Pinned Tweet
భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించాను. ఈ అవకాశమిచ్చిన మన నాయకులు శ్రీ @PawanKalyan గారికి, శ్రీ @narendramodi గారికి, శ్రీ @ncbn గారికి ధన్యవాదాలు. దేశ సేవకుడిగా పార్లమెంట్‌లో నా బాధ్యతలను నిర్వహిస్తాను.
#RajyaSabha #Mplingamaneni @JanaSenaParty
Lingamaneni Ramesh retweeted
టేకు వృక్షాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సాధించిన విజయం చారిత్రాత్మకం
• ఐదు దశాబ్దాల పరిశోధనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం అభినందనీయం
•మూడు అభివృద్ధి చెందిన టేకు క్లోన్ల విడుదలకు ఐసీఎఫ్ఆర్ఈ ఆమోదం
•మూడు టేకు క్లోన్లకు ఆమోదం లభించడం దేశంలోనే తొలిసారి
•ఈ ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ పరిశోనధనా విభాగం, పీసీసీఎఫ్ లను అభినందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
టేకు వృక్షాభివృద్ధి రంగంలో ఏకకాలంలో మూడు మెరుగైన క్లోన్లను సృష్టించి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సాధించిన చారిత్రాత్మక విజయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా అటవీ శాఖ పరిశోధనా విభాగం సాగించిన నిరంతర పరిశోధనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం అభినందనీయమని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారి ఈ అరుదైన ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పరిశోధనా విభాగం, పీసీసీఎఫ్, పరిశోధకులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా అభినందించారు.
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, బెంగళూరులోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ – ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ICFRE-IWST) సంయుక్తంగా పరిశోధన చేసి అభివృద్ధి చేసిన మూడు మెరుగైన టేకు క్లోన్లకు జాతీయ స్థాయిలో ఆమోదం లభించింది. ఐసీఎఫ్‌ఆర్‌ఈ వెరైటీ టెస్టింగ్ అండ్ రిలీజ్ విధానంలో ఈ క్లోన్లను విడుదల చేసేందుకు ఆమోదించడం రాష్ట్ర అటవీ పరిశోధన రంగ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తుంది. APFD-IWST-TG-1, APFD-IWST-TG-2, APFD-IWST-TG-3 పేర్లతో రూపొందించిన ఈ మూడు టేకు క్లోన్లు ఐదు దశాబ్దాలకు పైగా సాగిన నిరంతర పరిశోధన, మొక్కల ఎంపిక, క్షేత్రస్థాయి పరీక్షలు, శాస్త్రీయ మదింపు ఫలితంగా రూపుదిద్దుకున్నాయి. ఇందులో APFD-IWST-TG-1 క్లోన్ ను మన రాష్ట్రంలోని నర్సీపట్నం అటవీ ప్రాంతంలోని గుడిమర్రిపాకలలో అభివృద్ధి చేశారు. 1972లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ పరిశోధనా ప్రస్థానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ మెరుగైన టేకు క్లోన్లు భవిష్యత్తులో కలప ఉత్పాదకత పెంపునకు, రైతులు, కలప సాగుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు దోహదపడతాయి. అదే సమయంలో శాస్త్రీయ పద్ధతుల్లో అటవీ వనరుల అభివృద్ధికి, స్థిరమైన అటవీ నిర్వహణకు ఈ పరిశోధనలు తోడ్పడతాయని ఆకాంక్షించారు. అటవీ సంపద పరిరక్షణతో పాటు, ఆధునిక పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన ఐసీఎఫ్‌ఆర్‌ఈ–ఐడబ్ల్యూఎస్‌టీ శాస్త్రవేత్తలను అభినందించారు. జాతీయ స్థాయిలో దక్కిన ఈ గుర్తింపు భవిష్యత్ పరిశోధనలు, ఆవిష్కరణలకు స్ఫూర్తినిస్తుందన్నారు.
Lingamaneni Ramesh retweeted
Grateful for your thoughtful greetings and continued support Shri @MPLingamaneni ji. Thank you for your kind gesture.
Warm birthday wishes to Hon’ble Union Minister Shri @JoshiPralhad Ji. Wishing you good health, happiness, and continued strength in your service to the nation.
@PIB_India
@pibvijayawada
@airnewsalerts
@airnews_hyd
#HappyBirthdayPralhadJoshi #PralhadJoshi #lingamaneniramesh
నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల ఆవశ్యకతపై నా అభిప్రాయాలను ‘హిందుస్తాన్ టైమ్స్ తెలుగు’ ద్వారా పంచుకున్నాను.
👇
🔗 hindustantimes.com/telugu/an…
#Delimitation #WomensReservation #ViksitBharat #AndhraPradesh #lingamaneniramesh
Warm birthday wishes to Hon’ble Union Minister Shri @JoshiPralhad Ji. Wishing you good health, happiness, and continued strength in your service to the nation.
@PIB_India
@pibvijayawada
@airnewsalerts
@airnews_hyd
#HappyBirthdayPralhadJoshi #PralhadJoshi #lingamaneniramesh
ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పిస్తూ...
