V retweeted
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు శ్రీ రాము యాదవ్, శ్రీ గంగిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఖమ్మంకు చెందిన శ్రీ కలసాని రఘువీర్ యాదవ్, శ్రీ పేరాం మల్లయ్య, శ్రీ మాలేటి రవి జనసేన పార్టీలో చేరారు.
శుక్రవారం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు, చేరికల కమిటీ కన్వీనర్ శ్రీ మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, చేరికల కమిటీ సభ్యురాలు శ్రీమతి తనూజ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎం. దామోదర్ రెడ్డి, మచ్చ సుధాకర్, మండపాక కావ్య, శ్రీధర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
#JSPForNewAgePolitics #JanaSenaTelangana #JSPForTelangana
V retweeted
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు విజయమే లక్ష్యంగా చేపట్టిన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ప్రచార వాహనం సత్తుపల్లి పట్టణంలో విస్తృతంగా పర్యటించింది. సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ మంథని సంపత్ కుమార్, నియోజకవర్గ నాయకులు వడ్లకొండ జీవన్ సూచనల మేరకు నిర్వహించిన ఈ ప్రచారంలో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పట్టభద్రులను కలిసి జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ, మండల నాయకులు సూరిశెట్టి అనిల్ కుమార్, బత్తుల పవన్ కుమార్, జబీర్ సయ్యద్, సింగపోగు అప్పారావు, మిట్టపల్లి సత్యనారాయణ, నారా శ్రీనివాస్, దండు కరుణ తదితరులు పాల్గొన్నారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
V retweeted
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పని చేయాలి
•తొలి విడత విజయాల స్ఫూర్తితో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోనూ ముందుకు సాగాలి
•సమష్టి కృషితో ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
•స్థానిక ఎన్నికల్లో సాధించిన 100 శాతం విజయాల స్ఫూర్తితో ముందుకు సాగాలి
•తాడేపల్లిగూడెంలో కూటమి మున్సిపల్ అభ్యర్థులతో ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl ప్రత్యేక భేటీ
•మున్సిపల్ ఎన్నికల కార్యాచరణపై కూటమి అభ్యర్థులకు దిశానిర్దేశం
తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణ, ప్రచార ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి అభ్యర్థుల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడతలో ఎలాగైతే 100 శాతం విజయాలను సాధించామో, అదే స్ఫూర్తి, ఐక్యత, సమన్వయంతో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ముందుకు సాగాలి. నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు సమష్టిగా, సమన్వయంతో పని చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. పరస్పర సహకారం, సమన్వయంతో ఎన్నికల కార్యాచరణను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలి” అన్నారు.
*ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో శ్రీ నాగబాబు గారు ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల సమగ్ర అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాసేవలో బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
V retweeted
వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్
జగన్ తన పిఏ 1000 కోట్ల అక్రమ సంపాదన విషయాన్ని.., వైసీపీ వారు తరచూ చేసే ట్విట్టర్ స్పేస్ దూషణలు అంటూ డైవర్ట్.
స్వయంగా జగన్ తన పాత కేసులో, మరో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి దాఖలు చేసిన తాజా ఛార్జ్ షీట్ లో A1 గా స్థానం.
దాన్ని డైవర్ట్ చెయ్యడానికి జనసేన పార్టీకి సంబంధం లేని విషయాన్ని, జనసేన సిబ్బంది తప్పు లేని వ్యవహారాన్ని వైసీపీ తమ ప్రచార సాధనాల ద్వారా, కింది స్థాయి ఉద్యోగుల ద్వారా దుష్ప్రచారం.
అది కూడా తరచూ జనసేనపై నీలిగే వైసీపీ బడా నాయకులతో కాక, ఈసారి ఒక బీసీ వైసీపీ ఉద్యోగి నాగార్జున యాదవ్ చేత..
ఎందుకంటే వారు డైవర్ట్ చేసే విషయంలో తప్పు జనసేన వైపు లేదు, బలైతే బీసీ కులానికి చెందిన వ్యక్తి, అది కూడా సాధారణ వైసీపీ ఉద్యోగి అని రంగంలోకి దింపారు.
పైపైన మీ తప్పులు బయట పడకుండా ఎంత అద్దినా,
మీ ప్రచార సాధనాలతో ఎంత ముక్కినా రాజ్యాంగ వ్యవస్థల ముందు మీ తప్పులకు, (ఆర్థిక) నేరాలకు సమాధానంగా ప్రజల ముందు తప్పనిసరిగా దోషులుగా నిలబడతారు, నిలబెడతాం..
