CP Hyderabad City Police retweeted
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోషామహల్ స్టేడియంలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించాను.
సమాజ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి అసువులు బాసిన అమర పోలీసుల నిస్వార్థ సేవలు, సర్వోన్నత త్యాగాలు కలకాలం చిరస్మరణీయం.
ఆ అమరవీరుల త్యాగస్ఫూర్తిని గుండెల్లో నింపుకొని, మరింత నిబద్ధతతో ప్రజాసేవకు పునరంకితం కావడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళి.
#PoliceCommemorationDay #PoliceMartyrs #SaluteToMartyrs
శాంతిభద్రతల పరిరక్షణ కేవలం పోలీస్ యూనిఫాం డ్యూటీ మాత్రమే కాదు... అది ప్రతి పౌరుడి బాధ్యత కావాలి!
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమంటే, సమాజంలో బాధ్యతాయుతమైన పౌర స్పృహను మేల్కొలపడమే. పౌరుల స్వీయ క్రమశిక్షణే సమాజానికి అసలైన రక్షా కవచం.
అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నేటి ఈనాడు దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో ప్రచురితమైన నా ప్రత్యేక వ్యాసం ఇది. తప్పక చదవగలరు.
#PoliceCommemorationDay #PoliceMartyrs #SelfDiscipline #Eenadu #HyderabadPolice
CP Hyderabad City Police retweeted
ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను దసరా వేళ కొందరు స్వార్థం కోసం ఇనుప బోనుల్లో బంధించారు. మూగజీవులను హింసిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని మేం ముందుగానే స్పష్టంగా హెచ్చరించినప్పటికీ.. కొందరు పెడచెవిన పెట్టి ఆ నిస్సహాయ పక్షులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.
అప్రమత్తమైన పౌరుల నుంచి అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు తక్షణమే స్పందించి, మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి మొత్తం 4 పాలపిట్టలను ప్రాణాలతో కాపాడారు.
లంగర్‌హౌస్ బాపుఘాట్ సమీపంలోని ఆలయం వద్ద ఇరుకైన బోనుల్లో నరకయాతన అనుభవిస్తున్న రెండు పాలపిట్టలను విడిపించి కేబీఆర్ పార్క్ అటవీ అధికారులకు అప్పగించగా.. ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు బోను వేలాడదీసి నిర్బంధించిన ఒక పాలపిట్టను, అలాగే మంగళహాట్ బాలాజీనగర్ గుడి సమీపంలో బోనులో ఉంచిన మరో పాలపిట్టను రెస్క్యూ చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. బాధ్యులపై అటవీశాఖ సమన్వయంతో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
పండుగ పేరుతో ఒక నిస్సహాయ పక్షిని బంధించి, ఆహార నీళ్లు లేకుండా చిత్రహింసలకు గురిచేసి చూడటం ఎవరికీ మంచి చేయదు.. ఇది మన సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
ప్రాణభయంతో బోను చువ్వల మధ్య విలవిల్లాడుతున్న పక్షి రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది? నిజమైన భక్తి అంటే జీవకారుణ్యమే తప్ప, ప్రకృతిని బందీ చేయడం కాదు!
మూగప్రాణుల స్వేచ్ఛను హరిస్తూ, కాసుల వేటకు తెరలేపే ఇలాంటి అమానవీయ పోకడలను ఎవరూ ప్రోత్సహించవద్దు.
వన్యప్రాణులకు హాని తలపెట్టే ఘటనలు ఎక్కడ కనిపించినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని కోరుతున్నాం.
CP Hyderabad City Police retweeted
పండుగ అంటేనే ఆనందం, స్వేచ్ఛ, తోటి ప్రాణుల పట్ల కరుణ చూపించడం. కానీ, దసరా వేళ శుభం అంటూ కొందరు తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రెక్కలు కత్తిరించి, బోనుల్లో బంధించి వ్యాపారం చేస్తున్నారు.
ఆలోచించండి...
