BhuvanagiriNaveen_BRS retweeted
Sensational Expose
In undivided Andhra Pradesh , Telangana's water rights were taken from Pothireddypadu through Srisailam.
Now at Nagarjunasagar , Andhra Pradesh Government has been working on a tunnel without any permissions.
What is the 18 Hour Working CM Revanth doing when Telangana's water is stolen ❓️
Sleeping @revanth_anumula ❓️
- KTR
BhuvanagiriNaveen_BRS retweeted
క్రీడల విషయంలో రేవంత్ రెడ్డి మాటలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటే, చేతలు గల్లీ స్థాయి దాటకపోవడం సిగ్గుచేటు.
హైదరాబాద్ లో ఒలంపిక్స్ నిర్వహిస్తామంటూ డబ్బా ప్రచారం చేసుకునే @revanth_anumula క్రీడాకారుల సమస్యలు మీకు కనిపించడం లేదా?
అన్ని వర్గాల ప్రజలను మోసి చేసినట్లే.. క్రీడాకారులను కూడా దగా చేసారు.
క్రీడాకారుల సమస్యలు వింటుంటే ఆవేదన కలుగుతున్నది.
మీ ఫుట్ బాల్ సరదాలు తీర్చుకోవడం కోసం వంద కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడమే తప్ప, క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు సున్నా.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ప్రోత్సాహం లేక క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
ఖేలో ఇండియా క్రీడలకు ప్రధానిని ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి గారూ.. క్రీడాకారులకు కోచ్ లను నియమించాలన్న కనీస సోయి కూడా మీకు లేదా?
విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే PETలు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన కూడా మీకు లేదా?
పీఈటీలు లేకుండా, పీడీలు లేకుండా మీరు ఏర్పాటు చేస్తానంటున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం ఎలా నెరవేరుతుంది?
కోచ్ లు లేకుండా క్రీడా కారులకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారు?
ఖేల్ ఇండియా క్రీడా పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలంటే ముందుగా కోచ్ లను నియమించండి.
గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించేందుకు గాను పీఈటీ, పీడీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయిండి.
మాటలు కాదు, చేతలు చూపించి తెలంగాణ క్రీడాకారుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోండి.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించాలి.
గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు TA/DA ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించాలి.
క్రీడా బడ్జెట్‌ను పెంచి, కేటాయించిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలి.
మెగా డీఎస్సీ అని నిరుద్యోగ యువతను దగా చేశారు, వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించాలి.
తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేసి, ఆధునిక శిక్షణ కేంద్రాలు, మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి.
క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా సమాన అవకాశాలు, పారదర్శకమైన ఎంపిక విధానం కల్పించాలి.
క్రీడారంగ అభివృద్ధి అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రకటనలు, మైకుల ముందు ప్రగల్భాలు కాదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అవకాశాలు కల్పించడం.
క్రీడాకారుల భవిష్యత్తుతో చలగాటం ఆడటం మానేసి, హక్కులను కాపాడి, వారి ఆశయ సాధనకు తోడ్పాటు అందించాలని డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
BhuvanagiriNaveen_BRS retweeted
🔶 90 శాతం వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదిగి.. పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
🔶 గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్‌కు అండగా నిలిచి పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన కేటీఆర్
🔶 తెలంగాణ భవన్‌లో ఆత్మీయ భేటీ.. స్వయంకృషి ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ 👇
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన పారిశ్రామిక ప్రస్థానానికి అండగా నిలిచి, పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈరోజు తెలంగాణ భవన్‌లో ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత చంద్రకాంత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
90 శాతం శారీరక వైకల్యం ఉన్నప్పటికీ స్వయంకృషి, పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగి, తన పరిశ్రమ ద్వారా పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను కేటీఆర్ అభినందించారు.
ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేశారు. చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ లోగోను కేటీఆర్ ఆవిష్కరించారు.
శారీరక వైకల్యంతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న చంద్రకాంత్ సాగర్, వాటిని అధిగమిస్తూ స్వయంకృషి, పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగారు.
తన విజయాన్ని తనకే పరిమితం చేయకుండా, తన పరిశ్రమ ద్వారా దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమ అభివృద్ధికి కేటీఆర్ అందించిన సహకారం, ప్రోత్సాహం తన పారిశ్రామిక ప్రస్థానంలో ఎంతో కీలకమని చంద్రకాంత్ సాగర్ తెలిపారు.
కేటీఆర్ అండతో పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడంతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగానని కృతజ్ఞతలు తెలిపారు.
దివ్యాంగులకు ఉపాధి కల్పించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పిస్తున్నానని చంద్రకాంత్ సాగర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తాను స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిని స్వావలంబన దిశగా ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేయనున్నట్లు వివరించారు.
