Vemula Prashanth Reddy (@VPR_BRS) header
Vemula Prashanth Reddy (@VPR_BRS) profile picture

Ex Minister for Roads & Buildings, Legislative affairs and Housing, MLA from Balkonda, Telangana.

Hyderabad, India
Joined October 2018
Photo by Vemula Prashanth Reddy (@VPR_BRS)Photo by Vemula Prashanth Reddy (@VPR_BRS)Photo by Vemula Prashanth Reddy (@VPR_BRS)Photo by Vemula Prashanth Reddy (@VPR_BRS)Photo by Vemula Prashanth Reddy (@VPR_BRS)Photo by Vemula Prashanth Reddy (@VPR_BRS)Photo by Vemula Prashanth Reddy (@VPR_BRS)Photo by Vemula Prashanth Reddy (@VPR_BRS)Photo by Vemula Prashanth Reddy (@VPR_BRS)Photo by Vemula Prashanth Reddy (@VPR_BRS)
మనలో సరికొత్త ఉత్సాహానికి స్ఫూర్తినిస్తూ .. వెలుగును పంచే దీపావళి పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.... #kcr #ktr #brs – at Hyderabad, India
4
154
🔸రైతాంగాన్ని నిలువునా మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ 🔸కేసీఆర్ హయాంలో రాజులా బతికిన రైతన్నకు నేడు యూరియా కష్టాలు, కరెంట్ కోతలు 🔸కాళేశ్వరం నీళ్లను సముద్రం పాలుచేస్తూ రైతుల నోట్లో మట్టికొడుతున్నారు 🔸ఎస్సారెస్పీకి రావాల్సిన 90 టీఎంసీల నీటిని కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్దేశ్య పూర్వకంగా ఆపేసింది 🔸మేడిగడ్డ మరమ్మతులను మూడేళ్లుగా గాలికొదిలేసి తమ్మిడిహట్టి పేరుతో కొత్త డ్రామాలు 🔸కేసీఆర్ నిర్మించిన థర్మల్ ప్లాంట్లను బొగ్గు లేక బంద్ పెట్టిన అసమర్థ సర్కార్ 🔸ఈ నెల 11న నిర్మల్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ‘రైతు గర్జన’ బహిరంగ సభ 🔸రైతుబంధు, 24 గంటల కరెంట్, సాగునీటి సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం 🔸రైతు గర్జన సభకు ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు 🔸నిర్మల్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. సభా స్థలి పరిశీలన 🔸నిర్మల్ గడ్డపై గులాబీ దళం కదం తొక్కాలి.. రైతు గర్జనను విజయవంతం చేయండి 👉 మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్మల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ రామకృష్ణారెడ్డి సమన్వయంతో నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఇన్‌చార్జ్ జాన్సన్ నాయక్, పార్టీలో చేరిన వినయ్ రెడ్డి తదితరులతో కలిసి నిర్మల్‌లో నిర్వహించనున్న ‘రైతు గర్జన’ బహిరంగ సభ ప్రచార పోస్టర్‌ను శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతాంగ సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యమిచ్చి రైతును రాజులా చూసుకున్నారని గుర్తుచేశారు. ఆనాడు 24 గంటల ఉచిత విద్యుత్, సరిపడా సాగునీరు అందించి బంగారం లాంటి పంటలు పండించేలా ప్రోత్సహిస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు వేయవద్దని చెప్పే దుస్థితికి తెచ్చిందని మండిపడ్డారు. గతంలో రైతు ఫోన్ చేస్తే ఆటోలలో పొలాల వద్దకే ఎరువుల సంచులు చేరేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు రోజుల తరబడి లైన్లలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టుకుని గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘యాప్‌ల’ పేరుతో సర్వర్లు పనిచేయక ఒక్కో రైతుకు అరకొరగా బస్తాలు ఇస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుబంధు సకాలంలో పంపిణీ చేయకుండా రైతాంగాన్ని అప్పులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేసి, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి భూగర్భ జలాలను పుష్కలంగా పెంచారని తెలిపారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ బృందం కన్నెపల్లి పంప్‌హౌస్, మేడిగడ్డ బ్యారేజీని స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిందని చెప్పారు. ప్రస్తుతం కరువు కాలంలోనూ మేడిగడ్డ వద్ద ప్రతిరోజూ 22 వేల క్యూసెక్కులు (సుమారు 2 టీఎంసీలు) నీరు నిరుపయోగంగా దిగువకు సముద్రం పాలు అవుతున్నా, ప్రభుత్వం కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయడం లేదని మండిపడ్డారు. వర్షాకాలంలో రోజూ 10 నుంచి 11 టీఎంసీల నీరు దిగువకు వృథాగా వెళ్లిపోయినా అసెంబ్లీలో, బయటా తాము ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని దుయ్యబట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) పునర్జీవ పథకం కింద కేసీఆర్ నిర్మించిన రివర్స్ పంపింగ్ వ్యవస్థ పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆన్ చేయలేదన్నారు. వర్షాకాలంలోని 90 రోజుల్లో రోజుకు 1 టీఎంసీ చొప్పున మొత్తం 90 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం కావాలనే వదిలేసిందన్నారు. తద్వారా కాకతీయ, సరస్వతి కాల్వల ఆయకట్టుకు, లిఫ్ట్ ఇరిగేషన్ ఆధారిత చెరువులకు సమృద్ధిగా నీరిచ్చే చారిత్రక అవకాశాన్ని రైతులు కోల్పోయేలా చేశారని ఆరోపించారు. కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే అక్కసుతోనే, మేడిగడ్డ వద్ద కేవలం రెండు పిల్లర్లలో ఏర్పడిన పగుళ్లను మూడేళ్లుగా సరిచేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు తమ్మిడిహట్టి పేరుతో ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరలేపిందని విమర్శించారు. @KCRBRSPresident @BRSparty @KTRBRS – at Hyderabad, India
1
5
18
823
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా 8,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సిద్ధం చేసి ఇస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రికి థర్మల్ ప్లాంట్లు బొగ్గుతో నడుస్తాయన్న కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. స్థానిక సింగరేణి బొగ్గును పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటూ, రాష్ట్రంలోని ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయలేక మూసివేయించి రాష్ట్రాన్ని 6 నుండి 7 గంటల కరెంట్ కోతల్లోకి నెట్టారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రజాక్షేత్రంలో నిలదీసిన తర్వాతే విద్యుత్ సరఫరాలో కొంత కదలిక వచ్చిందని తెలిపారు. రైతాంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్, సకాలంలో రైతుబంధు, సరిపడా యూరియా మరియు ప్రాజెక్టుల సాగునీటి హక్కులను సాధించుకోవడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. బొగ్గు ప్రైవేటీకరణపై మంచిర్యాలలో, రైతుల సమస్యలపై అదిలాబాద్‌లో ఉద్యమించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.. నిర్మల్ రైతాంగం తరఫున గళమెత్తేందుకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం నిర్మల్ మినీ స్టేడియంలో జరిగే భారీ "రైతు గర్జన" బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ప్రకటించారు.ఈ సందర్బంగా రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ రైతు గర్జన సభకు నిర్మల్ నియోజకవర్గ రైతన్నలతో పాటు పట్టణ ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వ్యాపార వర్గాలు, విద్యార్థి-యువజనులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, రైతుల హక్కులను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కేటీఆర్ గారి నాయకత్వానికి మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.తదనంతరం రైతు గర్జన సభాస్థలి ని పరిశీలించారు – at Hyderabad, India
