Maa Gulf (@maagulf) header
Maa Gulf (@maagulf) profile picture

https://teapawt.org/t.co/USqyzGQsZa...News You Can Trust.

Joined April 2015
Photo by Maa Gulf (@maagulf)Photo by Maa Gulf (@maagulf)Photo by Maa Gulf (@maagulf)Photo by Maa Gulf (@maagulf)Photo by Maa Gulf (@maagulf)Photo by Maa Gulf (@maagulf)Photo by Maa Gulf (@maagulf)Photo by Maa Gulf (@maagulf)Photo by Maa Gulf (@maagulf)Photo by Maa Gulf (@maagulf)
కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!! కువైట్: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (Ek Ped Maa Ke Naam) ప్రచారంలో భాగంగా నవంబర్ 21న రిగ్గే, అండలూస్ పార్కుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ARMS4U, అమ్మా కువైట్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కువైట్‌లో భారత రాయబారి పరమితా త్రిపాఠి ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. భారతీయ ప్రవాసులు, స్వచ్ఛంద కార్యకర్తలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. చిన్న వయస్సు నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రకృతి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించేలా వారిని ప్రోత్సహించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2024 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. పచ్చదనం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. Read more >> maagulf.com/view/123814/late… #Enviroment #Kuwait #EkpedMaakeNaam #MaaGulfNews @maagulf
21
ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!! మస్కట్: ఒమన్‌లో జాతీయ సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయించే విధానాన్ని డిసెంబర్ 1నుంచి అమలు చేయనున్నట్లు నేషనల్ సబ్సిడీ కమిటీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఈ కార్డు ద్వారా అర్హులైన వాహనదారులకు లీటరు డీజిల్‌ను 258 బైసాలకు అందించనున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వద్ద రిజిస్టర్ అయిన ప్రైవేట్, వాణిజ్య అవసరాలకు వినియోగించే డీజిల్ వాహనాలకు ఈ సబ్సిడీ వర్తించనుంది. సబ్సిడీకి అర్హులైన లబ్ధిదారులకు కార్డు జారీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తూ మొబైల్‌కు SMS ద్వారా సమాచారం పంపించనున్నారు. నేషనల్ సబ్సిడీ సిస్టమ్ అప్లికేషన్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కార్డు పొందేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కార్డు జారీ లేదా దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే నేషనల్ సబ్సిడీ సిస్టమ్ కాల్ సెంటర్ 24174000 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. డీజిల్ వాహనదారులకు సబ్సిడీ ప్రయోజనాలను నేరుగా అందించడంతో పాటు, అర్హులైన వారికి నిర్ణీత ధరకు ఇంధనం అందుబాటులో ఉంచడం ఈ విధానం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. Read more >> maagulf.com/view/123813/late… #Diesel #Oman #Subsidycards #MaaGulfNews @maagulf
17
అవయవ మార్పిడి చికిత్సల్లో కింగ్ ఫైసల్ హాస్పిటల్ అరుదైన ఘనత..!! రియాద్: అవయవ మార్పిడి చికిత్సల్లో సౌదీ అరేబియాకు చెందిన కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (KFSH) అరుదైన ఘనత సాధించింది. 2023, 2024 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా జరిగిన లివర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్సల్లో దాదాపు 63 శాతం ఈ ఆసుపత్రిలోనే నిర్వహించారు. సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (SCOT) గణాంకాల ప్రకారం ఈ రెండేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 1,018 లివర్ మార్పిడి శస్త్రచికిత్సలు జరగగా, అందులో దాదాపు మూడింట రెండొంతుల శస్త్రచికిత్సలు KFSHలోనే జరిగాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా జరిగిన మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సల్లోనూ దాదాపు సగం ఈ ఆసుపత్రిలోనే నిర్వహించారు. గత నాలుగేళ్లుగా వరుసగా ఏడాదికి 1,000కు పైగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ ఆసుపత్రి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2022 నుంచి 2025 వరకు మొత్తం 4,330 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించింది. 2025లోనే 1,109 శస్త్రచికిత్సలు జరిగాయి. వీటిలో మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, క్లోమగ్రంథి, పేగుల మార్పిడి చికిత్సలు ఉన్నాయి. మూత్రపిండాల మార్పిడి కార్యక్రమంలో చికిత్స పొందిన రోగుల విషయంలో ఏడాది తర్వాత జీవించే వారి శాతం, మార్పిడి చేసిన అవయవం సక్రమంగా పనిచేస్తున్న శాతం 97 నుంచి 99 మధ్య నమోదైంది. 2025లో ఆసుపత్రి అవయవ మార్పిడి క్లినిక్‌లలో సుమారు 86,000 ఫాలో-అప్ విజిట్స్ నమోదయ్యాయి. అత్యాధునిక శస్త్రచికిత్సా విధానాల్లోనూ KFSH ముందంజలో ఉంది. 