🎵 వీవెనుడా… వీవెనుడా… రహస్య వీవెనుడా! #మనమాతృభాషతెలుగు #మనభాషమనహక్కు #మనభాషమనబాధ్యత

హైదరాబాద్
Joined August 2009
ఈ సంక్రాంతికి మీ, మీ చుట్టాల పిల్లలకు సరదాగా కాస్త తెలుగును పరిచయం చేయండి. ఓ పది నిమిషాలు వారితో ఈ “పొడుపు – విడుపు” ఆడండి. వారు ఆసక్తి చూపించిన మాటలను, విషయాలను వివరించండి. సరదా ముఖ్యం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! podupuvidupu.irusu.in/
5
23
6
60
8,388
Wordle 1,901 3/6 ⬛⬛🟨⬛⬛ ⬛🟨⬛🟨⬛ 🟩🟩🟩🟩🟩
3
353
10 ఆగష్టు మా నాన్నగారి పుట్టిన రోజు సందర్భంగా కొత్త ఛందం అందుబాటులోకి వచ్చింది. chandamu.github.io/ కొత్త పాత ఛందంలు ఒకే ఇంటిని పంచుకోబోతున్నాయి. దాదాపు 3000 పైబడిన ఛందస్సులు ఇందులో అందుబాటులో ఉంటాయి. #ఛందం
2
4
1
8
553
సక్కనోడు బక్కచిక్కినా అందమే రంగు పూల చొక్క హంగు తోటి చుక్క తోడు కొరకు చక్కగా వెడలెను తక్కువాయె నొకటె బుగ్గచుక్క 😀 #ఆటవెలది
చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. మరి మగమహానుభావుడైన నేను చిక్కినా అందమే అనడానికి మగమహారాజులకు ఏ సామెత లేదా🤔 ఈ సమాజాన్ని నేను నిలదీసిఫైయింగ్. #NewProfilePic #పూలచొక్కా
1
9
612
వీవెన్ retweeted
క్రౌడ్ ఫండింగ్ అంటే? *** అమెరికాతో పాటు, ఇతర పాశ్చాత్య దేశాల్లో ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందిన పదం - క్రౌడ్ ఫండింగ్. ఎవరైనా ఏదయినా ప్రాజెక్ట్ ప్రారంభించడానికో, లేదంటే - ఆల్రెడీ ప్రారంభించిన ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికో అవసరమయిన డబ్బు లేనప్పుడు, చిన్నచిన్న మొత్తాల్లో ఎక్కువమంది నుంచి ఆ డబ్బు సేకరించడమే క్రౌడ్ ఫండింగ్. ఉదాహరణకు, సినిమా విషయమేతీసుకుందాం. ఒక ఇండిపెండెంట్ సినిమా తీయడానికి ఓ కోటిరూపాయలు కావాలనుకుంటే - ఆ మొత్తాన్ని ఒక నలుగురో, పది మందో ఇన్వెస్టర్స్ నుంచి వివిధ డినామినేషన్లలో సులభంగా సేకరించవచ్చు. ప్రతి డినామినేషన్లో, ఇన్వెస్టర్లకు తాయిలాలుంటాయి. అవికాకుండా, ప్రపోర్షనేట్‌గా లాభాల్లో వారికి షేర్ కూడా ఉంటుంది. ఎవరికీ పెద్దగా రిస్క్ ఉండదు. అంతర్జాతీయంగా బాగా ప్రాచుర్యం పొందిన ఈ ఫండ్ రైజింగ్ ప్రాసెస్ ని అమలు చేయటం కోసం కిక్ స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నోవెబ్ సైట్లున్నాయి. వాటి కమిషన్ అవి తీసుకుంటాయి. ఒకసారి ఆ సైట్స్‌కు వెళితే ఎవరికయినా విషయం పూర్తిగా అర్థమైపోతుంది. కట్ చేస్తే - ఒకప్పుడు 'ఇండీ సినిమా' (ఇండిపెండెంట్ సినిమా) అంటే ఒక యజ్ఞంలా జరిగేది. డబ్బే ప్రధాన సమస్య కాబట్టి, సినిమా పూర్తిచేయడానికి సంవత్సరాలు కూడా పట్టేది. గెరిల్లా ఫిలిం మేకింగ్, రెనగేడ్ ఫిలిం మేకింగ్, నో బడ్జెట్ ఫిలిం మేకింగ్ లాంటి ధోరణులన్నింటికీ నేపథ్యం ఇదే. సరిపోయేంత డబ్బు లేకపోయినా సినిమా తీయడం! అయితే ఇప్పుడా సమస్య లేదు, రెండు