ఒక మూగజీవి స్వేచ్ఛను హరించి, దానికి ఆహారం, నీరు లేకుండా హింసిస్తూ చూస్తే ఎవరికైనా మేలు ఎలా జరుగుతుంది? ఆ పక్షి వేదనలో శుభం ఎలా కనిపిస్తుంది?
పాలపిట్ట మన పర్యావరణానికి రక్షకుడు, రైతుకు మేలు చేసే నిజమైన నేస్తం. అది నీలాకాశంలో స్వేచ్ఛగా రెక్కలు విప్పి ఎగురుతున్నప్పుడే ప్రకృతికి అందం, మన సమాజానికి గౌరవం.
వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం పాలపిట్టలను బంధించడం, విక్రయించడం, ప్రదర్శించడం నేరం.
ఈ పండుగ పూట మూగజీవాలకు స్వేచ్ఛను ప్రసాదిద్దాం. బంధించిన పక్షుల ప్రదర్శనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించకండి.
ఎక్కడైనా పాలపిట్టలను బంధించినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించండి.
#SavePalapitta #IndianRoller #CrueltyFreeDussehra #EcoFriendlyDussehra #TelanganaForest #WildlifeConservation
CP Hyderabad City Police retweeted
May Lord Ram's blessings bring victory over every difficulty and light up your life with peace, prosperity, and happiness. Happy Dussehra!
#Dussehra #Vijayadashami
CP Hyderabad City Police retweeted
శాంతిభద్రతల పరిరక్షణ కేవలం పోలీస్ యూనిఫాం డ్యూటీ మాత్రమే కాదు... అది ప్రతి పౌరుడి బాధ్యత కావాలి!
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమంటే, సమాజంలో బాధ్యతాయుతమైన పౌర స్పృహను మేల్కొలపడమే. పౌరుల స్వీయ క్రమశిక్షణే సమాజానికి అసలైన రక్షా కవచం.
అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నేటి ఈనాడు దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో ప్రచురితమైన నా ప్రత్యేక వ్యాసం ఇది. తప్పక చదవగలరు.
#PoliceCommemorationDay #PoliceMartyrs #SelfDiscipline #Eenadu #HyderabadPolice
CP Hyderabad City Police retweeted
దసరా నవరాత్రి దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ, వాహన పూజలు నిర్వహించాం.
శాంతిభద్రతల పరిరక్షణలో ఉపయోగించే ఆర్మరీ ఆయుధాలకు, నిరంతరం ప్రజలకు సేవలందించే పెట్రోలింగ్ వాహనాలకు ప్రత్యేక పూజలు చేశాం.
దుర్గామాత దివ్య ఆశీస్సులతో పోలీసు అధికారులందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించాను.
ప్రజాసేవలో అహర్నిశలు శ్రమించే మన సిబ్బంది ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షిస్తున్నాను.
#Dussehra #AyudhaPuja #HyderabadCityPolice #Durgashtami
CP Hyderabad City Police retweeted
ప్రకృతిని ఆరాధిస్తూ, తీరొక్క పూలతో కొలిచే విశిష్ట సంప్రదాయం బతుకమ్మ పండుగ. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి, సామరస్యానికి ఇది ప్రతీక.
ఈ పండుగ సందర్భంగా పేట్లబురుజు సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నాను.
సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడి, పండుగ ఆనందాన్ని పంచుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
నిరంతరం విధి నిర్వహణలో శ్రమించే పోలీస్ కుటుంబాలలో ఈ వేడుక సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు! 🌺🙏
#Bathukamma #HyderabadPolice
CP Hyderabad City Police retweeted
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా గురువారం అర్ధరాత్రి వేళ 3,000 మంది సిబ్బంది, 100 బృందాలతో విస్తృతంగా చేపట్టిన ఆపరేషన్ కవచ్ నాకాబందీ తనిఖీలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాను.