స్వయంకృషితో ఎదిగి మరెందరికో ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అభినందించారు.
దివ్యాంగుల సాధికారత, ఆత్మగౌరవంతో కూడిన జీవనం, స్వావలంబన కోసం స్వయంకృషి ఫౌండేషన్ చేపట్టనున్న కార్యక్రమాలకు శుభాకాంక్షలు తెలిపారు.
BhuvanagiriNaveen_BRS retweeted
గత నెలలోనే వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి మూడు పెద్ద దావత్ లు చేసింది కాంగ్రెస్ సర్కారు
1) తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో ఒకటి
2) ఢిల్లీ ఫైవ్ స్టార్ హోటల్ లో ఒకటి
3) హైదరాబాద్ నోవాటెల్ లో భారత్ సమ్మిట్ దావత్
డిసెంబర్ మొదటి వారంలో 500 కోట్లతో గ్లోబల్ సమ్మిట్ జరపబోతోంది.
కానీ,
కరువు ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఇంట్లో చిన్న దావత్ కూడా చేసుకోవద్దు అని మంత్రి జూపల్లి చెబుతున్నాడు!
ఎవని పాలైందిరో తెలంగాణ!
BhuvanagiriNaveen_BRS retweeted
రాతి కట్టడాలకు బదులు కాంక్రీట్ నిర్మాణాలు.. అష్టమి నాడు శిఖరం తొలగింపు
ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం ⁉️
వేములవాడలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిన్న (నవంబర్ 17) కార్తీక మాసం, మంగళవారం, అష్టమి రోజున వేములవాడ ఆలయ గర్భాలయం పైన ఉన్న శిఖరాన్ని తొలగించే పనులు చేపట్టడం భక్తుల ఆగ్రహానికి దారితీసింది.
గర్భాలయానికి ఎలాంటి నష్టం కలిగించబోమని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు గర్భాలయ శిఖరాన్నే తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి.
దాదాపు రెండేళ్లుగా పనులు జరుగుతున్నా, ఏయే నిర్మాణాలను తొలగిస్తున్నారు, కొత్తగా ఏమి నిర్మిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు అనే వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించడం లేదనే విమర్శలున్నాయి.
పురాతన ఆలయ నిర్మాణ శైలిని పరిగణనలోకి తీసుకోకుండా రాతి కట్టడాలు కాకుండా సిమెంట్ నిర్మాణాలు చేపట్టారని, కొత్త నిర్మాణాలు అసలు ఆలయ శిఖరాన్ని మించిపోయేలా ఉన్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చారిత్రక ప్రాధాన్యం ఉన్న 854 ఏళ్ల నాటి మండపాన్ని తొలగిస్తున్నారనే వార్తలు కూడా భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
కోటిలింగాల తొలగింపు, కాలభైరవుడు, ఆంజనేయస్వామి విగ్రహాల తరలింపు, సోమేశ్వర, ఉమామహేశ్వర, బాలా త్రిపురసుందరి ఆలయాల విషయంలోనూ భక్తులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
2025 నవంబర్ 12 నుంచి ప్రధాన ఆలయంలో భక్తులకు సాధారణ దర్శనాలు నిలిచిపోయాయి. సమీపంలోని భీమేశ్వరాలయంలో ప్రత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు చేశారు.
2027 ఆగస్టు నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపినా.. ప్రధాన ఆలయంలోకి పూజారులు, సిబ్బంది వెళ్లేందుకు పోలీసు భద్రత కల్పిస్తుండగా, సాధారణ భక్తులకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్టీపీసీ నుంచి బూడిదను తరలించే ప్రతి లారీకి రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు.
గత మూడేళ్లలో అధికారికంగా 1.24 లక్షల ట్రిప్పులు జరిగాయి. ఈ లెక్కన సుమారు రూ.6 కోట్ల వరకు వసూళ్లు అయ్యాయి.
ఉచితంగా లభించే ఎన్టీపీసీ బూడిదను తరలించుకోవాలంటే లారీ యజమానులు అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
ప్రభుత్వ అనుమతి ఉందా? అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా? వసూలు చేసిన సొమ్ముకు రసీదులు ఎందుకు ఇవ్వడం లేదు?
వసూలైన సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమ అయిందా? లేక మరెక్కడికైనా మళ్లించారా?
ఈ ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
- మాజీ ఎమ్మెల్యే @korkantichander
వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఐదుగురు కాంగ్రెస్ మంత్రులు భావిస్తున్నారంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలు, మోసాలు, విచ్చలవిడి అవినీతితో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తల్లోనూ అసంతృప్తి పెల్లుబుకుతోంది.
