BRS NRI Official (@brsnriofficial) header
BRS NRI Official (@brsnriofficial) profile picture
Joined October 2022
Photo by BRS NRI Official (@brsnriofficial)Photo by BRS NRI Official (@brsnriofficial)Photo by BRS NRI Official (@brsnriofficial)Photo by BRS NRI Official (@brsnriofficial)Photo by BRS NRI Official (@brsnriofficial)Photo by BRS NRI Official (@brsnriofficial)Photo by BRS NRI Official (@brsnriofficial)Photo by BRS NRI Official (@brsnriofficial)Photo by BRS NRI Official (@brsnriofficial)Photo by BRS NRI Official (@brsnriofficial)
నవంబర్ 29 – దీక్షా దివస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిద్దాం. - బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపు @mbigala @KTRBRS
1
68
BRS NRI Official retweeted
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్‌ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ప్రతిష్ఠను దెబ్బతీసేలా వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని బీఆర్‌ఎస్‌ (BRS ) గ్లోబల్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల ( Mahesh Bigala ) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలకు సంబంధించిన అంశాన్ని కేసీఆర్‌ వ్యక్తిగత వ్యవసాయ క్షేత్రంతో ముడిపెట్టి ఆరోపణలు చేసే సమయంలో వాటి అధికారిక ఆధారాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత పత్రికపై ఉందని ఆయన అన్నారు. వివరాలు వెల్లడించకుండా సంచలనాత్మక శీర్షికలతో ప్రజల్లో అపోహలు కలిగించడం సమర్థనీయం కాదని సూచించారు. పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తాం. ప్రజల తరఫున ప్రశ్నించే జర్నలిజాన్ని సమర్థిస్తాం. అదే సమయంలో, వ్యక్తుల గౌరవానికి, ప్రజల విశ్వాసానికి భంగం కలిగించే ఆరోపణలను బాధ్యతారహితంగా ప్రచురించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై చర్చ వాస్తవాలు, సాంకేతిక వివరాలు, అధికారిక రికార్డుల ఆధారంగానే జరగాలని,ఈ కథనంపై బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ లేవనెత్తిన ప్రశ్నలకు వెలుగు యాజమాన్యం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నోటీసులు అందిన 24 గంటల్లో వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకొని కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. @mbigala @KTRBRS @KonathamDileep @BRSparty
1
5
184
BRS NRI Official retweeted
పూలతో పూజించడమే కాదు... పూలనే పూజించే విభిన్న, విశిష్ఠ సంస్కృతి తెలంగాణకు సొంతం. తీరొక్క పువ్వులను అందంగా పేర్చి, భక్తి శ్రద్ధలతో, ఆటపాటలతో మన ఆడబిడ్డలు తొమ్మిది రోజుల పాటు ఆనందోత్సాహాలతో జరుపుకునే మన అస్తిత్వ సౌరభం బతుకమ్మ పండుగ. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా... తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. 🌸🌷🏵️🌺🌼
16
263
4
1,340
47,582
🏫❌ఒకవైపు రాష్ట్రంలో సర్కారు బడులను మూసివేస్తూ… ✅🍻మరోవైపు అడ్డగోలుగా కొత్త బార్లు, వైన్‌షాపులకు అనుమతులు ఇస్తున్న తుగ్లక్ రేవంత్! ఇవీ రేవంత్‌ ప్రభుత్వ ప్రాధాన్యతలు 😡 మార్పు.. మార్పు అంటూ తెలంగాణను సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్! #CongressFailedTelangana
12
BRS NRI Official retweeted
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు “చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!” You know who that is ✊ @NameisNani @odela_srikanth @Preyadarshe
229
2,090
81
17,808
1,002,001
BRS NRI Official retweeted
Always passionate about sharing Telangana’s growth story, and I will continue to take every opportunity to highlight the achievements of the BRS government. Here’s the full video of the Distinguished Public Lecture I delivered at @JindalGlobalUNI, Haryana, a few days ago, titled “Innovation in Governance: The Story of a Startup State.” It’s always rewarding to interact with students and young people, exchange ideas, and share Telangana’s remarkable journey of innovation and transformation. youtube.com/watch?v=aEL7kA5F…
21
162
2
826
108,369
