
No matter how tough life gets, I’ll keep rising like @ysjagan ❤️🔥
Joined February 2025
- Tweets2.9K
- Following195
- Followers356
- Likes12.5K
вєη B retweeted
Credit Chori!
Vote Chori!
Data Chori!
చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ!
అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే
@naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు.
ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు!
Hey Ram! Save Andhra!
вєη B retweeted
మున్సిపల్ ఎన్నికలు రిగ్గింగ్!
జిల్లా పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
మండల పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్!
ఎన్నిక ఏదైనా చివరకు టోటల్ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్!
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు — “నారా స్వామ్యం’’!
నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’!
ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే...
Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’!
నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’!
పోలింగ్ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’!
గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’!
ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’!
నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’!
అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’!
ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’!
ఇది కేవలం @ncbn గారికే సాధ్యం!
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్ చేస్తున్నాను. మీరే చూడండి- tinyurl.com/yfstwr84
Hey Ram, Save Andhra!
#RiggingMasterCBN
вєη B retweeted
Bapatlaలో ఒక YCP మహిళా MPTC అభ్యర్థి అత్త దగ్గర TDP వాళ్ళు 50లక్షల డబ్బు పెట్టి ప్రలోభాలకు try చేశారట
వాళ్ళ అత్త గారు
ఒకసారి ఆలోచించు నీకు కూతురుంది చిన్న పిల్ల అంటే
అదే గతి పడితే..దాన్ని చంపి నేను చస్తా కానీ జగనన్నను విడువను అన్నది.
8:7 లో YCP MPP won
вєη B retweeted
పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణ
మౌలిక సదుపాయాలపై దార్శనికతతో మేం ప్రారంభించిన ప్రణాళికే నేడు పెట్టుబడులకు అతిపెద్ద అవకాశంగా మారుతోంది.
రామాయపట్నం పోర్టుకు కీలక మైలురాయి!
దిగుమతులు, ఎగుమతుల కోసం రామాయపట్నం పోర్టును కేంద్ర పరోక్ష పన్నులు, మరియు కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) అధికారికంగా ప్రకటించింది. మా హయాంలో అడుగులు పడిన సముద్ర రవాణా మౌలిక సదుపాయాల ప్రణాళికను సాకారం చేసే దిశలో ఇది మరో కీలక ఘట్టం.
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, తీరం వెంబడి 4 పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే), 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. దీని వల్ల ప్రతి 50 కిలోమీటర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
రామాయపట్నం పోర్టును ప్రధాన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతూ, పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణను ముందుకు తీసుకెళ్లాలన్నది మా ఆలోచన. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. పోర్టు పరిసరాల్లో బీపీసీఎల్ భారీ రిఫైనరీ సముదాయం, ఇండోసోల్ సోలార్ సమీకృత తయారీ కేంద్రంతో పాటు మరెన్నో భారీ పెట్టుబడి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేలాది ఉద్యోగావకాశాలతో అక్కడ ఒక పారిశ్రామిక వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది.
మా పనితీరుకు నిదర్శనం ఏమిటంటే.. దావోస్ నుంచి సీఐఐ సదస్సుల వరకు, ప్రస్తుత @ncbn గారు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడులను ఆకర్షించేందుకు చూపిస్తున్నది మేం మొదలు పెట్టిన ఈ పోర్టులనే.
вєη B retweeted
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా?
ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు?
▪️ 2024-25 విద్యా సంవత్సరం
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.
ఫీజు రీయింబర్స్మెంట్ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు.
కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్ నిర్ధారించింది.
ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్ లెక్కలే.
▪️2025-26 విద్యా సంవత్సరం
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు?
2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు.
కానీ రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు.
బడ్జెట్ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి.
అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి.
మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు.
మీరు సవరించిన బడ్జెట్ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి.
▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం
2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు.
ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్ నెల కూడా రాలేదు.
అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు?
ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు?
వారికి చెల్లింపులు ఎలా చేశారు?
▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్
వైయస్సార్సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి.
4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి.
అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం.
మరి 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి?
మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది.
మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా?
2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది.
▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు?
ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం.
మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు?
పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి?
గతంలో మా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు?
▪️వాస్తవాలు చూస్తే..
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి),
2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు.
దీనికి అదనంగా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం.
కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే.
అంటే రూ.2,800 కోట్లు.
ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు.
▪️బకాయిలు వెంటనే చెల్లించండి
చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి.
ఇదిగో ఆధారాలు…
вєη B retweeted
OFFICIAL ANNOUNCEMENT 🦁💛
A once-in-a-lifetime player.
A new role. A bond that lasts forever 💛
Mahendra Singh Dhoni takes charge as the Team Mentor of Chennai Super Kings!
Through countless victories, challenging times, and memories that will stay in our hearts forever, MS has been at the heart of our journey from the very beginning.
From leading us to glory to guiding the next generation of Super Kings, Thala will always be a part of our identity. And Chennai will always be his home.
Read more : chennaisuperkings.com/news/n…
#WhistlePodu
вєη B retweeted
From a humble beginning in Ranchi to conquering the pinnacle of the sport, @msdhoni’s journey is a story of extraordinary grit, self-belief, and leadership.
As he bids farewell to active cricket, we celebrate not just the trophies, but the countless times he stood tall in the team's toughest moments, absorbing the pressure and guiding the side with a quiet smile. He leaves behind a wonderful and inspiring legacy that will be cherished by generations to come.
Wishing him the very best in his new role as Mentor and every happiness ahead.
#MSDhoni
вєη B retweeted
𝗔𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝗖𝗹𝗮𝘀𝘀𝗶𝗰 𝗖𝗮𝘀𝗲 𝗼𝗳 '𝗖𝗿𝗲𝗱𝗶𝘁 𝗖𝗵𝗼𝗿𝗶': 𝗧𝗮𝗸𝗶𝗻𝗴 𝗕𝗼𝘄𝘀 𝗳𝗼𝗿 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵’𝘀 𝗟𝗲𝗮𝗽 𝗳𝗿𝗼𝗺 𝟭𝟬𝘁𝗵 𝘁𝗼 𝟯𝗿𝗱 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗔𝗘𝗜 (𝗔𝗰𝗰𝗲𝘀𝘀 (𝗜𝗻) 𝗘𝗾𝘂𝗮𝗹𝗶𝘁𝘆 𝗜𝗻𝗱𝗲𝘅) 𝗥𝗮𝗻𝗸𝗶𝗻𝗴 𝗱𝘂𝗿𝗶𝗻𝗴 𝟮𝟬𝟮𝟭-𝟮𝟰
Mr. @ncbn garu, once again unabashedly takes the bows for an achievement that is not attributable to him. The OP Jindal Global University in association with CNES (Centre for New Economic Studies) published a report in 2024 and ranked the States on five key pillars crucial to social and human development and also ranked States on the basis of a composite index arrived at by assigning weights to the pillars. The university in association with CNES has conducted a similar exercise in 2021 and published a report. It is noteworthy that with respect to the 2021 AEI report, for majority of the indicators, the source of statistics utilized for ranking of States pertain to period prior to 2019 and for the 2024 AEI report, for all the indicators, the source of statistics pertain to the period 2021 to 2023. Therefore one can surmise that comparing both the reports ably provides the socio economic picture before and after the formation of YSRCP Govemment.
With respect to 'Health Index Score' Pillar, Andhra Pradesh was ranked 8 amongst States in 2021 report (on the basis of statistics majorly pertaining to period prior to 2019) and the State's rank improved to 2" in 2024 report (on the basis of the statistics entirely pertaining to the period of the YSRCP Government)
With respect to 'Socio Economic Security Pillar, Andhra Pradesh was ranked 11 amongst States in 2021 report (on the basis of statistics majorly pertaining to period prior to 2019) and the 𝗦𝘁𝗮𝘁𝗲'𝘀 𝗿𝗮𝗻𝗸 𝗶𝗺𝗽𝗿𝗼𝘃𝗲𝗱 𝘁𝗼 𝟭 𝗶𝗻 𝟮𝟬𝟮𝟰 𝗿𝗲𝗽𝗼𝗿𝘁 (on the basis of the statistics entirely pertaining to the period of the YSRCP Government), An aspect of immense pride for the State. This did not happen by accident. Right emphasis on welfare and development made this possible. Implementation of welfare programmes in most transparent manner, duly safeguarding private consumption during times of distress and support to industry and manufacturing sectors ensuing their fastest growth in South India during 2019-24 enabling better access to work and social security, is a major reason for this achievement.