66
🔸 మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం బట్టబయలైంది 🔸 వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి SRSP, నిజాంసాగర్ ప్రాజెక్టులను నింపాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ 🔸 రైతుల పంటలను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం 🔸 మేడిగడ్డ వద్ద 85 పిల్లర్లు నిటారుగా ఉన్నాయి.. కూలిపోయిందన్న ప్రచారం పచ్చి అబద్ధం 🔸 కేసీఆర్ పేరు రాకూడదనే దుర్బుద్ధితోనే నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారా? 🔸 రెండు టీఎంసీల ప్రవాహం ఉన్నా ఎత్తిపోయరా? పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వ మొద్దు నిద్ర 🔸 సాగునీరు విడుదల చేయకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రైతు పోరుబాట తప్పదు మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయిందని, కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చేస్తోన్న ప్రచారం పచ్చి అబద్ధమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను, రైతుల గోసను స్వయంగా చూసిన ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మొదట కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాణహిత-గోదావరి సంగమ ప్రాంతాన్ని, సిరోంచ, కాళేశ్వరం మధ్య గోదావరి బ్రిడ్జ్ వద్ద ఉన్న నీటి ప్రవాహాన్ని, కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించి తదనంతరం నేరుగా మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం బ్యారేజ్ పైకి వాహనాలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వారితో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... 👇🏻 మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 పిల్లర్లతో నిటారుగా చెక్కు చెదరకుండా నిలబడి ఉన్న వాస్తవాన్ని స్వయంగా మీడియా కెమెరాల సాక్షిగా ప్రజలందరూ గమనించవచ్చని పేర్కొన్నారు. గత మూడు వర్షాకాలాల్లో సంభవించిన భారీ వరదలు, లక్షలాది క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన ఈ బ్యారేజిలో ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదని స్పష్టం చేశారు. కేవలం రెండు మూడు పిల్లర్లకు చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే, వాటిని మూడేళ్లుగా బాగుచేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద దాదాపు 22,000 క్యూసెక్కుల ప్రవాహం (రోజుకు సుమారు 2 టీఎంసీల మేర నీరు) వృథాగా దిగువకు తరలిపోతోందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఆ నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ (SRSP), నిజాంసాగర్ సహా మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి రిజర్వాయర్లన్నింటినీ నింపవచ్చని వివరించారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ ప్రాజెక్టును పూర్తిగా నింపవచ్చని, రోజుకు అర టీఎంసీ చొప్పున నెలన్నర రోజులు పంపింగ్ చేస్తే 18 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్‌ను పూర్తిగా నింపే అవకాశముందని గుర్తుచేశారు. నీరు లేక గుత్ప, అలీసాగర్, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, నవాబు, వేంపల్లి, సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి లిఫ్టుల కింద, నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటలు ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గోదావరి జలాలను ఎత్తిపోసి చెరువులు, రిజర్వాయర్లు నింపితే కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ద్వేషపూరితమైన దుర్బుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తోందని ఆరోపించారు. ఇక్కడ నీటిని దిగువకు వదిలేస్తుంటే, చంద్రబాబు ఆ నీటిని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు తరలించుకుపోతున్నారని, కానీ తెలంగాణలో పక్కనే ఉన్న ప్రాజెక్టులకు మాత్రం ఈ ప్రభుత్వం నీరివ్వడం లేదని దుయ్యబట్టారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రస్తుతం కేవలం 4,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉండగా, మేడిగడ్డ వద్ద 22,000 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడ ప్రాజెక్టు కడతామని చెప్పడం ప్రజలను మోసగించే సరికొత్త డ్రామా అని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన రాక్షస వైఖరిని, దుర్బుద్ధిని విడనాడి, ఇప్పటికైనా తక్షణమే మోటార్లు ఆన్ చేసి వృథాగా పోతున్న నీటిని ప్రాజెక్టులకు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి సాగునీరు అందించకపోతే తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ఏకం చేసి పెద్దఎత్తున 'రైతు పోరుబాట' ఉద్యమాన్ని చేపడతామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. @kcr @ktr @BRSparty – at Hyderabad, India
4
18
894
👉 మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం బట్టబయలైంది 👉 వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి SRSP, నిజాం సాగర్ ప్రాజెక్టులను నింపాలి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ 👉 రైతుల పంటలను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం 👉 మేడిగడ్డ వద్ద 85 పిల్లర్లు నిటారుగా ఉన్నాయి.. కూలిపోయిందన్న ప్రచారం పచ్చి అబద్ధం 👉 కేసీఆర్ పేరు రాకూడదనే దుర్బుద్ధితోనే నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారా? 👉 రెండు టీఎంసీల ప్రవాహం ఉన్నా ఎత్తిపోయరా?..పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వ మొద్దునిద్ర 👉 సాగునీరు విడుదల చేయకపోతే కేటీఆర్ నాయకత్వంలో రైతు పోరుబాట తప్పదు మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయిందని, కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తోన్న ప్రచారం పూర్తిగా పచ్చి అబద్ధమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను, రైతుల గోసను స్వయంగా చూసిన ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మొదట కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాణహిత–గోదావరి సంగమ ప్రాంతాన్ని, సిరోంచ, కాళేశ్వరం మధ్య గోదావరి బ్రిడ్జ్ వద్ద ఉన్న నీటి ప్రవాహాన్ని, కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించి తధనంతరం నేరుగా మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.మెడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం బ్యారేజ్ పైకి వాహనాలు వెళ్లకుండా పోలీసు లు అడ్డుకోవడంతో కాసేపు వారితో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి BRS ప్రతినిధులు వాగ్విదానికి దిగారు. ఈ సందర్భంగా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 పిల్లర్లతో నిటారుగా చెక్కుచెదరకుండా నిలబడి ఉన్న వాస్తవాన్ని స్వయంగా మీడియా కెమెరాల సాక్షిగా ప్రజలందరూ గమనించవచ్చని పేర్కొన్నారు. గత మూడు వర్షాకాలాల్లో సంభవించిన భారీ వరదలు, లక్షలాది క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన ఈ బ్యారేజీలో ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదని స్పష్టం చేశారు. కేవలం రెండు మూడు పిల్లర్లకు చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే, వాటిని మూడేళ్లుగా బాగుచేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద దాదాపు 22,000 క్యూసెక్కుల ప్రవాహం (రోజుకు సుమారు 2 టీఎంసీల మేర నీరు) వృథాగా దిగువకు తరలిపోతోందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఆ నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ (SRSP), నిజాంసాగర్ సహా మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి రిజర్వాయర్లన్నింటినీ నింపవచ్చని వివరించారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ ప్రాజెక్టును పూర్తిగా నింపవచ్చని, రోజుకు అర టీఎంసీ చొప్పున నెలన్నర రోజులు పంపింగ్ చేస్తే 18 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్‌ను పూర్తిగా నింపే అవకాశముందని గుర్తుచేశారు. నీరు లేక గుత్ప, అలీసాగర్, చౌట్‌పల్లి హన్మంత్రెడ్డి, నవాబు, వేంపల్లి, సారంగాపూర్, మెంట్రాజ్ పల్లి లిఫ్టుల కింద, నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటలు ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గోదావరి జలాలను ఎత్తిపోసి చెరువులు, రిజర్వాయర్లు నింపితే కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ద్వేషపూరితమైన దుర్బుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తోందని ఆరోపించారు. ఇక్కడ నీటిని దిగువకు వదిలేస్తుంటే, చంద్రబాబు నాయుడు ఆ నీటిని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు తరలించుకుపోతున్నారని, కానీ తెలంగాణలో పక్కనే ఉన్న ప్రాజెక్టులకు మాత్రం ఈ ప్రభుత్వం నీరివ్వడం లేదని దుయ్యబట్టారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రస్తుతం కేవలం 4,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉంటే, మేడిగడ్డ వద్ద 22,000 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడ ప్రాజెక్టు కడతామని చెప్పడం ప్రజలను మోసగించే సరికొత్త డ్రామా అని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన రాక్షస వైఖరిని, దుర్బుద్ధిని విడనాడి, ఇప్పటికైనా తక్షణమే మోటార్లు ఆన్ చేసి వృథాగా పోతున్న నీటిని ప్రాజెక్టులకు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి సాగునీరు అందించకపోతే తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున 'రైతు పోరుబాట' ఉద్యమాన్ని చేపడతామని శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. @KTR_News @KCRBRSPresident @TeluguScribe @BRSTechCell – at Hyderabad, India
5
21
859
తెలంగాణ రాష్ట్ర మరియు జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మీ జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు,అభివృద్ధి, విజయాలు నింపాలని.. “చెడుపై మంచి విజయం… అధర్మంపై ధర్మం విజయం సాధించినట్టుగా ప్రతి అడుగులో విజయం మీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కొరుకుంటూ విజయదశమి(దసరా ) పండుగ పర్వదిన శుభాకాంక్షలు #Happyvijayadasami – at Metpalli, India
1
3
25
711
🔸 కాంగ్రెస్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో కరెంట్, సాగునీటి సంక్షోభం 🔸 నాడు కేసీఆర్ హయాంలో 24 గంటల నిరంతర విద్యుత్.. నేడు 6 గంటలు కూడా ఇవ్వలేని రేవంత్ సర్కార్ 🔸 సింగరేణిలో బొగ్గు మాయం.. కుంభకోణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి 🔸 ఎల్ నినో' సాకు ఓ బూటకం.. ఏపీలో లేని కరెంట్ కష్టాలు తెలంగాణలోనే ఎందుకు? 🔸 కేసీఆర్ నిర్మించిన థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా నిలిపివేసి రైతుల పొట్ట కొడతారా? 🔸 కరెంట్ లేక ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25,000 నష్టపరిహారం చెల్లించాలి 🔸 రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుంది కాంగ్రెస్ వైఖరి 🔸 ప్రజలు తనను సస్పెండ్ చేస్తారని తెలిసి అధికారులపై నెపం. నేడుతున్న రేవంత్ రెడ్డి... విద్యుత్ సరఫరాపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి 🔸 నిజామాబాద్ జిల్లా చెరువులను నింపేందుకు ఎస్సారెస్పీ నుంచి తక్షణమే 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలి 🔸 గుత్ప, అలీసాగర్, లక్ష్మీ కెనాల్ లిఫ్టులను పూర్తి సామర్థ్యంతో నడపకపోతే రైతు ఉద్యమం తప్పదు. 👉 మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం, ముందుచూపులేని విధానాల కారణంగా రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేల్పూర్ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలు, సాగునీటి ఎద్దడితో చేతికొచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్య పరిష్కారంపై కాకుండా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను తిట్టడం, రాజకీయ కక్షసాధింపు డ్రామాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించి రైతులను ఆదుకున్నారని వేముల గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరఫరా క్రమంగా 11 గంటల నుంచి 9 గంటలకు, ఆపై 7 గంటలకు, నేడు కనీసం 6 గంటలు కూడా సరిగ్గా ఇవ్వలేని దుస్థితికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే కొద్దిపాటి విద్యుత్ కూడా లో-వోల్టేజీతో, పదే పదే ట్రిప్ అవుతుండటంతో మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం నిత్యకృత్యంగా మారిందని తెలిపారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను బాగుచేసే నాథుడు లేక 15 రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తోందని, ఆ వ్యవధిలోనే పంటలు నిలువునా ఎండిపోతున్నాయని ఆరోపించారు. విద్యుత్ కొరతకు 'ఎల్ నినో' ప్రభావం, వర్షాలు లేకపోవడమే కారణమంటూ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవే కృష్ణా, గోదావరి నదులు, అవే వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ లేని విద్యుత్ కొరత, కరెంట్ కోతలు తెలంగాణలోనే ఎందుకు దాపురించాయని ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. వర్షాభావం వల్ల జలవిద్యుత్ తగ్గినా రాష్ట్రంలో కరెంట్ కొరత రాకూడదనే ఉద్దేశంతోనే నాడు సీఎం కేసీఆర్ ముందుచూపుతో కొత్తగూడెం (800 మెగావాట్లు), భద్రాద్రి (540 మెగావాట్లు), యాదాద్రి (4,000 మెగావాట్లు) వంటి భారీ థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మించి అప్పగించారని వివరించారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,000 మెగావాట్లు ఉండగా, కేసీఆర్ దానిని రికార్డు స్థాయిలో 20,000 మెగావాట్లకు పెంచారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయకుండా ఉత్పత్తిని 12,000 - 13,000 మెగావాట్లకు తగ్గించిందని ఆరోపించారు. సింగరేణి సంస్థలో ఉన్న బొగ్గును స్థానిక థర్మల్ కేంద్రాలకు ఇవ్వకుండా, ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తూ సంస్థ ఉనికిని ప్రమాదంలోకి నెడుతున్నారని విమర్శించారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు మాయమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధారాలతో నిరూపించినా ప్రభుత్వం నేటికీ స్పందించలేదని మండిపడ్డారు. నెలన్నర రోజులుగా రైతులు సబ్‌స్టేషన్ల ఎదుట, రోడ్లపై బైఠాయించి కన్నీరుమున్నీరవుతుంటే పట్టించుకోని ప్రభుత్వం, తీరా ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకునేసరికి సమీక్షల పేరుతో అధికారులను సస్పెండ్ చేస్తామంటూ నాటకాలాడుతోందని విమర్శించారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందంగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. నాడు కేసీఆర్ హయాంలో నిరంతర విద్యుత్ అందించి, ప్రాజెక్టులను సమర్థవంతంగా నడిపించింది ఇదే అధికారులని, పాలకులు మారిన విధానపరమైన అసమర్థతను అధికారులపై నెట్టి తప్పించుకోవాలని చూడటం హేయమని పేర్కొన్నారు. – at Hyderabad, India
1
6
7
919
90 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వర్షాకాలంలో కేవలం 46 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరిందని తెలిపారు. గోదావరి వరద నీరు లక్షల క్యూసెక్కులు సముద్రం పాలవుతున్న సమయంలో మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తకుండానే, కేసీఆర్ రూ. 1,900 కోట్లతో నిర్మించిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లు నడిపి రోజూ 1 టీఎంసీ చొప్పున 40 రోజుల్లో 40 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి తరలించవచ్చని మొరపెట్టుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు కృష్ణా నది నీటిని 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు తీసుకువెళ్లగలిగారని, కానీ ఇక్కడి ప్రభుత్వం కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్సారెస్పీ ప్రాజెక్టును నింపడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. *నిజామాబాద్ జిల్లా చెరువులను నింపేందుకు 4 టీఎంసీల నీరివ్వాలి* ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని పంటలను కాపాడటానికి, తాగునీటి ఎద్దడి రాకుండా చెరువులను నింపడానికి ఎస్సారెస్పీ నుంచి వెంటనే 3 నుంచి 4 టీఎంసీల నీటిని కేటాయించాలని వేముల డిమాండ్ చేశారు: 👉 540 క్యూసెక్కుల సామర్థ్యమున్న గుత్ప లిఫ్ట్ 4 మోటార్లకు గాను ప్రస్తుతం 360 క్యూసెక్కులు మాత్రమే నడుపుతున్నారని, పూర్తిస్థాయిలో నడిపించేందుకు కేవలం 1 టీఎంసీ నీరు అవసరమని తెలిపారు. 👉 అలీసాగర్ లిఫ్ట్1,175 క్యూసెక్కుల పూర్తి సామర్థ్యానికి గాను కేవలం 360 క్యూసెక్కులే ఇస్తున్నారని, దీని పూర్తి వినియోగానికి మరో 1 టీఎంసీ నీరు ఇవ్వాలని కోరారు. 👉 600 క్యూసెక్కుల సామర్థ్యమున్న లక్ష్మి కెనాల్ కాలువ ద్వారా కేవలం 200 క్యూసెక్కులే వదులుతున్నారని, మిగిలిన 400 క్యూసెక్కులను కూడా విడుదల చేసి చౌట్‌పల్లి హనుమంత్ రెడ్డి (166 క్యూసెక్కులు), వేంపల్లి, బోదెపల్లి, నవాబ్ లిఫ్టులకు సాగునీరందించాలన్నారు 👉 మెంట్రాజ్ పల్లి పంపులు ఆన్ చేసి ప్యాకేజి 21 ద్వారా కప్పల వాగు,పెద్దవాగు లో నీళ్లు నింపాలి 👉 వరద కాలువ ద్వారా నీటిని వదిలేటప్పుడు బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని రైతులకు నీరందేలా SRSP లో లెవల్స్‌ను పైకి ఉంచాలని, లేనిపక్షంలో స్థానిక రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రధాన డిమాండ్లు చేసారు • థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి నుంచి తక్షణమే పూర్తిస్థాయిలో బొగ్గు సరఫరా చేసి, అన్ని ప్లాంట్లను నడిపించి రైతులకు నిరంతర విద్యుత్ అందించాలి. • పంటలను రక్షించేందుకు ప్రభుత్వం బయట మార్కెట్ నుంచి అయినా తక్షణమే విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేయాలి. • కరెంట్ కోతలు, సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ. 25,000 చొప్పున పరిహారం చెల్లించాలి. • లో-వోల్టేజీ సమస్యతో కాలిపోయిన వ్యవసాయ మోటార్ల రిపేర్ ఖర్చులను ప్రభుత్వమే చెల్లించాలి. • కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను మూడు రోజుల్లోగా బాగుచేయాలి లేదా యుద్ధప్రాతిపదికన కొత్తవి ఏర్పాటు చేయాలి. • సింగరేణిలో మాయమైన 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు, టెండర్ల అవకతవకలు, సైట్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ల కుంభకోణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. • రైతులకు రోజుకు ఎన్ని గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తారో గడువుతో కూడిన స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించాలి. • ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో నడిపించి, చెరువులను నింపేందుకు ఎస్సారెస్పీ నుంచి తక్షణమే 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. రైతాంగ సమస్యలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా చెప్పుకుంటున్న సుదర్శన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా అన్నదాతలతో కలిసి పెద్దఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేందర్ కల్లెడ ఏలీయా , నాగదర్ రెడ్డి,బద్దం నర్సారెడ్డి మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి , మాజీ ఎంపిపి మహేష్,నియోజకవర్గ PACS చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు @BRSparty @KTRBRS @KTR_News @TeluguScribe @BRSTechCell @KCRBRSPresident – at Hyderabad, India
227
అశ్మక నుంచే చారిత్రక సౌరభం.. జైనం, బౌద్ధం విరాజమానం నిర్బంధ నిశీధి కుడ్యాలపైన రాసినదల్లా రణమైన, ఘనమైన నేల నవనాథ నందులు రంకెలేసిన చోట.. చిందు ఎల్లమ్మ, శివసత్తులాట ఇదిగిదిగో శ్రీరాంసాగర్.. ఇదే మన నిజామాబాద్! కేసీఆర్ జమానా మన జిల్లా ప్రగతి నమూనా జిల్లా ఆవిర్భావ దశాబ్ది శుభాకాంక్షలు! @BRSparty @KCRBRSPresident @KTR_News @KTRBRS @BRSHarish – at Hyderabad, India
3
29
594