BRS NRI Official retweeted
Exactly two years since the Congress-BJP unholy nexus became official in Telangana The Enforcement Directorate conducted raids at 16 locations linked to Congress minister Pongulet Srinivas Reddy in connection with a money-laundering case on 27th Sept, 2024 Reports of several cash-counting machines being carried to his residence made headlines Since then, neither the @dir_ed nor the BJP-led Union Govt has offered any official statement on the outcome of the raids or disclosed details of what was seized The BJP hounds opposition leaders using various central agencies. Yet when the target is a Congress minister, there appears to be a deafening silence Why is a minister belonging to Congress party enjoying immunity from the BJP? Ajab Prem ki Ghajab Kahani @RahulGandhi 👏
25
274
8
923
66,713
BRS NRI Official retweeted
నేడు స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదులుకున్న మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలుకుతూ.. కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి తన ఇంట్లోనే నీడనిచ్చిన గొప్ప తెలంగాణవాది కొండా లక్ష్మణ్ బాపూజీ. వివిధ దశల్లో తెలంగాణ స్వరాష్ట్ర పోరుకు వారు అందించిన సేవలు చిరస్మరణీయం. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది, వారి పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టుకుని గౌరవించింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏 (File pic)
11
156
1
1,168
50,196
BRS NRI Official retweeted
Interacted with several entrepreneurs at the Times Business Awards; urged them to dream big and align with local talent pool Was happy to see the enthusiasm and passion
5
118
1
651
43,210
BRS NRI Official retweeted
హైదరాబాద్‌లో 58, 59 జీవోల కింద 2 లక్షల మంది పేదలకు పట్టాలిచ్చి, లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించిన నాయకుడు కేసీఆర్. రేవంత్ గద్దెనెక్కి మూడేళ్లవుతున్నా.. హైదరాబాద్‌లో ఒక్క కొత్త ఇల్లు కట్టకపోగా, ఉన్న ఇళ్లను కూలగొడుతున్నాడు. ఉన్న నగరం దోమల బెడదతో అల్లాడుతుంటే.. కొత్తగా 'ఫ్యూచర్ సిటీ' అని డ్రామాలు ఆడుతున్నాడు. FTL పరిధిలోని కాంగ్రెసోళ్ల ఇళ్లు కూల్చే దమ్ము లేదు కానీ.. పేదోళ్ల ఇళ్లను మాత్రం రేవంత్ నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నాడు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
30
114
5,213
BRS NRI Official retweeted
బీఆర్ఎస్ అధికారంలో ఉండుంటే.. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులు పూర్తయిపోయేవి. ఎయిర్‌పోర్ట్ మెట్రో కోసం టెండర్లు పిలిచి, శంకుస్థాపన చేసి, పనులు కూడా ప్రారంభించాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
7
72
2
265
33,526
BRS NRI Official retweeted
Live: రైతులతో కలిసి ఎండిన పంటలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 📍 కొల్లాపూర్ నియోజకవర్గం teapawt.org/i/broadcasts/1wxWjlOBd…
24
1
69
3,999
BRS NRI Official retweeted
2014 నుంచి 2023 వరకు సిరిసిల్ల నియోజకవర్గంలో రూ.120 కోట్లతో 17–33/11 KV సబ్‌స్టేషన్లు, ఒక 132/33, ఒక 220/133 సబ్‌స్టేషన్ మంజూరు చేసి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థ CESSను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారని ఆరోపించారు. CESSను ఎందుకు రద్దు చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సర్దాపూర్‌లోని సిరిసిల్ల బెటాలియన్ పోలీసు కుటుంబాలు ఎన్నికల్లో ఇచ్చిన ‘ఏక్ పోలీసు’ హామీని అమలు చేయాలని కోరుతున్నాయని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికైనా ఆ హామీని నెరవేర్చి పోలీసు కుటుంబాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు రూ.213 కోట్లతో జిల్లా ప్రధాన ఆసుపత్రిని 300 పడకలకు పెంచిందని కేటీఆర్ తెలిపారు. మాతాశిశు కేంద్రం, రక్తనిధి, డయాలసిస్ కేంద్రం, ఐసీయూ, ఆధునిక మెటర్నిటీ వార్డు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.11 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేశామని తెలిపారు. సిరిసిల్ల వైద్యరంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే చర్యలు, కేటాయించే నిధుల వివరాలను సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, కంటి వెలుగు వంటి పథకాల ద్వారా పేదలు, మహిళలు, వృద్ధులకు సంక్షేమ ఫలాలు అందించామని కేటీఆర్ తెలిపారు. చేపపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, దళితబంధు, బీసీబంధు వంటి పథకాల ద్వారా వివిధ వర్గాలకు జీవనోపాధి కల్పించామని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గంలో సుమారు రూ.250 కోట్లతో 4,500 ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఆసరా పెన్షన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లకు కూడా కోతలు విధించారని విమర్శించారు. వృద్ధులు, బీడీ కార్మికులకు 33 నెలలుగా బాకీ ఉన్న రూ.66 వేల మొత్తాన్ని వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల నేతన్నలు, గౌడన్నలు, ముదిరాజ్‌లు, యాదవులు, ఇతర వర్గాల సంక్షేమానికి పర్యటన సందర్భంగా ఎన్ని నిధులు మంజూరు చేస్తారో సీఎం ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి చేరుస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదని కేటీఆర్ తెలిపారు. ముదిరాజ్‌లు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘ముదిరాజ్ సింహర్జన’ నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీశారని చెప్పారు. ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారో సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారో ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రతి ఆడబిడ్డకు 33 నెలలకు బాకీ ఉన్న రూ.82,500 ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు? పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరు ఎప్పుడు? ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిలిపివేసిన చేపపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, దళితబంధు, బీసీబంధు పథకాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారో ప్రభుత్వం ప్రకటించాలని కేటీఆర్ కోరారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో తేదీ ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీల హామీని ఎప్పుడు అమలు చేస్తారో కూడా చెప్పాలని కోరారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రెండేళ్లకు బాకీ ఉన్న రూ.24 వేల మొత్తాన్ని ఎప్పుడు వారి ఖాతాల్లో వేస్తారో ప్రకటించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక కాంగ్రెస్ అభ్యర్థులు బాండ్ పేపర్లపై హామీలు రాసిచ్చి అమలు చేస్తామని చెప్పారని కేటీఆర్ తెలిపారు. మూడేళ్లు కావస్తున్నా ఆ హామీలకు, బాండ్ పేపర్లకు దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి కూడా ఇప్పటికీ మోక్షం లేదని పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ లేవనెత్తిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ విమర్శలు, ఆరోపణలతో సిరిసిల్ల పర్యటనను ముగించకుండా ప్రజల సమస్యలపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని కోరారు. భూముల ఆరోపణలపై శ్వేతపత్రం, నేతన్నల బకాయిలు, రైతు సమస్యలు, సాగునీరు, పరిశ్రమలు, విద్య, వైద్యం, అభివృద్ధి పనులు, విద్యుత్, సంక్షేమ పథకాలు, వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చైతన్యానికి ప్రతీకైన సిరిసిల్ల గడ్డపైకి వస్తున్న ముఖ్యమంత్రి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
1
10
26
692
BRS NRI Official retweeted
నేతన్నలకు చెల్లించిన 10 శాతం యార్న్ సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. రూ.60 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు? 