కారణాలవల్ల: ఒకటి - ఫిలిం మేకింగ్‌లో ఆధునికంగా వచ్చిన సాంకేతిక అభివృధ్ధి. రెండవది - క్రౌడ్ ఫండింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా ఇండీ సినిమాలు ఈ క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్స్ ద్వారా, లేదా ఆ వెబ్‌సైట్స్‌కి బయట ప్రత్యేకంగా ఇలాంటి పధ్ధతిని పాటించటం ద్వారా అనుకున్నంత బడ్జెట్‌ను సులభంగా సేకరించుకోగలుగుతున్నాయి. ఇదే పద్ధతిని రెగ్యులర్ కమర్షియల్ సినిమాల నిర్మాణం కోసం కూడా ఈజీగా అనుసరించవచ్చు. సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ఆసక్తి ఉండి కూడా, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించి తమ కోరికని అలా తొక్కిపెట్టి ఉంచేవారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే - ఎంత చిన్న పెట్టుబడితోనయినా వారు ఫిలిం ప్రొడక్షన్‌లోకి ప్రవేశించవచ్చు! మీలో గాని, మీకు తెలిసిన వారిలో గాని... తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఫిలిం ప్రొడక్షన్లోకి ఎంటర్ అవ్వాలన్న ఆసక్తి ఉన్న మైక్రో ఇన్వెస్టర్లు గాని, మీడియేటర్స్ గాని ఎవరైనా ఉన్నారా?  Interested? DM me for more details. - మనోహర్ చిమ్మని
1
7
382
వీవెన్ retweeted
"అప్పుడే ఏం అయిపోలేదు బుజ్జీ!" పాకే వయసులో తెలియదు ఆపై నడక ఉంటుందని ! అడుగులేసే మొదట్లో తెలియదు మున్ముందు పరుగు పెట్టాలని ! పరుగు తీసేటపుడు తెలియదు మార్గం సరైనదేనా అని ! అంతా అర్థమయ్యే సరికి, అన్నీ తెలిసొచ్చే సమయానికి, సగం జీవితం అయిపోతుంది ! అని నిట్టూర్చే వారందరూ పాదం ఆగిన చోట నిలబడిపోకుండా, మనసు అలసిన పూట నిరాశపడకుండా, ఇంకా జీవించే ఉన్నా కదా! అనుకోండి, ఆ జీవితానికి విలువ ఇవ్వండి. కొత్తగా మళ్ళీ పాకండి, నడవండి, మళ్ళీ పరుగెత్తండి, కానీ .. ఈసారి ద్విగుణీకృతమైన ఉత్సాహంతో..👍 - హరీష్ ఆర్ మీనన్. Aka @27stories_
5
10
1
90
2,508
అమ్మ చేతి వంట కమ్మదనమువోలె, నిండుచందమామ పండు వెన్నె లోలె, తేట తెలుగు వలె తీయనైనది నిక్కముగను వరము నీదు ప్రేమ #ఆటవెలది
3
11
415
వీవెన్ retweeted
తెలుగునాట తెలుగే తొలినుడి అయివుండాలి. తెలుగే అన్నిటికన్నా పైన ఉండాలి. ఇంగ్లీషు మనలో ఎందరికో రెండవనుడి (సెకండ్ లాంగ్వేజ్) కావచ్చు. కానీ అదెప్పుడూ సెకండ్ టూ తెలుగే అవ్వాలి. దేవుడు మాట్లాడే భాష (ఏదైనా ఉంటే) కూడా తెలుగు తరువాతే..!
13
58
6
288
24,861
ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం మనమే. మన వలసలు/వ్యాప్తి కూడా ఎక్కువే కాబట్టి, ఎక్కడికెళ్ళినా ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడు/రాలు అయ్యే అవకాశం మెండు.
ప్రపంచంలో ఎక్కడ రాయి విసిరినా ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద పడుతుంది అనే వాళ్ళు. ఇప్పుడు ప్రపంచం లో ఏ షిప్ మునిగినా క్ర్యూ ఇండియన్స్ ఉంటున్నారు.