2023లో ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి రోబోటిక్ విధానంలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది. అనంతరం 2024లో ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి రోబోటిక్ గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేపట్టింది. ఈ టెక్నాలజీలో క్లిష్టమైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో శరీరానికి కలిగే గాయాలను తగ్గించేందుకు దోహదపడుతున్నాయి. వైద్యరంగంలో సాధించిన విజయాలకు గుర్తింపుగా 2026లో ప్రపంచంలోని 250 అత్యుత్తమ అకడమిక్ మెడికల్ సెంటర్లలో KFSH ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానాన్ని, మిడిలిస్ట్-ఆఫ్రికా ప్రాంతంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అదే విధంగా బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ 2026లో సౌదీ అరేబియా, మధ్యప్రాచ్యంలో అత్యంత విలువైన హెల్త్‌కేర్ బ్రాండ్‌గా ఈ ఆసుపత్రిని గుర్తించింది. న్యూస్‌వీక్ ప్రకటించిన వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ 2026, వరల్డ్స్ బెస్ట్ స్మార్ట్ హాస్పిటల్స్ 2027, వరల్డ్స్ బెస్ట్ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ 2027 జాబితాల్లోనూ KFSH చోటు సంపాదించింది. Read more >> maagulf.com/view/123812/late… #KingFaisalHospital #OrganTransplant #MaaGulfNews @maagulf
1
92
ఖతార్‌లో రెండో దశ ఎలక్ట్రిక్ రోబోటాక్సీల ట్రయల్స్..!! దోహా: ఖతార్‌లో ఆధునిక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. ఎలక్ట్రిక్ రోబోటాక్సీల పరీక్షల్లో భాగంగా రెండో దశను ప్రారంభించినట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ (MOT) ప్రకటించింది. మోవాసలాత్ (కర్వా) సంస్థ సమన్వయంతో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండో దశలో భాగంగా దోహా నగరంలో రెండు లెవల్-4 ఎలక్ట్రిక్ రోబోటాక్సీలను 12 నెలల పాటు పరీక్షించనున్నారు. ఇందుకోసం రవాణా మంత్రిత్వ శాఖ ముందుగానే గుర్తించి అనుమతించిన మార్గాలను ఎంపిక చేసింది. ఓల్డ్ దోహా పోర్ట్, మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ (MIA), సౌక్ వాకిఫ్, వెస్ట్ బే, షెరటాన్ దోహా హోటల్ నుంచి కార్నిష్ మీదుగా డిప్లొమాటిక్ స్ట్రీట్ చివరి వరకు ఈ వాహనాలు ప్రయాణించనున్నాయి. కాగా ఇప్పటికే నిర్వహించిన తొలి దశ పరీక్షలు ఆశించిన లక్ష్యాలను మించి విజయవంతమయ్యాయి. ఆటోమేటిక్ డ్రైవింగ్ విధానంలో ఈ వాహనాలు దాదాపు 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేశాయి. తొలిదశలో నిర్దేశించిన 500,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని అధిగమించాయి. పనితీరు, భద్రతకు సంబంధించిన సూచికలు కూడా సంతృప్తికరంగా ఉండటంతో రెండో దశ పరీక్షలకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ రోబోటాక్సీలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. లిడార్ (LiDAR) సెన్సార్లు, రాడార్ వ్యవస్థలు, కెమెరాలు, ప్రత్యేక ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ల సహాయంతో వాహనాలు రహదారిపై పరిస్థితులను గుర్తిస్తూ ప్రయాణిస్తాయి. ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా స్వయంచాలకంగా స్పందించేలా వీటిని రూపొందించారు. వాహనాల కార్యకలాపాలను రవాణా మంత్రిత్వ శాఖ, కర్వా సంస్థలు ప్రత్యేక కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తాయి. ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రత, కార్యకలాపాల నిర్వహణ, డేటా రక్షణ ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ఈ పరీక్షలు కొనసాగించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దశలవారీగా వాహనాల పనితీరును అంచనా వేసిన అనంతరం భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించే అవకాశాలను పరిశీలించనున్నట్టు తెలిపింది. Read more >> maagulf.com/view/123811/late… #ElectricRoboTaxi #Qatar #MaaGulfNews @maagulf
1
82
యూఎన్‌ ఆరోపణలను ఖండించిన బహ్రెయిన్..!! మనామా: ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (IRGC)తో సంబంధాలున్న వ్యక్తుల కేసులో న్యాయస్థానాల తీర్పులపై ఐక్యరాజ్యసమితి (UN) చేసిన ఆరోపణలను బహ్రెయిన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ కేసుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం (OHCHR) వెబ్‌సైట్‌లో పలువురు ప్రత్యేక ప్రతినిధులు విడుదల చేసిన ప్రకటన వాస్తవ పరిస్థితులను సరిగ్గా ప్రతిబింబించడం లేదని బహ్రెయిన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ కేసులో న్యాయపరమైన విచారణలన్నీ దేశ చట్టాలకు అనుగుణంగానే జరిగాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. నేరాలకు సంబంధించిన బాధ్యతను మత విశ్వాసాలు లేదా అనుబంధాల ఆధారంగా కాకుండా.. ఆరోపించిన నేరాలు, వాటికి సంబంధించిన ఆధారాల ఆధారంగానే నిర్ణయిస్తామని బహ్రెయిన్ వెల్లడించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉందని పునరుద్ఘాటించింది. మరోవైపు, ఈ ఆరోపణలపై బహ్రెయిన్ తన పూర్తి వివరణను సమర్పించేందుకు నిర్దేశించిన గడువు ముగియకముందే ఐక్యరాజ్యసమితి ప్రకటన విడుదల చేయడంపై విదేశాంగ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. సంబంధిత బహ్రెయిన్ అధికారులతో తగిన చర్చలు జరపకుండానే ప్రకటన విడుదల చేశారని అభ్యంతరం తెలిపింది. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విధానాల నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం, ఆరోపణలపై బహిరంగ ప్రకటన చేసే ముందు సంబంధిత దేశానికి స్పందించే అవకాశం కల్పించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. చట్టబద్ధ పాలన, న్యాయవ్యవస్థ స్వతంత్రత, మానవ హక్కుల పరిరక్షణకు బహ్రెయిన్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. Read more >> maagulf.com/view/123810/late… #Allegations #Iran #Manama #IRGC #MaaGulfNews @maagulf
30
యూఏఈలో ఆన్‌లైన్ సెల్లర్స్ కు కొత్త రూల్స్..!! దుబాయ్: యూఏఈలో ఆన్‌లైన్ సెల్లర్స్ కు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇకపై తమ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా థర్డ్ పార్టీ సంస్థలు లేదా వ్యక్తులు విక్రయించే వస్తువులు, సేవలకు కూడా ఆన్‌లైన్ విక్రయదారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశ వినియోగదారుల రక్షణ నిబంధనల్లో కీలక సవరణలకు యూఏఈ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ రిజల్యూషన్ నంబర్ 166 ఆఫ్ 2026 ప్రకారం, ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 14 ఆఫ్ 2023కు సంబంధించిన నిబంధనలను సవరించారు. సవరించిన ఆర్టికల్ 40 ప్రకారం.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయించే వస్తువులు, సేవలకు కూడా వినియోగదారుల రక్షణ నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనలు సంప్రదాయ విక్రయ మార్గాలకే పరిమితం కావని స్పష్టం చేశారు. ఒక సంస్థకు చెందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో మరో సంస్థ లేదా వ్యక్తి వస్తువులు విక్రయించినప్పటికీ, ఆ విక్రయాలకు సంబంధించి ప్లాట్‌ఫామ్ నిర్వహించే సరఫరాదారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జరిగే విక్రయాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి. వినియోగదారుల హక్కులకు రక్షణ యూఏఈలో ఇప్పటికే అమల్లో ఉన్న ఫెడరల్ లా నంబర్ 15 ఆఫ్ 2020 ప్రకారం.. వ్యాపార సంస్థలు నాణ్యమైన వస్తువులు, సేవలు అందించాలి. సరైన ధరలను ప్రదర్శించడంతోపాటు ఉత్పత్తుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా భద్రంగా ఉంచాలి. తప్పుడు ప్రకటనలు, నాణ్యత లేని ఉత్పత్తులు, అన్యాయమైన వ్యాపార పద్ధతుల నుంచి వినియోగదారులకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. లోపభూయిష్ట వస్తువులు లేదా నాసిరకం సేవల వల్ల నష్టం జరిగితే పరిహారం కోరే హక్కు కూడా వినియోగదారులకు ఉంటుంది. జరిమానాలు సవరించిన ఆర్టికల్ 41 ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలకు విధించాల్సిన జరిమానాలు, ఇతర పరిపాలనా చర్యలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఆర్థిక జరిమానాలతోపాటు ఉల్లంఘనల వివరాలను ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి ప్రతిపాదన మేరకు క్యాబినెట్ నిర్ణయించనుంది. కొత్త జరిమానాల విధానం అమల్లోకి వచ్చే వరకు, ప్రస్తుత ఉల్లంఘనలు, జరిమానాలకు సంబంధించిన నిబంధనలు కొనసాగుతాయి. అయితే కొత్త తీర్మానానికి విరుద్ధంగా ఉండకూడదు. ధరల నియంత్రణ అసాధారణ పరిస్థితులు, సంక్షోభాల సమయంలో వస్తువులు, సేవల ధరలు అనూహ్యంగా పెరిగితే ప్రభుత్వం తాత్కాలిక చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా సవరించిన నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అవసరమైతే నిర్దిష్ట వస్తువులు, సేవలకు ధరలను నిర్ణయించడం, వస్తువుల ఎగుమతులను నిషేధించడం, విక్రయాలకు కోటాలు విధించడం, ప్రత్యామ్నాయ మార్గాల్లో దిగుమతులు లేదా ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయించడం మాత్రం నిషేధం. అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వినియోగదారులపై అన్యాయంగా విధించిన భారంగా పరిగణిస్తారు. వాణిజ్య రికార్డులు, ఇన్‌వాయిస్‌లు, అకౌంటింగ్ వివరాల ఆధారంగా అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని అధికారులు అంచనా వేయవచ్చు. వినియోగదారులు ఆ మొత్తాన్ని తిరిగి పొందడంతోపాటు నష్టపరిహారం కూడా కోరవచ్చు. ధరల పెరుగుదల అసాధారణమా కాదా అని నిర్ణయించేందుకు ద్రవ్యోల్బణం, గత ధరలు, పొరుగు దేశాల్లో ధరలు, మారకపు విలువలు, రవాణా, బీమా ఖర్చులు, ఇంధన ధరలు, వినియోగదారుల ఫిర్యాదులు, మార్కెట్‌లో పోటీ పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సవరణలతో యూఏఈలో ఈ-కామర్స్ వ్యాపారాలపై పర్యవేక్షణ మరింత పెరగనుంది. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులకు అదనపు రక్షణ లభించనుంది. Read more >> maagulf.com/view/123809/late… #UAE #OnlineSellers #Consumers #MaaGulfNews @maagulf
2
188
బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్‌లైన్ మోసాలు.. ప్రజలను హెచ్చరించిన అబుధాబీ పోలీసులు అబుధాబీ: యూఏఈలో శీతాకాలం ప్రారంభం కావడంతో బైక్‌ల కొనుగోలు, అద్దెతో పాటు రెస్ట్ హౌస్‌లు, క్యాంప్‌సైట్‌ల బుకింగ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ ఆన్‌లైన్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని అబుధాబీ పోలీసులు ఆదివారం (నవంబర్ 22) ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆకర్షణీయమైన ధరలు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో నకిలీ ప్రకటనలు పెడుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్‌లను అద్దెకు ఇస్తామని, తక్కువ ధరకు విక్రయిస్తామని, క్యాంప్‌సైట్‌లు, రెస్ట్ హౌస్‌లను తక్కువ ధరకు బుక్ చేస్తామని నమ్మించి ముందుగానే డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, అధికారిక బుకింగ్, చెల్లింపు వెబ్‌సైట్‌లను పోలి ఉండే నకిలీ లింకులను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. ఈ లింకుల ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలను సేకరిస్తున్నట్లు హెచ్చరించారు. బుకింగ్ ఖరారు చేయడానికి లేదా కొనుగోలు పూర్తి చేయడానికి ముందస్తుగా డబ్బులు పంపిన తర్వాత బాధితులు మోసపోయినట్లు గుర్తిస్తున్నారని తెలిపారు. ఆన్‌లైన్ బుకింగ్‌లో జాగ్రత్తలు తప్పనిసరి చెల్లింపులు చేసే ముందు ప్రకటనలు, బుకింగ్ లింకులను క్షుణ్ణంగా పరిశీలించాలని అబుధాబీ పోలీసులు సూచించారు. లైసెన్స్ కలిగిన సంస్థలు, విశ్వసనీయ సేవా ప్రదాతల ద్వారానే బుకింగ్‌లు, కొనుగోళ్లు చేయాలని కోరారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని, ధృవీకరించని బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని స్పష్టం చేశారు. వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లు (OTP), వెరిఫికేషన్ కోడ్‌లను ఎవరికీ వెల్లడించకూడదని సూచించారు. మోసాలను ఎలా ఫిర్యాదు చేయాలి? ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన అనుమానాస్పద ప్రకటనలు లేదా లింకులు కనిపిస్తే అబుధాబీ పోలీసుల 'అమన్' (Aman) సేవ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఫోన్: 8002626 SMS: 2828 శీతాకాలంలో అవుట్‌డోర్ కార్యకలాపాలు, క్యాంపింగ్, బైక్ రైడింగ్‌కు వెళ్లే ప్రజలు ఆన్‌లైన్ బుకింగ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. #AbuDhabi #UAE @maagulf
57
బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్ #Bahrain #Qatar @maagulf దోహా: బహ్రెయిన్‌లోని పౌర పారిశ్రామిక కేంద్రంపై ఇరాన్ జరిపిన దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి బహ్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి (ఐరాస) చార్టర్‌ను, పొరుగు దేశాల మధ్య సత్సంబంధాల సూత్రాలను బహిరంగంగా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. ఆర్థిక సంస్థలు, పౌర మౌలిక సదుపాయాలు, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకునే దాడులను ఖతార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి దాడులు కొనసాగడం ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. అంతేకాకుండా, దౌత్యపరమైన ప్రయత్నాలకు విఘాతం కలిగించడంతో పాటు ప్రాంతంలో శాంతి, భద్రతలను నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను బలహీనపరుస్తాయని పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా అన్ని దేశాలు సంయమనం పాటించాలని, శాంతి స్థిరత్వాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఖతార్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
52
Today's Gulf countries online exchange rates are like this 📷UAE Dirham, Saudi Riyal, Kuwait Dinar, Oman Rial & Bahrain Dinar 📷 Follow our page for the latest & accurate rates @maagulf
1
107
రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!! మస్కట్: సముద్ర ప్రయాణంలో ఉన్న ఓ వాణిజ్య నౌకలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన రష్యా పౌరుడిని ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAFO) అత్యవసరంగా ఆసుపత్రికి తరలించింది. ధోఫర్ గవర్నరేట్ పరిధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలో రష్యా పౌరుడికి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య తలెత్తింది. సమాచారం అందుకున్న ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ వెంటనే వైద్య తరలింపు చర్యలు చేపట్టింది. విమాన సహాయంతో బాధితుడిని సలాలాలోని సుల్తాన్ ఖాబూస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించి బాధితుడికి వైద్య సహాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు. Read more >> maagulf.com/view/123797/late… #Airforce #Russian #Oman #MaaGulfNews @maagulf
1
106
సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!! రియాద్: సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై భద్రతా అధికారులు భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టారు. నవంబర్ 12 నుంచి 18 వరకు వారం రోజుల్లో నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో మొత్తం 10,783 మంది అక్రమ నివాసులను అరెస్ట్ చేసినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. ఇదే సమయంలో 11,915 మందిని దేశం నుంచి బహిష్కరించారు. అరెస్టయిన వారిలో 5,718 మంది నివాస చట్టం (Residency Law), 2,797 మంది సరిహద్దు భద్రతా చట్టం (Border Security Law), 2,268 మంది కార్మిక చట్టం (Labour Law) ఉల్లంఘించినవారు ఉన్నారు. మొత్తం 23,250 మందిని ప్రయాణ పత్రాలు పొందేందుకు వారి దేశాల దౌత్య కార్యాలయాలకు పంపించారు. మరో 10,814 మందికి స్వదేశాలకు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసే ప్రక్రియ చేపట్టారు. సౌదీ సరిహద్దుల ద్వారా అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 1,373 మందిని అధికారులు పట్టుకున్నారు. దేశం నుంచి అక్రమంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 28 మందిని కూడా అరెస్ట్ చేశారు. అక్రమ నివాసులకు రవాణా, ఆశ్రయం, ఉపాధి కల్పించిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 38,730 మంది పురుషులు, 2,211 మంది మహిళలు కలిపి మొత్తం 40,941 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. 15 ఏళ్ల జైలు.. SR1 మిలియన్ జరిమానా అక్రమంగా వ్యక్తులను సౌదీలోకి తీసుకురావడం, దేశంలో రవాణా చేయడం, ఆశ్రయం కల్పించడం లేదా ఇతరత్రా సహాయం అందించడం నేరమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు SR1 మిలియన్ వరకు జరిమానా విధించవచ్చని తెలిపింది. అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలు, నిందితులకు ఆశ్రయం కల్పించిన ఇళ్లను కూడా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేసింది. అక్రమ నివాసులకు సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రజలు అధికారులకు తెలియజేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో 911 నంబర్‌కు, ఇతర ప్రాంతాల్లో 999 లేదా 996 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. Read more >> maagulf.com/view/123796/late… #IllegalResidents #Saudiarabia #MaaGulfNews @maagulf
1
2
589
ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..! దోహా: ఖతార్‌లో అనారోగ్య సెలవు (సిక్‌లీవ్) సర్టిఫికెట్ల జారీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ఎలక్ట్రానిక్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు పేపర్ కాపీలు, చేతితో చేసిన సంతకాలు, ఆసుపత్రుల స్టాంపులు అవసరం లేదని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మంత్రి నిర్ణయం నంబర్ 54 ఆఫ్ 2026 ప్రకారం ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై ఖతార్‌లో e-Jaza వ్యవస్థ ద్వారానే సిక్‌లీవ్ సర్టిఫికెట్లు జారీ చేయాలి. ఇతర ఎలక్ట్రానిక్ వ్యవస్థలు లేదా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్లకు అధికారిక గుర్తింపు ఉండదు. కొత్త విధానం ప్రకారం రోగులకు రెండు సురక్షిత లింకులతో కూడిన ఎలక్ట్రానిక్ నోటిఫికేషన్ అందుతుంది. వీటిలో ఒక సర్టిఫికెట్‌లో వైద్య నిర్ధారణ వివరాలు ఉంటాయి. మరో సర్టిఫికెట్‌లో ఆ వివరాలు ఉండవు. రోగులు తమ అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు సర్టిఫికెట్లను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం గుర్తింపు ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. e-Jaza ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్లపై QR కోడ్ లేదా బార్‌కోడ్ ఉంటుంది. వీటికి చేతితో సంతకం చేయడం లేదా ఆసుపత్రి స్టాంపు వేయడం అవసరం లేదు. దీంతో సర్టిఫికెట్ల ధ్రువీకరణ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. అయితే సిక్‌లీవ్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం ఖతార్‌లో లైసెన్స్ పొందిన వైద్యులు, దంత వైద్యులకు మాత్రమే ఉంటుంది. వారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో తమకు కేటాయించిన వ్యక్తిగత ఖాతాల ద్వారానే సర్టిఫికెట్లు జారీ చేయాలి. అలాగే రోగి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందా? అంటువ్యాధికి సంబంధించినదా? వంటి తప్పనిసరి వైద్య వివరాలను కూడా సర్టిఫికెట్‌లో నమోదు చేయాలి. నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ వైద్యులు, ఆసుపత్రులపై ఎప్పటికప్పుడు తనిఖీలు, ఆడిట్‌లు నిర్వహించనుంది. సిక్‌లీవ్‌కు సంబంధించిన అర్హతలు, సర్టిఫికెట్ల జారీ విధానం, వ్యవస్థ దుర్వినియోగం వంటి అంశాలను పరిశీలించనుంది. నిబంధనలను ఉల్లంఘించినా, ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసినా సంబంధిత చట్టాల ప్రకారం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. Read more >> maagulf.com/view/123795/late… #SickLeave #Certificates #Qatar #MaaGulfNews @maagulf
37
కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!! కువైట్ : కువైట్‌లోని ఉమ్మ్ ఖదీర్ ప్రకృతి సంరక్షణ కేంద్రంలోకి (Umm Qadeer Nature Reserve) అక్రమంగా ప్రవేశించిన 10 మందిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఉపయోగించిన 6 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 6 పక్షులను కూడా అధికారులు పట్టుకున్నారు. ప్రకృతి వనరులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ విభాగం సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాయి. నిషేధం ఉన్నప్పటికీ నిందితులు వాహనాలతో రిజర్వులోకి ప్రవేశించి అక్కడి సహజ పర్యావరణానికి నష్టం కలిగించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో అక్కడి వన్యప్రాణుల ఆవాసాలకు కూడా ఇబ్బంది కలిగిందని తెలిపింది. ప్రకృతి సంరక్షణ కేంద్రాల్లోకి ప్రవేశించడం, వేటాడటం, అనుమతి లేకుండా సంచరించడం నిషేధమని అధికారులు గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఈ ఉల్లంఘన జరిగినట్లు పేర్కొన్నారు. ఈ చర్యల్లో స్వాధీనం చేసుకున్న 6 వాహనాలను సీజ్ చేశారు. పట్టుకున్న 6 పక్షులను తిరిగి స్వేచ్ఛగా వదిలిపెట్టారు. అరెస్టయిన 10 మందిని సెంట్రల్ జైలుకు తరలించి, తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్రకృతి సంరక్షణ ప్రాంతాల్లో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు, నిఘా కొనసాగుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రిజర్వుల్లోకి అక్రమంగా ప్రవేశించినా, సహజ పర్యావరణానికి హాని కలిగించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. Read more >> maagulf.com/view/123794/late… #NatureReserve #Kuwait #Arrest #MaaGulfNews @maagulf
1
118
ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!! మనామా: తమ దేశంపై ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడిందని బహ్రెయిన్ ఐక్యరాజ్యసమితి (UN)కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నవంబర్ 19న ఐరాస ప్రధాన కార్యదర్శికి, భద్రతా మండలి అధ్యక్షుడికి ఒకే సమాచారంతో కూడిన రెండు లేఖలను పంపించింది. అంతకుముందు నవంబర్ 13, 15 తేదీల్లోనూ దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడులను వెంటనే, ఎలాంటి షరతులు లేకుండా నిలిపివేయాలని ఐరాస భద్రతా మండలి తీర్మానం 2817 (2026)లో పిలుపునిచ్చినప్పటికీ దాడులు కొనసాగడం ఆందోళన కలిగిస్తోందని వివరించింది. బహ్రెయిన్ పంపిన తాజా లేఖలను భద్రతా మండలి అధికారిక పత్రం S/2026/924గా ప్రచురించింది. అంతకుముందు నవంబర్ 16న పంపిన లేఖ S/2026/911గా నమోదైంది. మరోవైపు, ఇరాన్ నుంచి వచ్చిన పలు వైమానిక దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యాలను చేరకముందే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ వెల్లడించింది. ప్రజలు, నివాసితులు సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ దాడులు తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా పరిణమించాయని బహ్రెయిన్ మండిపడింది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 2(4)తో పాటు అంతర్జాతీయ చట్టాలు, పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలకు సంబంధించిన సూత్రాలను కూడా ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని బహ్రెయిన్ కోరింది. Read more >> maagulf.com/view/123793/late… #Iran #Attacks #Bahrain #MaaGulfNews @maagulf
1
55
GTA 6 గేమ్‌పై యూఏఈ హెచ్చరిక..!! దుబాయ్: ప్రముఖ వీడియో గేమ్ ‘గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6’ (GTA 6) విషయంలో యూఏఈ అధికారులు తల్లిదండ్రులను అప్రమత్తం చేశారు. ఈ గేమ్‌లో మాదకద్రవ్యాల వినియోగం, నేర కార్యకలాపాలకు సంబంధించిన సన్నివేశాలు ఉండటంతో పిల్లలు, యువతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. యూఏఈ నేషనల్ యాంటీ నార్కోటిక్స్ అథారిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. గేమ్‌లో డ్రగ్స్ వినియోగం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను చూపించే సన్నివేశాలు పిల్లల ఆలోచనా విధానం, ప్రవర్తనపై ప్రభావం చూపవచ్చని తెలిపింది. ఇలాంటి ప్రమాదకర ప్రవర్తన సాధారణమేననే భావన పిల్లల్లో ఏర్పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించింది. పిల్లలు ఆడే వీడియో గేమ్‌లపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, వాటి వయోపరిమితులను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు కోరారు. గేమ్‌లలో ఉండే అభ్యంతరకర అంశాలు, వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. మరోవైపు, ఈ గేమ్ కంటెంట్‌పై యూఏఈలోని తల్లిదండ్రులు, ప్రజలు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు కూడా తల్లిదండ్రులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి. గేమ్‌కు ప్రజాదరణ ఉన్నప్పటికీ అది పిల్లల కోసం రూపొందించినది కాదని స్పష్టం చేశాయి. GTA 6లో తీవ్రమైన హింస, నేర కార్యకలాపాలు, అసభ్య పదజాలం, లైంగిక అంశాలు, మాదకద్రవ్యాల ప్రస్తావనలు ఉన్నాయని ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. యూఏఈ నేషనల్ మీడియా అథారిటీ ఈ గేమ్‌కు 21+ వయోపరిమితి కేటాయించింది. దేశంలో వీడియో గేమ్‌లకు ఇచ్చే అత్యధిక వయోపరిమితి ఇదే కావడం గమనార్హం. ఆన్‌లైన్ ద్వారా డ్రగ్స్ వలలో యువత ఇటీవల డ్రగ్స్ ముఠాలు సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లు, ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయని యూఏఈ అధికారులు హెచ్చరించారు. నేషనల్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ సలహాదారు డాక్టర్ అబ్దుల్లా అల్ ఖయాత్ నవంబర్ 12న దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డ్రగ్స్ అక్రమ రవాణాదారులు యువతను ఆకర్షించేందుకు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారని తెలిపారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ముందస్తు అవగాహన కల్పించడం ఇక అదనపు చర్య కాదని, అదే ప్రధాన రక్షణ మార్గమని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో డ్రగ్స్ వినియోగం వైపు ఆకర్షించే ప్రయత్నాలను యువత గుర్తించేలా అవగాహన కల్పించడంతో పాటు, పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. ఇంట్లో పిల్లలతో బహిరంగంగా మాట్లాడటం, వారికి సరైన మార్గనిర్దేశం చేయడం కూడా ముఖ్యమని అధికారులు తెలిపారు. Read more >> maagulf.com/view/123792/late… #GTA6 #Game #UAE #MaaGulfNews @maagulf
1
90
దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రైళ్ల కొత్త డిజైన్‌ను పరిశీలించిన షేక్ హమ్దాన్.. 29 శాతానికి చేరిన ప్రాజెక్టు పనులు దుబాయ్: దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రైళ్ల నూతన డిజైన్‌ను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ సమీక్షించారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడంతో పాటు, ఆకర్షణీయమైన రూపకల్పన, మెరుగైన నిర్వహణ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను రూపొందించారు. బ్లూ లైన్ ప్రాజెక్టులో భాగంగా రైళ్ల డిజైన్‌ను పరిశీలించిన షేక్ హమ్దాన్, ప్రయాణికుల సౌకర్యం, ఆధునిక సాంకేతికత, నిర్వహణ సామర్థ్యానికి ప్రాధాన్యతనిచ్చే అంశాలను సమీక్షించారు. ఇదిలా ఉండగా, దుబాయ్ మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్టు మొత్తం పనులు ఇప్పటివరకు 29 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, దుబాయ్ ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించడంలో ఈ కొత్త మెట్రో లైన్ కీలక పాత్ర పోషించనుంది. #dubai @maagulf @rta_dubai
49
కువైట్–అమెరికా ఆర్థిక సంబంధాల బలోపేతానికి చర్చలు..!! కువైట్: కువైట్, అమెరికా మధ్య ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరిగాయి. కువైట్ ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల శాఖ సహాయ మంత్రి, తాత్కాలిక వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అబ్దులజీజ్ అల్-మర్జూక్ వాషింగ్టన్‌లో అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కువైట్‌లో చేపట్టే అభివృద్ధి, పెట్టుబడి ప్రాజెక్టుల్లో అమెరికా ప్రైవేటు రంగం భాగస్వామ్యాన్ని పెంచే అంశంపై ప్రధానంగా చర్చించారు. ప్రాధాన్యత కలిగిన ఆర్థిక రంగాల్లో అమెరికా కంపెనీల పెట్టుబడులను ప్రోత్సహించే అవకాశాలను పరిశీలించారు. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలోనూ అల్-మర్జూక్ పాల్గొన్నారు. పలువురు అమెరికా కంపెనీలు, సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కువైట్ ఆర్థిక ప్రణాళికలు, వ్యాపార అనుకూల వాతావరణం మెరుగుదల, పెట్టుబడులకు సంబంధించిన చట్టాలు, విధానాల ఆధునికీకరణ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల బలోపేతంపై సమావేశంలో సమీక్షించారు. అమెరికా వ్యాపార వర్గాలతో సహకారాన్ని విస్తరించేందుకు కువైట్ ఆసక్తిగా ఉందని అల్-మర్జూక్ తెలిపారు. అమెరికా కంపెనీల నైపుణ్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను విభిన్న రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు నాణ్యమైన పెట్టుబడులను ఆకర్షించవచ్చని పేర్కొన్నారు. దీర్ఘకాలిక, సుస్థిర అభివృద్ధికి ఈ సహకారం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Read more >> maagulf.com/view/123784/late… #America #Kuwait #US #EconomicTies #MaaGulfNews @maagulf
2
130
షేక్ జాయెద్ రోడ్డు పై పరుగుల సందడి.. ఘనంగా దుబాయ్ రన్ 2026 ప్రారంభం #Dubai #UAE @maagulf #DubaiRun2026 దుబాయ్: దుబాయ్ నగరంలో ఆదివారం ఉదయం దుబాయ్ రన్ 2026 ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే షేక్ జాయెద్ రోడ్డుపై వేలాది మంది పాల్గొని పరుగులు తీశారు. దీంతో ప్రధాన రహదారి ఒక భారీ రన్నింగ్ ట్రాక్‌గా మారిపోయింది. ఎనిమిదో ఎడిషన్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. దుబాయ్ మీడియా ఆఫీస్ ఈ కార్యక్రమం ప్రారంభ దృశ్యాలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు షేక్ జాయెద్ రోడ్డుకు చేరుకుని ఉత్సాహంగా పరుగును ప్రారంభించిన దృశ్యాలు వీడియోలో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ఆకాశంలో జరిగిన వైమానిక విన్యాసాలు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూఏఈకి చెందిన అల్ ఫుర్సాన్ ఏరోబాటిక్ బృందం అద్భుతమైన విమాన విన్యాసాలు ప్రదర్శించగా, మోటరైజ్డ్ పారాగ్లైడర్లు ఆకాశంలో రంగురంగుల సందడి చేశాయి. మరోవైపు పచ్చని టీ-షర్టులు ధరించిన వేలాది మంది రన్నర్లు రహదారిపై పరుగులు తీస్తూ సందడి చేశారు. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు.. ఫోటోల్లో దుబాయ్ రన్ గల్ఫ్ న్యూస్ విజువల్ జర్నలిస్ట్ వీరేంద్ర సక్లానీ ఈ కార్యక్రమానికి సంబంధించిన అద్భుత దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. అల్ ఫుర్సాన్ విమాన విన్యాసాలు, ఆకాశంలో పారాగ్లైడర్ల ప్రదర్శనలు, షేక్ జాయెద్ రోడ్డుపై పరుగులు తీస్తున్న వేలాది మంది పాల్గొనేవారి చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఫొటోలు కార్యక్రమంలోని ఉత్సాహాన్ని, రంగుల సందడిని, ప్రజల ఐక్యతను ప్రతిబింబించాయి. 2019 నుంచి భారీ స్థాయికి చేరిన దుబాయ్ రన్ 2019లో తొలిసారిగా నిర్వహించిన దుబాయ్ రన్‌లో సుమారు 70 వేల మంది పాల్గొన్నారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం ఏటా మరింత విస్తరిస్తూ వస్తోంది. 2025లో నిర్వహించిన కార్యక్రమంలో 3.07 లక్షల మందికి పైగా పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిటీ రన్నింగ్ ఈవెంట్లలో ఒకటిగా దుబాయ్ రన్ గుర్తింపు పొందింది. దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల రెండు విభాగాలు ఉన్నాయి. ప్రొఫెషనల్ రన్నర్లతో పాటు కుటుంబాలు, చిన్నారులు, వాకింగ్ చేసే వారు, వివిధ వయసులు, ఫిట్‌నెస్ స్థాయులకు చెందిన ప్రజలు ఇందులో పాల్గొనే అవకాశం కల్పించారు. పదో ఏడాదికి చేరిన దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రి, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 2017లో దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం, శారీరక వ్యాయామాన్ని రోజువారీ జీవితంలో భాగం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేయడం, వరుసగా 30 రోజుల పాటు ఈ అలవాటును కొనసాగించాలని ఈ ఛాలెంజ్ ప్రోత్సహిస్తుంది. 2026లో పదో ఎడిషన్‌గా నిర్వహిస్తున్న దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 29 వరకు కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించే అతిపెద్ద వార్షిక కార్యక్రమాల్లో దుబాయ్ రన్ 2026 ఒకటిగా నిలిచింది.
2
195
వచ్చే వారం ఖతార్‌లో పొగమంచు.. వాహనదారులకు హెచ్చరిక..!! దోహా: ఖతార్‌లో వచ్చే వారం పొగమంచు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఖతార్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవచ్చని, హారిజాంటల్ విజిబిలిటీ తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పొగమంచు ఉన్న సమయంలో వాహన వేగాన్ని తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. Read more >> maagulf.com/view/123783/late… #Fog #Qatar #Warning #Motorists #MaaGulfNews @maagulf
1
114
సౌదీలో 25.2 శాతం పెరిగిన డెలివరీ ఆర్డర్లు..!! రియాద్: సౌదీ అరేబియాలో ఆన్‌లైన్ డెలివరీ సేవలకు ఆదరణ పెరుగుతోంది. 2026 మూడో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా డెలివరీ ఆర్డర్లు 129 మిలియన్లకు మించాయి. 2025 ఇదే కాలంతో పోలిస్తే 25.2 శాతం వృద్ధి నమోదైంది. సౌదీ రవాణా జనరల్ అథారిటీ (TGA) విడుదల చేసిన త్రైమాసిక గణాంకాల బులెటిన్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. డెలివరీ యాప్‌ల వినియోగం పెరగడం, ప్రజలు ఆన్‌లైన్ డెలివరీ సేవలపై ఎక్కువగా ఆధారపడుతుండటంతో ఆర్డర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రాంతాల వారీగా డెలివరీ ఆర్డర్ల వాటా ఇలా.. * రియాద్ – 44 శాతం * మక్కా ప్రాంతం – 22 శాతం * తూర్పు ప్రావిన్స్ – 16 శాతం * మదీనా – 5 శాతం * అసీర్ – 4 శాతం * ఖాసిమ్ – 3 శాతం * తబూక్ – 2 శాతం * హాయిల్ – 2 శాతం * అల్ జౌఫ్ – 1 శాతం * నార్తర్న్ బోర్డర్స్ – 1 శాతం * జజాన్ – 1 శాతం * నజ్రాన్ – 1 శాతం * అల్ బహా – 0.28 శాతం మొత్తం డెలివరీ ఆర్డర్లలో రియాద్ ఒక్కటే 44 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. మక్కా ప్రాంతం 22 శాతం, తూర్పు ప్రావిన్స్ 16 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో డెలివరీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, సేవల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం, నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించినట్లు TGA వెల్లడించింది. ఈ చర్యల ద్వారా డెలివరీ రంగంలో వృద్ధి, స్థిరత్వంతోపాటు సేవలపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. Read more >> maagulf.com/view/123782/late… #Deliveryorders #Saudiarabia #Riyad #MaaGulfNews @maagulf
2
137