ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) header
ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) profile picture

Unbiased News 📰🔎📌 Real Events. Verified Facts. Stories That Matter. మన చుట్టూ జరిగే యదార్థ సంఘటనలు, వాస్తవాలు మీ ముందుకు.

India
Joined March 2026
Photo by ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_)Photo by ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_)Photo by ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_)Photo by ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_)Photo by ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_)Photo by ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_)Photo by ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_)Photo by ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_)Photo by ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_)Photo by ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_)
🌿 గంజాయి మత్తులో పోలీస్ జీపెక్కి వీరంగం 🔹 అన్నమయ్య జిల్లా రాయచోటిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా రాత్రివేళ ఈ ఘటన జరిగింది. 🔹 గంజాయి తాగిన ఓ వ్యక్తి, స్టేషన్ నుంచి రౌండ్స్‌కు వెళ్తున్న పోలీస్ జీపును అడ్డుకుని రచ్చ చేశాడు. 🔹 జీపు పైకి ఎక్కి, "నాతో వల్గర్‌గా మాట్లాడతారా" అంటూ పోలీసులను బూతు మాటలతో నిలదీశాడు. #Rayachoti #AndhraPradesh
22
😔 యాప్‌లో దోస్తీ చేసి యువకుడి జేబు గుల్ల.. రూ.18 లక్షలు స్వాహా 📌 జడ్చర్ల మండలానికి చెందిన బీఈడీ విద్యార్థికి, ఓ గే యాప్‌లో గుంటూరు జిల్లా దొడ్లేరు వాసి తమ్మిశెట్టి నాగార్జునతో దోస్తీ కుదిరింది. 📌 ఉదండాపూర్ రిజర్వాయర్ పరిహారం డబ్బు ఖాతాలో పడగా, తల్లికి బాగాలేదంటూ రూ.200తో మొదలుపెట్టి మూడు నెలల్లో రూ.11.50 లక్షలు వేయించుకున్నాడు. 📌 బెదిరింపులతో అక్క బంగారం కుదువపెట్టి రూ.2.50 లక్షలు, మరోసారి రూ.2.50 లక్షలు, వరుసకు అన్న దగ్గర రూ.1.50 లక్షలు అప్పు తెచ్చి ఇచ్చాడు. 📌 మొత్తం రూ.18 లక్షలు ఇచ్చాక, తిరిగివ్వనని, అడిగితే చంపేస్తానని నాగార్జున బెదిరించాడు. 📌 తల్లిదండ్రులకు చెప్పి బాధితుడు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా, రూ.6 లక్షలు రికవరీ చేసినట్లు తెలిసింది. #Jadcherla #Mahabubnagar
24
ఓటర్ లిస్ట్ నుంచి 2.29 కోట్ల ఓట్లు మాయం! 🔹 వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో SIR జరిగింది, UP, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపుర్ లో 2.29 కోట్ల ఓట్లు తొలగించారు 🔹 ఇందులో 90% ఓట్లు UP నుంచే ఉన్నాయి, అక్కడ 15.44 కోట్ల నుంచి 12.56 కోట్లకు ఓటర్ల లిస్ట్ పడిపోయింది 🔹 పంజాబ్ లో 14 లక్షలు, ఉత్తరాఖండ్ లో 8 లక్షలు తొలగించగా గోవాలో 11.85 లక్షల నుంచి 10.58 లక్షలకు తగ్గింది 🔹 మణిపుర్ లో 20.9 లక్షల నుంచి 19.6 లక్షల మందినే ఫైనల్ ఓటర్ లిస్ట్ లో ఉంచారు #SIR #UttarPradesh #Manipur #Punjab
35
🪖 సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లపై కర్రలతో గుంపు దాడి 🔸 త్రిపుర ఆషాబరి/బోక్సానగర్ దగ్గర భారత్-బంగ్లాదేశ్ బోర్డర్‌లో ఈ ఘటన జరిగింది. 🔸 కంపెనీ కమాండర్ సహా ముగ్గురు బీఎస్ఎఫ్ సిబ్బంది వాహనాన్ని ఓ గుంపు చుట్టుముట్టింది. 🔸 కర్రలు, వెదురు కర్రలతో ముగ్గురినీ కొట్టి గాయపరచడమే కాకుండా, వాళ్ల ఆయుధాలు లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు. #BSF #Tripura
1
60
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాలకూరి అశోక్ గౌడ్ ప్రకటన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాలకూరి అశోక్ గౌడ్‌ను పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. #TeenmarMallanna #AshokGoud #MLCElections #TelanganaPolitics @TeenmarMallanna