ఈ స్పెషల్ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 725 వాహనాలను డిటైన్ చేసి, 48 మంది అనుమానితులను హైదరాబాద్ సిటీ పోలీస్ అదుపులోకి తీసుకోవడం జరిగింది.
సిటీలో నేరాల నియంత్రణ, అసాంఘిక శక్తుల కట్టడి కోసం రాత్రి వేళల్లో ఇలాంటి ఆకస్మిక నాకాబందీ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి.
నగర పౌరులంతా పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
#OperationKavach #HyderabadCityPolice #NightVigil #Dial112
CP Hyderabad City Police retweeted
రెండు కళ్లకు ఎదురుగా రెండు ఫోన్లు.. ఒకదాంట్లో గమ్యం చూపించే నేవిగేషన్ రూట్, మరోదాంట్లో నాన్‌స్టాప్ వినోదాన్ని పంచే సినిమా! ఇక చెవులకేమో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా రంగురంగుల లైట్లు వెలిగే పెద్ద హెడ్‌ఫోన్లు!
ఇది ఒక ఆటో డ్రైవర్ అధునాతన సెటప్. ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను నాకు పంపించారు.
చూడటానికి ఇది మల్టీ-స్క్రీన్ గేమింగ్ విన్యాసంలా అనిపించినా, వెనుక కూర్చున్న ప్రయాణికుల పాలిట మాత్రం ఇది నడుస్తున్న మృత్యుశకటం.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి క్షణకాలం రోడ్డుపై నుంచి పక్కకు మళ్లినా ఘోర ప్రమాదాలు ముంచుకొస్తాయి.
అలాంటిది నేరుగా సినిమా చూస్తూ, చెవుల్లో హెడ్‌ఫోన్లు పెట్టుకుని వాహనం నడపడం కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు.. క్షమించరాని నేరం.
ఎంవీ యాక్ట్ ప్రకారం ఇది డేంజరస్ డ్రైవింగ్ కిందకు వస్తుంది. దీనికి భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే అవకాశమూ ఉంది.
వినోదం కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడం భావ్యం కాదు. ఆటోను థియేటర్‌గా మార్చి జీవితాలకు ది ఎండ్ కార్డు వేయొద్దని గుర్తుంచుకోవాలి.
వాహనం ఏదైనా.. టూవీలర్, కారు, ఆటో, బస్, లారీ.. డ్రైవింగ్ సమయంలో మొబైల్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వాడకం ప్రాణాంతకం.
ఈ క్రమంలో ప్రయాణం ఆటో అయినా, కారు అయినా, బస్సు అయినా ప్రయాణికులు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
డ్రైవర్ ఫోన్ చూస్తున్నా, చెవుల్లో హెడ్‌ఫోన్లు లేదా ఇయర్‌బడ్స్ పెట్టుకున్నా చూస్తూ మౌనంగా ఉండిపోకండి. అది ప్రాణాలకే ప్రమాదమని వెంటనే ప్రశ్నించండి, వారించండి.
ఒకవేళ వారు వినకపోతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డయల్ 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించండి.
ప్రయాణంలో మీ నిర్లక్ష్యం మీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది.. అదే సమయంలో మీ అప్రమత్తత మీతో పాటు ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడుతుందని గ్రహించాలి.
Instructed @HYDTP to trace the auto (TG15U2657) driver and take stringent legal action as per the law.
#RoadSafety #HyderabadTraffic #PassengerSafety #Dial112 #DriveSafe
CP Hyderabad City Police retweeted
‘మా దాకా రాదులే’ అనుకోవద్దు.. సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దు!
సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తుగడలను తిప్పికొడుతూ ప్రజల కష్టార్జితాన్ని రక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం నిరంతరం అండగా నిలుస్తోంది. పౌరులు కూడా పూర్తి చైతన్యంతో వ్యవహరించినప్పుడే సైబర్ రహిత నగరాన్ని నిర్మించగలమని మేం పదేపదే స్పష్టం చేస్తున్నాం.