V retweeted
Great discoveries begin with a curious mind, the courage to question and the determination to explore the unknown.
On the death anniversary of Bharat Ratna Sir C. V. Raman Ji, I pay my humble tributes to the legendary physicist whose groundbreaking discovery of the Raman Effect transformed our understanding of light and brought global recognition to Indian science. His extraordinary scientific vision and spirit of inquiry continue to inspire generations to pursue knowledge, innovation and excellence.
- @PawanKalyan
#CVRaman #RamanEffect
V retweeted
హైదరాబాద్ మెటా కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడి అహంకారపు చర్య..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని మెటా కార్యాలయంపై దాడి చేసి, విధ్వంసానికి పాల్పడటం కాంగ్రెస్ అహంకారపు, అనైతిక చర్యగా కనబడుతోంది.
తెలంగాణలో లెక్కా, పత్రం లేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలను గోస పెడుతుంటే అడగాల్సిన కార్యకరర్తలు, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి దాడులకు పాల్పడడం సిగ్గు చేటు.
తెలంగాణ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పిస్తున్న అంతర్జాతీయ సంస్థలపై దాడులు చేస్తూ సమాజానికి ఏం సంకేతాలు ఇవ్వదలచుకున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి.
ఇలాంటి దాడుల వలన అంతర్జాతీయ వ్యాపార సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేసే ప్రమాదం తలెత్తె అవకాశం ఉంది. దాడులకు పాల్పడిన వారిపై పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలి.
-శ్రీ నేమూరి శంకర్ గౌడ్,
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్.
#CongressFailedTelangana
V retweeted
మొన్నటి వరకు ఆయన Power స్టార్
ఇప్పుడు Empower Star పవన్ కళ్యాణ్
- శ్రీమతి @upasanakonidela
#PawanKalyanMarkGovernance
V retweeted
ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం
ప్రకాశం జిల్లా పెళ్లూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఆ జిల్లా అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. బాపట్ల వైపు వెళ్తున్న పెళ్లి బృందం కారు కల్వర్టును వేగంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టు, గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. పెళ్లి బృందం కారు ప్రమాదానికి గురికావడం బాధించిందని ఉప ముఖ్యమంత్రివర్యులు అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
@PIB_India @IPR_AP @pibvijayawada
V retweeted
ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవుతోందని సొంత ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను స్పష్టం చేస్తోంది.
ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సొంత పార్టీ నేతల ప్రశ్నలకే సమాధానం చెప్పలేని పరిస్థితికి చేరుకుంది.
సొంత ఎమ్మెల్యేలకే నిధులు ఇవ్వలేని ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను, హామీలను ఎలా అమలు చేస్తుంది? ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన?
@revanth_anumula @INCTelangana
#CongressFailedTelangana
V retweeted
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర చేరికల కమిటీ సభ్యురాలు శ్రీమతి తనూజా రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గంకు చెందిన శ్రీ నర్రా సుఖేందర్ రెడ్డి జనసేన పార్టీలో చేరారు.
శుక్రవారం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు, చేరికల కమిటీ కన్వీనర్ శ్రీ మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, రాష్ట్ర నాయకులు ఎం. దామోదర్ రెడ్డి, మచ్చ సుధాకర్, మండపాక కావ్య, శ్రీధర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
#JSPForNewAgePolitics #JanaSenaTelangana #JSPForTelangana
V retweeted
రాజకీయ పార్టీ నాయకులతో ఫోటోలు దిగడం.... దీన గాథలు చెప్పి ఉద్యోగాల్లో చేరడం, నిరుద్యోగుల దగ్గర డబ్బులు దోచేయడం... ఉద్యోగం ఇచ్చిన కంపెనీను, యాజమాన్యాన్ని మోసం చేయడం.... దొరికినప్పుడు తప్పించుకోవడానికి ఇతరులపై బురద చల్లడం... ఇలాంటి దొంగల ముఠాను సమర్ధిస్తూ వెనకేసుకొచ్చే రాజకీయ పార్టీలు, నాయకులు, లాయర్లు, మీడియా ఎర్నలిస్టులు ఉండటం మన దురదృష్టం...
ధరణి కృష్ణ & కో చేస్తున్న దోపిడీలు గత ప్రభుత్వం పట్టుకోలేకపోయింది, ప్రస్తుత ప్రభుత్వం పట్టుకోలేకపోయింది... దేవాదాయ శాఖ, APPSC వంటి ఉన్నత ఉద్యోగాలను ఇప్పిస్తామని ఆ శాఖల సింబల్స్, సర్వీస్ రికార్డు ఫోర్జరీ చేస్తుంటే కనీసం ఒక్క అధికారి కూడా పట్టుకోలేకపోయారు...