2
11
828
మీ ట్విట్టరు ఖాతాను ఎవడైనా హ్యాక్ చేసి ఉంటే, కింది లింకుకు వెళ్ళి రిపోర్టు చెయ్యాలంట! help.x.com/en/forms/account-…
2
2
187
ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని ఎప్పుడూ గెలిచి చూపించే అమ్మాయికి జీవితం కొత్త సవాళ్లను విసిరితే? “అద్దంలో ఆమె రూపం” కథ చదవండి. telugu.pratilipi.com/story/a…
1
2
11
615
కత్తియాడిన తెగునొక్క కుత్తుకేమొ కలము కదిలిన చాలును కాగితమున జరుగు కల్లోల యుద్ధమే జగతియంత కత్తి కంటెను ఏలిక కలము పదును #తేటగీతి
2
2
21
1,322
ప్రజలు దానికి ముగింపు ఇస్తారు. 🟠 ప్రజలు దాన్ని ముగిస్తారు. ✅ #తెలుగు
1
9
753
వీవెన్ retweeted
మీ వాణిజ్య ప్రకటనలలో తెలుగు లిపిలో "లోండ్రీ" "బాథింగ్" అని రాసే బదులు ఇంగ్లీషులోనే రాయండి లేదంటే తెలుగులో "బట్టలు ఉతికేటప్పుడు" "స్నానం చేసేటప్పుడు" అని రాయండి. ఇలా అటూ ఇటూ కాకుండా ఆంగ్ల పదాలను తెలుగులో రాయకండి! 😁
4
3
1
28
1,262
వెళ్ళిరావలె నెల్లూరు వేళజూసి వెళ్ళి ఊరకుండుటగాదు వేగిరమున పట్టి చవులూరు పులుసును చట్టియందు ఉట్టియన్నమేసి కలిపి ఊడ్చి తినగ #తేటగీతి
1
11
453
వీవెన్ retweeted
♻️ Got an old mattress or unwanted furniture at home? Don't dump it—it doesn't belong on our streets or in our nalas. Let GHMC pick it up! Our Doorstep Old Mattresses & Furniture Pickup service is now LIVE. ✅ Easy doorstep pickup ✅ Safe & scientific recycling ✅ Cleaner streets and nalas ✅ A greener Hyderabad 📲 Scan the QR code to book your FREE doorstep pickup today and ensure your old mattresses and furniture are recycled responsibly. Together, let's keep our city clean, sustainable, and free from bulky waste. #GHMC #SwachhHyderabad #CleanHyderabad #Recycling #CircularEconomy #DoorstepPickup @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @jayesh_ranjan @Commissionrghmc @ZC_Khairatabad @ZC_Secunderabad @ZC_Charminar @ZcGolconda @ZC_Shamshabad @ZC_RAJNGR
53
213
22
518
157,006
ఇద్దరు మిల్క్ బాయ్స్!
444
అందరూ జర పైలం
గత రెండు వారాల్లో నాకు తెలిసిన అనేకమంది ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. మీ మిత్రుల నుండి ఏమైనా లింకులు మెసేజ్ రూపంలో వస్తే దయచేసి వాటిని క్లిక్ చేయకండి.
1
1
6
1,213
ఈ శోష'లు మీడియా రోజుల్లో, చదవడం, రాయడం మునుపు కంటే ముఖ్యం అనిపిస్తుంది నాకు. చదవడం మౌనాన్ని పరిచయం చేస్తే, రాయడం మనల్ని మనకి దగ్గర చేస్తుంది. నా దగ్గరి వారినందరిని ఏదో ఒకటి రాయమని బుర్ర తింటూనే ఉంటాను, ఒక్కోసారి వాళ్ళు ఈ బాధ భరించలేక ఏదో ఒకటి రాసి నా మొహానే కొట్టేటంత. రాయడం, విషయం మీద మనకున్న ఆలోచనల్ని ఒక క్రమంలోకి తేవడమే కాదు, భాష మీద మనకున్న పట్టుని కూడా పెంచుతుంది. రాసింది ఎవరితోనో పంచుకోవాలని రూలు ఏమీ లేదు, ఎప్పుడో కొన్నేళ్ళకి మనం చదువుకుంటే, మనకే అబ్బురంగా అనిపిస్తుంది. నేను స్వానుభవంతో తెలుసుకున్నది.. రాయడం కొంత అలవాటుగా మారాక, చదవడం కూడా మెరుగౌతుంది, రాతల్ని ఆస్వాదించే గుణం పెరుగుతుంది. మనం రాసిన నాలుగు మాటలూ మనకి నచ్చితే చాలు, అది ఇచ్చే సంతృప్తి గుండె నింపుతుంది. తమ్ముడు మల్లిఖార్జున్ అయితే వేరే విషయంతో పోలుస్తాడు. :) ఈ రోజు ఏదో ఒక విషయం మీద మీ ఆలోచనలు అక్షరాల్లో పెట్టండి.. వీలైతే పంచుకోండి, లేకుంటే మీకు మీరే మెసేజ్ గా పెట్టుకోండి.. నేటి మిమ్మల్ని రేపటికి దాచుకోండి, కొంతైనా..
2
7
49
2,484