పింఛన్ రాని ప్రతి ఒక్కరి గొంతుకగా నిలుస్తా.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా!
– పెండింగ్‌లో ఉన్న వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్లను వెంటనే మంజూరు చేయాలి
– ట్రాక్టర్, డీసీఎం ఉన్నాయనే కారణంతో పేదల పింఛన్లు నిలిపివే యొద్దు
– వికలాంగుల పింఛన్ల నిబంధనల్లో మార్పులు తీసుకురావాలి
– అర్హులైన వారందరికీ సాచురేషన్ మోడ్‌లో పింఛన్లు అందించాలి
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు
బచ్చన్నపేట:
బచ్చన్నపేట మండలంలోని నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజే శ్వర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పింఛన్లు అందని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, సంబంధిత అధికారు లతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని స్పష్టం చేశారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా గారి మీడియా పాయింట్స్:
➤ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో విస్తృతమైన పింఛన్ వ్యవస్థ అమ లులో ఉందని, వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేలా అనేక రకాల పింఛన్లు అందిస్తున్నాం.
➤ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీడీ కార్మికులకు సైతం పింఛ న్ సౌకర్యం కల్పించామని గుర్తుచేశారు. బోధకాలు, హెచ్‌ఐవీ, కిడ్నీ, లివర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు గత ప్రభుత్వం ప్రారంభించిన పింఛన్ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించడం అభినందనీయం.
➤ గతంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42 లక్షల పింఛన్లు ఉండగా, మరణాల కారణంగా ఏర్పడిన ఖాళీలతో పాటు ప్రస్తుతం జనగామ నియోజకవర్గ పరిధిలో కొత్తగా సుమారు 863 పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు.
➤ ప్రస్తుతం ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గీత కార్మికు లు, నేత కార్మికులు తదితర ఐదు కేటగిరీలకు చెందిన వారికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి.
➤ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించాలి. ప్రభుత్వం సాచురేషన్ మోడ్‌లో పింఛన్లను మంజూరు చేయాలని కోరారు.
➤ ప్రస్తుతం ఐదు కేటగిరీలకు పింఛన్లు మంజూరైనప్పటికీ, వృద్ధాప్య పింఛన్లు, బీడీ కార్మికుల పింఛన్లు ఇంకా రావాల్సి ఉంది. బచ్చన్నపేట ప్రాంతం నుంచి కూడా పింఛన్లు అందలేదని తనకు ఫోన్లు వస్తున్నాయ ని, మిగిలిన అర్హులకు సైతం పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వా న్ని కోరుతాను.
➤ పింఛన్లు అందని వారి సమస్యలపై ఎంఆర్‌ఓ, ఎంపీడీఓ అధికారు లతో మాట్లాడుతున్నాను. గత మూడేళ్లుగా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలి పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఎమ్మెల్యేగా తన బాధ్యత.
➤ కారు ఉన్నవారికి పింఛన్ విషయంలో నిబంధనలు వర్తింపజేయ డాన్ని అర్థం చేసుకోవచ్చని, అయితే ఇద్దరు ముగ్గురు కలిసి చిన్న వ్యాపారం లేదా జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్, డీసీఎం వంటి వాహనాలను సాకుగా చూపి పింఛన్లు నిలిపివేయడం సరికాదు.. ఈ నిబంధనలపై గతంలోనూ ప్రశ్నించామని, ప్రస్తుతం కూడా ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నామని చెప్పారు.
➤ ట్రాక్టర్ లేదా ఇతర వాహనాలు ఉన్నాయనే కారణంతో పేద కుటుం బాలను పింఛన్లకు దూరం చేయకుండా వాస్తవ పరిస్థితులను పరిశీ లించాలని సూచించారు.
➤ వికలాంగుల కుటుంబాల్లో కుమారుడు, కుమార్తె లేదా ఇతర కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఉందనే కారణంతో వికలాంగుల పింఛ న్లు నిలిపివేయడం సమంజసం కాదు..
➤ వికలాంగులకు ప్రత్యేక కోటా కింద పింఛన్లు అందించే విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి, సంబంధిత నిబంధ నలను పునఃపరిశీలించాలని కోరారు.
➤ అర్హత ఉండి పింఛన్ రాని ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభు త్వంపై ఒత్తిడి తీసుకొస్తాను. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా నని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు.