ప్రజా వ్యతిరేకత ముందు నిలవలేమని, కేసీఆర్ సునామీని తట్టుకోలేమని కాంగ్రెస్ నేతలకు ముందే భయం పట్టుకుంది!
ఆంధ్రాకు తొత్తుగా మారిన రేవంత్ రెడ్డి 😡
తాగునీటి ముసుగులో టన్నెల్ ద్వారా నాగార్జునసాగర్ జలాలను ఏపీ తరలిస్తుంటే,
రేవంత్ సర్కార్ మరియు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తున్నాయి.
సాగర్ నీటిమట్టం 510 అడుగులకు పడిపోయినా గ్రావిటీతో నీటిని మళ్లించే ఈ అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి.
లేనిపక్షంలో తెలంగాణ రైతాంగం కోసం బీఆర్ఎస్ మరో మహోద్యమం చేపడుతుంది
వరంగల్‌లోని కేడీసీ గ్రౌండ్‌లో..
ఈ నెల 22న "జన చైతన్య సభ" నిర్వహిస్తున్నాం.
ఈ సభలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు,
మేధావులు సైతం గులాబీ కండువా కప్పుకోనున్నారు.
రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు,
మిగిలిన మున్సిపాలిటీలకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం సాధిస్తాం.
- మాజీ ఎంపీ @vinodboianpalli
కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి చెందిన
ప్రజలు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు.
ఈ నెల 22న కేడీసీ గ్రౌండ్‌లో కేటీఆర్ గారి సమక్షంలో
వివిధ పార్టీల నేతలు భారీగా బీఆర్ఎస్‌లో చేరనున్నారు.
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..
గులాబీ జెండా ఎగరడం ఖాయం!
- మాజీ ఎమ్మెల్యే @dasyamofficial
♦️ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్‌కు అండగా నిలిచి, పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
♦️ 90 శాతం వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదిగి.. పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను అభినందించిన కేటీఆర్
♦️ తెలంగాణ భవన్‌లో ఆత్మీయ భేటీ.. స్వయంకృషి ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్ పారిశ్రామిక ప్రస్థానానికి అండగా నిలిచి, ఆయన పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ రోజు తెలంగాణ భవన్‌లో ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత చంద్రకాంత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
90 శాతం శారీరక వైకల్యం ఉన్నప్పటికీ స్వయంకృషి, పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగి, తన పరిశ్రమ ద్వారా పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను కేటీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేశారు. అనంతరం చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ లోగోను కేటీఆర్ ఆవిష్కరించారు.
శారీరక వైకల్యంతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న చంద్రకాంత్ సాగర్, వాటిని అధిగమిస్తూ స్వయంకృషి, పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగారు. తన విజయాన్ని తనకే పరిమితం చేయకుండా, తన పరిశ్రమ ద్వారా దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా అందిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమ అభివృద్ధికి కేటీఆర్ అందించిన సహకారం, ప్రోత్సాహం తన పారిశ్రామిక ప్రస్థానంలో ఎంతో కీలకమని చంద్రకాంత్ సాగర్ తెలిపారు. కేటీఆర్ అండతో పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడంతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగానని కృతజ్ఞతలు తెలిపారు.
దివ్యాంగులకు ఉపాధి కల్పించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పిస్తున్నానని చంద్రకాంత్ సాగర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిని స్వావలంబన దిశగా ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేయనున్నట్లు వివరించారు.
స్వయంకృషితో ఎదిగి మరెందరికో ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అభినందించారు. దివ్యాంగుల సాధికారత, ఆత్మగౌరవంతో కూడిన జీవనం, స్వావలంబన కోసం స్వయంకృషి ఫౌండేషన్ చేపట్టనున్న కార్యక్రమాలకు శుభాకాంక్షలు తెలిపారు.
పెన్షన్ల పండుగ పేరుతో కొద్ది మందికి మాత్రమే పాత రూ. 2,000 ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్.
కేసీఆర్ గారి హయాంలో నిజామాబాద్ జిల్లాలో 2,79,177 మందికి పెన్షన్ అందగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 17,131 మందిని తొలగించి, ఇప్పుడు కొత్తగా 20,555 మందికి ఇస్తోంది. అంటే జిల్లాలో నికరంగా పెరిగిన పెన్షన్లు కేవలం 3,424 మాత్రమే!
ఈ కొద్దిమంది కోసం 31 మండలాల్లో మీటింగ్‌లు పెట్టి ప్రచార ఆర్భాటం చేయడం ప్రజలను వంచించడమే. కొత్త పెన్షన్ల కంటే ఆ మీటింగ్‌ల ఖర్చే ఎక్కువవుతుంది.