With respect to 'Legal Recourse' Pillar, Andhra Pradesh was ranked 15 amongst States in 2021 report (on the basis of statistics majorly pertaining to period prior to 2019) and the State's rank improved to 2" in 2024 report (on the basis of the statistics entirely pertaining to the period of the YSRCP Government).
With respect to ranking on the basis of overall composite score, the State's rank improved from 10" in 2021 (on the basis of statistics majorly pertaining to period prior to 2019) to 3 in 2024 (on the basis of the statistics entirely pertaining to the period of the YSRCP Government). The 2024 AEI report, in fact made a special mention that '𝗔𝗡𝗗𝗛𝗥𝗔 𝗣𝗥𝗔𝗗𝗘𝗦𝗛 𝗠𝗔𝗗𝗘 𝗧𝗛𝗘 𝗕𝗜𝗚𝗚𝗘𝗦𝗧 𝗝𝗨𝗠𝗣 𝗥𝗜𝗦𝗜𝗡𝗚 𝗙𝗥𝗢𝗠 𝟭𝟬 𝗣𝗟𝗔𝗖𝗘 𝗧𝗢 𝟯𝗿𝗱 𝗣𝗟𝗔𝗖𝗘 𝗢𝗨𝗧 𝗢𝗙 𝗔𝗟𝗟 𝗧𝗛𝗘 𝗦𝗧𝗔𝗧𝗘𝗦
I am indeed proud to say that owing to the YSRCP Govemment's emphasis on socio economic programmes, the State could demonstrate significant improvement on all parameters. All the above mentioned success could be achieved during the period that is being unscrupulously described by the Mr. Chandrababu Naidu to be a time when State was on ventilator.
вєη B retweeted
Manam odipovataniki reason okka allegation vachinapudu counter ivvakunda wait cheyyatam ..em change raledu @YSRCParty
During 2019-24 the amount released towards Fee Reimbursement
@ysjagan also cleared pending fee reimbursement bills left behind by the previous TDP govt.👇🏻
సొంత బాబాయ్ హత్య నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకు @ysjagan గారి మోడస్ ఆపరెండీ ఒక్కటే! తప్పు చేయడం.. నెపం ఇతరులపై నెట్టడం.. అబద్ధాలతో తప్పించుకోవడం. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి జగన్ గారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఐదేళ్లూ పబ్లిసిటీ పిచ్చతో మీ బొమ్మలకు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చి ఉంటే రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మిగిలేవా? మీరు బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. మీరు పెట్టిన బకాయిలు చెల్లిస్తున్న మాపై నిందలా? మీ ఫేక్ ప్రచారంతో నిజాలను మార్చలేరు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న మీ చరిత్రను చెరిపేయలేరు! ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నాన్ని కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవడం మీకు గన్‌తో పెట్టిన విద్య కదా జగన్ గారూ!
вєη B retweeted
Every child deserves the right to dream, learn, live in a safe and supportive world. It’s our responsibility to invest in their education and well-being today, empower them to claim the future they deserve and they will be set to drive the progress of our nation. Warm wishes to all young minds on #ChildrensDay!
вєη B retweeted
దేవినేని అవినాష్ గారి స్వగృహం నందు శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం
స్వామి శరణం శరణం అయ్యప్ప🙏
#DevineniAvinash #AyyappaSwamy
вєη B retweeted
I invite you to our beautiful state for the Andhra Pradesh Global Investors Summit to be held on the 3rd & 4th of March in Visakhapatnam.