8
376
జనగామ నియోజకవర్గం | తేదీ: 17-11-2026
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాలి
– వాహనాలు, కుటుంబ సభ్యుల ఉద్యోగాల పేరుతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేయొద్దు
– పెండింగ్‌లో ఉన్న, తిరస్కరణకు గురైన దరఖాస్తులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలి
– ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుగా నిరంతరం నిలబడతా
– నూతన చేయూత పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు
జనగామ:
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జనగామ మండలం చీటకోడూరు గ్రామంలోని రైతు వేదిక వద్ద మంగళవారం నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల జారీ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూ రైన పెన్షన్ల ఉత్తర్వులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పెన్షన్లు అందే లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ కారణా లతో పెండింగ్‌లో ఉన్న, తిరస్కరణకు గురైన దరఖాస్తులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.
ఎమ్మెల్యే పల్లా గారి మీడియా పాయింట్స్:
➤ జనగామ మండలంలోని 21 గ్రామాలకు చెందిన ఐదు రకాల పెన్షన్ల కింద మొత్తం 781 మందికి నూతనంగా పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు. ఇందులో 412 మంది వితంతువులు, 86 మంది ఒంటరి మహిళలు, 218 మంది దివ్యాంగులు, 28 మంది నేత కార్మికులు, 77 మంది గీత కార్మికులు ఉన్నట్లు వివరించారు.
➤ కుటుంబ జీవనోపాధి కోసం అప్పులు చేసి ట్రాక్టర్లు, ఇతర వాహ నాలు కొనుగోలు చేసుకున్న పేద కుటుంబాలకు పెన్షన్లు నిరాకరిస్తు న్నట్లు తన దృష్టికి వచ్చింది. నాలుగు చక్రాల వాహనం ఉన్నంత మాత్రా న వారంతా కార్లలో తిరుగుతూ సౌకర్యవంతమైన జీవితం గడుపుతు న్నట్లు కాదని పేర్కొన్నారు. కొందరు ట్రాక్టర్లు, డీసీఎంలు కొనుగోలు చేసి అద్దెకు నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని వివరిం చారు.
➤ బ్యాంకు రుణాలు తీసుకుని జీవనోపాధి కోసం వాహనాలు కొను గోలు చేసిన వారి పరిస్థితులను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేవలం వాహనం ఉందనే కారణంతో నిజమైన నిరుపేదలకు పెన్షన్ నిరాకరించకుండా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని సూచించారు.
➤ దివ్యాంగుల కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉద్యోగం ఉందనే కార ణంతో కొన్ని గ్రామాల్లో ఐదు నుంచి ఆరు వరకు పెన్షన్ దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు తన దృష్టికి వచ్చింది. కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి పిల్లల్లో ఎవరికైనా ఉద్యోగం ఉందనే ఒక్క కారణంతో దివ్యాంగులకు పెన్షన్ నిరాకరించకుండా మానవతా దృక్పథంతో పరిశీలించాలని కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులను కోరారు. అర్హులైన దివ్యాంగులకు పెన్షన్లు అందేలా ప్రత్యేక దృష్టి సారిం చాలని సూచించారు.
➤ ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు వివిధ కారణా లతో తిరస్కరణకు గురైన దరఖాస్తులను కూడా మరోసారి పరిశీలిం చాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇంకా పెన్షన్లు పొందని అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
➤ ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, వారి సమ స్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా తనపై ఉంది.. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లతో పాటు ఇతర సంక్షే మ పథకాల అమలు విషయంలో ఎక్కడ సమావేశాలు జరిగినా అధి కారుల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
➤ సీఎంఆర్ఎఫ్, ఎల్‌ఓసీ, ఆర్‌బీఎస్ సేవలతో పాటు ఆరోగ్య, విద్యా రంగాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలోనూ తన వంతు కృషి కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ప్రజలు తనను తమకు కాపలాదారుగా ఎన్నుకున్నారని, వారి బాగోగులు చూసుకోవడం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నించడం తన బాధ్యతన్నారు.
➤ అధికారులు సమస్యలను పరిష్కరించినా, పరిష్కరించకపోయినా ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా నిరంతరం నిలబడతానని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో స్థానిక సర్పంచులతో సమన్వయం చేసుకుంటూ పెన్షన్ల మంజూరు కార్యక్రమాలను కొనసాగించాలని అధి కారులకు సూచించారు.
జనగామ పట్టణంలోని శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో జరిగిన దేవరకొండ వెంకట్ కుమార్తె తేజస్వీ వివాహ వేడుకకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఆకాంక్షించారు.