దేశ ప్రగతికి దిశానిర్దేశం చేస్తున్న పవిత్ర గ్రంథం మన రాజ్యాంగం.
ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును స్మరించుకుంటూ...
అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.
@PIB_India
@pibvijayawada
@IPR_AP
@airnewsalerts
@airnews_hyd
#SamvidhanDiwas #IndianConstitution #ConstitutionOfIndia #lingamaneniramesh
Lingamaneni Ramesh retweeted
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా పోటీ చేస్తున్న NDA కూటమి బలపరచిన అభ్యర్థి శ్రీమతి ఆకుల భవాని గారి కొరకు బ్యాలెట్ నం.1 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
సమాజ సంక్షేమం, నిస్వార్థ సేవే పరమావధిగా సిక్కు మతాన్ని స్థాపించి, సత్యం, ప్రేమ, సమానత్వ విలువలను మానవాళికి బోధించిన పరమ పవిత్ర గురువు శ్రీ గురునానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా సిక్కు సోదరసోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి దివ్య బోధనలు సమాజానికి నిత్య స్ఫూర్తి.
సత్ శ్రీ అకాల్.
Warm greetings to our Sikh brothers and sisters on the Jayanti of Sri Guru Nanak Dev Ji. His timeless teachings of truth, equality, and selfless service remain a constant inspiration to humanity.
Sat Sri Akal.
@PIB_India
@pibvijayawada
@airnewsalerts
@airnews_hyd
#GuruNanakJayanti #Gurpurab #Waheguru #GuruNanakDevJi #SatnamWaheguru #HappyGurpurab #GuruNanakJayanti2026
6
141
పరమపవిత్రమైన కార్తీక పౌర్ణమి వెలుగులు ప్రతి ఇంటా సుఖశాంతులను, ఆయురారోగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తూ... అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
@PIB_India
@pibvijayawada
@airnews_hyd
#KarthikaPournami #KartikPurnima #KarthikaDeepam #KarthikaMasam #lingamaneniramesh #DevDeepawali #KarthikaPournami2026 #Deepotsavam
"అందరినీ ప్రేమించు... అందరినీ సేవించు" అనే దివ్య సందేశంతో మానవ సేవే మాధవ సేవ అని చాటిన మహనీయులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాను. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో వారు అందించిన నిస్వార్థ సేవలు చిరస్మరణీయం. సత్యం, ధర్మం, శాంతి మార్గంలో వారు అందించిన బోధనలు తరతరాలకు మార్గదర్శకం.
#SriSathyaSaiBaba #SathyaSaiJayanthi
Warm birthday wishes to the Hon’ble Speaker of the Lok Sabha, Shri @ombirlakota Ji.
The composure, fairness, and dedication with which you uphold democratic values and guide the proceedings of the House are commendable. Wishing you a healthy, happy, and long life ahead.
@PIB_India
@pibvijayawada
@loksabhaspeaker
@LokSabhaSectt
@sansad_tv
#OmBirla #LokSabhaSpeaker
1
6
205
Lingamaneni Ramesh retweeted
పులి కదలికలపై నిరంతర నిఘా.. ప్రజల భద్రతకు భరోసా
•థర్మల్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరా ట్రాప్‌లతో నిఘా
•హనుమాన్ (@HANUMAN_APGOV) బృందాలతో విస్తృత పర్యవేక్షణ చేపట్టండి
•ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలి
•అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాలను రప్పించండి
•రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలి
•పులికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకునేలా చర్యలు
•ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సమీక్ష
ఏ.కొండూరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. పులి కదలికలపై నిరంతరం నిఘా పెడుతూ, ప్రజల భద్రత భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అధునాతన సాంకేతికతతోపాటు ఇతర రాష్ట్రాల నిపుణుల సహకారం తీసుకోవాలని అటవీశాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ స్వీయ పర్యవేక్షణలో ఆపరేషన్ నిర్వహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. పులి కదలికలు, దాని సంచార ప్రాంతాలు, ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, పులి సంచార మార్గాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమాచారాన్ని పరిసర గ్రామాల ప్రజలకు చేరవేయాలి. స్థానిక అటవీ శాఖ బృందాలతో సమన్వయం చేసుకుంటూ హనుమాన్ (H.A.N.U.M.A.N) బృందాలతో విస్తృతంగా గస్తీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పులి కదలికలను మరింత సమర్థవంతంగా గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరా ట్రాప్‌లు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలను విస్తృతంగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ను పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ (CWL), ఇతర అటవీ శాఖ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో చేపట్టే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
పులి సంచరిస్తున్న ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో ప్రజల భద్రతకు తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు, పశువుల కాపరులు, స్థానిక ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా అవసరమైన సూచనలు చేయాలన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక పులి ట్రాకింగ్, రెస్క్యూ బృందాలను రప్పించి ఆపరేషన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ, అనుభవజ్ఞులైన వన్యప్రాణి నిపుణుల సహకారంతో పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ ఆపరేషన్‌లో ప్రజలకుగానీ, పులికిగానీ ఎలాంటి హాని కలగకూడదని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. ప్రజల ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, పులి సంరక్షణను కూడా బాధ్యతగా తీసుకుని జాగ్రత్తగా, సమన్వయంతో చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, చేపట్టిన చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు కలగకుండా అన్ని చర్యలను, అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు.