🔸 కేసీఆర్ పదేళ్ల స్వర్ణయుగ పాలనపై అసత్య ప్రచారాలు మానుకోవాలి 🔸వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే కేసీఆర్, కేటీఆర్‌లపై కాంగ్రెస్ బురదజల్లుడు 🔸కేసీఆర్ పరిపాలనా వికేంద్రీకరణతోనే సంక్షేమం గడపగడపకూ చేరింది 🔸 బొగ్గు కొరతతో 5 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి బంద్.. రైతులను గోసపెడుతున్న రేవంత్ సర్కార్ 🔸 కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేకనే రైతులు తమ ధన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారు 🔸 రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? 🔸 నాడు దేశంలో నంబర్ వన్.. నేడు 12 వ స్థానానికి దిగజారిన తెలంగాణ 🔸 అక్రమ కేసులు, పోలీసుల వేధింపులతో పాలన సాగించలేరు 🔸 కేసీఆర్ హయాంలోనే నిజామాబాద్ ప్రగతి.. .. నేడు కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోతున్నారు 🔸 అంతర్గత సర్వేల్లో కాంగ్రెస్ ఖేల్ ఖతం.. 80 శాతం స్థానాలతో బీఆర్ఎస్ పునరాగమనం ఖాయం 🔸 అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమ కారులకు సన్మానం 👉 మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో నూతన జిల్లాల పునర్విభజన జరిగి అక్టోబర్ 11 నాటికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్‌లోని జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అధ్యక్షత వహించగా, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎవరూ ఊహించని రీతిలో 14-15 ఏళ్లపాటు అలుపెరగని ఉద్యమం చేసి, యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి, ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన అపర చాణక్యుడు కేసీఆర్ అని వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. నాడు ఉద్యమంలో స్వార్థం లేకుండా పోరాడిన జేఏసీ చైర్మన్లు చారి(ఆర్మూర్ ), గట్టు ఈశ్వర్(భీంగల్), రహీం(బాల్కొండ), గణేష్ గుప్తా (కమ్మర్పల్లి ), జ్ఞానేశ్వర్ (వేల్పూర్) తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను సన్మానించారు.అలాగే తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబ సభ్యులను కుడా గౌరవంగా సన్మానించి వారికి ప్రశాంత్ రెడ్డి పాదాభివందనం చేసారు. వారికీ సదా అండగా నిలవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు అందని పరిపాలనను చెంతకు చేర్చేందుకు కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని వేముల పేర్కొన్నారు. అందులో భాగంగానే 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విస్తరించారని, సుమారు 140కి పైగా నూతన మండలాలు, 27 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసి పరిపాలనా వికేంద్రీకరణ చేశారని వివరించారు. కలెక్టరేట్లు, మండల కేంద్రాలు ప్రజలకు చేరువ కావడంతో పెన్షన్లు, రైతుబంధు, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ చేరాయని, ఆ పదేళ్ల పాలన తెలంగాణకు స్వర్ణయుగంగా విలసిల్లిందని స్పష్టం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని వేముల తీవ్రంగా దుయ్యబట్టారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా నిలిచిపోయి తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తిందని ఆరోపించారు. కొత్తగూడెంలో 800 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్లు, యాదాద్రిలో 3,400 మెగావాట్లు (మొత్తం 4,000 మెగావాట్లలో కేవలం 600 మెగావాట్లే ఉత్పత్తి అవుతోంది) కలిపి దాదాపు 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి బొగ్గు కొరత వల్ల ఆగిపోయిందని గణాంకాలతో వివరించారు. ఫలితంగా గ్రామాల్లో, నగరాల్లో రోజుకు నాలుగైదు సార్లు విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజలను, రైతులకు సాగునీరు అందక అల్లాడేలా చేస్తున్నారని మండిపడ్డారు. #KCR #BRS #VemulaPrashanthReddy #Telangana #BRSDecadeCelebrations #Nizamabad #ktr – at Hyderabad, India
1
1
25
708
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 400 కొనుగోలు కేంద్రాలు తెరిచామని కాగితాల్లో ప్రకటనలు ఇస్తున్న ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో రైతులకు కనీస భరోసా ఇవ్వలేకపోతోందన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేక రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడానికి సంకోచిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 1న సుమారు 400 కేంద్రాలను తెరిచి పదిరోజులు కావస్తున్నా ఒక్కరంటే ఒక్క రైతు కూడా ధాన్యం అమ్మడానికి తేలేదంటే, ఈ సర్కారుకు విశ్వసనీయత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులు పూర్తిగా నమ్మకం కోల్పోయారని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం లేదంటే వానకు కొట్టుకుపోవడం, నెలల తరబడిగా నిరీక్షించడం తప్ప ఫలితం ఉండదని అన్నదాతలకు అర్థమైపోయింది కాబట్టే రైతులు దళారులకే తెగనమ్ముకుంటున్నారు వెలవెలబోతున్న కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనుగోళ్ల బాధ్యతలను గతంలోనే గాలికొదిలేశారని గతంలో ప్రభుత్వానికి అమ్మినా నెల రోజుల వరకు పైసలు రాని పరిస్థితులను రైతులు గురుతు చేసుకుంటున్నారని..ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పైసలు వస్తాయో రావో అన్న ఆందోళనతో దళారులకు అమ్ముకుంటున్నారు అని ఎమ్మెల్యే అన్నారు. గతంలో కేసీఆర్ పాలనలో ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేదని, నేడు కొనుగోలు ప్రక్రియకు మూడు నెలల సమయం పడుతుండటంతో, అలాగే క్వింటాలుకు 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన రూ. 500 బోనస్ ఇవ్వడం లేదని, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో విధిలేక రైతులు దళారులకు, మిల్లర్లకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ. 4,000 పెన్షన్, మహిళలకు నెలకు రూ. 2,500, తులం బంగారం, రూ. 500 బోనస్ వంటి హామీలను అమలు చేయలేక, ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికే రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ 2006 నుంచి కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్న 67 ఎకరాల భూమిపై అసెంబ్లీ వేదికగా 1,000 ఎకరాలు, 700 ఎకరాలు అంటూ పొంతనలేని అబద్ధాలు ప్రచారం చేశారని, సర్వేలు చేయించినా దళితుల భూమి ఒక్క ఇంచు కూడా ఆక్రమణకు గురికాలేదని తేలిందన్నారు. అలాగే కేటీఆర్ 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన సర్వీస్ అపార్ట్‌మెంట్ల వ్యాపారానికి సంబంధించిన అన్ని పన్ను లెక్కలు పారదర్శకంగా ఉన్నాయని తెలిపారు. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై వేముల తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు. కేవలం రెండు మూడేళ్లలోనే రేవంత్ రెడ్డి భార్య పేరిట సుమారు రూ. 6,000 కోట్ల విలువైన హ్యుందాయ్ షోరూమ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతి కూడా ఉత్తీర్ణులు కాని ఆయన సోదరుడు రెండు మూడేళ్ల వ్యవధిలో రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఏరోస్పేస్ విడిభాగాల పరిశ్రమను ఎలా స్థాపించారో చెప్పాలన్నారు. సుమారు 50 అంతర్జాతీయ పాఠశాలలు ఎలా ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. రూ. 