5
596
మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను
ఆశీర్వదించడం జరిగింది.
1
2
442
Dignity of office seems like a rare trait with Telangana Congress & BJP leaders
CM acting like a body guard of Gandhis, PCC president & Minister running behind Rahul Gandhi’s bike like errand boys !
Likewise Union Minister and BJP state president touching the feet of Amit Shah and carrying his chappal
What shameful and unbecoming behaviour
Telangana was founded on the principle of self respect. Looks like these two national parties will never ever be able to comprehend it
Lies, damned lies and then there is the Congress election manifesto “Abhaya Hastam”
Mr @RahulGandhi Since you’re in Hyderabad enjoying at the expense of Telangana exchequer, why don’t you answer simple questions about 420 promises, 13 declarations & 6 guarantees?
✳️ BC declaration: promised ₹ 1,00,000 Crore budget allocation for Backward classes
❌ Delivered: Less than ₹ 5,000 Crore in three years
✳️ Promised 42% in education, employment and govt contracts to BCs
❌ Delivered - ZERO
✳️ SC & ST Declaration: Promised a new scheme Ambedkar Abhaya Hastam ₹12 lakh to poor SC & ST families
❌ Delivered - ZERO
✳️ Promised 31% in govt contracts to SC and ST communities
❌ Delivered - ZERO
✳️ Youth Declaration: Promised 2 Lakh Jobs within 365 days, Rajiv Yuva Vikasam
❌ Delivered - 10 thousand jobs and Zero Vikasam
✳️ Student Declaration: Promised 5 Lakh Vidya Bharosa card
❌ Delivered - ZERO
✳️ Minority Declaration: Promised ₹4,000 Cr budget
❌ Delivered - Less than ₹1,000 Crore
The list is endless just like the saga of betrayal of Congress to Telangana
#CongressConnedTelangana
#CongressFailedTelangana
ఒకవైపు 365 మండలాల్లో కరువుతో రైతులు, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతుంటే... రైతులకు పరిహారం, ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి పైసల్లేవని చేతులెత్తేస్తూ…
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచార సదస్సులకు, విలాసాలకు మాత్రం వందల కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.
ఎవడి పాలైందిరో తెలంగాణ 😡
#CongressLootingTelangana
ఒకవైపు రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టి ప్రజలను, రైతులను ఆగం చేసి..
మరోవైపు భారత్ సమ్మిట్ పేరిట వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. భారతదేశ చిహ్నమైన అశోక చక్రాన్ని ఆఫ్రికా మీద పెట్టి దేశ పరువు తీసిన రేవంత్ 😡
దేశ గౌరవాన్ని కించపరిచిన నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హతే లేదు!
వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి..రైతులను ఆదుకోవాలి!
– మిల్లులకు ట్యాగింగ్ పూర్తి చేసి, సన్న వడ్ల బోనస్‌పై వెంటనే జీవో జారీ చేయాలి
– దళారులు సిండికేట్‌గా మారి ధాన్యం ధర తగ్గిస్తున్నారు.. రైతులు తొందరపడొద్దు
– తపాసుపల్లి నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేయాలి.
వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి..రైతులను ఆదుకోవాలి!
– మిల్లులకు ట్యాగింగ్ పూర్తి చేసి, సన్న వడ్ల బోనస్‌పై వెంటనే జీవో జారీ చేయాలి
– దళారులు సిండికేట్‌గా మారి ధాన్యం ధర తగ్గిస్తున్నారు.. రైతులు తొందరపడొద్దు
– తపాసుపల్లి నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేయాలి
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు
చేర్యాల:
చేర్యాల పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమా వేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జరు గుతున్న జాప్యం, మిల్లులకు ట్యాగింగ్, సన్న వడ్ల బోనస్ జీవో జారీ చేయకపోవడం, రైతులకు గిట్టుబాటు ధర అందకపోవడంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:
➤ చేర్యాల ప్రాంతంలో ఇప్పటికే వరి కోతలు పూర్తయి, రైతులు ధాన్యా న్ని రాశులుగా పోసి రోడ్లపై, మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలకు తరలించినప్పటికీ జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం ఆందోళనకరమన్నారు.