71
150 దేశాలను వణికించిన హ్యాకర్...ఉత్తర కొరియా సైబర్ నేరగాడు పాక్ జిన్-హ్యుక్ ఉత్తర కొరియాకు చెందిన సైబర్ హ్యాకర్ పాక్ జిన్-హ్యుక్‌పై FBI అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రభుత్వ రక్షణలో ఉత్తర కొరియాలోనే ఉంటున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. 2014లో సోనీ పిక్చర్స్‌పై సైబర్ దాడికి పాల్పడి, ఉన్నతాధికారుల ఈమెయిల్స్, ఉద్యోగుల సమాచారం, విడుదల కాని సినిమాలను లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2016లో బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ సైబర్ దోపిడీలో భాగంగా సుమారు 81 మిలియన్ డాలర్లను అక్రమంగా బదిలీ చేసిన ఘటనలోనూ అతడి పేరు వెలుగులోకి వచ్చింది. 2017లో వాన్నాక్రై రాన్సమ్‌వేర్ దాడితో 150 దేశాల్లో 3 లక్షలకు పైగా కంప్యూటర్లు ప్రభావితమయ్యాయి. బ్రిటన్ ఆసుపత్రులు సహా పలు సంస్థల కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. సైబర్ దాడుల ద్వారా సమకూరిన నిధులు ఉత్తర కొరియా అణ్వాయుధాలు, క్షిపణి కార్యక్రమాలకు మళ్లుతున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. దేశం వెలుపలికి రాకుండానే అంతర్జాతీయ సైబర్ నేరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. #NorthKorea #CyberAttack #FBI #ParkJinHyok
91
తుఫాన్ సహాయక చర్యలకు ఏపీ ప్రభుత్వం రూ.37 కోట్ల నిధులు తుఫాన్ మురాసు ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు, అత్యవసర ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.37 కోట్ల నిధులు మంజూరు చేసింది. #AndhraPradesh #CycloneMurasu #ReliefFunds #CycloneRelief
437
పుణెలో కల్తీ లడ్డూల కలకలం.. 1,190 కిలోలు సీజ్ పుణెలోని తిలక్ నగర్‌లో గల గాయత్రి లడ్డూ భండార్‌పై FDA అధికారులు దాడులు చేసి, రూ.1.73 లక్షల విలువైన 1,190 కిలోల కల్తీ లడ్డూలను స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో తయారీ, అధిక మోతాదులో రసాయన రంగుల వినియోగాన్ని గుర్తించారు. పండుగ వేళ స్వీట్లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారాం ముండే హెచ్చరించారు. #Pune #FoodSafety #AdulteratedSweets #FDARaid
2
104
తుఫాన్ బాధితులకు అండగా కర్ణాటక.. ఏపీకి సహాయక బృందాలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలకు మద్దతుగా కర్ణాటక బృందాలు ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరాయి. కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటామని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కర్ణాటక భరోసా ఇచ్చింది. #Karnataka #AndhraPradesh #CycloneRelief #RescueOperations
75
⚓ అరేబియా సముద్రంలో పైరేట్ల చెర నుంచి 20 మంది సిబ్బందికి విముక్తి.. భారత నేవీ మెరుపు ఆపరేషన్ 🔹 అరేబియా సముద్రంలో ముంబైకి 3,000 కిలోమీటర్లకు పైగా దూరంలో పైరేట్ల చేతిలో చిక్కుకున్న 'అజిని' (Azini) ఫిషింగ్ నౌక సిబ్బందిని భారత నేవీ సురక్షితంగా రక్షించింది. నవంబర్ 2, 2026న చేపట్టిన 48 గంటల సమన్వయ ఆపరేషన్‌లో మొత్తం 20 మంది ప్రాణాలను కాపాడింది. 🔹 భారీగా ఆయుధాలు కలిగిన పైరేట్లను గుర్తించి, నౌకను అడ్డుకుని సిబ్బందిని సురక్షితంగా విడిపించడంలో భారత నేవీ కీలక పాత్ర పోషించింది. 🔹 ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం (IAF) సకాలంలో అందించిన సహకారం కీలకంగా నిలిచింది. సముద్రంలో ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు భారత బలగాల అప్రమత్తత, కార్యాచరణ సంసిద్ధత మరోసారి వెల్లడైంది. 🔹 ప్రాణాల రక్షణ, సముద్ర భద్రత, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం భారత్ తన నిబద్ధతను చాటుకుంది. సురక్షిత సముద్ర మార్గాలు, స్వేచ్ఛాయుతమైన, భద్రమైన హిందూ మహాసముద్ర ప్రాంతం కోసం భారత్ కట్టుబడి ఉంది. #IndianNavy #IndianAirForce #SafeSeas #IndianOceanRegion