నా లెక్కలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే మంత్రి సీతక్క, మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేస్తారా?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS సవాల్ 🔥
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి నాగార్జున సాగర్‌ను తెలంగాణకు కాకుండా చేస్తున్నారు.
ఆంధ్రపదేశ్ యథేచ్ఛగా నీళ్ళ దోపిడీ చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం కండ్లప్పగించి చూస్తుంటే.. దానికి మోదీ ఆశీస్సులు ఉన్నాయి.
పోతిరెడ్డిపాడు విషయంలో అన్యాయం చేసినట్లే, ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గర నుండి 1,600 కిలోమీటర్ల పైప్‌లైన్ వేసి 9 టీఎంసీల నీళ్లు తీసుకుపోతున్నారు.. వీటికి ఎటువంటి అనుమతలు లేవు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
62
పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి సిగ్గనిపిస్తలేదా?
పాలమూరు, జూరాల, శ్రీశైలం పంపులు ఆన్ చేయలేదు.. ఈ వానాకాలం మొత్తంలో కనీసం 50 టీఎంసీల నీళ్ళు ఎత్తలేదు.
250 టీఎంసీల కృష్ణా నీళ్లు ఆంధ్రార్పణం అయ్యాయి.
చంద్రబాబు నాయుడు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు నీళ్ళు తీసుకుపోయాడు.. కానీ 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరుకు రేవంత్ నీళ్ళు ఇవ్వలేదు.
ఇప్పుడు నాగార్జున సాగర్ వద్ద పెద్ద సొరంగం తవ్వి ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తీసుకుపోతుంటే దాని గురించి కూడా మాట్లాడట్లేరు.
మీకు ఓట్లేసి గెలిపించిన నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడరా?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
2
152
తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ కొల్లగొడుతుంటే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు స్పందించరా?
ఈ జల దోపిడీని అడ్డుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం.. బహిరంగ సభలు పెట్టి ప్రజలను జాగరూకులు చేస్తాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
3
172
శ్రీశైలంలో 3.6 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో 52 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.. ఇలాంటి పరిస్థితిలో నాగార్జున సాగర్ నుండి ఏపీ నీళ్ళు కొల్లగొడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది?
కేఆర్ఎంబీ దగ్గరకు వెళ్ళి ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని అడిగారా?
మిగిలిన 40 టీఎంసీలు తెలంగాణ తాగునీటికి కేటాయించాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారా?
జలాశయాల్లో మిగిలిన నీటిలో తాగునీటికి ఎంత కేటాయించారు?
ఆంధ్రపదేశ్ నీటి తరలింపుపై కేఆర్ఎంబీ వద్ద నిరసన వ్యక్తం చేశారా?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
2
167
నాగార్జున సాగర్‌లో ఏ అనుమతి లేకుండా సొరంగం తవ్వి నీళ్ల దోపిడీకి ఏపీ ప్రభుత్వం పాల్పడుతుంది
ఈ విషయం బయటపెట్టిన నమస్తే తెలంగాణ పత్రికకు నా అభినందనలు
తాగునీటి పథకం పేరు చెప్పి సాగునీటిని కూడా ఎత్తుకుపోతున్నారు
90 టీఎంసీల నీళ్లని తీసుకుపోడానికి ప్రయత్నం జరుగుతుంది.. ఇంత జరుగుతుంటే మంత్రులు, ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు
ముఖ్యమంత్రి ఏమో హైదరాబాద్‌లో నీళ్లు లేవు స్నానం చేయొద్దు, బండ్లు కడగొద్దని ఉపదేశాలు ఇస్తాడు.. నీటిపారుదల శాఖ మంత్రి ఏమో తాగునీటికి ఇబ్బందే లేదని చెప్తున్నాడు
హైదరాబాద్‌లో ఒక అక్టోబర్ నెలలో రెండున్నర లక్షల ట్యాంకర్లు బుక్ చేసారు
- కేటీఆర్
రేవంత్ రెడ్డిని నమ్మి ఓట్లు వేసిన నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలనే ద్రోహం చేసి, జల దోపిడీ చేస్తున్నారు
శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడుకు ఈరోజుకు జల దోపిడీ జరుగుతుంది
నాగార్జున సాగర్ నుండి ఆంధ్రాకు నీళ్లు తీసుకెళ్లడానికి సంవత్సరం నుండి నిర్మాణం జరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదా?
రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ఆరోజు సమైక్య పాలనలో జరిగిన ద్రోహం కంటే పెద్ద ద్రోహం
- కేటీఆర్
12
300