@APFDOfficial @PIB_India @IPR_AP @pibvijayawada
ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటూ, కష్టనష్టాలకు వెరవక బతుకు నావను నడిపిస్తున్న మత్స్యకార సోదరులందరికీ ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు.
మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వేట నిషేధ భృతిని రూ. 20 వేలకు పెంచడంతో పాటు, వారి ఉపాధికి ఆటంకంగా మారిన గత ప్రభుత్వ జీవో నంబర్ 217ను రద్దు చేసి గంగపుత్రులకు పూర్తి భరోసా కల్పించింది. మత్స్యకార సోదరులు, వారి కుటుంబాలు సురక్షితంగా, గౌరవంగా, సుఖసంతోషాలతో, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను.
Warm wishes on World Fisheries Day to our fishermen brothers who brave the open seas and everyday hardships with unmatched resilience.
Standing firmly by our Gangaputras, the Kutami government has raised the fishing ban relief to ₹20,000 and scrapped the previous regime's GO 217 to protect their livelihoods. Wishing them and their families continued safety, dignity, and prosperity.
@narendramodi
@ncbn
@PawanKalyan
@PIB_India
@pibvijayawada
#WorldFisheriesDay #Fishermen #Matsyakara #lingamaneniramesh
9
278
Saddened to hear about the passing of Smt. Savitri Devi Ji, mother of Hon’ble Uttar Pradesh Chief Minister Shri @myogiadityanath Ji. Losing a mother leaves an irreplaceable void. My heartfelt condolences and prayers are with Yogi Ji and his family in this hour of grief. Om Shanti.
#OmShanti
#YogiAdityanath
10
538
Lingamaneni Ramesh retweeted
విజయవాడ, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయాల స్ఫూర్తితో రాబోయే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు సమష్టి కృషి, ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని ఏపీ గ్రీన్ ఛైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl గారు పేర్కొన్నారు. గురువారం కాకినాడలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల కార్యాచరణ, అన్ని వర్గాల నాయకుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
తెలుగు నేలపై ఐఐటీ విద్యా వెలుగులు పంచిన మహనీయుడు, గురువు చుక్కా రామయ్య గారికి వందో పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆయన అంకితభావం, నిరాడంబరత తరతరాలకు మార్గదర్శకం. నిండు ఆయురారోగ్యాలతో, ఆనందంగా శతాబ్ది వసంతంలోకి అడుగుపెడుతున్న రామయ్య మాస్టారు అనునిత్యం మనందరికీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#ChukkaRamaiah #100thBirthday #lingamaneniramesh
@PIB_India
@pibvijayawada
@airnews_hyd
@eenadulivenews
#ChukkaRamaiah #100thBirthday #lingamaneniramesh
14
361
Lingamaneni Ramesh retweeted
దేశభక్తికి నిలువెత్తు రూపం ఝాన్సీ లక్ష్మీబాయి.
బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొంటూ, చివరి శ్వాస వరకు స్వరాజ్యం కోసం ఆమె పోరాడిన తీరు భారతీయులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఆమె పోరాట పటిమ మనందరికీ ఆదర్శం.
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#RaniLakshmiBai
మాతృభూమి స్వాతంత్ర్యం కోసం తుదిశ్వాస వరకు పోరాడిన మహోన్నత వీరనారి, ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఆ మహానియురాలికి నివాళులు అర్పిస్తున్నాను.
ఆమె అమర త్యాగం... దేశభక్తికి, తెగువకు ప్రతీకగా నిలిచిన ఆమె జీవితం... దేశ సేవలో ముందుకు సాగడానికి నిత్య స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
@PIB_India
@pibvijayawada
@airnewsalerts
@airnews_hyd
#RaniLakshmibai #JhansiKiRani #lingamaneniramesh
Warm birthday greetings to Hon’ble Union Minister Shri @KirenRijiju ji.
Your tireless dedication to public service and the development of the nation is truly commendable. Praying for your good health, happiness, and continued success in serving the people.
@PIB_India
@mpa_india
@airnewsalerts
@airnews_hyd
@pibvijayawada
#KirenRijiju #lingamaneniramesh
Lingamaneni Ramesh retweeted
అగ్ని ప్రమాదంలో వలలు కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలవండి
•పరిహారం చెల్లించే ఏర్పాటు చేయండి
•ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులు షెడ్లలో ఉంచిన వలలు దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులంతా వలలు షెడ్లలో ఉంచుకోగా , అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. మొత్తం 250 నుంచి 300 వరకు వలలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు. తుపాను కారణంగా వేట విరామం ఉండడం, వలలు కాలిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందజేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. నష్టపరిహారం అందించాలని, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2.O పథకం కింద నష్టపోయిన వలలను తిరిగి అందించే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వలలు నష్టపోయిన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
Lingamaneni Ramesh retweeted
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#RamojiExcellenceAwards2026






