అయితే, తాజాగా సోమవారం ఒక్క రోజే నగరంలో నమోదైన మూడు వేర్వేరు కేసుల్లో బాధితులు ఏకంగా దాదాపు రూ. 5.35 కోట్లను సైబర్ కేటుగాళ్ల చేతుల్లో పోగొట్టుకోవడం కలిచివేసింది. ఈ ఉదంతాల్లో నష్టపోయిన ముగ్గురు బాధితులతో నేనే స్వయంగా మాట్లాడాను.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... ముగ్గురూ ఉన్నత విద్యావంతులే, సమాజంపై పూర్తి అవగాహన ఉన్నవారే. అయినప్పటికీ ‘ఇలాంటి మోసాలు మా దాకా రావు కదా’ అనే అమాయకత్వం, అతి ధీమాతో మొదటి లావాదేవీ జరిగినప్పుడే అలర్ట్ కాకపోవడం వల్లే ఇంత భారీ మొత్తాన్ని కోల్పోయారు.
బాధితులు ప్రదర్శించిన నిర్లక్ష్యం, కేటుగాళ్ల మాయాజాలం ఎంత ప్రమాదకరంగా మారాయో ఈ మూడు ఘటనలే నిదర్శనం.
నగరంలో పేరుపొందిన ఓ ప్రముఖ వ్యాపార సంస్థ అకౌంటెంట్ గుర్తుతెలియని జిప్ ఫైల్ ఓపెన్ చేసి, సీఈఓ డీపీతో వచ్చిన నకిలీ వాట్సాప్ సందేశాన్ని రోజూవారీ లావాదేవీల్లో వచ్చే ఓటీపీ క్లియరెన్స్‌లాగే పొరబడి ఏకంగా రూ. 2.70 కోట్లు బదిలీ చేసేశారు; ఎనిమిది రోజుల పాటు నిధులు మళ్లుతున్నా, బ్యాంక్ సందేశాలు వస్తున్నా ఆ సంస్థ యాజమాన్యం గమనించకపోవడం తీవ్ర నిర్లక్ష్యం.
మరో ఉదంతంలో 72 ఏళ్ల వృద్ధురాలిని సీబీఐ, ఈడీ, మనీ లాండరింగ్ పేరుతో ‘డిజిటల్ అరెస్ట్’ చేశామంటూ 20 రోజుల పాటు భయపెట్టి, ఆమె బంగారాన్ని సైతం అమ్మించి రూ. 2.12 కోట్లు కాజేశారు.
ఇక విదేశాల్లో పనిచేసి నగరానికి వచ్చిన ఓ ప్రముఖ వైద్యుడు గత పదేళ్లుగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న అనుభవజ్ఞుడే అయినప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకు 5 నుంచి 20 శాతం లాభాలంటూ వచ్చిన ప్రకటనల మాయలో పడి నకిలీ ట్రేడింగ్ యాప్‌లో రూ. 52.51 లక్షలు పోగొట్టుకున్నారు.
సైబర్ నేరాలపై గౌరవ ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, పోలీస్ విభాగం తరఫున మేం నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నాం.
‘జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్’ పేరుతో ఏడాది కాలంలోనే దాదాపు 11,417 అవగాహన సదస్సులు నిర్వహించి సుమారు 5.06 లక్షల మందికి అవగాహన కల్పించాం. అయినప్పటికీ ప్రజలు మేమిచ్చే అడ్వైజరీలను చాలా లైట్ గా తీసుకుంటుంన్నారు.
అసలు మన దేశ చట్టంలో ఎక్కడా ‘డిజిటల్ అరెస్ట్’ అనే భావనే లేదని, ఏ దర్యాప్తు సంస్థా ఆన్‌లైన్‌లో నగదు డిమాండ్ చేయదని ఎన్నిసార్లు చెబుతున్నా భయాందోళనలకు లోనవుతున్నారు.
మరోవైపు బ్యాంకుల నుంచి విడతలవారీగా కోట్ల రూపాయల సొమ్ము డెబిట్ అవుతుంటే ఖాతాదారులను అప్రమత్తం చేయడంలో బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు.