112
🏛️ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ సర్వం సిద్ధం...పకడ్బందీ ఏర్పాట్లకు సీఎం రేవంత్ ఆదేశాలు డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో జరగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు ఆరు నగరాల్లో 20 వేదికలపై 27 రకాల క్రీడా పోటీలు, ఒక డెమో పోటీ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది క్రీడాకారులు, సుమారు 2 వేల మంది కోచ్‌లు, అధికారులు పాల్గొననున్నారు. యువ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అత్యున్నత ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. తెలంగాణ కర్రసాము క్రీడను కూడా ఆతిథ్య రాష్ట్ర కోటాలో చేర్చేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. క్రీడల నిర్వహణ పర్యవేక్షణకు గ్రూప్-1 అధికారులకు బాధ్యతలు అప్పగించాలని, వివిధ జిల్లాల్లో స్థానిక అధికారులను నియమించాలని సూచించారు. క్రీడాకారులకు నాణ్యమైన వసతి కల్పించడంతో పాటు ప్రతి వారం నిర్వహణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, శిక్షణ అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రారంభ, ముగింపు వేడుకల్లో అనవసర ఆడంబరాలు వద్దని సీఎం @revanth_anumula స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వనరులను ఖేలో ఇండియా నిర్వహణకు వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. #KheloIndiaYouthGames #TelanganaSports #RevanthReddy #SportsDevelopment
100
ఫాక్స్ సాగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్...మల్లారెడ్డి కుటుంబ ఫామ్‌హౌస్ ప్రహరీ కూల్చివేత హైదరాబాద్‌లోని ఫాక్స్ సాగర్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణల తొలగింపునకు హైడ్రా సోమవారం భారీ కూల్చివేతల కార్యక్రమం చేపట్టింది. చెరువు భూములను తిరిగి స్వాధీనం చేసుకుని పునరుద్ధరించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. దూలపల్లి గ్రామంలోని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన ఫామ్‌హౌస్ ప్రహరీ గోడ, గేటును అధికారులు కూల్చివేశారు. సర్వే నంబర్ 124లోని ఆస్తిలో దాదాపు 15 ఎకరాలు ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో మట్టితో పూడ్చివేతలు చేసి ప్రహరీ నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జీడిమెట్లలోని సర్వే నంబర్లు 41, 42 పరిధిలో ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లోకి వస్తున్న దాదాపు 20 ఎకరాల మేర ప్రహరీ గోడలను హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన దాదాపు అర కిలోమీటరు బండ్‌ను కూడా అధికారులు గుర్తించారు. దాని వెంట నిర్మించిన ప్రహరీ గోడతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇనుప ఫెన్సింగ్‌ను తొలగించారు. కూల్చివేతల సమయంలో సుప్రీంకోర్టు న్యాయవాది సౌరభ్ రాజ్ వర్మ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. తన తండ్రి దీపక్ వర్మ, బాబాయి ప్రశాంత్ వర్మ వారసుడిగా హక్కులు ఉన్నాయని వాదించారు. అయితే హైడ్రా అధికారులు ఎఫ్‌టీఎల్ హద్దులను చూపించి కూల్చివేతలు కొనసాగించారు. ఫాక్స్ సాగర్ చెరువు పరిధిలోని ఆక్రమణలను తొలగించి, చెరువు భూములను తిరిగి స్వాధీనం చేసుకుని పునరుద్ధరించడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు హైడ్రా వెల్లడించింది. #HYDRAA #FoxSagar #MallaReddy #Hyderabad #Telangana
1
101
విశాఖ ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు.. ఎగిసిపడుతున్న మంటలు.. దట్టమైన పొగలు 🔸 విశాఖపట్నంలోని ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు తర్వాత రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. 🔸 రిఫైనరీ నుంచి ఆకాశాన్ని తాకేలా మంటలు ఎగిసిపడుతుండగా.. పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది. సమీప కాలనీల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 🔸 పేలుడుకు గల కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. #Visakhapatnam #OilRefinery #Explosion #AndhraPradesh
