Official Twitter handle of The Collector & District Magistrate of Bapatla District, Andhra Pradesh

Bapatla
Joined January 2024
బాపట్ల, తేది: 13-10-2026 - స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ . గారు అధికారులను ఆదేశించారు. - మంగళవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో మాట్లాడుతూ, 2011 జనగణన ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో వసతులు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, భద్రతా ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఎన్నికల మార్గదర్శకాలు, ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. #Bapatla #LocalBodyElections #ElectionPreparedness #DistrictAdministration #AndhraPradesh
70
బాపట్ల, తేది: 13-10-2026 - స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్ . గారు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, గ్రామపంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసి గెజిట్ విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. - ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఖరారు చేయాలని, తప్పులు లేకుండా పునఃపరిశీలించాలని సూచించారు. #Bapatla #LocalBodyElections #ReservationProcess #DistrictAdministration #AndhraPradesh
75
*CWC-Visakhapatnam/Date:11-10-2026 at 09:10 HRS IST (YELLOW ALERT🟡: BE UPDATED) :* *Light* Thunderstorm accompanied with lightning, gusty winds speed reaching 30-40 kmph and *light rainfall* likely to occur at one or two places over BAPATLA and PRAKASAM districts within the next 03 hours. ===
102
బాపట్ల, తేది: 07-10-2026 - ప్రజా సేవ చేసే వారందరికీ ఎస్.ఆర్. శంకరన్ గారు ఆదర్శప్రాయుడని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు తెలిపారు. - బుధవారం కలెక్టరేట్‌లో శంకరన్ 16వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కలెక్టర్ గారు నివాళులర్పించారు. వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. మన్నె శ్రీనివాసరావు రచించిన ‘రేపల్లె చరిత్ర’ పుస్తకాన్ని విడుదల చేశారు. పేదలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి శంకరన్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవితం అధికారులు, యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ గారు పేర్కొన్నారు. #SRShankaran #PublicService #Bapatla #DistrictAdministration #GoodGovernance
1
80
- Improved Road Connectivity in ThurpuPalem - District: Bapatla | Mandal: Cherukupalli | Village: ThurpuPalem - A CC road was constructed in ThurpuPalem Gram Panchayat from the Nagaram–Rajavolu R&B Road to the residence of Shanaka Nagamalleswara Rao with *MP LADS* funds. The work was taken up at an estimated cost of ₹3 lakh, & ₹2,79,988 was spent. With the completion of the road, transportation has become easier for villagers. The new road has also reduced difficulties #Bapatla #Cherukupalli #ThurpuPalem #RoadDevelopment #Connectivity
89
🗳️ బాపట్ల జిల్లాలో ఓటర్ల ప్రత్యేక డ్రైవ్ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ & ASDDO ఓటర్ల పునఃపరిశీలన కోసం జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. 🎯 లక్ష్యం: ఏ ఒక్క అర్హమైన ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి విడిపోకూడదు. ✅ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలి. ✅ ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలి. ✅ పేరు తొలగించబడిన వారు లేదా వివరాల్లో మార్పులు ఉన్నవారు సంబంధిత BLOను సంప్రదించాలి. మీ ఓటు – మీ హక్కు. మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో తప్పక నిర్ధారించుకోండి. — జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా కలెక్టర్, బాపట్ల #Bapatla #VoterList #SpecialDrive #ElectionCommission #SVEEP
3
4
504
Safe Drinking Water Assured in Poluru Village - District: Bapatla  |  Mandal: Yaddanapudi  |  Village: Poluru - Under the Rural Water Supply (RWS) scheme in Poluru village, the filter media was replaced at a cost of *₹8.25 lakh using DMF funds.* This has improved water purification capacity and enabled the supply of quality and safe drinking water to 2,556 people. With reduced water-quality issues, households now have access to improved drinking water supply. The work has directly benefited the people of Poluru village. #Bapatla #Yaddanapudi #Poluru #SafeDrinkingWater #RWS
1
88
బాపట్ల, తేది: 06-10-2026 - ప్రత్యేక సంక్లిప్త ఓటర్ల సవరణలో అర్హత లేని దరఖాస్తులను పునఃపరిశీలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి.,ఐ.ఏ.ఎస్. ఆదేశించారు. - మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రతి బీఎల్‌ఓ స్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి ధృవీకరణ పత్రాలు సేకరించాలన్నారు. ప్రజాభిప్రాయ నివేదికల్లో 100 శాతం ప్రతికూలత ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 22ఏ కేసులను వెంటనే పరిష్కరించాలని, గ్రామీణ వైద్య క్లినిక్‌లకు స్థల సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
71
బాపట్ల, తేది: 06-10-2026 - ఆటిజం, భవిత కేంద్రాలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులు, మానసిక దివ్యాంగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు. - మంగళవారం విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి షామల్ రావు నిర్వహించిన వీక్షణ సమావేశంలో కలెక్టర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఒకే చోట వైద్యం, విద్య అందితే చిన్నారులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. - భవిత కేంద్రాల అధికారులు, వైద్యులు, సిబ్బంది ఆటిజం కేంద్రాల్లోనూ సేవలందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష కార్యాలయాల అద్దె బకాయిలు చెల్లించి, నిర్వహణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
64
బాపట్ల, తేది: 06-10-2026 - సంజీవని విధానం ప్రజల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం కృష్ణాజిల్లా నుంచి వర్చువల్‌గా రాష్ట్రవ్యాప్తంగా పూర్తయిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించారు. బాపట్ల జిల్లాలో 21 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్ గారు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ గారు ప్రారంభించారు. - గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రూ.5.33 కోట్లతో 21 భవనాలు నిర్మించినట్లు కలెక్టర్ వెల్లడించారు. #SanjeevaniVidhanam #VillageHealthClinics #HealthAndhraPradesh #Bapatla #DistrictAdministration
56
ఎంపీ లాడ్స్‌ నిధులతో ..స్వచ్ఛమైన తాగునీటికి భరోసా - జిల్లా: బాపట్ల | మండలం: పర్చూరు | గ్రామం: గార్నేపూడి - గార్నేపూడి గ్రామపంచాయతీలోని ఏదారి మాదిగపల్లిలో *ఎంపీ లాడ్స్‌ నిధులతో రూ.9.00 లక్షల* అంచనా వ్యయంతో అవసరమైన మౌలిక వసతులతో ఆర్‌ఓ ప్లాంట్‌ను నిర్మించారు. పనులు పూర్తవడంతో స్థానిక ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రజల రోజువారీ తాగునీటి అవసరాలు తీరడంతో పాటు, సురక్షితమైన, నాణ్యమైన తాగునీటి లభ్యతకు భరోసా ఏర్పడింది. #Bapatla #Parchur #Garnepudi #SafeDrinkingWater #ROPlant
1
68