ఇది నాకు జరగదులే అని నిర్లక్ష్యంగా ఉండకండి, ‘నాక్కూడా జరగొచ్చు’ అన్న స్పృహతో అనుక్షణం అప్రమత్తంగా ఉండండి.
గుర్తుతెలియని లింకులు, ఫైల్స్ తెరవకండి, అపరిమిత లాభాల ప్రకటనలను గుడ్డిగా నమ్మకండి.
గుర్తుతెలియని బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్యానిక్ కావొద్దు; కుటుంబ సభ్యులకు చెప్పడంతో పాటు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 112 కు ఫోన్ చేయండి.
ముఖ్యంగా ఇంట్లోని వృద్ధుల ప్రవర్తనను పిల్లలు ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి నైతిక స్థైర్యాన్ని అందించాలి. ఒకవేళ ఎవరైనా దురదృష్టవశాత్తూ మోసపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యంత కీలకమైన 'గోల్డెన్ అవర్'లో వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
గుర్తుంచుకోండి... అప్రమత్తతే సైబర్ నేరాలకు అసలైన విరుగుడు!
CP Hyderabad City Police retweeted
చట్టం నేరాన్ని నిరోధించి బాధితులకు న్యాయం చేకూర్చగలదు కానీ, వ్యక్తి అంతరంగంలో అసలు నేర ప్రవృత్తే మొలకెత్తకుండా కాపాడే సహజ రక్షణ కవచం మాత్రం పటిష్ఠమైన కుటుంబ వ్యవస్థే.
పసిప్రాయం నుంచే అలవాటవుతున్న డిజిటల్ ఒంటరితనం, తల్లిదండ్రుల పర్యవేక్షణా లోపం, ఇంట్లో ఆప్యాయతలు కరువై ఏర్పడుతున్న భావోద్వేగ శూన్యతే నేడు టీనేజర్లను దారుణమైన నేరాల వైపు నెడుతున్నాయి.
పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు కూడబెట్టడం కంటే పిల్లలనే సమాజానికి ఆస్తిగా తీర్చిదిద్దడమే అసలైన సంస్కారమని స్పష్టం చేస్తూ నేటి ఈనాడు దినపత్రిక (@eenadulivenews) సంపాదకీయ పేజీలో ప్రచురితమైన నా విశ్లేషణ ఇది.
Link 🔗eenadu.net/telugu-news/vyaky…
#FamilyFirst #ChildSafety #ParentingMatters #HyderabadPolice #VCSajjanar #Eenadu
CP Hyderabad City Police retweeted
ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ వద్దు!
అర్ధరాత్రి రోడ్లపైకొచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని నగర ప్రజలకు, ముఖ్యంగా యువతకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు క్షణికావేశం, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుండటం బాధాకరం.
రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు నాడే ఆ పాపతో పాటు కుటుంబసభ్యుడు దుర్మరణం చెందడం ఎంతో కలిచివేసింది.
ప్రమాదం జరిగిన వెంటనే మా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు నిలపలేకపోయాం.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్ బండ్ పై ప్రమాద స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ జరుగుతున్న ప్రమాదాలపై వివిధ ప్రభుత్వ విభాగాలలో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించాం.
పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుక అని, దానిని ఇళ్ల వద్ద లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలని స్పష్టం చేస్తున్నాం.
అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జనసంచారం ఉండకపోవడంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుంటాయి. అలాంటి సమయంలో చిన్నపిల్లలను వెంటేసుకుని నడిరోడ్డుపైకి రావడం ఎంతమాత్రం వివేకం కాదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
అసలు ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వేడుకలు నిర్వహించడం నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధం. గతంలోనే జీహెచ్‌ఎంసీ దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
మా పోలీసులు నిరంతరం పహారా కాస్తూ అక్కడికి వచ్చేవారిని పంపిస్తున్నప్పటికీ, అర్ధరాత్రి పూట మళ్లీ వచ్చి వేడుకలు చేసుకోవడం వల్లే ఇలాంటి విషాదాలు పునరావృతమవుతున్నాయి.