Experience the ease of doing business in our state and partake in our vibrant culture.
Welcome!
#APGlS2023 #AndhraPradesh
вєη B retweeted
. @ncbn ఆర్భాటపు అభివృద్ధి ప్రచారం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వాస్తవ పరిస్థితి
తగ్గుతున్న విద్యుత్ డిమాండ్. ప్రభుత్వ ఆదాయంలో లేని పురోగతి
మరోవైపు దారుణంగా పెరుగుతున్న నిరుద్యోగం
తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ హయాంలో మునుపెన్నడూ లేనంత అవినీతి, శాంతి భద్రతల వైఫల్యాలు మనం చూస్తున్నాం. వీటిని కప్పి పుచ్చుకునేందుకు, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందంటూ ప్రభుత్వం తప్పు దోవ పట్టించేలా ప్రచారం చేస్తోంది. అయితే, గణాంకాలు మాత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయి.
విద్యుత్ డిమాండ్‌కు సంబంధించిన గణాంకాలు అందుకు ఒక ఉదాహరణ.
ఏపీఈఆర్సీ (ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 2023–24లో పంపిణీ సంస్థలు (డిస్కంల) విద్యుత్ విక్రయాలు 71,722 మిలియన్ యూనిట్లు కాగా, పంపిణీ జరిగిన విద్యుత్ 79,758 మిలియన్ యూనిట్లు. అదే 2025–26లో డిస్కంల విద్యుత్ విక్రయాలు 70,885 మిలియన్ యూనిట్లు కాగా, విద్యుత్ పంపిణీ 78,546 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. అంటే రాష్ట్రంలో ఈ రెండేళ్లలో విద్యుత్ డిమాండ్ తగ్గిన విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సాధారణంగా అభివృద్ధి చెందుతున్న ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు విద్యుత్ అవసరాలు పెరగడం, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా వినియోగించుకోవడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల గృహ విద్యుత్ వినియోగం అధికం కావడం ఇందుకు కారణాలు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గత రెండేళ్లుగా విద్యుత్ డిమాండ్ తగ్గడాన్ని మనం చూస్తున్నాం. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని స్పష్టంగా బయటపెడుతోంది.
ఇంకా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని చెప్పడానికి విద్యుత్ డిమాండ్‌కు సంబంధించిన గణాంకాలు మాత్రమే ఆధారం కాదు. 2023–24లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.85,922.36 కోట్లు కాగా.. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన 2025–26కు సంబంధించిన తాత్కాలిక గణాంకాల ప్రకారం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.86,552.65 కోట్లు. అంటే రెండేళ్ల కాలంలో వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) కేవలం 0.15 శాతం మాత్రమే. ఇది ఈ రెండేళ్లలో రాష్ట్రంలో తగ్గిన పెట్టుబడులకు తార్కాణంగా నిలుస్తోంది.
ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఈ మందగమనం ఉపాధి కల్పనపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. 2026–27 తొలి త్రైమాసికంలో నిరుద్యోగం విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉండగా, రెండో త్రైమాసికంలో రెండవ స్థానానికి చేరుకుంది. అంటే రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగానికి ఇది అద్దం పడుతోంది. అయినా తాము 23 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించామని చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారు.
вєη B retweeted
ఇది వైయస్ జగన్ గారి మార్క్ అభివృద్ధి అంటే! 🔥
CII భాగస్వామ్య సదస్సులో వేదికపై ఏపీలో వైయస్ జగన్ గారు చేసిన అభివృద్ధిని ప్రస్తావించిన నారా లోకేష్.
ప్రతిదీ క్రెడిట్ చోరీ చేయడం తప్పితే, రాష్ట్రంలో తండ్రీకొడుకులు చేసిన అభివృద్ధి శూన్యం.
మీకు ఏమీ చేతకానందుకు సిగ్గుపడండి @ncbn, @naralokesh!
#YSJaganMarkDevelopment
#CreditChorBabu
#CreditChorLokesh
#JaganannaConnects





