10 శాతం యార్న్ సబ్సిడీని ఎప్పుడు విడుదల చేస్తారు? స్పష్టమైన తేదీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. వస్త్ర పరిశ్రమ ఉన్న సిరిసిల్లను కాదని వేములవాడలో యార్న్ డిపో ఏర్పాటు చేయడం ద్వారా సిరిసిల్ల నేతన్నలను అవమానించారని కేటీఆర్ ఆరోపించారు. వస్త్రోత్పత్తికి రూ.300 కోట్ల విలువైన యార్న్ అవసరం ఉండగా కేవలం రూ.50 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. సిరిసిల్లలోనే యార్న్ డిపో ఏర్పాటు చేసి అవసరమైన మేరకు యార్న్ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుబీమా తరహాలో నేత కార్మికుల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రూ.5 లక్షల నేతన్న బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీమియం కూడా చెల్లించకుండా నిలిపివేసిందని కేటీఆర్ తెలిపారు. నేతన్న బీమాను ఎప్పుడు పునరుద్ధరిస్తారో ముఖ్యమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెద్దూర్ ప్రాంతంలో 60 ఎకరాల్లో రూ.174 కోట్లతో అపరెల్ పార్క్ నిర్మించామని కేటీఆర్ తెలిపారు. గోకుల్‌దాస్, టెక్స్‌పోర్ట్ తదితర సంస్థల ద్వారా 2,500 మంది మహిళలకు ఉపాధి కల్పించామని చెప్పారు. మరో 8 వేల మందికి పని కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సహకరించడం లేదని ఆరోపించారు. అపరెల్ పార్క్‌లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు? ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు? వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మికులను యజమానులుగా మార్చే లక్ష్యంతో 88 ఎకరాల్లో రూ.387.61 కోట్లతో వీవింగ్ పార్క్ ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. 50 షెడ్లు నిర్మించి, మొదటి దశలో 1,104 మంది కార్మికులకు ఒక్కొక్కరికి నాలుగు చొప్పున మొత్తం 4,416 అధునాతన మరమగ్గాలు అందించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ షెడ్లను వడ్ల గోదాములు, విద్యుత్ పరికరాల గోదాములు, ఇతర అవసరాలకు వినియోగిస్తూ నేతన్నల కలలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. వీవింగ్ పార్క్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు? షెడ్లను ఎప్పటిలోగా నేతన్నలకు కేటాయిస్తారు? కార్మికులను ఎప్పటిలోగా యజమానులుగా మారుస్తారు? స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరమగ్గాల, చేనేత అభివృద్ధి కార్పొరేషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేసిందని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లకు చెందిన గూడూరి ప్రవీణ్‌ను చైర్మన్‌గా నియమించి నేతన్నల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కార్పొరేషన్లను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కార్పొరేషన్లను పునరుద్ధరించి, సిరిసిల్ల పద్మశాలి బిడ్డను చైర్మన్‌గా ఎప్పుడు నియమిస్తారో తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పద్మశాలి సంక్షేమ సంఘ భవనానికి 5 ఎకరాల భూమి కేటాయించి రూ.5 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం బిల్లులు విడుదల చేయకుండా నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశారని ఆరోపించారు. పెండింగ్ నిధులు విడుదల చేసి భవన నిర్మాణాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని సుమారు 56 వేల మంది రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున రూ.532 కోట్ల పెట్టుబడి సాయం రైతుబంధు కింద అందించామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ఎగ్గొట్టిన రైతుబంధు బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో, ఎకరాకు రూ.15 వేల చొప్పున ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల రైతుబంధు ఇస్తామని ఇచ్చిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారో ముఖ్యమంత్రి ప్రకటించాలని కేటీఆర్ కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ హామీని సంపూర్ణంగా ఎప్పటిలోగా అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతుబీమా కింద సిరిసిల్ల నియోజకవర్గంలోని 806 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.40.30 కోట్లు అందించామని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం బీమా సంస్థకు ప్రీమియం కూడా చెల్లించకుండా రైతుబీమా పథకాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. రైతుబీమాను ఎప్పుడు పునరుద్ధరిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.12 కోట్లతో సుమారు 260 మంది రైతులకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లు అందించిందని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నియోజకవర్గంలో రూ.15 కోట్లతో నాలుగు కొత్త మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేశామని, సర్దాపూర్‌లో రూ.26 కోట్లతో ఆధునిక మార్కెట్ యార్డు నిర్మించామని తెలిపారు. 