కేవలం క్షణికానందం కోసం చేసే పొరపాట్ల వల్ల అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకోవద్దు. ఇకపై ఎవరూ కూడా అర్ధరాత్రి వేళల్లో ట్యాంక్‌బండ్, చెరువులు, బహిరంగ ప్రదేశాల వద్దకు వచ్చి సంబరాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
@HYDTP @hydcitypolice @CPHydCity
CP Hyderabad City Police retweeted
Remembering the Father of the Nation, Mahatma Gandhi, on his birth anniversary.
His principles of peace, unity, and mutual respect remain our guiding lights in serving the citizens. Let's pledge to keep our neighborhoods harmonious and law-abiding.
#GandhiJayanti
#Hyderabad #Bapu #TruthAndNonViolence #HydPolice
CP Hyderabad City Police retweeted
భక్తి పారవశ్యంతో పులకించిన హైదరాబాద్.. ఆనందోత్సాహాల నడుమ సాగిన గణనాథుడి శోభాయాత్ర!
అందరి సహకారంతో.. నిండు మనసులతో.. ప్రశాంత వాతావరణంలో దిగ్విజయంగా ముగిసిన చారిత్రక సంబరం!
ఈ ఘన విజయానికి బాటలు వేసింది..
మూడు నెలల ముందే మొదలైన మా ప్రణాళికా రచన!
ప్రతి జోన్‌లో పర్యటిస్తూ, మండపాలను దర్శిస్తూ.. అందరినీ కలుపుకుంటూ సాగిన పటిష్ఠమైన కార్యాచరణ!
శోభాయాత్ర వేళ క్షేత్రస్థాయి పర్యవేక్షణ..
ఎక్కడా ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిన భక్తుల రాకపోకలు!
అనుకున్న సమయానికే నిమజ్జన ఘట్టాలన్నీ సాగర ఒడిలో సంపూర్ణమైన క్షణాలు!
ప్రజల సేవలో నిరంతరం చిరునవ్వుతో నిలిచి, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావం చాటిన.. పోలీస్ సిబ్బందికి మనస్ఫూర్తి అభినందనలు! 👮♂️💐
మాకు నిరంతరం దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి.. చేయి చేయి కలిపి నడిచిన అన్ని ప్రభుత్వ విభాగాలకు.. భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితికి.. మంచిని ప్రతిధ్వనించిన మీడియా మిత్రులకు..
అన్నింటికీ మించి క్రమశిక్షణతో, ప్రేమతో సహకరించిన మా ప్రియమైన హైదరాబాద్ ప్రజానీకానికి.. సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు!
CP Hyderabad City Police retweeted
హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తయింది.
బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఒకటే కమిషనరేట్ పరిధిలోకి రావడం వల్ల శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ మరింత సులువైంది.
ఈ మహాక్రతువును విజయవంతం చేసిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ ప్రజలకు, రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
రెండు నెలలుగా అద్భుతంగా పనిచేసిన జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఆర్ అండ్ బీ, విద్యుత్, వైద్యారోగ్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు, పూర్తి సహకారం అందించిన ఉత్సవ సమితులు, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఊరేగింపుల్లో ప్రమాదకరంగా మారిన 'పేపర్ షాట్స్'ను నిషేధించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. స్వయం క్రమశిక్షణతో కూడిన మరిన్ని జాగ్రత్తలతో, రాబోయే 2027 ఉత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తాం.
#HyderabadCityPolice #GaneshNimajjanam2026 #PeacefulHyderabad #TeamWork
CP Hyderabad City Police retweeted
అంకితభావంతో శ్రమించి హైదరాబాద్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా విజయవంతం చేసిన మా సిబ్బంది నిబద్ధత వెలకట్టలేనిది.. వీరి కష్టానికి ఎన్ని ప్రశంసలైనా తక్కువే!