🔥 రిఫైనరీలో భారీ పేలుడు.. ఆకాశాన్నంటిన మంటలు 📌 విశాఖపట్నంలోని ఓ ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం. 📌 పేలుడు ధాటికి మంటలు ఎగసిపడగా, దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్మేసింది. 📌 దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 📌 పేలుడుకు కారణాలు, ప్రమాద తీవ్రత, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. #Visakhapatnam #AndhraPradesh
2
251
పొదల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం.. హత్య అనుమానాలు ఫతేపూర్ జిల్లా లౌలీ ప్రాంతంలోని కొర్రా కనక్ సమీపంలో పొదల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ తలపై పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలు గుర్తించారు. హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. #FatehpurCrime #UPPolice #MurderSuspect #CrimeNews
191
మెడను వింతగా తిప్పుతూ యువకుడి విన్యాసం.. షాకవుతున్న నెటిజన్లు యువకుడు తన మెడను అసాధారణ రీతిలో తిప్పుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి విన్యాసం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది టాలెంటా.. మ్యాజిక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు. #ViralVideo #AmazingTalent #ShockingVideo #SocialMedia
1
207
గ్రీన్ వాటర్ ట్యాంకర్లతో 11.07 లక్షల లీటర్ల శుద్ధి చేసిన నీటి సరఫరా 📌 రెండో రోజు 79 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా 124 ట్రిప్పులు నిర్వహించి, మొత్తం 1,107 కిలోలీటర్ల (11.07 లక్షల లీటర్లు) శుద్ధి చేసిన నీటిని సరఫరా చేశారు. 📌 మూడు రీజియన్ల పరిధిలోని 18 ఎస్టీపీల నుంచి ప్రభుత్వ అవసరాలకు 609.5 కిలోలీటర్లు, ప్రైవేట్ అవసరాలకు 497.5 కిలోలీటర్ల నీటిని అందించారు. 📌 రీజియన్ల వారీగా సైబరాబాద్‌లో 505 కిలోలీటర్లు, మల్కాజిగిరిలో 306.5 కిలోలీటర్లు, హైదరాబాద్‌లో 295.5 కిలోలీటర్ల నీటిని సరఫరా చేశారు. 📌 నిర్మాణ పనులు, పార్కులు, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ వంటి తాగేతర అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. #HMWSSB #GreenWaterTanker #Hyderabad #WaterConservation
95
🔥 రిఫైనరీలో భారీ పేలుడు.. ఆకాశాన్నంటిన మంటలు 📌 విశాఖపట్నంలోని ఓ ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం. 📌 పేలుడు ధాటికి మంటలు ఎగసిపడగా, దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్మేసింది. 📌 దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 📌 పేలుడుకు కారణాలు, ప్రమాద తీవ్రత, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. #Visakhapatnam #AndhraPradesh
2
4
1
9
1,691
ముచ్చట్లు | Stories • Voices • Views retweeted
Replying to @muchatlu_
1
1
28
🚨 ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ.. ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి సమాచారం తెలిసిన వారు 9849684273, 9908217456 నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలియజేయాలని విజ్ఞప్తి. #MissingWoman #MissingChildren #PublicAppeal #TelanganaNews
6
5
195
కులవివక్ష బాధిత కుటుంబానికి హరీశ్ రావు పరామర్శ మంగంపల్లిలో కులవివక్షకు గురైన మాసాని సుధీర్ కుటుంబాన్ని మాజీ మంత్రి @BRSHarish పరామర్శించి ధైర్యం చెప్పారు. దళితులపై వివక్షను సహించేది లేదని, నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుధీర్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. #HarishRao #BRS #CasteDiscrimination #Telangana
122