200 కోట్ల నష్టాల్లో ఉన్న మెడికవర్ ఆసుపత్రి వాటాలను రెండున్నరేళ్లలో రూ. 13,200 కోట్లకు ఎలా విక్రయించగలిగారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ నేతల ఆస్తులతో పాటు రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ సవాల్ విసిరి 15 రోజులు దాటినా ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ అవినీతి లెక్కలను బయటపెట్టినందుకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఖండించారు. కేసీఆర్ హయాంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిన తెలంగాణ, నేడు రేవంత్ రెడ్డి పాలనలో 12వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు చేయించుకున్న అంతర్గత సర్వేల్లోనూ బీఆర్ఎస్ పార్టీ 70 నుంచి 80 శాతం స్థానాలు గెలుచుకుని తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమైందని ధీమా వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులతో ప్రజాస్వామ్య నిరసనలను అణచివేయలేరని, భీమ్‌గల్‌లో ఆత్మహత్య చేసుకున్న బాధితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే తనను హైదరాబాద్‌లోనే అరెస్టు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్న అధికారుల వ్యవహారశైలిని ఎండగడతామని, ప్రజాస్వామ్యబద్ధంగా తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడకుండా కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. – at Hyderabad, India
1
410
🔸 ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మానవ నిర్మిత కరువే 🔸 ఎస్సారెస్పీలో 46 టీఎంసీల నీళ్లున్నా చివరి ఆయకట్టుకు కన్నీళ్లేనా? 🔸 కేవలం 3 టీఎంసీల నీటిని విడుదల చేస్తే పంటలు దక్కుతాయి.. వెంటనే మోటార్లు ఆన్ చేయాలి 🔸 గుత్ప, అలీసాగర్ సహా అన్ని ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో నడపాలి 🔸 సింగరేణి బొగ్గును అమ్ముకుంటూ 5,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను బంద్ పెట్టారు 🔸 కరెంటు కోతలు, లో-వోల్టేజీతో రైతాంగం ఆగ్రహం.. పాత చీకటి రోజులను తెచ్చిన కాంగ్రెస్ పాలన 🔸 విద్యుత్ సంక్షోభానికి ‘ఎల్-నినో’ కారణం కాదు.. కాంగ్రెస్ అసమర్థతే కారణం 🔸 సారంగపూర్, మెంట్రాజపల్లి పంపుహౌస్‌ల ద్వారా కప్పల వాగు, పెద్ద వాగుల్లోకి నీరిచ్చి చెరువులు నింపాలి. 🔸 రైతులారా అధైర్యపడకండి.. ప్రభుత్వ మెడలు వంచైనా నీళ్లు, కరెంట్ సాధిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది కాదని, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేని విధానాల వల్ల తలెత్తిన ముమ్మాటికీ మానవ నిర్మిత కరువేనని మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీరు, విద్యుత్ అందక చివరి ఆయకట్టు పంటలు ఎండిపోతున్న పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే కేవలం 13 సెంటీమీటర్ల లోటు మాత్రమే నమోదైందని, అంతమాత్రానికే తీవ్ర కరువు పరిస్థితులు దాపురించడానికి కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యమే కారణమని శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) లో ప్రస్తుతం సుమారు 46 టీఎంసీల నీటి నిల్వలు నిండుగా అందుబాటులో ఉన్నాయి. • జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నిజామాబాద్ రూరల్, బాన్స్ వాడ, బోధన్ తదితర ప్రాంతాల్లో పంటలు చేతికొచ్చే కీలక దశలో ఎండిపోతుంటే, ప్రభుత్వం కనీస కనికరం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత నెల రోజులుగా తాము నిరంతరం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నప్పటికీ, మొక్కుబడిగా వ్యవహరిస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత దశలో కేవలం 3 టీఎంసీల నీటిని విడుదల చేసి లిఫ్టులను నడిపిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పంటలన్నీ దక్కి, యావత్ రైతాంగం గట్టెక్కుతుందని స్పష్టం చేశారు. జిల్లా కు మంత్రి అనుకుంటున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లా యంత్రాంగం తక్షణమే సమీక్ష సమావేశం నిర్వహించి కింది చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వేముల డిమాండ్ చేశారు గుత్ప లిఫ్ట్‌లో 4 భారీ మోటార్లు ఉండగా, కేవలం ఒక్క మోటారును మాత్రమే నడుపుతూ మిగతా మూడింటిని నిరుపయోగంగా ఉంచారు. వెంటనే 4 మోటార్లను పూర్తి సామర్థ్యంతో నడపాలి. అలీసాగర్ పరిధిలోని రెండు మోటార్లను పూర్తిస్థాయిలో నిరంతరం ఆన్ చేయాలి. లక్ష్మీ కెనాల్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపించడంతో పాటు చౌట్‌పల్లి హన్మంత్రెడ్డి, వేంపల్లి లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్ పథకాలను వెంటనే ప్రారంభించి చివరి ఆయకట్టు వరకు నీరందేలా చూడాలి. ఎండకాలంలో భూగర్భ జలాలు అడుగంటకుండా, చెరువులు నింపేందుకు సిద్ధంగా ఉన్న సారంగపూర్ పంప్ హౌస్, మెంట్రాజ్పల్లి పంప్ హౌస్‌లను వినియోగించి కప్పల వాగు, పెద్ద వాగుల్లోకి నీటిని విడుదల చేయాలి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు నిరంతరాయంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కేవలం 6 నుంచి 7 గంటల కరెంట్ కూడా సక్రమంగా అందడం లేదని వేముల విమర్శించారు. లో-వోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోతుండటంతో రైతులు సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ కొరతకు 'ఎల్-నినో' ప్రభావం కారణమంటూ కాంగ్రెస్ పార్టీ కట్టుకథలు చెబుతోందని కొట్టిపారేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కాంగ్రెస్ సర్కార్ బొగ్గు లేదనే సాకుతో తాళాలు వేసి మూసివేసిందని ఆరోపించారు.. కొత్తగూడెంలో 800 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్లు, యాదాద్రిలో 3,600 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను నిలిపివేసి, రాష్ట్రంలో సుమారు 5,000 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తిని అడ్డుకున్నారని తెలిపారు. తెలంగాణ గడ్డపై సింగరేణి సంస్థ బొగ్గు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఆ బొగ్గును స్థానిక థర్మల్ ప్లాంట్లకు ఇవ్వకుండా స్వార్థ ప్రయోజనాల కోసం రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే బొగ్గు సరఫరాను పునరుద్ధరించి, మూతపడిన అన్ని విద్యుత్ కేంద్రాలను తక్షణమే ప్రారంభించి రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రైతాంగం ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ఆందోళన చెందవద్దని శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. #KCR #BRS #Nizamabad #ktr – at Hyderabad, India
4
30
665