కానీ కేవలం 5 నెలల్లో ఈ నకిలీ ఉద్యోగాల సిండికేట్ ను బయట పెట్టిన జనసైనికురాలు శ్రీమతి @kotarukmini గారికి మనస్పూర్తిగా అభినందించాలి.
తానే కనుక బయటకు వచ్చి కేసు పెట్టకపోతే ఈ సిండికేట్ వ్యవహారం ప్రజలకు తెలిసేది కాదు, మరింత మంది నిరుద్యోగులు బలైపోయేవారు. తన వ్యక్తిగత జీవితంపై ఎంత నీచంగా మాట్లాడినా సహించిన ఆవిడ, ఈ ఫేక్ జాబ్ రాకెట్ ద్వారా జరుగుతున్న అవినీతి, నిరుద్యోగ యువతకు జరిగే అన్యాయంపై గళం ఎత్తి, శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమ్మే జనసేన పార్టీ యొక్క అవినీతిపై రాజీ లేని పోరాటానికి నిదర్శనంగా నిలిచారు.
#WeAreWithRukminiKota
#BewareOfOriginalScamsters
V retweeted
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు పరిపాలనా అనుభవం, నిజాయితీ, ప్రజాసేవా నిబద్ధతను దృష్టిలో పెట్టుకుని, పట్టభద్రులు, ముఖ్యంగా మహిళా పట్టభద్రుల సమస్యలను పెద్దల సభలో చర్చించి తగిన పరిష్కారం కోసం గొంతెత్తి నినదించే ప్రాతినిధ్యం కోసం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది..
-శ్రీ నేమూరి శంకర్ గౌడ్,
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్.
#JanaSenaTelangana #JSPForTelangana
V retweeted
నకిలీ ఉద్యోగాల పేరుతో ₹7 కోట్ల కుంభకోణం చేసిన ధరణీ కృష్ణ వ్యవహారంపై, @YSRCParty మరియు, వైసీపీ అధికార ప్రతినిధి @ImYanamala జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి రుక్మిణి కోట గారి వ్యక్తిత్వ భంగం కలిగేలా చేసిన ఆరోపణలపై అలాగే వీరిపై న్యాయపరంగా తీసుకోనున్న చర్యలపై మీడియా సమావేశం ద్వారా వివరాలు వెల్లడిస్తున్న శ్రీమతి రుక్మిణి కోట గారి లీగల్ బృందం
youtube.com/live/mKwJIB4Pg80…
V retweeted
నకిలీ జాబ్ స్కాం కు పాల్పడి, పరారీలో ఉన్న ముద్దాయి బోడపాటి ధరణి కృష్ణ కోసం ఒకవైపు పోలీసులు గాలిస్తుంటే, అలాంటి వారి ఆచూకీ తెలిసినప్పుడు పట్టించాల్సింది పోయి, లైవ్ పెడుతున్నాను అని చెప్పడం ఏ రకమైన జర్నలిజం @ashuvemulapalli గారు? నిందితుల ఆరోపణల ఆధారంగా కథనాలు ప్రసారం చేయడం మాత్రమే కాకుండా, ఇప్పుడు నిందితులను పోలీస్ వారికి పట్టించడం మానేసి మీ వ్యూస్ కోసం, మీ కొత్త యూట్యూబ్ ఛానల్ కోసం ఇంతకీ దిగజారుతారా?
@police_guntur వారు అశోక్ వేములపల్లి గారి ద్వారా ముద్దాయి ధరణి కృష్ణ ఆచూకీ కనిపెట్టి కేసు విచారణ చేయవలసిందిగా కోరుతున్నాము.
#BewareOfOriginalScamsters
V retweeted
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ వీరమహిళల ఆధ్వర్యంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని జ్యోతిరావు పూలే పార్క్‌లో ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులతో వీరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యసాహసాలు, త్యాగనిరతి నేటి మహిళలకు ఆదర్శమని పేర్కొంటూ, ఆమె పోరాట స్ఫూర్తితో మహిళలు అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు చిట్టి మణిత రెడ్డి, రాగుల శిరీష, కానుగంటి మంగ, గుండేటి లావణ్య, గుండ శకుంతల, తోదేటి భారతి పాల్గొన్నారు.
#RaniLakshmiBai
