కర్తవ్య నిర్వహణలో అలసిసొలసిన నా సహచరుల్లో సరికొత్త జోష్ నింపేందుకే వారితో కలిసి సరదాగా ఆడిపాడాను.
అహోరాత్రులు చెమటోడ్చిన వాళ్ల ముఖాల్లో.. ఆ అలసట స్థానంలో విరిసిన నవ్వులు చూశాక, ఇంతకంటే సంతృప్తి ఇంకేముంటుంది
#HyderabadCityPolice #DutyFirst #PoliceFamily
#GaneshUtsav #HyderabadGaneshImmersion
CP Hyderabad City Police retweeted
నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేలా చూసేందుకు క్షేత్రస్థాయి ఏర్పాట్లను ద్విచక్ర వాహనంపై స్వయంగా పర్యటించి పరిశీలించాను.
CP Hyderabad City Police retweeted
నగర ప్రజలకు విజ్ఞప్తి!
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నిన్నటి నుంచి ఎంతో ప్రశాంత వాతావరణంలో, వైభవంగా కొనసాగుతోంది.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్న ప్రజలందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ధన్యవాదాలు.
ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ తదితర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వాహనాల రాకపోకలు మందగించి, నిమజ్జన ప్రక్రియ కాస్త ఆలస్యమైంది.
ఈ శోభాయాత్ర నేటి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. విగ్రహాల నిమజ్జనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మా పోలీసు, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాన మార్గాల్లో ఇప్పటికే విధించిన ట్రాఫిక్ ఆంక్షలను నేడు కూడా కొనసాగిస్తున్నాం.
ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో విగ్రహాల రద్దీ కారణంగా సాధారణ వాహనాలకు అనుమతి లేదు.
కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడమో లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడమో చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రధాన రహదారులపైకి వాహనాలతో వచ్చి అనవసరంగా ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడవద్దు.
ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారిక సూచనలు, అడ్వైజరీలను గమనిస్తూ నగర ప్రజలంతా మాకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిందిగా కోరుతున్నాం.
#WATCH | Hyderabad, Telangana: On security and traffic arrangements for Ganesh immersion, IPS Commissioner of Police, VC Sajjanar, says, "This is the final day of Ganesh immersion in Hyderabad city...till now the entire immersion activity has been peaceful...by tomorrow morning we are hopeful that the entire immersion activity will be completed. The director, Kamalasan Reddy and his entire team, along with the other officers concerned department from GHMC, Health, RTC, R&B, and Electricity, have been a great help to Hyderabad city to ensure a peaceful completion of the Ganesh festival because from here they have been monitoring the activities live through their dedicated cameras and also dedicated drones and also dedicated CCTV-mounted vehicles..."
CP Hyderabad City Police retweeted
*బైక్‌పై గణేశ్ శోభాయాత్ర మార్గాలను పరిశీలించిన హైదరాబాద్ సీపీ సజ్జనర్*
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాలను బైక్‌పై హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్వయంగా పర్యటించి పరిశీలించారు. నగరంలో శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేలా చూడటంలో భాగంగా క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన ద్విచక్ర వాహనంపై ఈ తనిఖీ చేపట్టారు.
యాత్ర సాగుతున్న ప్రధాన కూడళ్లయిన మోజంజాహి (ఎంజే) మార్కెట్, బషీర్‌బాగ్, లిబర్టీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఊరేగింపు సజావుగా సాగేందుకు క్షేత్రస్థాయిలో చేపట్టిన బందోబస్తు, ఇతర ఏర్పాట్లను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. శోభాయాత్ర ఎక్కడా ఆగకుండా ముందుకు సాగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలని, శోభాయాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు.
విధుల్లో ఉన్న సిబ్బంది అంతా సమన్వయంతో ఉంటూ, నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.


