🔸 ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మానవ నిర్మిత కరువే 🔸 ఎస్సారెస్పీలో 46 టీఎంసీల నీళ్లున్నా చివరి ఆయకట్టుకు కన్నీళ్లేనా? 🔸 కేవలం 3 టీఎంసీల నీటిని విడుదల చేస్తే పంటలు దక్కుతాయి.. వెంటనే మోటార్లు ఆన్ చేయాలి 🔸 గుత్ప, అలీసాగర్ సహా అన్ని ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో నడపాలి 🔸 సింగరేణి బొగ్గును అమ్ముకుంటూ 5,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను బంద్ పెట్టారు 🔸 కరెంటు కోతలు, లో-వోల్టేజీతో రైతాంగం ఆగ్రహం.. పాత చీకటి రోజులను తెచ్చిన కాంగ్రెస్ పాలన 🔸 విద్యుత్ సంక్షోభానికి ‘ఎల్-నినో’ కారణం కాదు.. కాంగ్రెస్ అసమర్థతే కారణం 🔸 సారంగపూర్, మెంట్రాజపల్లి పంపుహౌస్‌ల ద్వారా కప్పల వాగు, పెద్ద వాగుల్లోకి నీరిచ్చి చెరువులు నింపాలి. 🔸 రైతులారా అధైర్యపడకండి.. ప్రభుత్వ మెడలు వంచైనా నీళ్లు, కరెంట్ సాధిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది కాదని, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేని విధానాల వల్ల తలెత్తిన ముమ్మాటికీ మానవ నిర్మిత కరువేనని మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీరు, విద్యుత్ అందక చివరి ఆయకట్టు పంటలు ఎండిపోతున్న పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే కేవలం 13 సెంటీమీటర్ల లోటు మాత్రమే నమోదైందని, అంతమాత్రానికే తీవ్ర కరువు పరిస్థితులు దాపురించడానికి కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యమే కారణమని శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) లో ప్రస్తుతం సుమారు 46 టీఎంసీల నీటి నిల్వలు నిండుగా అందుబాటులో ఉన్నాయి. • జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నిజామాబాద్ రూరల్, బాన్స్ వాడ, బోధన్ తదితర ప్రాంతాల్లో పంటలు చేతికొచ్చే కీలక దశలో ఎండిపోతుంటే, ప్రభుత్వం కనీస కనికరం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత నెల రోజులుగా తాము నిరంతరం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నప్పటికీ, మొక్కుబడిగా వ్యవహరిస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత దశలో కేవలం 3 టీఎంసీల నీటిని విడుదల చేసి లిఫ్టులను నడిపిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పంటలన్నీ దక్కి, యావత్ రైతాంగం గట్టెక్కుతుందని స్పష్టం చేశారు. జిల్లా కు మంత్రి అనుకుంటున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లా యంత్రాంగం తక్షణమే సమీక్ష సమావేశం నిర్వహించి కింది చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వేముల డిమాండ్ చేశారు గుత్ప లిఫ్ట్‌లో 4 భారీ మోటార్లు ఉండగా, కేవలం ఒక్క మోటారును మాత్రమే నడుపుతూ మిగతా మూడింటిని నిరుపయోగంగా ఉంచారు. వెంటనే 4 మోటార్లను పూర్తి సామర్థ్యంతో నడపాలి. అలీసాగర్ పరిధిలోని రెండు మోటార్లను పూర్తిస్థాయిలో నిరంతరం ఆన్ చేయాలి. లక్ష్మీ కెనాల్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపించడంతో పాటు చౌట్‌పల్లి హన్మంత్రెడ్డి, వేంపల్లి లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్ పథకాలను వెంటనే ప్రారంభించి చివరి ఆయకట్టు వరకు నీరందేలా చూడాలి. ఎండకాలంలో భూగర్భ జలాలు అడుగంటకుండా, చెరువులు నింపేందుకు సిద్ధంగా ఉన్న సారంగపూర్ పంప్ హౌస్, మెంట్రాజ్పల్లి పంప్ హౌస్‌లను వినియోగించి కప్పల వాగు, పెద్ద వాగుల్లోకి నీటిని విడుదల చేయాలి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు నిరంతరాయంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కేవలం 6 నుంచి 7 గంటల కరెంట్ కూడా సక్రమంగా అందడం లేదని వేముల విమర్శించారు. లో-వోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోతుండటంతో రైతులు సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ కొరతకు 'ఎల్-నినో' ప్రభావం కారణమంటూ కాంగ్రెస్ పార్టీ కట్టుకథలు చెబుతోందని కొట్టిపారేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కాంగ్రెస్ సర్కార్ బొగ్గు లేదనే సాకుతో తాళాలు వేసి మూసివేసిందని ఆరోపించారు.. కొత్తగూడెంలో 800 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్లు, యాదాద్రిలో 3,600 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను నిలిపివేసి, రాష్ట్రంలో సుమారు 5,000 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తిని అడ్డుకున్నారని తెలిపారు. తెలంగాణ గడ్డపై సింగరేణి సంస్థ బొగ్గు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఆ బొగ్గును స్థానిక థర్మల్ ప్లాంట్లకు ఇవ్వకుండా స్వార్థ ప్రయోజనాల కోసం రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే బొగ్గు సరఫరాను పునరుద్ధరించి, మూతపడిన అన్ని విద్యుత్ కేంద్రాలను తక్షణమే ప్రారంభించి రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రైతాంగం ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ఆందోళన చెందవద్దని శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. #KCR #BRS #Nizamabad #ktr – at Hyderabad, India
5
30
614
🔸 సుధాకర్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే 🔸 సుధాకర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి 🔸 సుధాకర్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి 🔸 భీంగల్ ఎస్సై తిరుపతిని డిస్మిస్ చేయాలి 🔸 నన్ను హైదరాబాద్‌లో హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్య మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ******* భీంగల్‌లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పొలాస సుధాకర్ పోలీసుల వేధింపులు తాళలేక పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని, చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సుధాకర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “తనకు పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని సుధాకర్ కాలిన గాయలతో స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తి చేసిన ఆరోపణలను కూడా పట్టించుకోకుండా పోలీసుల ప్రమేయం లేదని జిల్లా పోలీస్ అధికారి CP అనడం బాధ్యతరహిత్యం” అని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అవినీతి పరుడైన భీంగల్ SI తిరుపతి ని CP వెనకేసుకొస్తున్నాడు. సుధాకర్ మృతదేహాన్ని సందర్శించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బాల్కొండ నియోజకవర్గానికి వెళ్తున్న తనను హైదరాబాద్‌లోని నివాసంలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. “నేను ఏదైనా పార్టీ కార్యక్రమానికి వెళ్లడం లేదు. నా నియోజకవర్గానికి చెందిన ఒక చిరు వ్యాపారి చనిపోయాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, చివరి చూపు చూడటానికి వెళ్తున్నాను. నన్ను హైదరాబాద్‌లోనే ఎందుకు నిర్బంధించారు? అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ ఆపవచ్చు, అవసరమైతే అక్కడే అరెస్ట్ చేయవచ్చు. హైదరాబాద్‌లోనే హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేసారు.. 👉 మృతుడు సుధాకర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. 👉 భీంగల్ ఎస్సై తిరుపతిపై హత్యయత్నం కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించాలి. 👉 కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. 👉 కుటుంబానికి తక్షణ ఆర్థిక, న్యాయ సహాయం అందించాలి. సుధాకర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తాం, తొందర్లోనే SI పై హ్యుమన్ రైట్ కమిషన్లో ఫిర్యాదు చేస్తాం అని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. #kcr #brs #ktr #brsartyonline #brsnews – at Hyderabad, India