➤ ప్రారంభించిన కేంద్రాల్లోనూ మిల్లులకు ట్యాగింగ్ ప్రక్రియ పూర్తికా లేదని, మిల్లులకు ట్యాగింగ్ చేసిన చోట కూడా సన్న వడ్లకు సంబం ధించి ఇప్పటివరకు జీవో జారీ చేయలేదని పేర్కొన్నారు.
➤ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో గత మూడు సంవత్సరాలుగా వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిందని పల్లా గారు గుర్తుచేశారు.
➤ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ప్రకటించిందని విమర్శించారు. గత యాసంగి సీజన్ లో కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ఇప్పటివరకు బోనస్ చెల్లించలే దని, ప్రస్తుత యాసంగి సీజన్‌లో సన్న వడ్ల బోనస్‌కు సంబంధించి జీవో సైతం విడుదల చేయలేదని అన్నారు.
➤ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం, మిల్లు లకు అలాట్‌మెంట్ జరగకపోవడం, బోనస్‌పై స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
➤ ఈసారి పంట దిగుబడి తక్కువగా రావడంతో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ధరలను సిండికేట్ చేసి తగ్గిస్తున్నారని ఆరోపిం చారు. ప్రభుత్వ కొనుగోళ్లలో జాప్యం రైతులను మరింత నష్టాలపాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
➤ రైతులు దళారుల మాటలు నమ్మి తొందరపడి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించవద్దని పల్లా విజ్ఞప్తి చేశారు. ఈసారి పంట దిగు బడి తక్కువగా ఉన్నందున రైతులకు మంచి ధర లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
➤ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.2,450 మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ అందుతుందని, కాబట్టి రైతులు కొంతకాలం ఓపిక పట్టాలని సూచించారు.
➤ జిల్లా కలెక్టర్‌తో గత రాత్రే మాట్లాడానని, సమస్యలను వివరించగా వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని పల్లా గారు తెలిపారు. కలెక్టర్‌తో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి ఇంకా ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలను తక్షణమే తెరవాలని కోరా రు. ప్రారంభించిన కేంద్రాలకు మిల్లులను వెంటనే ట్యాగింగ్ చేసి, ధా న్యం కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాం టి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.
➤ తపాసుపల్లి నుంచి చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందేలా తక్షణమే నీటిని విడుదల చేయాలని పల్లా గారు కోరారు. ఈ విషయంలో ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని చివరి ఆయకట్టు భూముల వరకు నీరు చేరేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
2
282
It's been 3 years @RahulGandhi ji... When will you start giving montly ₹ 2,500 to women in Telangana?
@KTRBRS
राहुल गांधी जी,
वादे सारे हवा हो गए, कहाँ चले?
तेलंगाना पूछे सवाल, जवाब कौन दे?
Dear @RahulGandhi Ji,
As you land in Hyderabad to attend a Congress jamboree funded by Telangana's taxpayers, the people of Telangana are waiting for answers.
You made promises. Three years later, where are the 420 guarantees?
Come prepared to answer, not just to address!
5
322
You didn’t show up when students demanding jobs (that you promised ) were being throttled & getting beaten up by Congress police.
You were unperturbed when tribal women of Lagacharla were beaten, disrobed & molested for their lands.
When Hydraa bulldozers were destroying homes of hardworking Telangana people- you were sleeping in Delhi.
You had no time when over 10,000 trees were felled overnight, deers & peacocks, and a rich ecosystem was razed at Kancha Gachibowli HCU lands or when KBR park was being destroyed
You didn’t flinch when the Constitutional processes were being ridiculed & 10 BRS MLAs were being bought off to join Congress
Women legislatures’s sarees were pulled, beaten in front of the Assembly - did you have a word to offer Rahul?
You couldn’t speak about farmer suicides, weaver suicides, journalists’ midnight arrests, crony capitalism, land grabbing….!!!
Your own MLAs & ministers are openly speaking about brazen corruption
You chose silence when it mattered!
NOW!
You waltz in shamelessly for a propaganda stunt with ₹100 Cr Telangana people’s money
Where do you get off @RahulGandhi ?
#CongressFailedTelangana
राहुल गांधी जी,
वादे सारे हवा हो गए, कहाँ चले?
तेलंगाना पूछे सवाल, जवाब कौन दे?
Dear @RahulGandhi Ji,
As you land in Hyderabad to attend a Congress jamboree funded by Telangana's taxpayers, the people of Telangana are waiting for answers.
You made promises. Three years later, where are the 420 guarantees?
Come prepared to answer, not just to address!




