25 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కల్పించామని చెప్పారు. సిరిసిల్లకు అదనంగా ఎన్ని టన్నుల మార్కెట్ గోదాములను మంజూరు చేస్తారో సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో సాగునీటి సామర్థ్యాన్ని 1.36 లక్షల ఎకరాలకు పెంచామని కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీలో భాగంగా మధ్య మానేరు నుంచి అప్పర్ మానేరు వరకు అనుసంధాన పనులను రూ.1,604 కోట్లతో చేపట్టామని, రూ.533 కోట్లతో 3 టీఎంసీల సామర్థ్యంతో మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేశామని తెలిపారు. మల్కపేట నుంచి అప్పర్ మానేరు వరకు నీటిని ఎప్పుడు తరలిస్తారు? డిస్ట్రిబ్యూటరీ కాలువలను ఎప్పుడు మంజూరు చేస్తారు? స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయలో భాగంగా రూ. 80 కోట్లతో చెరువుల అభివృద్ధి, ట్యాంక్‌బండ్ల నిర్మాణం చేపట్టామని కేటీఆర్ తెలిపారు. రూ.140 కోట్లతో 12 చెక్‌డ్యామ్‌లు నిర్మించామని చెప్పారు. జిల్లాలో చెరువుల అభివృద్ధికి, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ఎన్ని కోట్లు కేటాయిస్తారో సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలు తీసుకురావాలి.. ఆక్వా హబ్, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను అభివృద్ధి చేయాలి బీఆర్‌ఎస్ హయాంలో 366 ఎకరాల్లో రూ.90 కోట్లతో ఆక్వా హబ్‌కు శ్రీకారం చుట్టామని కేటీఆర్ తెలిపారు. నర్మాల గ్రామంలో 309 ఎకరాల్లో రూ.100 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్నా కొత్త పరిశ్రమల ఏర్పాటు సంగతి పక్కన పెడితే, ఇప్పటికే మంజూరైన పరిశ్రమలను పూర్తి చేసే చర్యలు కూడా చేపట్టలేదని ఆరోపించారు. సిరిసిల్లలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ని కోట్లు కేటాయిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. JNTU ఇంజినీరింగ్ కాలేజీకి నిధులు విడుదల చేయాలి సిరిసిల్లను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ విద్యాసంస్థలను ఏర్పాటు చేసిందని కేటీఆర్ తెలిపారు. జిల్లాలో రూ.400 కోట్లతో JNTU ఇంజినీరింగ్ కాలేజీ, రూ.166 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.10 కోట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, రూ.80 కోట్లతో వ్యవసాయ కళాశాల, రూ.36 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ.4 కోట్లతో ప్రభుత్వ ITI ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.400 కోట్లతో మంజూరైన JNTU ఇంజినీరింగ్ కాలేజీకి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. JNTU ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి అవసరమైన నిధులను సిరిసిల్ల పర్యటనలోనే ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మన ఊరు–మన బడి కింద పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి 2014 నుంచి 2023 వరకు సిరిసిల్ల పట్టణంలో సుమారు రూ.1,564 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. రహదారులు, మురికి కాలువలు, జంక్షన్లు, వైకుంఠధామాలు, సామాజిక సంఘ భవనాలు, పార్కులు, సెంట్రల్ లైటింగ్, క్రీడా ప్రాంగణాలు, మార్కెట్లు, డిజిటల్ గ్రంథాలయం, దోభీఘాట్ తదితర పనులు చేపట్టామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా పట్టణ ప్రజలకు ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించామని తెలిపారు. జిల్లా కేంద్ర అభివృద్ధిలో భాగంగా రూ.75 కోట్లతో కలెక్టరేట్ సముదాయం, జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను పత్రికాముఖంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ కాలంలో మంజూరైన సుమారు రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలను విడుదల చేసి పనులు పూర్తి చేయాలని కోరారు. బీఆర్‌ఎస్ హయాంలో పంచాయతీరాజ్, రోడ్లు–భవనాల శాఖల ద్వారా సుమారు రూ.1,000 కోట్లతో డబుల్ రోడ్లు, రింగ్ రోడ్లు, తారు రోడ్లు, సీసీ రోడ్లు, మురికి కాలువలు, కమ్యూనిటీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, గోదాములు, క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించామని కేటీఆర్ తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా రూ.1,132 కోట్లతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించామని పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని రోడ్లు, ఎన్ని భవనాలు మంజూరు చేస్తారు? వెంటనే ఎన్ని నిధులు విడుదల చేస్తారు? ప్రకటించాలని డిమాండ్ చేశారు.
2
14
33
961
BRS NRI Official retweeted
సిరిసిల్లకు వెళ్తున్న రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔹 8 వేల ఎకరాల భూములపై రేవంత్ చేసిన ఆరోపణలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి 🔹 2,400 ఎకరాలు రికవరీ చేసినట్లు చెబుతున్న వివరాలు బయటపెట్టాలి 🔹 నేతన్న, రైతన్న, విద్యార్థి, అన్ని వర్గాల సమస్యలకు సమాధానం చెప్పాలి 🔹 హామీల అమలుపై స్పష్టమైన తేదీలు ప్రకటించాలి 🔹 సిరిసిల్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి సిరిసిల్లకు వస్తున్న రేవంత్‌ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటి ప్రశ్నలు 👇 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తయిన తర్వాత తొలిసారిగా సిరిసిల్లకు వస్తున్న రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్వాగతం పలికారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో సిరిసిల్లకు వస్తున్నందున రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు కాకుండా ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని, ప్రతి రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. 420 హామీల్లో ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ నాయకులు 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారని, అందులో 2,400 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని అసెంబ్లీలో సీఎం చేసిన ఆరోపణలు నిరాధారమని కేటీఆర్ పేర్కొన్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేవలం 1,272 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ జరిగిందని, అందులో సిరిసిల్ల నియోజకవర్గంలో కేవలం 204 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశామని తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతుల అభ్యర్థనల మేరకు, అర్హత ప్రకారం రికార్డులు సవరించామని చెప్పారు. 8 వేల ఎకరాల భూమి ఎక్కడుంది? అందులో 2,400 ఎకరాలు ఏ భూమి? ఏ మండలం? ఏ గ్రామం? ఏ సర్వే నంబరు? ఎవరి పేరుపై ఉంది? ఎంత విస్తీర్ణం? అనే పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఆరోపణల్లో వాస్తవం ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆరోపణలను రుజువు చేయలేకపోతే సిరిసిల్ల ప్రజలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిందని కేటీఆర్ తెలిపారు. స్కూల్ యూనిఫాంలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, సంక్షేమ శాఖ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లతో పాటు అనేక ప్రభుత్వ ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు అందించామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో రూ.3,313 కోట్ల విలువైన 100 కోట్ల మీటర్ల బట్టకు పీపీ ఆర్డర్లు, టెస్కో ద్వారా ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. దీంతో నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి లభించడంతో పాటు నెలకు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందే పరిస్థితి కల్పించామని చెప్పారు. సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తుల టర్నోవర్‌ను ఏడాదికి రూ.250 కోట్ల నుంచి దాదాపు రూ.1,000 కోట్లకు పెంచామని, నేతన్నల ఆత్మహత్యలు తగ్గడంతో పాటు వలసలు కూడా నిలిచిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేసి 2024లో నేతన్నలకు పూర్తిగా ఉపాధి లేకుండా చేసిందని కేటీఆర్ ఆరోపించారు. నేతన్నల పోరాటం తర్వాత చీరల పథకాన్ని మరో పేరుతో ప్రారంభించినా దాన్ని కేవలం మహిళా సంఘాలకు మాత్రమే పరిమితం చేశారని తెలిపారు. గతంలో సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చిన స్కూల్ యూనిఫాంలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, సంక్షేమ శాఖ వస్త్ర ఆర్డర్లను ఇతర పెద్ద పరిశ్రమలు, దళారులకు కేటాయించారని ఆరోపించారు. దీంతో ఏడాది పొడవునా ఉండాల్సిన పని ఆరు నెలల కంటే తక్కువకు పడిపోయిందని తెలిపారు. పాత బకాయిలన్నీ చెల్లించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రూ.300 కోట్ల బకాయిల్లో ఇంకా రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు.
2
58
1
181
15,121
BRS NRI Official retweeted
కుప్పంలో జలహారతి 💧 తెలంగాణ రైతుల కన్నీటి ఆర్తి 😭 శ్రీశైలం నుండి 670 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు సొంత గ్రామం కుప్పంకి నీళ్లు పోతున్నాయి. కానీ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరుకు నీళ్లు ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావట్లేదు. తెలంగాణలో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం నీటి తరలింపును అడ్డుకోవడంలో కూడా విఫలమైంది. - మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 🔥 🔴శ్రీశైలం నుండి 672 కిలోమీటర్లు ప్రయాణించిన కృష్ణా జలాలు కుప్పం చేరుకున్నాయి 🔴ఈ రోజు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించాల్సిన జలహారతి రేపటికి వాయిదా పడింది 🔴ఏవీఆర్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో 123.64 కిలోమీటర్ల పొడవైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను నిర్మించారు. 🔴శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటిని హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా, అందులో భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా తరలించి, కుప్పం నియోజకవర్గంలోని 110 చిన్నతరహా నీటిపారుదల చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు, కుప్పం మరియు పలమనేరు ప్రాంతాల్లోని 4.02 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. 🔴కృష్ణా నదికి పక్కనే ఉన్న, కృష్ణా నీటికి హక్కుదారులైన పాలమూరు పల్లెలకు కృష్ణా జలాలు రావడం లేదు. 🔴కరంటు ఇవ్వకుండా, మోటార్లు నడవకుండా ఎత్తిపోతల మోటార్లను కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొలాలు ఎండబెట్టింది. 🔴జూరాల నుండి నీళ్లు విడుదల చేయకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. 🔴ఎల్ నినో పేరుతో తెలంగాణకు క్రాప్ హాలిడే ప్రకటించారు. 🔴శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా ఏపీ ప్రభుత్వం నీటిని కృష్ణా బేసిన్ కు సంబంధం లేని ప్రాంతాలకు సాగునీరు తరలిస్తుంది. 🔴ఇక్కడ కృష్ణా నది పక్కన కిలోమీటర్ల పరిధిలో ఉన్న చెరువులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నింపడం లేదు. 🔴రేవంత్ రెడ్డి గురుభక్తి కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెడుతున్నాడు. 🔴రేవంత్ తప్పులకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదు. 🔴సాగునీరు విడుదల చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసుల ద్వారా హౌస్ అరెస్టులు చేయిస్తుంది.
1
53
221
15,530
BRS NRI Official retweeted
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రామన్న ఉద్యమకారుడికి అండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS కూకట్‌పల్లి షంషీగూడకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్ (51) అడ్వాన్స్‌డ్ స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చిన్న వయసు నుంచే తెలంగాణ తల్లి వేషధారణలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లక్ష్మణ్ కుమార్తె చంద్రికతో పాటు కుటుంబ సభ్యులతో ఇటీవల కేటీఆర్ గారు ఫోన్‌లో మాట్లాడి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో లక్ష్మణ్ కుమార్తె, కుమారుడు కేటీఆర్ గారిని కలిశారు. ఇప్పటికే బసవతారకం ఆసుపత్రిలో రెండు కీమోథెరపీలు పూర్తయ్యాయని తెలుసుకున్న కేటీఆర్ గారు, తదుపరి చికిత్స గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉన్న సింధు హాస్పిటల్‌కు కేటీఆర్ గారు రిఫర్ చేయడం జరిగింది. ఉద్యమకారుల కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావులను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సకు అవసరమైన సహకారం అందించాలని కేటీఆర్ గారు సూచించారు.
3
44
1
138
9,815
ఒకవైపు.. నీళ్లు, కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళనతో రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న రైతులు 😭 మరోవైపు.. రైతులకు నీళ్లు, కరెంటు ఇవ్వడం చేతకాక.. మదమెక్కి బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ దొంగలు🤦‍♂️
1
45
BRS NRI Official retweeted
ఒకవైపు.. నీళ్లు, కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళనతో రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న రైతులు 😭 మరోవైపు.. రైతులకు నీళ్లు, కరెంటు ఇవ్వడం చేతకాక.. మదమెక్కి బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ దొంగలు🤦‍♂️ రైతుల గోడు పట్టని దుర్మార్గపు రేవంత్ సర్కార్! #CongressFailedTelangana
3
86
2
255
16,999
BRS NRI Official retweeted
జూరాల ఆయకట్టుకు సాగునీరిచ్చి పంటలు కాపాడాలని డిమాండ్ చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలను, రైతులను అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ అక్రమంగా నిర్బంధించడం రేవంత్ రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. అదేవిధంగా వందలాది రైతులను కూడా పోలీసులు అడ్డుకుని, నిర్భంధించడం రాష్ట్రంలో సాగుతున్న అణచివేతకు తాజా ఉదాహరణ. కళ్లముందే పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతల గోసను ప్రభుత్వం తీర్చాల్సిందిపోయి, న్యాయమైన డిమాండ్ తో నిరసనకు సిద్ధమైన రైతులను, బీఆర్ఎస్ శ్రేణులను అణచివేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తోంది. సీఎంగా విఫలమైన రేవంత్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే, జిల్లాలోని అనేక మండలాల్లో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు చీకటి ఆదేశాలిచ్చాడు. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా కూడా విడుదల చేయకుండా కుంటిసాకులతో రేవంత్ సర్కారు పచ్చని పంటల ఉసురు తీస్తోంది. తమ పంటలను కాపాడుకునే ఏకైక తపనతో గుండెపగిలిన రైతులు జూరాల గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తే, వారిపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం అన్నదాతలను అన్నివిధాలా అరిగోస పెడుతోంది. తెలంగాణ గడ్డపై ఉన్న జూరాల ప్రాజెక్టు పరిసరాల్లోకి రైతులు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి, వందలాది పోలీసులను చుట్టుపక్కల మోహరించడం, వస్తున్న రైతులను అడ్డగించి అరెస్టులు చేయడం ముమ్మాటికీ సిగ్గుమాలిన చర్య. తాగునీటికి కేవలం రెండు టీఎంసీలు సరిపోతాయని తెలిసినా, 9 టీఎంసీలున్న జూరాల నుంచి చుక్క నీరు విడుదల చేయకుండా ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులను సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని నేరం. అక్రమంగా అరెస్టుచేసిన రైతులను, బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం విడుదల చేయడంతోపాటు జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు రిలీజ్ చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై కిసాన్.
24
304
9
1,228
93,806