19
79
2,258
ఇంటర్వ్యూ విత్ సత్యాగ్రహీ ఛానల్ (part 2) @KCRBRSPresident @TSwithKCR @KTR_News @KTRBRS @BRSparty @brspartynizamabad @BRSTechCell – at Hyderabad, India
2
1
18
1,008
*సిరిసిల్లలో రేవంత్ విమర్శలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందన* •సిరిసిల్ల సాక్షిగా రేవంత్ నోటి దూల మరో సారి బయటపడింది. •తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా, కేటీఆర్ పైనా కారుకూతలు కూసిన రేవంత్ నోటిని ఫినాయిల్ తో కడిగినా తప్పులేదు. •అసెంబ్లీలో నెత్తీనోరూ బాదుకున్నా ఎవరూ వినలేదని ఇప్పుడు రోడ్ల వెంట పడ్డడు. •వేయి ఎకరాల ఫామ్మ్ హౌజ్ అన్న నోటి తోనే, 67 ఎకరాలు అన్నాడు. •రేవంత్ అబద్ధాలను ఎర్రవెల్లి జనమే తిప్పికొట్టారు. కేసీఆర్ ఒక్కరైతునూ ఇబ్బంది పెట్టలేదని వాళ్లే చెబుతున్నారు. •సర్వేకు ఆదేశించినా ఇంచు అవినీతి లేదని తేలటంతోనే తేలు కుట్టిన దొంగలా రేవంత్ మొహం తెల్లబోతోంది. •పదిరోజులు ప్రచారం చేసుకున్నా... రేవంత్ మొహం చూసేందుకు సిరిసిల్ల జనం ఇష్టపడలేదు. •కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప, సిరిసిల్ల ప్రజలు రేవంత్ వెంట లేరని స్పష్టమైంది. •మూడేళ్లు పాలించిన తమ పాలనకు మూడిందని రేవంత్ కు అర్థమైంది. •అందుకే ఈ పిచ్చి ప్రేలాపనలు, అర్థంలేని విమర్శలు. •కేటీఆర్ ఆరేండ్లు అమెరికాలో పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసి, ఉద్యమంలోకి వచ్చాడు. •మరి గోడలకు రంగులేసిన నీకు వందల కోట్లు ఎలా వచ్చాయి రేవంత్. •జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఎలా వచ్చింది, ఔటర్ చుట్టూ భూములెలా వచ్చాయి. •ఇంటర్ కూడా పాస్ కాని నీ అన్నదమ్ములకు వందల కోట్లు వచ్చిన సీక్రెట్ ఏందో చెప్పు. •కేసీఆర్ తో సహా కుటుంబ సభ్యుల అందరి ఆస్థలు ఎన్నికల అఫిడవిట్ లో స్పష్టంగా ఉన్నాయి. అవే వాళ్లు విడుదల చేసిన శ్వేత పత్రాలు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రేవంత్, ఆయన సోదరుల సంపాదన మార్గాలు, ఆస్థులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. •కాళేశ్వరంతో గోదావరి జలాలు పారినయో.. లేదో... రైతులను అడిగితే తెలుస్తుంది. •వేయి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైనా, సిరిసిల్ల ప్రజల బాగుకోసం ఏం చేస్తానో రేవంత్ చెబితే బాగుండేది, నీ దగ్గర ఆ విషయంలేదని ఇవాళ స్పష్టమైంది. •విసిగిపోయిన తెలంగాణ ప్రజలు నిన్నూ, నీ పార్టీ పాలనను నిమజ్జనం చేసేందుకు సిద్దంగా ఉన్నారు. @KTR_News @BRSparty @KCRBRSPresident – at Hyderabad, India
1
4
26
1,208
👉 ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సౌజన్యంతో పాఠశాల లకు పారిశ్రామిక వేత్త, తన వియ్యంకుడు దయానంద్ రెడ్డి 6 లక్షల విలువైన సామాగ్రి భారీ విరాళం 👉 ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ గ్రామ పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ మెటీరియల్ మరియు భీంగల్ కస్తూరిబా గాంధీ పాఠశాల కు 35 డ్యూయల్ డెస్క్ బెంచ్ ల పంపిణి బాల్కొండ నియోజకవర్గంలోని ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ గ్రామాల హైస్కూళ్లకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి సౌజన్యంతో తన వియ్యంకుడు పారిశ్రామిక వేత్త ఏనుగు దయానంద్ రెడ్డి గారి సహకారంతో సమకూరిన ఒక్కొకటి 1,50,000 రూపాయల విలువ గల సైన్స్ ల్యాబ్ మెటీరియల్‌ను ఈ రోజు వేల్పూర్‌లో ని నివాసంలో ఆయా పాఠశాలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించేందుకు, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు ఈ ల్యాబ్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని వేముల ప్రశాంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. అలాగే భీంగల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు రూ.1,46,650 విలువైన 35 డ్యూయల్ డెస్క్ బెంచీలను పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తన వియ్యంకులు దయానంద రెడ్డి గారు ముందుకు రావడం అభినందనీయమని, విద్యా రంగానికి అయన అందిస్తున్న సహకారం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు పేర్కొన్నారు.ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందించడానికి ఇకముందు కూడా అవసరం ఉన్న చోట మా సహాయ సహాకారాలు ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్య ప్రతినిధులు, గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. #kcr #ktr #brs – at Armur, India
1
11
446
👉 ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సౌజన్యంతో పాఠశాల లకు పారిశ్రామిక వేత్త, తన వియ్యంకుడు దయానంద్ రెడ్డి 6 లక్షల విలువైన సామాగ్రి భారీ విరాళం 👉 ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ గ్రామ పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ మెటీరియల్ మరియు భీంగల్ కస్తూరిబా గాంధీ పాఠశాల కు 35 డ్యూయల్ డెస్క్ బెంచ్ ల పంపిణి బాల్కొండ నియోజకవర్గంలోని ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ గ్రామాల హైస్కూళ్లకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి సౌజన్యంతో తన వియ్యంకుడు పారిశ్రామిక వేత్త ఏనుగు దయానంద్ రెడ్డి గారి సహకారంతో సమకూరిన ఒక్కొకటి 1,50,000 రూపాయల విలువ గల సైన్స్ ల్యాబ్ మెటీరియల్‌ను ఈ రోజు వేల్పూర్‌లో ని నివాసంలో ఆయా పాఠశాలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించేందుకు, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు ఈ ల్యాబ్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని వేముల ప్రశాంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. అలాగే భీంగల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు రూ.1,46,650 విలువైన 35 డ్యూయల్ డెస్క్ బెంచీలను పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తన వియ్యంకులు దయానంద రెడ్డి గారు ముందుకు రావడం అభినందనీయమని, విద్యా రంగానికి అయన అందిస్తున్న సహకారం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు పేర్కొన్నారు.ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందించడానికి ఇకముందు కూడా అవసరం ఉన్న చోట మా సహాయ సహాకారాలు ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్య ప్రతినిధులు, గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. #kcr #brs #brsparty #ktr – at Armur, India
2
44
724