లో మీ ముందుంటాం, మా కార్తీక్ రెడ్డి 24 గంటలూ మీకు అందుబాటులో ఉంటాడు.
🔸ఇష్యూ పెద్దది కాకముందే ప్రభుత్వం తక్షణమే ఈ 2026 గెజిట్‌ను నిలిపివేయాలి, 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం హనుమాన్ ఆలయాన్ని కాపాడుతూ ఇచ్చిన పాత గెజిట్ ప్రకారమే 100 ఫీట్ల రోడ్డును వేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

నీ బిడ్డ ఇంటర్నేషనల్ స్కూల్ కోసం ఇంకో స్కూల్ కూల్చేస్తావా రేవంత్ రెడ్డి?
రూ. 2 లక్షలకు గజం ఉన్న భూమిని కేవలం రూ. 47 వేలకే గజం చొప్పున గుట్టుచప్పుడు కాకుండా వేలం వేశారు.
రూ. 110 కోట్ల విలువైన భూమిని రూ. 26 కోట్లకు కట్టబెట్టారు.
ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్నప్పుడు ఇళ్లు కూల్చాల్సిన అవసరమే లేదు.
- నార్సింగి రోడ్ అలైన్మెంట్ మార్పు బాధితులతో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు
ఒక్క బిల్డర్ కోసం రేవంత్ సర్కార్ ప్రజల ఇండ్లను కూలగొడ్తుంది.
రాధా రియల్టర్స్ అనే బిల్డర్ కోసం 2,000 ఇళ్లు కూల్చివేసి 5,000 మందిని రోడ్డున పడేస్తారా?
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రోడ్ అలైన్మెంట్‌ను కొంచెం మార్చి, ప్రజల కోరిక మేరకు 2018లో కేసీఆర్ గారు గుడి కూల్చివేయకుండా, ఇళ్లకు ఇబ్బంది కలగకుండా రోడ్డు వేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.
కానీ 2026లో కేవలం కాంగ్రెస్ నాయకుల కోసం, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కోసం అలైన్‌మెంట్ మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేసి, పాత అలైన్‌మెంట్ ప్రకారం రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము
- నార్సింగి రోడ్ అలైన్మెంట్ బాధితులతో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శైలిమ దంపతులు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ ఆయురారోగ్యాలతో, సుదీర్ఘకాలం పాటు ప్రజాసేవలో కొనసాగాలని కేటీఆర్ దంపతులు ఆకాంక్షించారు.
నార్సింగిలో 100 ఫీట్ల రోడ్డు అలైన్‌మెంట్ మార్పుతో నష్టపోతున్న కాలనీలను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు.
కొత్త రోడ్డు అలైన్‌మెంట్ మార్కింగ్‌ల వల్ల నష్టపోతున్న బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న హరీష్ రావు.
అన్ని అనుమతులు ఉన్నా తమ భవనాలు కూల్చేందుకు రెడ్ మార్కులు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు.