thiru777 (@thiru7773) header
thiru777 (@thiru7773) profile picture

IT professional and interesting politics, cricket 🏏 ,Kriya Yogi, a sacred yogic practice aimed at self-realization.

Joined August 2019
Photo by thiru777 (@thiru7773)Photo by thiru777 (@thiru7773)Photo by thiru777 (@thiru7773)Photo by thiru777 (@thiru7773)Photo by thiru777 (@thiru7773)Photo by thiru777 (@thiru7773)Photo by thiru777 (@thiru7773)Photo by thiru777 (@thiru7773)Photo by thiru777 (@thiru7773)Photo by thiru777 (@thiru7773)
భగవంతుని,గురువు అనుగ్రహంతో లేదా ప్రపంచానుభవాలపై విసుగుతో జీవుడు సాధనవైపు తిరిగి తన మూలాన్ని అన్వేషిస్తాడు.ఆత్మజ్ఞానం పొంది అందులో స్థిరపడినప్పుడు విషయాసక్తి తగ్గుతుంది. ప్రకృతిజనిత దేహమమకారమే ప్రపంచాకర్షణకు కారణం.క్రియాసాధన ద్వారా పరావస్థను చేరినవారు వికారస్థితిని అధిగమిస్తారు.🙏
4
26
328
ప్రశాంతమైన ఆత్మసాగరంలో సుడిగాలిలా లేచిన చలనం వల్ల మనస్సు అలలు విస్తరించాయి. వాటి బిందువులైన జీవులు తమ మూలాన్ని మరచి అహంకారం, దేహాభిమానంతో తాము వేరనే భావనకు లోనయ్యారు. ఏకత్వం అనేకత్వంగా కనిపించింది. యథార్థజ్ఞానం మరుగునపడి, విషయతృష్ణ పెరిగి, వివేకం నశించడమే వికారగ్రస్త స్వభావం.🙏
3
13
187
మొదట బుద్ధితత్త్వం, తరువాత సూక్ష్మరూపం, ఆపై స్థూలరూపం క్షేత్రజ్ఞుని శక్తితో పరిణమిస్తాయి. మనస్సు, ఇంద్రియాల ద్వారా ప్రపంచం అనుభవమవుతుంది; అవీ ఆత్మ వికారరూపాలే. ఆకాశం వస్తువులకు ఆధారమైనట్లే, ఆత్మ ప్రకృతికీ జగత్తుకీ ఆధారం. ఆయన లేక ఏదీ ఉండదు, తెలియబడదు; ఆయనే సమస్తం.🙏
3
17
219
దేహమైన క్షేత్రం,దానిని తెలిసిన క్షేత్రజ్ఞుని తత్త్వాన్ని శ్రద్ధగా వినమని భగవంతుడు అర్జునునికి చెబుతున్నాడు. క్రియ ద్వారా ఆత్మలో నిలవడం నిర్వికారం;కోరికలు జ్ఞానాన్ని కప్పి, మనస్సునూ ఇంద్రియాలనూ విషయాలవైపు నడిపిస్తాయి. ఆత్మనిష్ఠలో కోరికలు, క్రియలు శమించి పరిపూర్ణత ప్రకాశిస్తుంది.🙏
31
దేహంలో వికారగ్రస్తమైన అహంకారం పుడుతుంది. చేతనాచేతన తత్త్వాలు, కోరికలు, వికారాలకు లోనయ్యే ఇంద్రియాల సమ్మేళనమైన దేహమే ‘క్షేత్రం’. ప్రకృతి–పురుషుల సంయోగంతో ఎలా ఏర్పడుతుందో, దీని స్వభావం, లక్షణాలేమిటో, దీనిని తెలిసిన క్షేత్రజ్ఞుని ఆత్మస్వరూపం, మహిమ, ప్రభావాలేమిటో సంక్షిప్తంగా విను.🙏
1
3
39
344
దేహాభిమానం ఉన్నంతవరకే జీవపరమాత్మల భేదం. క్రియాపరావస్థలో తొలగి,నది సముద్రంలో కలిసినట్లు జీవుడు నామరూపాలను విడిచి పరమాత్మతో ఏకమవుతాడు. అనేక ప్రతిబింబాలతో సూర్యుడు మారనట్లే,అనేకత్వంతో బ్రహ్మపూర్ణత్వం తగ్గదు.జ్ఞానిని మాయ బంధించదు. నాభిలోని సమానవాయుశక్తి, కూటస్థజ్యోతుల అనుభవించాలి.🙏
2
15
168
788
వాయువును బ్రహ్మగా ఉపాసిస్తూ, విషయాలవైపు సాగే ప్రవాహం నుంచి రక్షణ కోరాలి. మనోబుద్ధీంద్రియాలన్నీ ఆత్మశక్తితోనే పనిచేస్తాయిసర్వవ్యాపకత్వం,సర్వజ్ఞత్వం, సర్వశక్తిత్వం అనుభవమవుతాయి. సాక్షాత్కారంతో అజ్ఞానభావం తొలగి, ఆత్మలో ఆత్మను దర్శిస్తాడు. క్షేత్రక్షేత్రజ్ఞుల భేదం ఈ అనుభవమే జ్ఞానం.🙏
1
6
25
267
నాభిలో రుద్రస్వరూపంగా ఉన్న ప్రాణం బలానికి,వాక్శక్తికి ఆధారం.వాక్కు విస్తరణతో ప్రాణం చంచలమై,చంచల మనస్సుకు కారణమవుతుంది;అదే జీవుణ్ణి సంసారమృత్యువులకు బంధిస్తుంది. ఈ పాఠం ప్రకారం, వాయువు స్థిరంగా ఉన్నప్పుడు శివస్వరూపం; చంచలంగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని వ్యక్తపరిచే మనస్సుగా ఉంటుంది.🙏
4
17
196
ఇడా, పింగళా, సుషుమ్నా పాదాలు సుషుమ్నలో ఏకమైనప్పుడు క్రియాపరావస్థ కలుగుతుంది. అందులో నిలిస్తే ప్రకాశించే బ్రహ్మాకాశం అనుభవమై, బ్రహ్మమేనని సాక్షాత్కారమవుతుంది. ప్రాణశక్తితోనే జగత్తు వ్యక్తమవుతుంది.విషయాసక్తితో జడత్వం పొందిన మనస్సును ప్రాణక్రియ ద్వారా సూక్ష్మస్థితికి తీసుకురావాలి.🙏
2
16
154
ప్రాణం బాహ్యగమనం నుంచి అంతర్ముఖమై స్వస్వరూపాన్ని చేరాలి. ఇడా పింగళల్లో శ్వాస సంచరించినంతకాలం ప్రపంచభావన ఉంటుంది. అప్రమత్త సాధనతో సుషుమ్నలో ఆచరించి, ‘మూడవ పాదోపాసన’లో నిలిచినకొద్దీ అనేకత్వం తొలగి, జగత్తంతా ఏకబ్రహ్మంగా అనుభవమవుతుంది. ఆనందస్వరూపుడైన పరమపురుషుడే జీవుని నిజస్వరూపం.🙏
1
7
36
282
పరమాత్మ ప్రాణానికే ప్రాణం;ఆయన శక్తితోనే సమస్త జీవులు జీవిస్తున్నాయి.ఆ స్థిరప్రాణాన్ని ఉపాసించే సాధకుడు బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మంలో లీనమవుతాడు.తాడును తాడుగా గుర్తించినప్పుడు పామనే భ్రమ తొలగినట్లు, ఆత్మజ్ఞానంతో ఊహాజనిత జీవభావం తొలగి, నిత్యమైన నిజస్వరూపం ప్రకాశిస్తుంది. ఓం నమః శివాయ🙏
5
42
383
ఇంద్రియాలు బాహ్యవిషయాల వైపు మళ్లడం వల్ల జీవుడు అంతరాత్మను గ్రహించక,నశ్వర దేహమే తానని భ్రమిస్తాడు.మోహం తొలగితే నిత్యాత్మస్వరూపం ప్రకాశిస్తుంది. ప్రాణాయామంతో ప్రాణాపానాలను హృదయ సంగమస్థానంలో నిలిపితే, సర్వదేవతారాధ్యుడైన వామనరూప పరమాత్మ అనుభూతమవుతాడు. ఓం శ్రీం హ్రీం క్లీం వామనాయ నమః
1
4
42
494
మాయవల్ల భగవంతుడు అనేక రూపాల్లో వ్యక్తమైనా పూర్ణత్వం తగ్గదు.నామరూపాలు, దేహాభిమానంతో కప్పబడిన జీవుడు నిజస్వరూపాన్ని మరచిపోతాడు.ప్రాణం బాహ్యంగా ప్రవహించడంతో దృష్టి ప్రపంచంవైపు మళ్లుతుంది. అదే పరమాత్మ శరీరంలో భోక్తగా,క్షేత్రజ్ఞుడిగా వ్యక్తమై, హృదయగుహలోని కూటస్థంలో స్థితుడై ఉంటాడు.🙏
3
16
176
1,039
అన్ని శరీరాలలో క్షేత్రజ్ఞుడిగా ఉన్నది పరమాత్మయే. నాభిస్థానంలో ఉన్న క్షేత్రజ్ఞుడు నా స్వరూపమే. ‘నేను’, ‘నాది’, సుఖదుఃఖాలను అనుభవించే జీవుడూ ఆయన స్వరూపమే.జీవునికి అజ్ఞానం, పరమాత్మకు సర్వజ్ఞత్వం ఉన్నా,ఈ భేదం నామరూపాల వల్ల తాత్కాలికంగా కనిపించేదే; పరమార్థంలో జీవపరమాత్మలు వేరు కాదు.🙏
2
13
157
దేహబద్ధుడైన జీవుడే సాధకుడిగా క్రియ చేస్తాడు.శరీరమే తనదని భావించే స్థితిలో ఆరోగ్యానికీ అలంకరణకూ ప్రాధాన్యమిస్తాడు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు దేహబంధం నుంచి విముక్తి పొంది, స్వస్వరూపంలో నిలిపే శ్రద్ధ చూపుతాడు. దేహబద్ధ స్థితినీ,బంధవిముక్త స్థితినీ తెలిసినవాడే క్షేత్రజ్ఞుడు.🙏
6
30
354
గురువు ఉపదేశించినా నిర్లక్ష్యంగా ఉంటే శాంతి లభించదు.సత్కర్మలు, దైవానుగ్రహంతో సాధన సులభమైనా అప్రమత్తత అవసరం. లేకపోతే ఇంద్రియాలనే దొంగలు సాధనాఫలాన్ని అపహరిస్తాయి.లభించిన గౌరవానికి పొంగిపోతే గర్వమనే పురుగు సద్గుణాల పంటను నాశనం చేస్తుంది. వినయంతో కాపాడిన పంటే భగవంతునికి సమర్పణయోగ్యం.
5
49
451
రైతులా జీవుడు శరీరమనే క్షేత్రాన్ని సాగుచేయాలి. విత్తనాలు నాటి, పంటకు హాని చేసే వాటిని తొలగించి, కాపాడాలి;ప్రకృతి అనుగ్రహమూ అవసరమే. సాధనలో శరీరం పొలం, ప్రాణక్రియ నాగలి,మనస్సు–ఇంద్రియాలు దాన్ని లాగే పశువులు. ప్రాణాయామాది క్రియలతో క్షేత్రాన్ని దున్నితే ఆత్మజ్ఞానమనే పంట లభిస్తుంది.🙏
4
21
223
శంకర భగవత్పాదుల ప్రకారం శరీరాన్ని క్షేత్రమంటారు:ఇది నాశనం నుంచి కాపాడుతుంది; అయినా తానూ నశిస్తుంది; పొలంలో విత్తనానికి తగిన పంటలాగే కర్మలకు తగిన సుఖదుఃఖాలను అనుభవింపజేస్తుంది.చింతలతో తల్లడిల్లే జీవుడు సాధన ద్వారానే శాంతిని పొందగలడు. ఏ కార్యానికైనా, విముక్తి సాధనకూ శరీరమే ఆధారం.🙏
4
44
392
శ్వాసపై ఏకాగ్రతతో ప్రాణచలనం శాంతించి, మనస్సు లీనమవుతుంది.ప్రాణమనస్సుల స్థిరత్వం ఆత్మస్థితికి దారితీస్తుంది.విశ్వాసం, దృఢసంకల్పంతో క్రియాయోగాన్ని అభ్యసించే సాధకుడు ప్రాణాన్ని సహస్రారంలో స్థిరపరచి, బ్రహ్మైక్యాన్ని పొందుతాడు. నిరంతర సాధనతో దివ్యానందం,శాశ్వత తృప్తి సిద్ధిస్తాయి.🙏
1
2
12
167
బ్రహ్మసాక్షాత్కారంతో యోగి సందేహాలు తొలగి, చిత్తం నిశ్చలమై,కోరికలు లయమవుతాయి. సుఖదుఃఖాలకు చలించని సమత్వంతో జీవిస్తూ, ఆత్మజ్ఞానాన్ని కోరే సాధకులకు బోధించి వారి ఉన్నతికి తోడ్పడతాడు. మనస్సు చంచలంగా ఉన్నంతవరకు ఏ మార్గంలోనూ సాధన సఫలం కావడం కష్టం; చిత్తస్థిరత్వమే సార్థక సాధనకు మూలం.🙏
4
23
312